Saturday 6 February 2021

Aditya Hrudayam shlokam lyrics in telugu meaning free pdf book download video - ఆదిత్య హృదయం

ఆదిత్య హృదయం గొప్పతనం:: 
Aditya Hrudayam shloakam in telugu

శ్రీరాముల వారు ఈ ఆదిత్య హృదయం పఠించిన తర్వాతే రావణాసురుడిపై యుద్ధానికి వెళ్ళి విజయం సాధించారట.... 

ప్రత్యక్ష భగవానుడైన సూర్య భగవానుని ప్రార్థిస్తే ఆయురారోగ్యాలు, తలపెట్టే కార్యక్రమాలలో విజయం సిద్ధిస్తుంది.... వారానికి ఒక్కసారైనా ఆదిత్య హృదయాన్ని శ్రద్ధగా పఠిస్తే అనారోగ్యం దూరం అవుతుంది... ముఖ వర్చస్సు మెరుగవుతుంది... క్రింది లింక్ లో ఆదిత హృదయం అర్థం... పఠించే విధానం... వీడియో సహితంగా ఉంది... pdf downloadable link...
download and share with your near and dear..


Aditya-Hrudayam-shlokam-meaning-free-download-pdf-and-how-to-read-video
Aditya Hridayam in telugu pdf 

ధ్యానం 

 నమస్సవిత్రే జగదేక చక్షుసే 
జగత్ప్రసూతి స్థితి నాశహేతవే 
త్రయీమయాయ త్రిగుణాత్మ ధారిణే 
విరించి నారాయణ శంకరాత్మనే 

 తతో యుద్ధ పరిశ్రాంతం సమరే చింతయా స్థితం| 
రావణం చాగ్రతో దృష్ట్వా యుద్ధాయ సముపస్థితం‖ 1 ‖ 

 దైవతైశ్చ సమాగమ్య ద్రష్టుమభ్యాగతో రణం| 
ఉపాగమ్యా-బ్రవీద్రామం అగస్త్యో భగవాన్ ఋషిః ‖ 2 ‖ 

 రామ రామ మహాబాహో శృణు గుహ్యం సనాతనం| 
యేన సర్వానరీన్ వత్స సమరే విజయిష్యసి ‖ 3 ‖ 

 ఆదిత్య హృదయం పుణ్యం సర్వశత్రు వినాశనం| 
జయావహం జపేన్నిత్యం అక్షయ్యం పరమం శివం‖ 4 ‖ 

 సర్వమంగళ మాంగళ్యం సర్వ పాప ప్రణాశనం| 
చింతాశోక ప్రశమనం ఆయుర్వర్ధన ముత్తమం‖ 5 ‖ 

 రశ్మిమంతం సముద్యంతం దేవాసుర నమస్కృతం| 
పూజయస్వ వివస్వంతం భాస్కరం భువనేశ్వరం‖ 6 ‖ 

 సర్వదేవాత్మకో హ్యేష తేజస్వీ రశ్మిభావనః | 
ఏష దేవాసుర గణాన్ లోకాన్ పాతి గభస్తిభిః ‖ 7 ‖ 

 ఏష బ్రహ్మా చ విష్ణుశ్చ శివః స్కందః ప్రజాపతిః | 
మహేంద్రో ధనదః కాలో యమః సోమో హ్యపాం పతిః ‖ 8 ‖ 

 పితరో వసవః సాధ్యా హ్యశ్వినౌ మరుతో మనుః | 
వాయుర్వహ్నిః ప్రజాప్రాణః ఋతుకర్తా ప్రభాకరః ‖ 9 ‖ 

 ఆదిత్యః సవితా సూర్యః ఖగః పూషా గభస్తిమాన్ | 
సువర్ణసదృశో భానుః హిరణ్యరేతా దివాకరః ‖ 10 ‖ 

 హరిదశ్వః సహస్రార్చిః సప్తసప్తి-ర్మరీచిమాన్ | 
తిమిరోన్మథనః శంభుః త్వష్టా మార్తాండకోంఽశుమాన్ ‖ 11 ‖ 

 హిరణ్యగర్భః శిశిరః తపనో భాస్కరో రవిః | 
అగ్నిగర్భోఽదితేః పుత్రః శంఖః శిశిరనాశనః ‖ 12 ‖ 

