Tuesday 9 February 2021

Rukmini Kalyanam pdf free download puja vidhanam chaganti pravachanam

Rukmini Kalyanam by Sri Chaganti Koteshwa Rao Garu, Rukmini Kalyanam full guide, Rukmini Kalyanam in telugu pdf free download, Rukmini Kalyanam telugu learning video,Rukmini Kalyanam story shlokalu padyalu, Rukmini Kalyanam significance and importance for unmarried persons.


పెళ్ళి కాని వారు... పెళ్ళి త్వరగా కావాలని కోరుకునే వారు... ఇష్టమైన వరుడు / వధువు దొరకాలని కలలు కనేవారు... పెళ్ళి కావడం బహు కష్టంగా ఉన్నవారు ఈ రుక్మిణి కళ్యాణము(శ్రీ కృష్ట పూజ)ను నిష్టగా పఠిస్తే అనుకున్న విధంగా కళ్యాణం జరుగుతుంది... దాదాపు పది సంవత్సరాల నుండి పెళ్ళి కోసం పరి తపిస్తున్న మా మిత్రులకు శ్రేయోభిలాషులకు ఈ pdf ను mail చేసాను.. నాకైతె 100% result కనపడింది.. తప్పక forward చేయండి...

 
Rukmini-Kalyanam-pdf-free-download-puja-vidhanam-chaganti-pravachanam

రుక్మిణీ కళ్యాణము శ్రీకృష్ణ పూజ తో గానీ లక్ష్మీ దేవి అమ్మవారి అష్టకం... లాంటి వాటితో చేస్తే చాలా చక్కని ఫలితం ఉంటుంది... ఈ PDF లో మొత్తం పూజా విధానం.. గురించి చాలా స్పష్టంగా ఉంది... దీనిని ఉచితంగా డౌన్ లోడ్ చేసుకోండి.. మీ మిత్రులకు అవసరం ఉన్న వారికి ఉచితంగా షేర్ చేయండి... 

రుక్మిణీ కళ్యాణం- Story:

