అష్టాదశ పురాణాలు
అష్టాదశ పురాణాలను కృష్ణద్వైపాయనుడైన వ్యాసమహర్షి రచించాడని, రచించిన తానే స్వయంగా చెప్తున్న్తట్లు కాకుండా ఆ విషయాలను ఒకప్పుడు నైమిశారణ్యంలో శౌనకుడు మొదలైన మహా మునులు దీర్ఘ సత్రయాగం చేస్తున్నప్పుడు, వారికి వ్యాసుని శిష్యుడైన రోమహర్షణుడుకుమారుడైన సూత మహర్షి ద్వారా చెప్పించాడని పురాణాలే చెబుతున్నాయి. ఈ పురాణాలు మధ్య యుగం లో జరిగిన శైవ, వైష్ణవ ఘర్షణల వలన పరివర్తన చెందాయి అనే వాదన కూడా లేక పోలేదు. కొన్ని శ్లోకాల రచన శైలి వ్యాస మహర్షి రచన శైలిని గమనిస్తే ఆ విషయం అవగతం అవుతుంది.
పురాణాల క్రమం ఎలా ఉందో కూడా ఒక శ్లోకం ఉంది.. అదే క్రమంలో చదివితే సారం బాగా అర్థమవుతుంది...
పురాణాల పేర్లు చెప్పే శ్లోకం
సత్రయాగం జరుగుచున్నప్పుడు అష్టాదశపురాణాలను తెలుపుతూ సూతుడు ఋషులకు చెప్పిన శ్లోకం. భాగవత పురాణము ప్రధమ స్కందము లో చెప్పబడింది.
'మ'ద్వయం 'భ'ద్వయం చైవ 'బ్ర'త్రయం 'వ'చతుష్టయం
అనాపద్లింగకూస్కాని పురాణాని పృథక్ పృథక్
పైన చెప్పిన వాటిలో:
“మ” ద్వయం — మత్స్య పురాణం, మార్కండేయ పురాణం
“భ” ద్వయం — భాగవత పురాణం, భవిష్య పురాణం
“బ్ర” త్రయం — బ్రహ్మ పురాణం, బ్రహ్మ వైవర్త పురాణం, బ్రహ్మాండ పురాణం
“వ” చతుష్టయం — విష్ణు పురాణం, వరాహ పురాణం, వామన పురాణం, వాయు పురాణం
మిగిలిన వాటి పేర్ల మొదటి అక్షరాలు మాత్రమే తీసుకుని శ్లోకపాదం కూర్చటం జరిగింది:
అ — అగ్ని పురాణం
నా — నారద పురాణం
పద్ — పద్మ పురాణం
లిం — లింగ పురాణం
గ — గరుడ పురాణం
కూ — కూర్మ పురాణం
స్కా — స్కాంద పురాణం
ఇవే ఆ అష్టాదశ పురాణాలు... ఇవన్నీ వేదములు, వేదాంగములు.. మొదలగు వాటినుండి సేకరించినవి అని.. వేదక్రతువునకు అడ్డంగా ఉండకుండా విడదీసారు అనే వాదన కూడా ఉంది... ఏది ఏమైనప్పటికీ ఈ అష్టాదశ పురాణాలు చదివితే వేద వేదాంగ సారం కొంచెం అవగాహనకు వస్తుంది... క్రింది లింక్ లో అష్టాదశ పురాణాల ను ఉచితంగాపొందే లిస్ట్ ఉంది... మీకు ఏ పుస్తకం చదవాలని ఉంటుందో.. ఆపుస్తకం మీద క్లిక్ చేస్తే pdf వస్తుంది... అక్కడే మీకు డౌన్ లోడ్ ఆప్షన్ కూడా కనపడుతుంది... అవసరం ఉన్న వారు డౌన్ లోడ్ చేసుకోండి..
గరుడ పురాణం Garuda Puranam in telugu pdf free download
వైశాఖ పురాణము Vaishakha Puranam in telugu free pdf download
Skandha Puranam in telugu free pdf download
దేవీ భాగవతము Devi Bhagavatam in telugu pdf free download
అష్టాదశ పురాణాలు-Part-2 Ashtadasha puranalu in telugu free pdf download
download చేసుకునే ముందు మా You Tube Channel ని Subscribe చేసుకోండి. మాకు కొంచెం support ఇచ్చినట్టుగా ఉంటుంది.
Post a Comment