 వ్యోమనాథ స్తమోభేదీ ఋగ్యజుఃసామ-పారగః | 
ఘనవృష్టి రపాం మిత్రో వింధ్యవీథీ ప్లవంగమః ‖ 13 ‖ 

 ఆతపీ మండలీ మృత్యుః పింగళః సర్వతాపనః | 
కవిర్విశ్వో మహాతేజా రక్తః సర్వభవోద్భవః ‖ 14 ‖

 నక్షత్ర గ్రహ తారాణాం అధిపో విశ్వభావనః | 
తేజసామపి తేజస్వీ ద్వాదశాత్మన్-నమోఽస్తు తే ‖ 15 ‖ 

 నమః పూర్వాయ గిరయే పశ్చిమాయాద్రయే నమః | 
జ్యోతిర్గణానాం పతయే దినాధిపతయే నమః ‖ 16 ‖ 

 జయాయ జయభద్రాయ హర్యశ్వాయ నమో నమః | 
నమో నమః సహస్రాంశో ఆదిత్యాయ నమో నమః ‖ 17 ‖ 

 నమ ఉగ్రాయ వీరాయ సారంగాయ నమో నమః | 
నమః పద్మప్రబోధాయ మార్తాండాయ నమో నమః ‖ 18 ‖ 

 బ్రహ్మేశానాచ్యుతేశాయ సూర్యాయాదిత్య-వర్చసే | 
భాస్వతే సర్వభక్షాయ రౌద్రాయ వపుషే నమః ‖ 19 ‖ 

 తమోఘ్నాయ హిమఘ్నాయ శత్రుఘ్నాయా మితాత్మనే | 
కృతఘ్నఘ్నాయ దేవాయ జ్యోతిషాం పతయే నమః ‖ 20 ‖ 

 తప్త చామీకరాభాయ వహ్నయే విశ్వకర్మణే | 
నమస్తమోఽభి నిఘ్నాయ రుచయే లోకసాక్షిణే ‖ 21 ‖ 

 నాశయత్యేష వై భూతం తదేవ సృజతి ప్రభుః | 
పాయత్యేష తపత్యేష వర్షత్యేష గభస్తిభిః ‖ 22 ‖ 

 ఏష సుప్తేషు జాగర్తి భూతేషు పరినిష్ఠితః | 
ఏష ఏవాగ్నిహోత్రం చ ఫలం చైవాగ్ని హోత్రిణాం‖ 23 ‖ 

 వేదాశ్చ క్రతవశ్చైవ క్రతూనాం ఫలమేవ చ | 
యాని కృత్యాని లోకేషు సర్వ ఏష రవిః ప్రభుః ‖ 24 ‖ 

 ఫలశ్రుతిః 

 ఏన మాపత్సు కృచ్ఛ్రేషు కాంతారేషు భయేషు చ | 
కీర్తయన్ పురుషః కశ్చిన్-నావశీదతి రాఘవ ‖ 25 ‖ 

 పూజయస్వైన మేకాగ్రో దేవదేవం జగత్పతిం| 
ఏతత్ త్రిగుణితం జప్త్వా యుద్ధేషు విజయిష్యసి ‖ 26 ‖ 

 అస్మిన్ క్షణే మహాబాహో రావణం త్వం వధిష్యసి | 
ఏవముక్త్వా తదాగస్త్యో జగామ చ యథాగతం‖ 27 ‖ 

 ఏతచ్ఛ్రుత్వా మహాతేజాః నష్టశోకోఽభవత్-తదా | 
ధారయామాస సుప్రీతో రాఘవః ప్రయతాత్మవాన్ ‖ 28 ‖ 

 ఆదిత్యం ప్రేక్ష్య జప్త్వా తు పరం హర్షమవాప్తవాన్ | 
త్రిరాచమ్య శుచిర్భూత్వా ధనురాదాయ వీర్యవాన్ ‖ 29 ‖

 రావణం ప్రేక్ష్య హృష్టాత్మా యుద్ధాయ సముపాగమత్ | 
సర్వయత్నేన మహతా వధే తస్య ధృతోఽభవత్ ‖ 30 ‖ 

అధ రవిరవదన్-నిరీక్ష్య రామం ముదితమనాః పరమం ప్రహృష్యమాణః | 
నిశిచరపతి సంక్షయం విదిత్వా సురగణ మధ్యగతో వచస్త్వరేతి ‖ 31 ‖ 

 ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మికీయే ఆదికావ్యే యుద్దకాండే సప్తోత్తర శతతమః సర్గః ‖ 

 for more https://teluguvignanamvinodam1.blogspot.com/ 

ఆదిత్య హృదయం (Lyrics with meaning)


తతౌ యుద్ధ పరిశ్రాంతం సమరే చింతయా స్థితం 
రావణం చాగ్రతో దృష్ట్వా యుద్ధాయ సముపస్థితం 

1 అర్థము: యుద్ధము చేసి చేసి మిక్కిలి అలసియున్న శ్రీరాముడు సమరరంగమున చింతా క్రాంతుడైయుండెను. పిమ్మట రావణుడు యుద్ధసన్నద్ధుడై ఆ స్వామి యెదుట నిలిచి యుండెను. 

దైవతైశ్చ సమాగమ్య ద్రష్టుమభ్యాగతో రణం 
ఉపగమ్యాబ్రవీద్రామం అగస్త్యో భగవానృషిః 

2 అర్థము: 
యుద్ధమును చూచుటకై దేవతలతో కూడి అచ్చటికి విచ్చేసిన పూజ్యుడైన అగస్త్య మహర్షి శ్రీరాముని సమీపించి, ఆ ప్రభువుతో ఇట్లు పల్కెను. 

అగస్త్య ఉవాచ: 
రామరామహాబాహో శృణు గుహ్యం సనాతనం 
యేన సర్వానరీన్ వత్స సమరే విజయష్యసి 

3 అర్థము : 
ఓరామా! మహాబాహో! నాయనా! సనాతనము మిగుల గోప్యము ఐన ఈ స్తోత్రమును గూర్చి తెలిపెదను వినుము. దీనిని జపించినచో సమరమున నీవు శత్రువులపై విజయము సాధించగలవు. 

ఆదిత్యహృదయం పుణ్యం సర్వశత్రువినాశనం 
జయావహం జపేన్నిత్యం అక్షయం పరమం శివం 

4 అర్థము : 
ఈ ఆదిత్యహృదయ అను స్తోత్రము పరమ పవిత్రమైనది. సమస్త శత్రువులను నశింపజేయునది. నిత్యము దీనిని జపించినచో సర్వత్ర జయములభించుట తథ్యము. ఇది సత్ఫలములను అక్షయముగ ప్రసాదించునది. 

సర్వమంగళమాంగళ్యం సర్వపాపప్రణాశనం 
చింతాశోకప్రశమనం ఆయుర్వర్ధన ముత్తమం 

5 అర్థము : 
ఇది పరమపావనమైనది. సకల శ్రేయస్సులను సమకూర్చి సమస్త పాపములను నశింపజేయును ఆధివ్యాధులను తొలగించి ఆయుస్సును వృద్ధిపరుచును. సర్వ జపములలో శ్రేష్ఠమైనది. కావున దీనిని జపించుట ఎంతేని ఆవశ్యము. 

రశ్మిమంతం సముద్యంతం దేవాసుర నమస్కృతం 
పూజయస్వవివస్వంతం భాస్కరం భువనేశ్వరం 

6 అర్థము : అనంతమైన బంగారుకిరణములతో శోభిల్లుచు, జాతికి జాగృతి కూర్చును. దేవాసురులు ఈయనకు ప్రణమిల్లుదురు. మిక్కిలి తేజస్సుగలవాడు, సమస్త భువనములన నియంత్రించువాడు, లోకములకు వెలుగునిచ్చు ఆదిత్యుని పూజింపుము. 

సర్వ దేవాత్మకో హ్యేశ తేజస్వీ రశ్మిభావనః 
ఏశ దేవాసురగణాన్ లోకాన్ పాతి గభస్తిభిః 

7 అర్థము : ఇతడు సమస్త దేవతలకు ఆత్మయైనవాడు. తేజో రాశి. తన కిరణములచే లోకమునకు శక్తిని, స్ఫూర్తిని ప్రసాదించువాడు. దేవాసుర గణములతో గూడి సమస్త లోకములను తన కిరణములచే రక్షించుచుండువాడు. 

