ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుండి నవమి దాకా నవరాత్రులుగా జరుపుకుంటారు... దశమి రోజును విజయదశమిగా జరుపుకుంటారు.... ఈ తొమ్మిది రోజులు దుర్గాదేవి అమ్మవారు మహిషాసురుడిపై జరిపిన యుద్ధంలో వేర్వేరు రూపాలలో ప్రజలను ఇబ్బందులకు గురికాకుండా అమ్మ లా రక్షిస్తుంది.. ఒక్కొక్క రోజు ఒక్కొక్క రూపంలో అమ్మవారిని కొలుస్తాము... అలా ఈ తొమ్మిది రోజులు కూడా అమ్మవారిని పూజించడానికి ఏ ఏ స్తోత్రాలు చదవాలో రోజు వారీగా క్రింద ఇచ్చాము...
ఆశ్వీయుజ శుద్ధ పాడ్యమి – మొదటి రోజు
శ్రీశైల శ్రీ భ్రమరాంబికా అలంకారం – శ్రీ శైలపుత్రీ దేవి
శ్లోకం:
వందే వాంఛితలాభాయ చంద్రార్థకృతశేఖరామ్!
వృషారూఢాం శూలధరాం శైలపుత్రీం యశ స్వినీమ్!!..
విజయవాడ శ్రీ కనకదుర్గ అలంకారం – శ్రీ స్వర్ణకవచాలంకృత దుర్గా దేవి
ఈ రోజు పఠించ తగిన స్తోత్రాలు :
శ్రీ నవదుర్గా స్తోత్రం
శ్రీ దుర్గా స్తోత్రం
ఆశ్వీయుజ శుద్ధ విదియ – రెండవ రోజు
శ్రీశైల శ్రీ భ్రమరాంబికా అలంకారం – శ్రీ బ్రహ్మచారిణీ దేవి
శ్లోకం:
"దధానాకర పద్మాభ్యా మక్షమాలా కమండలూ దేవీ ప్రసీదతు మయి బ్రహ్మచారిణ్యనుత్తమా"
విజయవాడ శ్రీ కనకదుర్గ అలంకారం – శ్రీ బాలా త్రిపుర సుందరీ దేవి
శ్లోకం:
హ్రీంకారాసన గర్భితానల శిఖాం సౌఃక్లీం కళాంబిభ్రతీం సౌవర్ణాంబర ధారిణీం వసుధాదౌతాం;
త్రినేత్రోజ్జ్వలామ్ వందే పుస్తక పాశమంకుశధరాం స్రగ్భూషితాముజ్జ్వలాం తాంగౌరీం త్రిపురాం పరాత్పర కళాంశ్రీచక్ర సంచారిణీమ్!!
ఈ రోజు పఠించ తగిన స్తోత్రాలు :
బాలాంబికాష్టకం
శ్రీ దుర్గా స్తోత్రం
ఆశ్వీయుజ శుద్ధ తదియ – మూడవ రోజు
శ్రీశైల శ్రీ భ్రమరాంబికా అలంకారం – శ్రీ చంద్రఘంటా దేవి
విజయవాడ శ్రీ కనకదుర్గ అలంకారం – శ్రీ గాయత్రీ దేవి
ఈ రోజు పఠించ తగిన స్తోత్రాలు :
శ్రీ గాయత్రీ అష్టకం
శ్రీ దుర్గా స్తోత్రం
ఆశ్వీయుజ శుద్ధ చవితి – నాల్గవ రోజు
శ్రీశైల శ్రీ భ్రమరాంబికా అలంకారం – శ్రీ కూష్మాండా దేవి
విజయవాడ శ్రీ కనకదుర్గ అలంకారం – శ్రీ అన్నపూర్ణా దేవి
ఈ రోజు పఠించ తగిన స్తోత్రాలు :
శ్రీ అన్నపూర్ణా స్తోత్రం
శ్రీ దుర్గా స్తోత్రం
ఆశ్వీయుజ శుద్ధ పంచమి – ఐదవ రోజు
శ్రీశైల శ్రీ భ్రమరాంబికా అలంకారం – శ్రీ స్కందమాతా దేవి
విజయవాడ శ్రీ కనకదుర్గ అలంకారం – శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవి
ఈ రోజు పఠించ తగిన స్తోత్రాలు :
శ్రీ లలితా పంచరత్నం
శ్రీ లలితా సహస్రనామ స్తోత్రం
శ్రీ లలితా త్రిశతీ స్తోత్రం
దేవీ ఖడ్గమాలా స్తోత్రం
ఆశ్వీయుజ శుద్ధ షష్ఠి – ఆరవ రోజు
శ్రీశైల శ్రీ భ్రమరాంబికా అలంకారం – శ్రీ కాత్యాయనీ దేవి
విజయవాడ శ్రీ కనకదుర్గ అలంకారం – శ్రీ మహాలక్ష్మీ దేవి
ఈ రోజు పఠించ తగిన స్తోత్రాలు :
శ్రీ మహాలక్ష్మ్యష్టకం
శ్రీ లక్ష్మీ అష్టోత్తరశతనామ స్తోత్రం
శ్రీ దుర్గా స్తోత్రం
ఆశ్వీయుజ శుద్ధ సప్తమి – ఏడవ రోజు
శ్రీశైల శ్రీ భ్రమరాంబికా అలంకారం – శ్రీ కాలరాత్రి దేవి
విజయవాడ శ్రీ కనకదుర్గ అలంకారం – శ్రీ సరస్వతీ దేవి
ఈ రోజు పఠించ తగిన స్తోత్రాలు :
శ్రీ శారదా ప్రార్థన
ఆశ్వీయుజ శుద్ధ అష్టమి – ఎనిమిదవ రోజు
శ్రీశైల శ్రీ భ్రమరాంబికా అలంకారం – శ్రీ మహాగౌరీ దేవి
విజయవాడ శ్రీ కనకదుర్గ అలంకారం – శ్రీ దుర్గా దేవి
ఈ రోజు పఠించ తగిన స్తోత్రాలు :
శ్రీ గౌరీ సప్తశ్లోకీ స్తుతిః
శ్రీ దుర్గా స్తోత్రం
ఆశ్వీయుజ శుద్ధ నవమి – తొమ్మిదవ రోజు
శ్రీశైల శ్రీ భ్రమరాంబికా అలంకారం – శ్రీ సిద్ధిదాత్రీ దేవి
విజయవాడ శ్రీ కనకదుర్గ అలంకారం – శ్రీ మహిషాసురమర్దినీ దేవి
ఈ రోజు పఠించ తగిన స్తోత్రాలు :
శ్రీ మహిషాసురమర్దిని సోత్రం
శ్రీ దుర్గా స్తోత్రం
ఆశ్వీయుజ శుద్ధ దశమి – పదవ రోజు
శ్రీశైల శ్రీ భ్రమరాంబికా అలంకారం – శ్రీ రాజరాజేశ్వరీ దేవి
విజయవాడ శ్రీ కనకదుర్గ అలంకారం – శ్రీ భ్రమరాంబికా దేవి
ఈ రోజు పఠించ తగిన స్తోత్రాలు :
శ్రీ రాజరాజేశ్వరీ అష్టకం
శ్రీ భ్రమరాంబికా అష్టకం
శ్రీ దుర్గా స్తోత్రం
Post a Comment