పిల్లలు ఈ స్తోత్రం శ్రద్ధగా పఠిస్తే చక్కటి విద్యా బుద్ధులు, పెద్దలకు సంపద సిద్ధి, సౌఖ్యం, అనంతమైన కీర్తి ప్రతిష్ఠలు లభిస్తాయి!!!
గంగాతరంగరమణీయజటాకలాపం
గౌరీనిరంతరవిభూషితవామభాగమ్ |
నారాయణప్రియమనంగమదాపహారం
వారాణసీపురపతిం భజ విశ్వనాథమ్ || ౧ ||
అర్థం –
గౌరీనిరంతరవిభూషితవామభాగమ్ |
నారాయణప్రియమనంగమదాపహారం
వారాణసీపురపతిం భజ విశ్వనాథమ్ || ౧ ||
అర్థం –
గంగ యొక్క అలలచే రమణీయముగా చుట్టబడిన జటాజూటము కలిగి, ఎడమవైపు ఎల్లపుడు గౌరీదేవి వలన అలంకరింపబడి, నారాయణునకు ఇష్టమైన వాడు, అనంగుని (కామదేవుని) మదమును అణిచివేసినవాడు, వారాణసీ పట్టణమునకు అధిపతి అయిన విశ్వనాథుని ఆరాధించుచున్నాను.
వాచామగోచరమనేకగుణస్వరూపం
వాగీశవిష్ణుసురసేవితపాదపీఠమ్ | [**పాదపద్మమ్**]
వామేన విగ్రహవరేణ కలత్రవంతం
వారాణసీపురపతిం భజ విశ్వనాథమ్ || ౨ ||
అర్థం –
వాచామగోచరమనేకగుణస్వరూపం
వాగీశవిష్ణుసురసేవితపాదపీఠమ్ | [**పాదపద్మమ్**]
వామేన విగ్రహవరేణ కలత్రవంతం
వారాణసీపురపతిం భజ విశ్వనాథమ్ || ౨ ||
అర్థం –
మాటలతో చెప్పడానికి సాధ్యం కాని చాలా గుణములయొక్క స్వరూపము కలిగి, వాగీశ (బ్రహ్మ), విష్ణు మరియు సురులచే సేవింపబడు పాదములను కలిగి, ఎడమవైపు మూర్తీభవించిన భార్యను కలిగి, వారాణసీ పట్టణమునకు అధిపతి అయిన విశ్వనాథుని ఆరాధించుచున్నాను.
భూతాధిపం భుజగభూషణభూషితాంగం
వ్యాఘ్రాజినాంబరధరం జటిలం త్రినేత్రమ్ |
పాశాంకుశాభయవరప్రదశూలపాణిం
వారాణసీపురపతిం భజ విశ్వనాథమ్ || ౩ ||
అర్థం –
భూతాధిపం భుజగభూషణభూషితాంగం
వ్యాఘ్రాజినాంబరధరం జటిలం త్రినేత్రమ్ |
పాశాంకుశాభయవరప్రదశూలపాణిం
వారాణసీపురపతిం భజ విశ్వనాథమ్ || ౩ ||
అర్థం –
భూతములకు రాజుగా, సర్పములను శరీర ఆభరణములుగాచేసికొని, పులిచర్మముమును వస్త్రముగా కట్టుకుని, జటాజూటమును, మూడుకన్నులను కలిగి, పాశమును (త్రాడు), అంకుశమును (గాలము), భయములేనిది, వరములను ఇవ్వగలిగినది అయిన శూలమును చేతితో పట్టుకొనియున్న, వారాణసీ పట్టణమునకు అధిపతి అయిన విశ్వనాథుని ఆరాధించుచున్నాను.
శీతాంశుశోభితకిరీటవిరాజమానం
భాలేక్షణానలవిశోషితపంచబాణమ్ |
నాగాధిపారచితభాసురకర్ణపూరం
వారాణసీపురపతిం భజ విశ్వనాథమ్ || ౪ ||
అర్థం –
శీతాంశుశోభితకిరీటవిరాజమానం
భాలేక్షణానలవిశోషితపంచబాణమ్ |
నాగాధిపారచితభాసురకర్ణపూరం
వారాణసీపురపతిం భజ విశ్వనాథమ్ || ౪ ||
అర్థం –
చల్లని తేజస్సుతో ఉన్న చంద్రుడిని కిరీటముగా చేసుకొని, నుదుటి కంటి మంటలో అయిదు బాణములను విలీనము చేసుకొని, సర్పములయొక్క రాజుని చెవికి ఆభరణముగా చేసుకొని, వారాణసీ పట్టణమునకు అధిపతి అయిన విశ్వనాథుని ఆరాధించుచున్నాను.