ఏశ బ్రహ్మా చ విష్ణుశ్చ శివః స్కందః ప్రజాపతిః 
మహేంద్రో ధనదః కాలో యమస్సోమో హ్యపాంపతిః 

8 అర్థము : బ్రహ్మ, విష్ణువు, శివుడు, కుమారస్వామి, ప్రజాపతి, దేవేంద్రుడు, కుబేరుడు, కాలస్వరూపుడు, యముడు, చంద్రుడు, వరుణుడు , 

పితరో వసవః సాధ్యాః అశ్వినౌ మరుతో మనుః 
వాయుః వహ్నిః ప్రజాప్రాణా ఋతు కర్తా ప్రభాకరః 

9 అర్థము : పితృదేవతలు. వసువులు, సాధ్యులు. అశ్వినీదేవతలు, మరుత్తులు, మనువు, వాయువు, అగ్ని, ప్రజలు మొదలగువారి స్వరూపములు అన్నిము ఇతనివే. షడృతువులకు కారకుడు ఈ ప్రభాకరుడే. 

ఆదిత్యః సవితా సూర్యః ఖగః పూషా గభస్తిమాన్ 
సువర్ణసదృశో భానుః హిరణ్యరేతా దివాకరః 

10 అర్థము : 
ఆదిత్యుడు జగత్సృష్టికి కారకుడు. జనులు తమవిధులు నిర్వర్తించుటకు ప్రేరణయిచ్చును. లోకోపకారం కొరకు ఆకాశమున సంచరించి వర్షములద్వారా జగత్తును పోషించి తన కిరణములను ప్రకాశింపజేయును. బంగారు వన్నెతో తేజరిల్లుచు అద్భుతముగా ప్రకాశించువాడు. బ్రహ్మాండములు ఉత్పత్తికి బీజమైనవాడు. చీకట్లను తొలగించుచు దివాసమయమున ప్రాణులను కార్యనిమగ్నులను గావించువాడు. 

హరిదశ్వస్సహస్రార్చిః సప్తసప్తిర్మరీచిమాన్ 
తిమిరోన్మథనః శంభుస్త్వష్టా మార్తండక అంషుమాన్ 

11 అర్థము : 
శ్యామవర్ణముగల రథాశ్వములు గలవాడు. అసం ఖ్యాకములైన కిరణములు గలవాడు. సప్త అను పేరుగల రథాశ్వముగలవాడు. రథమునకు ఏడు గుఱ్ఱములుగలవాడు. తేజో నిధానములైన కిరణములు గలవాడు. సర్వసంహారకుడు. జగత్ప్రళయమునకు పిమ్మట దానిని మరల సృజించుటకై ఆవిర్భవించెడివాడు. నిరంతరము తన కిరణములచే ప్రకాశించుచుండువాడు. 

హిరణ్యగర్భహ్ శిశిరస్తపనో భాస్కరో రవిః 
అగ్నిగర్భోఅదితేః పుత్రః శంఖః శిశిరనాశనహ్ 

12 అర్థము :
బ్రహ్మాండములను తన ఉదరమునందు ధరించువాడు. తాపత్రయములతో బాధపడువారికి ఆశ్రయమై వాటిని తొలగించుటకు శాంతిని ప్రసాదించువాడు, తపింపజేయువాడు. దివ్యములైన వెలుగులను గూర్చువాడు. సకల లోకములకు స్తుతిపాత్రుడు. దివాసమయమున అగ్నిని గర్భమునందు ధరించువాడు. అదితి దేవికి పుత్రుడుగా అవతరించినవాడు. సాయంకాలమున స్వయముగా శాంతించువాడు. మంచును తొలగించువాడు. 

వ్యోమనాథ స్తమోభెదీ ఋగ్ యజుస్సామ పారగః 
ఘన వృష్టిరపాం మిత్రో వింధ్య వీథీ ప్లవంగమః 

13 అర్థము : 
ఆకాశమునకు అధిపతియైనవాడు. రాహువును ఛేదించు లక్షణముగలవాడు. పూర్వాహ్ణమున ఋగ్వేదరూపము, మధ్యాహ్న సమయమున యజుర్వేదరూపమును, సాయంసమయమున సామవేదరూపమునను అలరారుచుండెడివాడు. ఘనముగా వర్షములను కురిపించుచుండువాడు. అందువలననే జలములను వర్షింపజేయువాడు అని ఖ్యాతి వహించెను. వింధ్యగిరి మార్గమున అతివేగముగా సంచరించువాడు. 

