నాగ ప్రతిష్ట చేయడం అంటే సుబ్రహ్మణ్యస్వామిని ఆరాధించడమే... సంతానం కలగని వారు వివాహం ఆలస్యం అయినవారు... భూ సంబంధిత లావాదేవీలలో చిక్కుకుని బయటపడి లేనివారు... తమ పుత్ర పౌత్ర వారసులు అందరికీ ఎటువంటి పంచేంద్రియ దోషములు ఉండకూడదు మంచి ఆరోగ్యం పొందాలి అనుకునేవారు నాగ ప్రతిష్ట ను చేయవచ్చు...
అయితే నాగ ప్రతిష్ట ను నిత్యం ధూపదీప నైవేద్య ఆరాధన చేసే ఆలయంలో ఆ వెసులుబాటు ఉన్నప్పుడు మాత్రమే ఆయా ఆలయములో నాగ ప్రతిష్ట చేయవచ్చు.. ఇటువంటి నాగ ప్రతిష్ట చేయటానికి ప్రత్యేక ఆలయంలో ఉంటాయి వాటికి ప్రతి నిత్యం విశేష పూజలు జరుగుతూ ఉంటాయి... అలా ప్రతిష్ట చేసినా ఆ నాగప్రతిమకు సరైన పోషణ జరగలేదు అంటే అరిష్టాలు సంభవిస్తాయి... అందుకే సరైన ఆలయమును గుర్తించి నిరంతరం పోషణ జరుగుతుందా లేదా అనేది జాగ్రత్తగా చెక్ చేసుకోవాలి లేకపోతే పుణ్యానికి పోతే పాపం ఎదురవుతుంది...
కేవలం నాగప్రతిష్ట అని మాత్రమే కాకుండా...బాణ లింగ ప్రతిష్ట ... స్ఫటిక లింగ ప్రతిష్ట ...సహస్ర లింగ ప్రతిష్ట అని వేర్వేరు అంశాలు ఇక్కడ ఉన్నాయి వేరు నక్షత్రములలో జన్మించిన వారికి ఆ నక్షత్రాలకు సంబంధించిన దోషాలను నివారించడానికి ఒక చెట్టు ని నాటమని చెప్తారు... అలా నక్షత్ర సంబంధించిన పరిహారములు కూడా ఇక్కడ లభిస్తాయి...
గ్రహాలకు సంబంధించిన దోషాలు నిమిత్తం ఇక్కడ నవగ్రహ ఆలయం ఉంది ఒక్కొక్క గ్రహానికి ఒక ఆలయం ఉండటం కేవలం ఇక్కడ మాత్రమే సాధ్యమైంది..
వేరు వేరు గ్రహ దోషాలకు గ్రహ దోష నివారణ పూజలు నిర్వహించడానికి ఇక్కడ అవకాశం ఉంది... నక్షత్ర రాశి దోషానికి సంబంధించి ఏ చెట్టును ఏ దిశలో నాటాలి అనే దానితో సహా ఈ ఆలయంలో చూడవచ్చు.... ఎన్నో విషయాలను ధర్మ సంబంధమైన అనుమాన నివృత్తి తెలుపుతూ ఆలయమును సోదాహరణగా చూపుతూ క్రియేట్ చేశాము... ఆలయము నకు సంబందించిన ఈ వీడియో క్రింద లింక్ లో ఉంది చూడండి
మా స్తోత్ర సూచిక లోని >>ఇతర ఆలయ సమాచారముల << కోసం లింక్ చూడండి
మా YouTube Channel ను SUBSCRIBE చేయండి.. మమ్ము కొంచెం Encourage చేసినట్లు అవుతుంది.. Please subscribe our Channel
ప్రత్యంగిరా అమ్మవారి ని ఆరాధించడం ద్వారా కూడా ఈ దోషాలు అన్నిటిని పోగొట్టుకోవచ్చు దానికోసం ఇక్కడ ప్రత్యంగిరా హోమం చేయడానికి ప్రత్యంగిరా అమ్మవారి ఆరాధించటానికి అమ్మవారి ఆలయం కూడా ఉంది ఆ ఆలయం గురించి నేను మీకు సోదాహరణగా పోస్టులో వివరించాను పూర్తి ఇన్ఫర్మేషన్ కోసం మీరు ఆ వీడియోను చూడవచ్చు క్రింద ఆ లింకు ఉంచుతున్నాను...
Post a Comment