Sunday 27 June 2021

Daridrya dahana Ganapati Stotram in telugu pdf free download - దారిద్ర్య దహన గణపతి స్తోత్రం

Daridrya dahana Ganapati Stotram - దారిద్ర్య దహన గణపతి స్తోత్రం

అష్టైశ్వర్యాలు ప్రసాదించి సకల కష్ట నష్ట దరిద్రాలను భస్మం చేసే మహామహిమాన్వితమైన గణేశ స్తోత్రం

మనం ఏ కార్యం తలపెట్టినా, అది ఎటువంటి అవరోధాలు కలుగకుండా, విజయవంతంగా కొనసాగాలని ప్రప్రథమంగా పూజించేది విఘ్నేశ్వరుడినే.... సకల సంకటాలనూ తొలగించే గణపతి అనుగ్రహం కోసం సంకట నాశన గణేశ స్తోత్రం భక్తి శ్రద్ధ విశ్వాసాలతో పఠిస్తే, శ్రీ గణేశ అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది. ఎవరికి వారు స్వయంగా, అనుభవపూర్వకంగా తెలుసుకోవచ్చు. ప్రతీరోజూ ఈ మహామహిమాన్వితమైన స్తోత్రాన్ని పఠించి, గణేశ అనుగ్రహం పొందుదాం. ఈ దారిద్ర్య దహన గణేశ స్తోత్రం ప్రతీరోజూ పఠిస్తే శ్రీ గణేశుని అనుగ్రహం వలన అష్టైశ్వర్యాలు కలిగి, సకల కష్ట నష్ట దరిద్రాలు భస్మం అవుతాయి
 
దారిద్ర్య దహన గణపతి స్తోత్రం

Daridra dahana Ganapati Stotram video in telugu



సువర్ణ వర్ణ సుందరం సితైక దంత బంధుం
గృహీత పాశ మంకుశం వరప్రదా భయప్రదం
చతుర్భుజం త్రిలోచనం భుజంగ మోపవీతినం
ప్రపుల్ల వారిజాసనం భజామి సింధురాననః || 1 ||

కిరీట హార కుండలం ప్రదీప్త బాహు భూషణం
ప్రచండ రత్నకంకణం ప్రశోభిత్రాంగ్రి యష్టికం
ప్రభాత సూర్య సుందరాంబర ద్వయ ప్రధారిణం
సరత్న హేమబూపుర ప్రశోభి తాంఘ్రి పంకజం || 2 ||

సువర్ణ దండ మండిత ప్రచండ చారు చామరం
గృహ ప్రదేందు సుందరం యుగక్షణ ప్రమోదితం
కవీంద్ర చిత్తరంజకం మహావిపత్తి భంజకం
షడక్షర స్వరూపిణం భజే గజేంద్ర రూపిణం || 3 ||

విరించి, విష్ణు వందితం విరూపలోచన స్తుతం
గిరీశ దర్శనేచ్ఛయా సమర్పితం పరాంబయా
నిరంతరం సురాసురైః సుపుత్ర వామలోచనైః
మహామఖేష్ట కర్మను స్మృతం భజామి తుందిలం || 4 ||

మధౌహ లుబ్ధ చంచలాళి మంజు గుంజితా రవం
ప్రబుద్ధ చిత్తరంజకం ప్రమోద కర్ణచాలకం
అనన్య భక్తి మాననం ప్రచండ ముక్తిదాయకం
నమామి నిత్య మాదరేణ వక్రతుండ నాయకం || 5 ||

దారిద్ర్య విద్రావణ మాశు కామదం
స్తోత్రం పఠేదేత దజస్ర మాదరాత్
పుత్రీ కళత్ర స్వజనేషు మైత్రీ
పుమాన్ భవే దేకదంత వరప్రసాదాత్. || 6||

మా స్తోత్ర సూచిక లోని మరిన్ని శ్రీ గణేశ స్తోత్రాలు చూడండి.
                    👆👆                               👆👆
మా స్తోత్ర సూచిక లోని >>గణేశ స్తోత్రాలు << కోసం లింక్ చూడండి

మా YouTube Channel ను SUBSCRIBE చేయండి.. మమ్ము కొంచెం Encourage చేసినట్లు అవుతుంది.. Please subscribe our Channel
👉👉👉To Subscribe us please click here👈👈👈




ఏ పని చేద్దామన్నా ఆటంకం ఎదురవుతున్నవారు.... ఏ స్తోత్రం చదవాలో తెలియని వారు... అనుకున్న పనులు సకాలంలో పూర్తయి.. సంసార బాధలు... అప్పుల బాధలు తీరాలంటే.. క్రింది స్తోత్రములు చదువవచ్చు... ఫలితం భగవంతుని మీద వదిలి ఈ స్తోత్రములు చదివి చక్కగా ప్రణాళిక వేసుకుని మీ కార్యములను దీక్షగా చేయండి.. మీరు అనుకున్న ఫలితములు ఆ భగవంతుని కృపతో తప్పక సాధిస్తారు... 
క్రింద ఉన్న స్తోత్రం పేరు మీద క్లిక్ చేయడం ద్వారా ఆ స్తోత్రం ఓపెన్ అవుతుంది.. 

Whatsapp Button works on Mobile Device only