ఆతపీ మండలీ మృత్యుః పింగళః సర్వతాపనః 
కవిర్విశ్వో మహాతేజా రక్తః సర్వ భవోధ్భవః 

14 అర్థము : 
వేడిని కలిగియుండువాడు. వృత్తాకారమైన బింబము గలవాడు. విరోధులను రూపుమాపువాడు. ప్రభాత సమయమున పింగళవర్ణము కలిగియుండువాడు. మధ్యాహ్న సమయమున సర్వప్రాణులను తపింపజేయువాడు. వ్యాకరణాది సమస్త శాస్త్రముల యందును పండితుడు. విశ్వమును నిర్వహించువాడు. గొప్ప తేజస్సు గలవాడు. సకల ప్రాణులయందును అనురక్తి గలిగి యుండువాడు. సమస్త ప్రాణుల ఉత్పత్తికి కారణమైనవాడు. 

నక్షత్ర గ్రహతారాణాం అధిపో విశ్వ భావనః 
తెజసామపి తేజస్వీ ద్వాదశాత్మన్నమోస్తుతే 

15 అర్థము : 
నక్షత్రములకు, గ్రహములకు, తారలకును అధిపతియైనవాడు. విశ్వస్థితికి హేతువు. అగ్న్యాది తేజస్సులకు మించిన తేజస్సు గలవాడు. పన్నెండు రూపములతో విలసిల్లువాడు. ఈ నామములతో ప్రసిద్ధికెక్కిన సూర్యభగవానుడా నీకు నమస్కారం. 

నమః పూర్వాయ గిరయే పశ్చిమాయాద్రయె నమః 
జ్యోతిర్గణాణాం పతయే దినధిపతయే నమః 

16 అర్థము : 
స్వామీ! నీవు పూర్వగిరియందును, పశ్చిమగిరి యందును విలసిల్లుచుండువాడివి. గ్రహములకు, నక్షత్రములకు, దివారాత్రములకు అధిపతివి. ఉపాసకులకు జయము అనుగ్రహించునట్టి ఓ సూర్యభగవానుడా నీకు నమస్కారము. 

జయాయ జయభద్రాయ హర్యశ్వాయ నమో నమః 
నమో నమస్సహస్రాంశో ఆదిత్యాయ నమో నమః 

17 అర్థము : 
జయములను, శుభములను చేకూర్చువాడవు. శ్యామవర్ణముగల రథాశ్వములుగలవాడవు. వేలకొలది కిరణములు గలవాడవు. అదితి పుత్రుడవైన ఓ సూర్యభగవానుడా నీకు నమస్కారము. 

నమ ఉగ్రాయ వీరాయ సారంగాయ నమో నమః 
నమః పద్మ ప్రబోధాయ ప్రచండాయ నమో నమః 

18 అర్థము :
నిన్ను ఉపాసించని వారికి నీవు భయంకరుడవు. ప్రాణులకు శక్తిని ప్రసాదించువాడవు. శీఘ్రముగ ప్రయాణించువాడవు. పద్మములను వికసింపజేయువాడవు. జగత్ప్రళయమునకు పిమ్మట మరల సృజించుటకై ఆవిర్భవించు నట్టి ఓ సూర్యభగవానుడా నీకు నమస్కారము. 

బ్రహ్మేశానాచ్యుతేశాయ సూర్యాయాదిత్యవర్చసే 
భాస్వతే సర్వభక్షాయ రౌద్రాయ వపుషె నమః 

19 అర్థము : 
బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులకు ప్రతీకవు. దివ్య తేజస్సంపన్నుడవు. కాంతికి నిధియైన వాడవు. ప్రళయకాలమున లయకారకుడవు. అందువలన రుద్రస్వరూపుడవైన ఓ సూర్యభగవానుడా నీకు నమస్కారము. 

తమొఘ్నాయ హిమఘ్నాయ శత్రుఘ్నాయ అమితాత్మనె 
కృతఘ్నఘ్నాయ దేవాయ జ్యోతిషాం పతయే నమః 

20 అర్థము : 
తమస్సును రూపుమాపువాడవు. జడత్వమును, శీతలత్వమును నశింపజేయువాడవు. నిన్ను ఆశ్రయించి నవారి శత్రువులను సంహరించువాడవు. పరమాత్మ స్వరూపుడవు. కృతఘ్నులను నశింపజేయుచు, దివ్యతేజస్సు విరజిమ్ముచు, జ్యోతులకు అధిపతివైన నీకు నమస్కారము. 