విదర్భ దేశాన్ని రాజు భీష్మకుడు, అతనికి రుక్మి, రుక్మరత, రుక్మకేతు, రుక్మబాహు, రుక్మనేత్ర అనే ఐదుగురు కుమారులు, రుక్మిణి అనే కుమార్తె ఉన్నది. రుక్మిణీదేవి శరత్కాల చంద్ర బింబం వలే దిన దిన ప్రవర్థమానమై యవ్వన వయస్సుకు వస్తుంది. వసుదేవ నందనుడు శ్రీకృష్ణుడు రుక్మిణి దేవి గురించి విని ఆమె తన భార్య కావాలి అని అనుకొంటాడు. అదే విధంగా రుక్మిణీ దేవి కూడా శ్రీకృష్ణుడి గురుంచి విని శ్రీకృష్ణుడినే తన భర్తగా పొందాలని అనుకొంటుంది. రుక్మిణీ దేవి పెద్దలు దీనికి అంగీకారం తెలిపి పెళ్ళి దిశగా పనులు మొదలు పెడుతుండగా రుక్మి ఈ మాటలు విని తన సోదరి పెళ్ళి శిశుపాలుడు కిచ్చి చేయాలని తీర్మానిస్తాడు. రుక్మి ఆ వివాహానికి సుముహూర్తం కూడా పెట్టిస్తాడు. ఈ విషయం తెలుసుకొన్న రుక్మిణీ దేవి చాలా చింతిస్తుంది. కొద్ది సేపు ఆలోచించి తన శ్రేయస్సు కోరే అగ్నిజోతనుడు అనే విప్రవరుడిని రప్పించి తన మనస్సు విప్పి విషయం చెప్పి ద్వారకపురమునకు వెళ్ళి శ్రీకృష్ణునకు తన అభీష్టము తెలిపి ముహూర్తమునకు ముందే ఇక్కడకు వచ్చి తనని చేపట్టమంటుంది. అగ్నిజోతనుడు హుటాహుటిన ద్వారకకు వెళ్ళి రుక్మిణీ దేవి పలికిన పలుకులు శ్రీకృష్ణునకు విన్నవిస్తాడు. అంతేకాక శ్రీకృష్ణుడికి ఆ విప్రవరుడు రుక్మిణీ దేవి ఏవిధంగా చేపట్టాలో ఆలోచనగా ఈ విధంగా చెబుతాడు. యదువంశ నందన రుక్మిణీ దేవి వారి వంశములొని వారి ఆచారము ప్రకారం పెళ్లి కుమార్తె పాణిగ్రహణానికి ముందు నగరము పొలిమేరలలొ ఉన్న దేవాలయానికి గౌరీ పూజకు వస్తుంది. ఆ సమయములొ యదువంశ నందన నువ్వు ఆమెను తీసుకొని వెళ్ళవచ్చు. ఆమె తో పాటు ఎవ్వరు ఉండరు కావున యుద్ధము జరిగే ప్రసక్తి కూడా ఉండదు. శ్రీ కృష్ణుడు అందుకు అంగీకరిస్తాడు. వారిరువురు విదర్భ దేశము వైపు బయలు దేరుతారు. అగ్నిజోతనుడు రుక్మిణి వద్దకు వెళ్ళి శ్రీ కృష్ణుడి తో జరిగిన సంభాషణ చెబుతాడు, శ్రీకృష్ణుడు ఆమె ని సర్వలోకేశ్వరి దేవాలయంలొ కలవనున్నట్లు కూడా చెబుతాడు. అనుకున్న ప్రకారము రుక్మిణీ దేవి నగరపొలిమేరలలొ ఉన్న సర్వలోకేశ్వరి ఆలయానికి వస్తుంది.
ఆ విధంగా అర్చనలు పూర్తి చేసి తిరిగి రాజధాని వైపు వస్తోంది. రాజధాని వీధులలొ అనేక రాజ్యాల రాజులు ఉన్నారు. అందరు చూస్తూ ఉండగానే శ్రీకృష్ణుడు ఆమెని తన రథం మీద ఎక్కించుకొని హుటహుటిన ద్వారక వైపు బయలుదేరతాడు. అలా రుక్మిణీ దేవిని తిసుకొని వెళ్ళుతున్న శ్రీకృష్ణుడిని చూసి అందరు తెల్లబోయారు. తేరుకొని శ్రీ కృష్ణుడి మీద యుద్ధమునకు బయలు దేరారు. అప్పుడు బలరాముడు మొదలైన యదువీరులు ఆ రాజులను చెల్లాచెదురు చేశారు. ఆ రాజులు వెనుదిరిగి పిక్కబలం పడుతూ శిశుపాలుని చూసి నాయన బతికి ఉంటే కదా భార్య, ఇప్పుడూ ఇంటికి వెళ్ళి మరో రాచకన్యని పెళ్లి చేసుకోమని చెబుతారు. కాని రుక్మి తన సేనతో దూకుడుగా వెళ్ళి శ్రీకృష్ణుడి రథం ఎదురుగా నిలిచి దండయాత్ర చేస్తాడు. అనేక విధాల శ్రీకృష్ణుడిని దుర్భాషలాడి బాణాలు విడుస్తుంటే శ్రీకృష్ణుడు ఒక్క బాణం విసిరి వాడి ధనస్సు ఖండించాడు. మరికొని నిశిత శరాలతో గుఱ్ఱలను చంపాడు. శిశుపాలుడు పరిగ, గద ఆదిగా గల అనేక ఆయుధాలు విడుస్తుంటే శ్రీకృష్ణుడు అన్నింటిని ఛేదిస్తాడు. శ్రీకృష్ణుడు రుక్మి శిరస్సు ఖండించదలస్తుంటే రుక్మిణీ దేవి శ్రీకృష్ణుడి కాళ్ళపై పడి తన సోదరుడిని క్షమించి విడిచి పెట్ట మంటుంది. శ్రీకృష్ణుడు శాంతించి రుక్మి కి తల గొరిగించే సన్మానం చేస్తాడు. అది చూసి రుక్మిణీ దేవి విచారిస్తుండగా బలరాముడు రుక్మిణీ దేవిని ఓదారుస్తాడు. ఆ తరువాత శ్రీకృష్ణుడు రుక్మిణీ దేవిని ద్వారకకు తీసుకొని వెళ్తాడు. ద్వారకకు వెళ్ళాక అక్కడ పెద్దలు విద్యుక్తంగా రుక్మిణీ శ్రీకృష్ణులకు వివాహం జరిపిస్తారు.
 