పంచాననం దురితమత్తమతంగజానాం
నాగాంతకం దనుజపుంగవపన్నగానామ్ |
దావానలం మరణశోకజరాటవీనాం
వారాణసీపురపతిం భజ విశ్వనాథమ్ || ౫ ||
అర్థం –
పంచాననం దురితమత్తమతంగజానాం
నాగాంతకం దనుజపుంగవపన్నగానామ్ |
దావానలం మరణశోకజరాటవీనాం
వారాణసీపురపతిం భజ విశ్వనాథమ్ || ౫ ||
అర్థం –
పాపములచే మదమెక్కిన ఏనుగులకు సింహమువంటి వాడు, పాము వంటి దైత్యులకు నాగాంతకుడు, మృత్యువు, బాధ మరియు ముసలితనము అను అడవికి కార్చిచ్చు, వారాణసీ పట్టణమునకు అధిపతి అయిన విశ్వనాథుని ఆరాధించుచున్నాను.
తేజోమయం సగుణనిర్గుణమద్వితీయం
ఆనందకందమపరాజితమప్రమేయమ్ |
నాగాత్మకం సకళనిష్కళమాత్మరూపం
వారాణసీపురపతిం భజ విశ్వనాథమ్ || ౬ ||
అర్థం –
తేజోమయం సగుణనిర్గుణమద్వితీయం
ఆనందకందమపరాజితమప్రమేయమ్ |
నాగాత్మకం సకళనిష్కళమాత్మరూపం
వారాణసీపురపతిం భజ విశ్వనాథమ్ || ౬ ||
అర్థం –
దివ్యతేజస్సు కలిగి, గుణములు ఉండి గుణములు లేక, మరొకటిగా లేక, ఆనందమునకు మూలమై, ఎవ్వరిచేత ఓడింపబడక, ఎవ్వరి ప్రమేయము అవసరములేక, నాగాభరణములు కలిగి, కళలు ఉండి కళలు లేని ఆత్మరూపము కలిగి, వారాణసీ పట్టణమునకు అధిపతి అయిన విశ్వనాథుని ఆరాధించుచున్నాను.
ఆశాం విహాయ పరిహృత్య పరస్య నిందాం
పాపే రతిం చ సునివార్య మనః సమాధౌ |
ఆదాయ హృత్కమలమధ్యగతం పరేశం
వారాణసీపురపతిం భజ విశ్వనాథమ్ || ౭ ||
అర్థం –
ఆశాం విహాయ పరిహృత్య పరస్య నిందాం
పాపే రతిం చ సునివార్య మనః సమాధౌ |
ఆదాయ హృత్కమలమధ్యగతం పరేశం
వారాణసీపురపతిం భజ విశ్వనాథమ్ || ౭ ||
అర్థం –
ఆశలను విడిచి, పరులను నిందింపక, పాపములలో ఆనందము అనుభవింపక, మనస్సును సమాధి స్థితియందు ఉంచి, మనస్సు అనే కమలము పట్టుకొని మధ్యలో ఉన్న, వారాణసీ పట్టణమునకు అధిపతి అయిన విశ్వనాథుని ఆరాధించుచున్నాను.
రాగాదిదోషరహితం స్వజనానురాగం
వైరాగ్యశాంతినిలయం గిరిజాసహాయమ్ |
మాధుర్యధైర్యసుభగం గరళాభిరామం
వారాణసీపురపతిం భజ విశ్వనాథమ్ || ౮ ||
అర్థం –
రాగాదిదోషరహితం స్వజనానురాగం
వైరాగ్యశాంతినిలయం గిరిజాసహాయమ్ |
మాధుర్యధైర్యసుభగం గరళాభిరామం
వారాణసీపురపతిం భజ విశ్వనాథమ్ || ౮ ||
అర్థం –
రాగము వంటి దోషములు లేక, స్వజనులతో అనురాగముతో ఉండి, వైరాగ్యమనెడి శాంతికి నిలయమై, గిరిజతో కూడి, ధైర్యమనెడి మాధుర్యమును చూపుతూ, విషమువలన కంఠానికి ఏర్పడిన అందమైన మచ్చతో కూడి, వారాణసీ పట్టణమునకు అధిపతి అయిన విశ్వనాథుని ఆరాధించుచున్నాను.
