ఇది పరాశర సంహిత, జైమిని సంహిత నుండి క్రోడీకరింప బడిన అతి ప్రాచీన జ్యోతిష్య శాస్త్ర గ్రంథం... ఈ గ్రంథంలా జ్యోతిష్య శాస్త్రం గురించిన వివరాలు వేరే ఏ ఇతర గ్రంథాలలో లభ్యంకావు... శాస్త్రము అభ్యసించిన పండితులకు మాతమే కాదు... క్రొత్త గా శాస్త్రం నేర్చుకోవాలి అనే ఆసక్తి ఉన్నవారికి ఎంతో ఉపయోగకరమైనది ఈ గ్రంధం..
రవి, చంద్ర, కుజ, బుధ, గురు, శుక్ర, శని, రాహు, కేతు మహాదశల ఫలితములు, తెలుసుకొను విధానములు చక్కగ చెప్పబడెను. తరువాత సాముదాయక అంతర్దశాఫలితములుకూడ విపులముగ చెప్పబడినవి, ఆవిధముగ జాతక ఫలితములు పూర్తిగా తెలుసుకొనుటకు వీలుగా ఈ గ్రంధములో సంజ్ఞాధ్యాయము, ద్వాదశ భావ ఫలితములు, దశాఫలితములు, దశాంతర్దశాఫలితములు ప్రతివారికి సులభముగ బోధపడునట్లు తెలిపబడింది. అనగా జాతకభాగమంతయు యీ ఒక్క గ్రంధములోనే చెప్పబడెను.
ఈ గ్రంధము చదివినచో జాతక భాగమంతయు పూర్తిగా తెలుస్తుంది. అందుచే దీనితో సమానమైన గ్రంధము వేరొకటి లేదు. పరా శర్యము, జైమిని మొదలగు పద్ధతులన్నియు క్రోడీకరించి, జై ఈ గ్రంధము వ్రాసినట్లు తెలియుచున్నది.
జ్యోతిష శాస్త్రము అతి ప్రాచీనమైన భారతీయ విజ్ఞానశాస్త్రము. ఈశాస్త్రము మన మతగ్రంధములైన వేదములలో చెప్పబడియున్నది. ఈ శాస్త్రము పురాతనమునుండియు శాఖోపశాఖలుగా విస్తరింపబడి నదై, వివిధ విషయములను లోకహితముగ తెలియజేయుటకు సాధన ముగ యున్నది. ఆకాశమందు సంచరించు గ్రహముల, నక్షత్రముల సంబార విశేషములను తెలుపునది సిద్ధాంత భాగము.
గ్రహములయొక్కయు, నక్షత్రములయొక్కయు రశ్మిప్రభా వమువలన ప్రాణికోటిపై కలుగబోవు శుభాశుభ ఫలితములు తెలియ జేయునది:జాతక భాగమనబడుచున్నది.
మరియు భూమండలముపై పరిపాలకుల గురించియు, కలుగబోవు ప్రపంచ ఉపద్రవములను గురించియు, వర్షముల గురించియు, వాతా వరణముల గురించియు, సస్యముల వృద్ధి, క్షయములు గురించియు, భూకంపము మొదలగు ఉపద్రవములను గురించియు, యింకను అనేక విషయముల గురించి తెలియజేయు భాగము సంహిత జ్యోతిష భాగ మనియు, యీ శాస్త్రము మూడు భాగములుగ విభజింపబడినది. ఈ శాస్త్రమునకు మన దేశమందేగాక, ప్రపంచములో సమస్త దేశముల యందును విశిష్ఠస్థానము కలదు. దైవజ్ఞుడు లేని దేశములో ప్రభువు దైవజ్ఞులను తమ దేశమునందుంచుకొని, పోషించవలయునని చెప్పబడియున్నది.
జ్యోతిష శాస్త్రము, ఆయుర్వేదము, గణిత శాస్త్రము, వేదాంతము, మొదలగు శాస్త్రములు అభ్యసించుటవలన మానవులకు విజ్ఞాన నేత్రము వికసించును. అట్టి విజ్ఞానశక్తితో పురుషార్థములైన ధర్మార్థ, కామ, మోక్షములను చతుర్విధ పురుషార్ధములను సులభముగా సాధించ వచ్చును. బహుశాస్త్ర పరిశీలన లేని జీవితము పశుజీవితములో సమానమువంటిది. ఈ శాస్త్రజ్ఞానము లేనివారు కూపస్థమండూకము వలె నుందురు.
👇👇To download Sarvartha chintamani Ancient Astrology Book click here👇👇
Tags:
sarvartha chintamani - ancient vedic indian horoscope book pdf free download - సర్వార్థ చింతామణి telugu book free download pdf, free e books download
మాసైట్ లో ఇంకా ఎన్నో 👉అమూల్యమైన పుస్తకాలు 👈ఉన్నాయి.. మీరు చూసి ఇష్టమైన వాటిని డౌన్ లోడ్ చేసుకోవచ్చు..
చాణక్య నీతి సూత్రాలు -Chankya neeti sutra in telugu pdf free download
కౌటిల్యుని అర్థ శాస్త్రం- Kowtilyuni artha shastram in telugu free pdf download
పంచతంత్రం - panchatantram books in telugu free download
భర్తృహరి సుభాషితం- bharthruhari subhashitam books in telugu free pdf download
వేద గణితము - Vedaganitamu books in telugu free pdf download
పెద్ద బాలశిక్ష - Pedda Balashiksha Books in telugu free pdf download
download చేసుకునే ముందు మా You Tube Channel ని Subscribe చేసుకోండి. మాకు కొంచెం support ఇచ్చినట్టుగా ఉంటుంది.
👉భగవద్గీత Bhagavadgeetha in telugu pdf free download
👉మహాభారతం Maha Bharatam in telugu pdf free download
👉రామాయణం Ramayanam in telugu pdf free download
👉భాగవతం Bhagavatam in telugu pdf free download
👉అష్టాదశ పురాణాలు Ashtadasha puranalu in telugu pdf free download
👉పిల్లల నీతి కథలు
👉అందరికీ ఆయుర్వేదం Andarikee ayurvedam books in telugu pdf free download
Thanks a Lot Admin for Sharing Valuable Ancient Books.. MAY GOD BLESS YOU..
ReplyDelete