Saturday, 6 August 2022

Sri Devi Khadgamala Stotram in telugu free download pdf - ఖడ్గమాలా స్తోత్రం

ఖడ్గమాలా స్తోత్రం - Sri Devi Khadgamala Stotram free pdf download

(ఈ స్తోత్రాన్ని మొదట అర్థం వివరణ ఇచ్చాము... తర్వాత పూర్తి స్తోత్రము ఇచ్చాము. చివరలో ఈ స్తోత్ర పిడిఎఫ్ ప్రతిని కూడా ఉంచాము.. ఉచితంగా డౌన్ లోడ్ చేసుకోండి)
శ్రీచక్రము ఒక యంత్రము. దీనిని ఖడ్గమాలా స్తోత్రం తో అనుసంధానము చేస్తారు.

శ్రీ దేవి యంత్ర రూపం శ్రీ చక్రం.
శ్రీవిద్యా ఉపాసకులు శ్రీ చక్రాఅర్చన చేస్తారు. ఇది చాలా విధి విధానాలతో ఉంటుంది. అయితే ఖడ్గమలా స్తోత్రం శ్రీ చక్ర అనుసంధానం చేసి చదువుకుంటే అద్భుత ఫలితాలు ఉంటాయి.

ముందు గా స్తోత్రములో శ్రీ దేవీ ప్రార్థన…
ఈ క్రింద విధంగా ఉంటుంది

హ్రీంకారాసనగర్భితానలశిఖాం సౌః క్లీం కళాం బిభ్రతీం
సౌవర్ణాంబరధారిణీం వరసుధాధౌతాం త్రినేత్రోజ్జ్వలామ్ |
వందే పుస్తకపాశమంకుశధరాం స్రగ్భూషితాముజ్జ్వలాం
త్వాం గౌరీం త్రిపురాం పరాత్పరకళాం శ్రీచక్రసంచారిణీమ్ ||

తాత్పర్యం

హ్రీం అనే బీజాక్షర గర్భంలో ఉన్న అగ్ని శిఖ లాంటి తల్లి, సౌః క్లీం అనే బీజాక్షరాల కళలతో నెలకొన్న అమ్మా, బంగారు వర్ణ వస్త్రములు ధరించిన తల్లి, వరములు అన్న అమృతం ఇచ్చే తల్లి నీవు. మూడు జ్వలిస్తున్న కన్నులతో ఉన్నా నీకు నమస్కారం. పుస్తకము, పాశము, అంకుశం
వీటితో ఉజ్వలం గా వెలుగొందే నీవు గౌరివి. మూడు పురాలలో పరాత్పరు రాలైన చిత్కళవి. శ్రీ చక్రము లో సంచరిస్తూ ఉంటావు.

ఇప్పుడు సంకల్పం, ఋషి, దేవి, ఛందస్సు బీజం, శక్తి, కీలకము, మన కోరిక ఇవన్నీ ఇదిగో ఇలా ఉంటాయి

అస్య శ్రీ శుద్ధశక్తిమాలామహామంత్రస్య, ఉపస్థేంద్రియాధిష్ఠాయీ వరుణాదిత్య ఋషయః

దేవీ గాయత్రీ ఛందః సాత్విక కకారభట్టారకపీఠస్థిత కామేశ్వరాంకనిలయా మహాకామేశ్వరీ శ్రీ లలితా భట్టారికా దేవతా, ఐం బీజం క్లీం శక్తిః, సౌః కీలకం మమ ఖడ్గసిద్ధ్యర్థే సర్వాభీష్టసిద్ధ్యర్థే జపే వినియోగః,

ఈ స్తోత్రమునకు వరుణాదిత్య ఋషి
గాయత్రి చందస్సు కామేశ్వరుని అంకంపై కూర్చొని ఉన్న మాహా కామేశ్వరి దేవత, బీజం ఐం, శక్తి క్లీం, కీలకం సౌః, ఖడ్గం కోసం, అభీష్ట సిద్ది కోసం. ఈ స్తోత్రము జపిస్తున్నా

మూలమంత్రేణ షడంగన్యాసం కుర్యాత్

ఇప్పుడు అంగన్యాస కరన్యాసాలు చేస్తారు

ఐం అంగుష్టాభ్యాం నమః,
క్లీం తర్జనీభ్యాం నమః,
సౌః మధ్యమాభ్యాం నమః,
సౌః అనామికాభ్యాం నమః,
క్లీం కనిష్ఠికాభ్యాం నమః,
అం కరతల కరపృష్ఠాభ్యాం నమః
కరన్యాసః

ఐం హృదయాయ నమః,
క్లీం శిరసే స్వాహా,
సౌః శిఖాయై వషట్,
సౌః కవచాయ హుం,
క్లీం నేత్రత్రయాయ వౌషట్,
అం కరతల అస్త్రాయఫట్ నమః
అంగన్యాసః
భూర్భువస్సువరోమితి దిగ్బంధః

ధ్యానమ్.

