Tuesday, 23 February 2021

in these temples sun rays touches swami only once in a year

సంవత్సరానికి ఒక సారి మాత్రమే సూర్య కిరణాలు ఈ దేవాలయాలలో మూలవిరాట్టును తాకుతాయి...
అవి
1. అరసవెల్లి సూర్య నారాయణ స్వామి ఆలయం, శ్రీకాకుళం, రథ సప్తమి రోజున
2. గావి గంగాధరస్వామి ఆలయం, బెంగుళూరు , మకర సంక్రాంతి రోజున
3. శ్రీ పద్మనాభ స్వామి వారి ఆలయ గోపురం, తిరువనంతపురం , తుల సంక్రాంతి రోజున
4. నాగలాపురం వేదనారాయణ స్వామి ఆలయం,
5. కొల్హాపురం, మహలక్ష్మీ అమ్మవారి ఆలయం, జనవరి 31 న...
in these temples sun rays touches swami only once in a year
ఈ ఆలయాలలో మూలవిరాట్టులను తాకే ఆ అద్భుత దృశ్య వీడియోలు మీ కోసం...


Sun rays Touching to Suryanarayana Swamy temple in Arasavelli
రథ సప్తమి నాడు అరసవెల్లి సూర్య నారాయణ స్వామి పాదాలను సూర్య కిరణాలు తాకే దృశ్యాన్ని అందరికీ చూడాలని ఉంటుంది కదా.. కానీ అది చాలా మందికి సాధ్య పడదు... ఎంతో recommendation తీసుకువచ్చినా కూడాకొన్ని క్షణాలపాటే కనిపించే ఆ దృశ్యాన్ని చూడడం నిజంగా అదృష్టమే...

సూర్యుడు దక్షిణాయనం నుండి ఉత్తరాయణానికి మారినపుడు మార్చుకునే గమన దిశ రథ సప్తమి నాడు.. ఇలా కిరణాలు పడతాయి... మరల 6 నెలల తర్వాత దక్షిణాయనం నుండి ఉత్తరాయణానికి మార్చుకునేటపుడు కూడా ఇలా సూర్య కిరణాలు పడతాయి... ఏదో ఆలయాలను నిర్మించడం వేరే... కానీ కొన్ని ప్రత్యేక దినాలలో మాత్రమే అలా కిరణాలు పడేవిధంగా ఆలయాలను నిర్మించడం నిజంగా గొప్ప విషయం కదా...Sun rays Touching Gavi Gangadhara Swami video (Temple, Bangalore)
బెంగుళూరు లోని గావి గంగాధర స్వామి వారి ఆలయం లో మకరసంక్రాంతి నాడు స్వామి వారిని సూర్య కిరణాలు తాకుతాయి...
  Sun rays passing through Padmanabha swami temple tower video
తులా సంక్రాంతి నాడు తిరువనంతపురం పద్మనాభ స్వామి వారి ఆలయ గోపురం గుండా సూర్య కిరణాలు ఒక్కొక్క ద్వారం గుండా క్రిందకు రావడం చాలా స్పష్టంగా ఉంటుంది... ఇది కేవలం ఆ ఒక్క రోజు మాత్రమే ఉంటుంది.. 
కొల్హాపూర్ మహలక్ష్మి అమ్మవారి పాదాలను సూర్య కిరణాలు జనవరి 31 న తాకుతాయి... కేవలం ఆ ఒక్కరోజు మాతమే జరుగుతుంది ఇలా...


Sun rays touching Nagalapuram vedanarayanaswami temple
నాగలాపురం వేదనారాయణ స్వామి ఆలయంలో సూర్య కిరణాలు తాకే దృశ్యం

ఆదిత్యకవచమ్

అస్య శ్రీ ఆదిత్యకవచస్తోత్రమహామన్త్రస్య అగస్త్యో భగవానృషిః అనుష్టుప్ఛందః ఆదిత్యో దేవతా శ్రీం బీజం ణీం శక్తిః సూం కీలకం మమ ఆదిత్యప్రసాదసిద్ధ్యర్థే జపే వినియోగః |
ధ్యానం –
జపాకుసుమసంకాశం ద్విభుజం పద్మహస్తకమ్
సిన్దూరాంబరమాల్యం చ రక్తగంధానులేపనమ్ |
మాణిక్యరత్నఖచిత-సర్వాభరణభూషితమ్
సప్తాశ్వరథవాహం తు మేరుం చైవ ప్రదక్షిణమ్ ||

దేవాసురవరైర్వన్ద్యం ఘృణిభిః పరిసేవితమ్ |
ధ్యాయేత్పఠేత్సువర్ణాభం సూర్యస్య కవచం ముదా ||

కవచం –
ఘృణిః పాతు శిరోదేశే సూర్యః పాతు లలాటకమ్ |
ఆదిత్యో లోచనే పాతు శ్రుతీ పాతు దివాకరః ||

ఘ్రాణం పాతు సదా భానుః ముఖం పాతు సదారవిః |
జిహ్వాం పాతు జగన్నేత్రః కంఠం పాతు విభావసుః ||

స్కంధౌ గ్రహపతిః పాతు భుజౌ పాతు ప్రభాకరః |
కరావబ్జకరః పాతు హృదయం పాతు నభోమణిః ||

ద్వాదశాత్మా కటిం పాతు సవితా పాతు సక్థినీ |
ఊరూ పాతు సురశ్రేష్టో జానునీ పాతు భాస్కరః ||
జంఘే మే పాతు మార్తాణ్డో గుల్ఫౌ పాతు త్విషాంపతిః |
పాదౌ దినమణిః పాతు పాతు మిత్రోఽఖిలం వపుః ||

ఆదిత్యకవచం పుణ్యమభేద్యం వజ్రసన్నిభమ్ |
సర్వరోగభయాదిభ్యో ముచ్యతే నాత్ర సంశయః ||

సంవత్సరముపాసిత్వా సామ్రాజ్యపదవీం లభేత్ |
అశేషరోగశాంత్యర్థం ధ్యాయేదాదిత్యమండలమ్ |

ఆదిత్య మండల స్తుతిః –
అనేకరత్నసంయుక్తం స్వర్ణమాణిక్యభూషణమ్ |
కల్పవృక్షసమాకీర్ణం కదంబకుసుమప్రియమ్ ||

సిందూరవర్ణాయ సుమండలాయ
సువర్ణరత్నాభరణాయ తుభ్యమ్ |
పద్మాదినేత్రే చ సుపంకజాయ
బ్రహ్మేన్ద్ర-నారాయణ-శంకరాయ ||

సంరక్తచూర్ణం ససువర్ణతోయం
సకుంకుమాభం సకుశం సపుష్పమ్ |
ప్రదత్తమాదాయ చ హేమపాత్రే
ప్రశస్తనాదం భగవన్ ప్రసీద ||

ఇతి ఆదిత్యకవచమ్ |

Post a comment

Whatsapp Button works on Mobile Device only