చాణక్యుల వారు తక్షశిల విశ్వవిద్యాలయంలో ఒక ఆచార్యులు.. ఒక విధంగా మనకు తెలిసిన చరిత్రలో ఈయనే ప్రథమ King Maker.. అంటే.. చంద్రగుప్తుడిని మహారాజుగా చేసింది ఈయనే... మొదటి సారిగా చక్రవర్తిత్వానికి అర్థం... పెద్ద రాజ్యాన్ని తయారు చేయడం గురించి తన రాజనీతి అర్థ శాస్త్రాలలో పేర్కొనడమే కాక.. స్వయంగా మౌర్య సామ్రాజ్యాన్ని స్థాపించి పెంచి పెద్ద చేసిన వాడిగా ఇతని రాజనీతిజ్ఞతను చెప్పవచ్చు....
నందరాజులకు మంత్రిగా ఉన్న రాక్షసుడు... చంద్రగుప్తుడిని చంపడానికి ఎన్నో కుతంత్రాలు పన్నినాడు.. వాటన్నిటినీ ఛేదించి ఆయననే తిరిగి చంద్రగుప్తునికి ప్రధాన మంత్రిగా చేసి.. ఎన్నో రాజ్యాలను జయించేందుకు అనువుగా రాక్షస మంత్రిని మార్చడం మామూలు విజయం కాదు.. ఇలాంటి ఎన్నో చాణక్య నీతులను ఆయన శాస్త్రాలలో మనకు బోధిస్తారు.....
అసలు ఏ మందీ మార్బలం లేని సమయంలో పర్వత రాజు సాయంతో సామంత రాజులందరినీ కలిపి నందరాజ్యం మీద యుద్ధం చేసి నందవంశాన్ని నిర్మూలన చేసి... అతి బలవంతులైన మిత్ర రూపంలో ఉన్న శత్రువు పర్వతరాజులాంటి వారందరినీ నిర్మూలించడం.. వంటివి.. ఎన్నో నేర్చుకోవలసిన విషయాలు..
శత్రువులను చంపడం, లొంగ దీసుకోవడం, గూఢ చారుల వ్యవస్థ.. శత్రు దేశంలో కూడా చారులను ఏర్పాటు చేసుకోవడం లాంటి ఎన్నో టెక్నిక్స్ ఇప్పటికీ మనం follow అవుతూనే ఉన్నాము... అయితే చాణక్యుల వారు తెలిపిన అర్థ శాస్త్రానికి ఇప్పుడు మనం వాడుక భాషలో ఉన్న అర్థ శాస్త్రానికి చాలా తేడా ఉంది.. అయిననూ మన వాడుక భాషలోని అర్థ శాస్త్రమనేది ఒక చిన్న విభాగం క్రింద చెప్పవచ్చు... చాణక్యునకు గోత్ర నామము కౌటిల్యుడిగా.. విష్ణుశర్మ అని ఇతర పేర్లు ఉన్నవి..
విష్ణుశర్మ పేరుతో పంచతంత్రము
కౌటిల్యుని పేరుతో అర్థ శాస్త్రము
చాణక్యుని పేరుతో చాణక్య నీతి
గ్రంథములు మనకు లభ్యమవుతున్నాయి..
విష్ణుశర్మ పేరుతో పంచతంత్రము
కౌటిల్యుని పేరుతో అర్థ శాస్త్రము
చాణక్యుని పేరుతో చాణక్య నీతి
గ్రంథములు మనకు లభ్యమవుతున్నాయి..
క్రింద ఉన్న లింక్ లో ఆ పుస్తకములు ఉన్నవి.. ఇవి చదవడం వలన మనలో ఉన్న జిజ్ఞాస , విజ్ఞానం.. తప్పకుండా పెరుగుతాయి.. చిన్న పిల్లలను చదివించడం వలన.. మంచి రాజనీతిజ్ఞులుగా... మంచి తెలివైన వారుగా... విలువలతో కూడిన విద్యను అందించిన వారము అవుతాము... ఆసక్తి ఉన్న వారు చూడగలరు..
చాణక్య నీతి సూత్రాలు
కౌటిల్యుని అర్థ శాస్త్రం
చాణక్య నీతి సూత్రాలు
కౌటిల్యుని అర్థ శాస్త్రం
You Interest also:
download చేసుకునే ముందు మా You Tube Channel ని Subscribe చేసుకోండి. మాకు కొంచెం support ఇచ్చినట్టుగా ఉంటుంది.
Post a Comment