తప్త చామీక రాభాయ హరయే విష్వకర్మణే 
నమస్తమోభినిఘ్నాయ రుచయే లొకసాక్షిణే 

21 అర్థము: 
బంగారమువంటి వన్నెగలవాడవు. ఆహుతులను గ్రహించువాడవు. సర్వజగత్కర్తవు. తమస్సులను పారద్రోలువాడవు. ప్రకాశస్వరూపుడవు. జగత్తున జరిగెడి సర్వజనుల కర్మలకు సాక్షియైన వాడవు. కనుక ఓ భాస్కరుడా నీకు నమస్కారము. 

నాశయత్యేష వై భూతం తదైవ సృజతి ప్రభుః 
పాయత్యేష తపత్యేష వర్షత్యేష గభస్తిభిః 

22 అర్థము: 
రఘునందనా! ఈ ప్రభువే సమస్త ప్రాణులను లయమొనర్చును. పిదప సృష్టించి పాలించుచుండును. ఇతడు తన కిరణముల చేత జగత్తును తపింపజేయును. వర్షములను ప్రాసాదించుచుండును. 

ఏష సుప్తేషు జాగర్తి భూతేషు పరినిష్ఠితః 
ఏష చైవాగ్నిహోత్రంచ ఫలం చైవాగ్నిహోత్రిణాం 

23 అర్థము: 
ఇతడు సకల ప్రాణులలో అంతర్యామిగా నుండును. వారు నిద్రించుచున్నను తాను మేల్కొనియే యుండును. హవిస్సు యొక్క స్వరూపము ఇతడే. తత్ఫలస్వరూపమూ ఇతడే. 

వేదాశ్చ క్రతవశ్చైవ క్రతూనాం ఫలమేవ చ 
యాని కృత్యాని లోకేషు సర్వేషు రవిః ప్రభుః 

24 అర్థము :
 ఇతడు వేదవేద్యుడు. యజ్ఞఫలస్వరూపుడు. లోకములో జరిగెడి సమస్త కార్యములకు ఈ సూర్యభగవానుడే ప్రభువు. 

ఏనమాపత్సు కృత్ శ్రేషు కాంతారేషు భయేషు చ 
కీర్తయన్ పురుషః కశ్చిన్ నావసీదతి రాఘవః 

25 అర్థము : 
రఘురామా! ఆపదలయందును, కష్టముల యందును, దుర్గమమార్గములయందును, భయస్థితులయందును ఈ స్వామిని కీర్తించినవారికి నాశము ఉండదు. 

పూజయస్వైనమేకాగ్రో దేవదేవం జగత్పతిం 
ఏతత్ త్రిగుణితం జప్త్వా యుద్ధేషు విజయిష్యసి 

26 అర్థము : 
దేవదేవుడు, జగత్పతియైన ఈ సూర్యభగవానుని ఏకాగ్రతతో పూజింపుము. ఈ ఆదిత్యహృదయమును ముమ్మారు జపించినచో నీవు ఈ మహా సంగ్రామము నందు విజయము పొందగలవు. 

అస్మిన్ క్షణే మహాబాహో రావణం త్వం వధిష్యసి 
ఏవముక్త్వా తదాగస్త్యో జగామ చ యథాగతం 

27 అర్థము : 
మహాబాహో! రామా! ఈ క్షణముననే నీవు రావణుని వధింపగలవు అని పలిగి అగస్త్య మహర్షి తన స్థానమునకు చేరెను 

ఏతత్ శృత్వా మహాతెజా నష్టశొకోభవత్తదా 
ధారయామాస సుప్రీతొ రాఘవహ్ ప్రయతాత్మవాన్

 28 అర్థము : 
మహాతేజస్వియైన శ్రీరాముడు అగస్త్యమహాముని ద్వారా ఈ ఆదిత్యహృదయ మహిమను గ్రహించి చింతారహితుడయ్యెను. అతడు మిక్కలి సంతృప్తి పొంది ఏకాగ్రతతో ఆదిత్యహృదయ మంత్రమును మనస్సు నందు నిలుపుకొనెను. 