సర్వదేవ కృతమ్ శ్రీ లక్ష్మీ స్తోత్రమ్

క్షమస్వ భగవత్యంబ క్షమా శీలే పరాత్పరే|
శుద్ధ సత్వ స్వరూపేచ కోపాది పరి వర్జితే||

ఉపమే సర్వ సాధ్వీనాం దేవీనాం దేవ పూజితే|
త్వయా వినా జగత్సర్వం మృత తుల్యంచ నిష్ఫలమ్|

సర్వ సంపత్స్వరూపాత్వం సర్వేషాం సర్వ రూపిణీ|
రాసేశ్వర్యధి దేవీత్వం త్వత్కలాః సర్వయోషితః||

కైలాసే పార్వతీ త్వంచ క్షీరోధే సింధు కన్యకా|
స్వర్గేచ స్వర్గ లక్ష్మీ స్త్వం మర్త్య లక్ష్మీశ్చ భూతలే||

వైకుంఠేచ మహాలక్ష్మీః దేవదేవీ సరస్వతీ|
గంగాచ తులసీత్వంచ సావిత్రీ బ్రహ్మ లోకతః||

కృష్ణ ప్రాణాధి దేవీత్వం గోలోకే రాధికా స్వయమ్|
రాసే రాసేశ్వరీ త్వంచ బృందా బృందావనే వనే||

కృష్ణ ప్రియా త్వం భాండీరే చంద్రా చందన కాననే|
విరజా చంపక వనే శత శృంగేచ సుందరీ|

పద్మావతీ పద్మ వనే మాలతీ మాలతీ వనే|
కుంద దంతీ కుందవనే సుశీలా కేతకీ వనే||

కదంబ మాలా త్వం దేవీ కదంబ కాననే2పిచ|
రాజలక్ష్మీః రాజ గేహే గృహలక్ష్మీ ర్గృహే గృహే||

ఇత్యుక్త్వా దేవతాస్సర్వాః మునయో మనవస్తథా|
రూరూదుర్న మ్రవదనాః శుష్క కంఠోష్ఠ తాలుకాః||

ఇతి లక్ష్మీ స్తవం పుణ్యం సర్వదేవైః కృతం శుభమ్|
యః పఠేత్ప్రాతరుత్థాయ సవైసర్వం లభేద్ధ్రువమ్||

అభార్యో లభతే భార్యాం వినీతాం సుసుతాం సతీమ్|
సుశీలాం సుందరీం రమ్యామతి సుప్రియవాదినీమ్||

పుత్ర పౌత్ర వతీం శుద్ధాం కులజాం కోమలాం వరామ్|
అపుత్రో లభతే పుత్రం వైష్ణవం చిరజీవినమ్||

పరమైశ్వర్య యుక్తంచ విద్యావంతం యశస్వినమ్|
భ్రష్టరాజ్యో లభేద్రాజ్యం భ్రష్ట శ్రీర్లభేతే శ్రియమ్||

హత బంధుర్లభేద్బంధుం ధన భ్రష్టో ధనం లభేత్||
కీర్తి హీనో లభేత్కీర్తిం ప్రతిష్ఠాంచ లభేద్ధ్రువమ్||

సర్వ మంగళదం స్తోత్రం శోక సంతాప నాశనమ్|
హర్షానందకరం శాశ్వద్ధర్మ మోక్ష సుహృత్పదమ్||
|| ఇతి సర్వ దేవ కృత లక్ష్మీ స్తోత్రం సంపూర్ణం ||

క్షీర సాగరం నుండి లక్ష్మీ దేవి ఉద్భవించినప్పుడు దేవతలందరూ కలిసి అమ్మవారిని స్తోత్రం చేశారు. కనుక దీనిని " సర్వదేవకృత లక్ష్మీ స్తోత్రం " అంటారు. ఈ స్తోత్రం అత్యంత శక్తి వంతమైనది. కనీసం 41 రోజులు క్రమంతప్పకుండా పారాయణ చేసి ప్రతీ శుక్రవారమూ అమ్మ వారికి ఆవుపాలతో చేసిన పరమాన్నము నైవేద్యము పెట్టిన వారికి ఎంత కష్టములో ఉన్ననూ ఆ కష్టములు తొలగి సమస్త సంపదలూ లభిస్తాయి. వివాహము ఆలస్యమవుతున్న అబ్బాయిలకి అతి త్వరలో సౌందర్య వతి అయిన, అనుకూల వతి అయిన కన్యతో వివాహము అవుతుంది. లక్ష్మీ దేవి వంటి భార్య లభిస్తుంది. ఇందు సంశయము లేదు. ఇంకా దీని వలన కలుగు సంపదలు అన్నీ ఇన్నీ అని చెప్పనలవి కాదు.

