Siddhantha Shiraomani by bhaskaracharya book free download in pdf - సిద్ధాంత శిరోమణి by భాస్కరాచార్య
ఒకసారి క్రింది పద్యం చూడండి
ఈ పద్యం శ్రీ భాస్కరాచార్యుల వారు రచించిన సిద్ధాంత శిరోమణి అనే పురాతన గ్రంథంలో ఉంది...
ఆకృష్ట శక్తిశ్చ మహీతయాయత్
ఖస్థం గురు స్వాభిముఖం స్వశక్త్యా ।
ఆకృష్యతే తత్పతతీవ భాతి
స మే సమంతాత్ క్వపతత్వియం ఖే ।।
భూమి తన ఆకర్షణ శక్తి చేత సమస్త వస్తువులను తన వైపునకు లాగుకొనును. కావున అవి భూమి పై పడుచున్నట్లు కనిపించును.
భాస్కరాచార్యులు (క్రీ.శ 1114 - 1185) సిద్ధాంత శిరోమణి ని రచించారు.. ఆరోజుల్లో మన భారత దేశమునుండి విరివిగా ఎన్నో శాస్త్ర సంబంధ విషయాలను గ్రీకులు జర్మన్ లు తమ దేశాలకు తీసుకువెళ్ళారు.. ఎన్నో లక్షల మంది విదేశీయులు తక్షశిల నలంద విశ్వవిద్యాలయాలలో అభ్యసిస్తున్నట్లు మన భారత దేశాన్ని ఆ కాలంలో సందర్శించిన యాత్రీకుల స్వీయ రచనలలో వ్రాసుకున్న సందర్భాలు ఉన్నాయి.. అలా మన ఈ విశేషాలు అన్నీ వారు సాధించినట్లు పేటెంట్ తీసుకున్నారు.. కానీ మనం బ్రిటిష్ వారి దాస్య శృంఖలాలలో ఉండడం.. మరియు తర్వాతి వారు సరైన విధంగా భారత దేశాన్ని ప్రపంచములో సరిగా నిలబెట్ట లేక పోవడం వలన అన్ని మరుగున పడిపోయాయి...
ఇప్పటికీ ఇంకా భూమ్యాకర్షణ శక్తిని కనుగొన్నది న్యూటనేనని ఎవరైనా యాపిల్ కథలు చెప్తే, అంతకు ముందే 11వ శతాబ్దానికి చెందిన భాస్కరాచార్య సిద్ధాంత శిరోమణిలో చెప్పారు కదా? అని ప్రశ్నించండి.
సిద్ధాంత శిరోమణి, ప్రాచీన భారతీయ గణితవేత్త రెండవ భాస్కరుని ప్రధాన రచన. 36 సంవత్సరాల వయసులో (అనగా సా.శ. 1150) రాయబడిన ఈ ఉద్గ్రంథంలో మూడు సంపుటాలుగా, సుమారు 1450 శ్లోకాలు ఉన్నాయి
లీలావతి గణితము - Leelavathi Ganitamu free download in english pdf
ఇది భాస్కరుడు, తన కుమార్తె లీలావతి పేర రాసాడని ప్రసిద్ధి. ఇది సిద్ధాంత శిరోమణిలోని మొదటి భాగం. 13 అధ్యాయాలు, 278 శ్లోకాలు ఉన్న ఈ గ్రంథం అంకగణితం, కొలతలు గురించి చర్చిస్తుంది.
బీజగణితం - Beejaganitamu in telugu pdf free download
సిద్ధాంత శిరోమణిలోని రెండవ భాగం బీజగణితం. ఇది 6 అధ్యాయాలుగా, 213 శ్లోకాలుగా ఉండి బీజగణితం గూర్చి చర్చిస్తుంది.
గణితాధ్యాయం, గోళాధ్యాయం
సిద్ధాంత శిరోమణిలోని మూడవ భాగమైన గణితాధ్యాయం, గోళాధ్యాయం, జ్యోతిష్య గ్రంథం. ఇది సుమారు 900 శ్లోకాలతో కూడి ఉంది.
Tags:
Bhaskaraacharya information in telugu
Siddhanta Shiromani book free download in telugu pdf
Who invented gravitational force ancient indian sage information
Short essay on Bhaskaracharya
Brahmasphuta siddantham matter in English
Bhaskaraacharya information in telugu
Siddhanta Shiromani book free download in telugu pdf
Who invented gravitational force ancient indian sage information
Short essay on Bhaskaracharya
Brahmasphuta siddantham matter in English
మాసైట్ లో ఇంకా ఎన్నో 👉అమూల్యమైన పుస్తకాలు 👈ఉన్నాయి.. మీరు చూసి ఇష్టమైన వాటిని డౌన్ లోడ్ చేసుకోవచ్చు..
Post a Comment