ఆదిత్యం ప్రేక్ష్య జప్త్వా తు పరం హర్షమవాప్తవాన్ 
త్రిరాచమ్య శుచిర్భూత్వా ధనురాదాయ వీర్యవాన్ 

29 అర్థము : 
పిదమ ముమ్మారు ఆచమించి శుచియై సూర్యభగవానుని జూచుచు ఈ మంత్రమును జపించి పరమ సంతుష్టుడాయెను. పిమ్మట ఆ రఘువీరుడు తన ధనువును చేబూనెను. 

రావణం ప్రేక్ష్య హ్రుష్టాత్మా యుద్ధాయ సముపాగమత్ 
సర్వ యత్నేన మహతా వధె తస్య ధృతోభవత్ 

30 అర్థము : 
మిక్కిలి సంతుష్టుడైయున్న ఆ రాముడు రావణుని జూచి యుద్ధమునకై పురోగమించెను. అన్ని విధములుగా గట్టి పూనికతో ఆ నిశాచరుని వధించుటకు కృతనిశ్చయుడయ్యెను. 

అథ రవి రవదన్నిరీక్ష్య రామం ముదితమనాః పరమం ప్రహృష్యమాణః 
నిశిచరపతి సంక్షయం విదిత్వా సురగణమధ్యగతో వచస్త్వరేతి 

అర్థము : 
పిమ్మట దేవతలమధ్యనున్న సూర్యభగవానుడు రావణుడు నశించుట తథ్యము అని ఎరింగి మానసోల్లాసమును పొందినవాడై, పరమ సంతోషముతో శ్రీరాముని జూచి రామా! త్వరపడుము అని పలికెను


👇👇To Download Aditya Hridayam in pdf PLEASE CLICK HERE👇👇

Tags:
Aditya Hridayam in Telugu pdf free download,
Aditya Hridayam importance and significance,
Aditya Hridayam meaning in telugu,
Aditya Hridayam learning video,
Aditya Hrudayam book in telugu,
Aditya Hrudayam Lyrics in Telugu,
ఆదిత్య హృదయం- Aditya Hridayam in Telugu pdf book free download learning video, Aditya Hridayam Lyrics meaning in Telugu, ,

Aditya Hrudayam pdf free download
Aditya Hrudayam Stotram with full lyrics
Aditya Hridayam - Stotras from Ramayan

మరిన్ని >>> సూర్య స్తోత్రములు <<< చూడండి

ఇతర >>>స్తోత్రములు / శ్లోకముల<<<కై చూడండి



You may interest in following posts...

మనలో ఉన్న భయాలను దూరం చేసే స్తోత్రం శ్రీ దుర్గాష్టోత్తరశతనామావళిః👇👇👇
శ్రీ దుర్గాష్టోత్తరశతనామావళిః sri durgashtottara shata namavali in telugu pdf free download video

 పోగొట్టుకొనబడిన వస్తువు తిరిగి పొందడానికి, పఠించ వలసిన స్తోత్రం కార్తవీర్యార్జున స్తోత్రం👇👇👇
కార్తవీర్యార్జున స్తోత్రం karta veeryarjuna stotram in telugu pdf free download

చదువు, తెలివి తేటలు బాగా అభివృద్ధి చెందడానికి, పెద్దలకు సంపద సిద్ధి, సౌఖ్యం, అనంతమైన కీర్తి ప్రతిష్ఠల కోసం పఠించవలసిన స్తోత్రం శ్రీ విశ్వనాథ అష్టకం!!!
Click 👇👇👇
విశ్వనాథ అష్టకం Vishvanatha ashtakam in telugu pdf free download

 భార్యా భర్తల మధ్య అనురాగాన్ని పెంచి కలహాలను దూరంచేసే స్తోత్రం ఉమామహేశ్వర స్తోత్రం    
👇👇👇
ఆకలి దప్పుల బాధలేకుండా మన భవిష్యత్ జరుగుబాటు సుఖంగా సాగేలా చేసే మంత్రం అన్నపూర్ణాష్టకం👇👇👇
అన్నపూర్ణాష్టకం annapurnashtakam in telugu pdf free download video

ఆదిత్య హృదయం aditya hrudayam in telugu pdf free download video

Post a Comment

Whatsapp Button works on Mobile Device only