వారాణసీపురపతేః స్తవనం శివస్య
వ్యాఖ్యాతమష్టకమిదం పఠతే మనుష్యః |
విద్యాం శ్రియం విపులసౌఖ్యమనంతకీర్తిం
సంప్రాప్య దేహవిలయే లభతే చ మోక్షమ్ || ౯ ||
అర్థం –
వారాణసీపురపతేః స్తవనం శివస్య
వ్యాఖ్యాతమష్టకమిదం పఠతే మనుష్యః |
విద్యాం శ్రియం విపులసౌఖ్యమనంతకీర్తిం
సంప్రాప్య దేహవిలయే లభతే చ మోక్షమ్ || ౯ ||
అర్థం –
వారాణసీపురపతి అయిన శివుని యొక్క ఈ ఎనిమిది శ్లోకముల స్తవము పఠించు మనుషులకు విద్యలు, ఐశ్వర్యము, అమితమైన ఆనందము, అనంతమైన కీర్తి, కలిగి దేహము వదిలిన తరువాత మోక్షము కలుగును.
(ఈ అర్థము మండా కృష్ణశ్రీకాంత శర్మచే స్ఫురింపబడి వ్రాయబడినది)
(ఈ అర్థము మండా కృష్ణశ్రీకాంత శర్మచే స్ఫురింపబడి వ్రాయబడినది)
download చేసుకునే ముందు మా You Tube Channel ని Subscribe చేసుకోండి. మాకు కొంచెం support ఇచ్చినట్టుగా ఉంటుంది.
to download Sri Vishwanatha ashtakam in telugu click below👇👇👇
to read Vishwanatha ashtakam without mistakes follow the video
Tags:
Sri Vishwanatha AshTakam stotram in Telugu pdf book free download learning video, Sri Vishwanatha AshTakam stotram shlokam Lyrics meaning in Telugu, శ్రీ విశ్వనాథ అష్టకం స్తోత్రమ్ తెలుగులో,,
in Telugu pdf free download,
Sri Vishwanatha AshTakam stotram importance and significance,
Sri Vishwanatha AshTakam stotram meaning in telugu,
Sri Vishwanatha AshTakam stotram learning video,
Sri Vishwanatha AshTakam stotram Book in telugu,
Sri Vishwanatha AshTakam stotram lyrics in Telugu,
Sri Vishwanatha Ashtakam shlokam with meaning in telugu
You may interest in following posts... Sri Vishwanatha AshTakam stotram in Telugu pdf book free download learning video, Sri Vishwanatha AshTakam stotram shlokam Lyrics meaning in Telugu, శ్రీ విశ్వనాథ అష్టకం స్తోత్రమ్ తెలుగులో,,
in Telugu pdf free download,
Sri Vishwanatha AshTakam stotram importance and significance,
Sri Vishwanatha AshTakam stotram meaning in telugu,
Sri Vishwanatha AshTakam stotram learning video,
Sri Vishwanatha AshTakam stotram Book in telugu,
Sri Vishwanatha AshTakam stotram lyrics in Telugu,
Sri Vishwanatha Ashtakam shlokam with meaning in telugu
పోగొట్టుకొనబడిన వస్తువు తిరిగి పొందడానికి, పఠించ వలసిన స్తోత్రం కార్తవీర్యార్జున స్తోత్రం👇👇👇
చదువు, తెలివి తేటలు బాగా అభివృద్ధి చెందడానికి, పెద్దలకు సంపద సిద్ధి, సౌఖ్యం, అనంతమైన కీర్తి ప్రతిష్ఠల కోసం పఠించవలసిన స్తోత్రం శ్రీ విశ్వనాథ అష్టకం!!!
Click 👇👇👇
మా YouTube Channel ను SUBSCRIBE చేయండి.. మమ్ము కొంచెం Encourage చేసినట్లు అవుతుంది.. Please subscribe our Channel
Post a Comment