Rukmini Kalyanam in pdf free download

👇👇👇👇
రుక్మిణి కళ్యాణము
👆👆👆👆



రుక్మిణి కళ్యాణము గురించి బ్రహ్మశ్రీ శ్రీ చాగంటి వారి ప్రవచనాన్ని వినండి... 
Rukmini Kalyanam Video 👇👇👇




Rukmini Kalyanam book pdf download here 👇👇👇


వేర్వేరు గ్రహదోషాలు.. కుజ దోషం ఉన్నా ఒక్కొక్కసారి వివాహం ఆలస్యం కావచ్చు... ప్రతిరోజూ నిష్టగా పఠించేందుకు అనువుగా అవసరమైన స్తోత్రాలను క్రింద ఉంచాము... 

గ్రహ దోషాలను తొలగించుకొనుటకు👉👉 నవగ్రహ స్తోత్రం

కుజ దోష నివారణకు 👉👉సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం - 

కుజ దోష నివారణకు 👉👉సుబ్రహ్మణ్య అష్టకం - 




ఈ మెసేజ్ save చేసుకుని... అవసరం అయిన  మిత్రులకు షేర్ చేయడం మర్చిపోకండి.. 
అవి చాలా మందికి ఉపయోగపడాలి...
🙏🙏🙏


మా స్తోత్ర సూచిక లోని >>శ్రీకృష్ణ స్తోత్రాలు << కోసం లింక్ చూడండి

మా YouTube Channel ను SUBSCRIBE చేయండి.. మమ్ము కొంచెం Encourage చేసినట్లు అవుతుంది.. Please subscribe our Channel
👉👉👉To Subscribe us please click here👈👈👈




👆👆👆

Tags:
Rukmini Kalyanam meaning in telugu,
Rukmini Kalyanam Pravachanam by Shri Chaganti Koteshwara Rao garu,
Rukmini Kalyanam learning video,
Rukmini Kalyanam book in telugu,
Rukmini Kalyanam Lyrics in Telugu,
Rukmini Kalyanam in Telugu pdf free download,
Rukmini Kalyanam importance and significance,


You may interest in following posts...

మనలో ఉన్న భయాలను దూరం చేసే స్తోత్రం శ్రీ దుర్గాష్టోత్తరశతనామావళిః👇👇👇
శ్రీ దుర్గాష్టోత్తరశతనామావళిః sri durgashtottara shata namavali in telugu pdf free download video

 పోగొట్టుకొనబడిన వస్తువు తిరిగి పొందడానికి, పఠించ వలసిన స్తోత్రం కార్తవీర్యార్జున స్తోత్రం👇👇👇
కార్తవీర్యార్జున స్తోత్రం karta veeryarjuna stotram in telugu pdf free download

చదువు, తెలివి తేటలు బాగా అభివృద్ధి చెందడానికి, పెద్దలకు సంపద సిద్ధి, సౌఖ్యం, అనంతమైన కీర్తి ప్రతిష్ఠల కోసం పఠించవలసిన స్తోత్రం శ్రీ విశ్వనాథ అష్టకం!!!
Click 👇👇👇
విశ్వనాథ అష్టకం Vishvanatha ashtakam in telugu pdf free download

 భార్యా భర్తల మధ్య అనురాగాన్ని పెంచి కలహాలను దూరంచేసే స్తోత్రం ఉమామహేశ్వర స్తోత్రం    
👇👇👇
ఆకలి దప్పుల బాధలేకుండా మన భవిష్యత్ జరుగుబాటు సుఖంగా సాగేలా చేసే మంత్రం అన్నపూర్ణాష్టకం👇👇👇
అన్నపూర్ణాష్టకం annapurnashtakam in telugu pdf free download video

ఆదిత్య హృదయం aditya hrudayam in telugu pdf free download video

Post a Comment

Whatsapp Button works on Mobile Device only