హ్రీంకారాసనగర్భితానలశిఖాం సౌః క్లీం కళాం బిభ్రతీం
సౌవర్ణాంబరధారిణీం వరసుధాధౌతాం త్రినేత్రోజ్జ్వలామ్ |
వందే పుస్తకపాశమంకుశధరాం స్రగ్భూషితాముజ్జ్వలాం
త్వాం గౌరీం త్రిపురాం పరాత్పరకళాం శ్రీచక్రసంచారిణీమ్ ||

తాత్పర్యం

హ్రీం అనే బీజాక్షర గర్భంలో ఉన్న అగ్ని శిఖ లాంటి తల్లి, సౌః క్లీం అనే బీజాక్షరాల కళలతో నెలకొన్న అమ్మా, బంగారు వర్ణ వస్త్రములు ధరించిన తల్లి, వరములు అన్న అమృతం ఇచ్చే తల్లి నీవు. మూడు జ్వలిస్తున్న కన్నులతో ఉన్నా నీకు నమస్కారం. పుస్తకము, పాశము, అంకుశం
వీటితో ఉజ్వలం గా వెలుగొందే నీవు గౌరివి. మూడు పురాలలో పరాత్పరు రాలైన చిత్కళవి. శ్రీ చక్రము లో సంచరిస్తూ ఉంటావు.

లమిత్యాదిపంచ పూజామ్ కుర్యాత్, యథాశక్తి మూలమంత్రమ్ జపేత్ |

ఇప్పుడు లమిత్యాదిపంచ పూజాలు చేయాలి , యథాశక్తి మూలమంత్రమ్ జపము చేయాలి |

లం – పృథివీతత్త్వాత్మికాయై శ్రీ లలితాత్రిపురసుందరీ పరాభట్టారికాయై గంధం పరికల్పయామి – నమః

హం – ఆకాశతత్త్వాత్మికాయై శ్రీ లలితాత్రిపురసుందరీ పరాభట్టారికాయై పుష్పం పరికల్పయామి – నమః

యం – వాయుతత్త్వాత్మికాయై శ్రీ లలితాత్రిపురసుందరీ పరాభట్టారికాయై ధూపం పరికల్పయామి – నమః

రం – తేజస్తత్త్వాత్మికాయై శ్రీ లలితాత్రిపురసుందరీ పరాభట్టారికాయై దీపం పరికల్పయామి – నమః

వం – అమృతతత్త్వాత్మికాయై శ్రీ లలితాత్రిపురసుందరీ పరాభట్టారికాయై అమృతనైవేద్యం పరికల్పయామి – నమః

సం – సర్వతత్త్వాత్మికాయై శ్రీ లలితాత్రిపురసుందరీ పరాభట్టారికాయై తాంబూలాదిసర్వోపచారాన్ పరికల్పయామి – నమః

లం – పృథివీ తత్వ బీజం. ఈ బీజా స్వరూపంలో ఉన్న
శ్రీ లలితాత్రిపురసుందరీ పరాభట్టారికకు గంధం –
నమస్కారములతో సమర్పిస్తున్నాను.

హం – ఆకాశ తత్వ బీజం. ఈ బీజ స్వరూపములో ఉన్న
శ్రీ లలితాత్రిపురసుందరీ పరాభట్టారికాయై పుష్పం నమస్కారములతో సమర్పిస్తున్నాను.

యం – వాయు తత్వ బీజం. ఈ బీజ స్వరూపములో ఉన్న
శ్రీ లలితాత్రిపురసుందరీ పరాభట్టారికాయై ధూపము నమస్కారములతో సమర్పిస్తున్నాను.

రం – తేజస్ తత్వ బీజం. ఈ బీజ స్వరూపములో ఉన్న
శ్రీ లలితాత్రిపురసుందరీ పరాభట్టారికాయై దీపం నమస్కారములతో సమర్పిస్తున్నాను.

వం – అమృత తత్వ బీజం. ఈ బీజ స్వరూపములో ఉన్న
శ్రీ లలితాత్రిపురసుందరీ పరాభట్టారికాయై అమృత నైవేద్యం నమస్కారములతో సమర్పిస్తున్నాను.

సం – సర్వ తత్వ బీజం. ఈ బీజ స్వరూపములో ఉన్న
శ్రీ లలితాత్రిపురసుందరీ పరాభట్టారికాయై తాంబూలాది సర్వ ఉపచారాలని నమస్కారములతో సమర్పిస్తున్నాను.

శ్రీ దేవీ సంబోధనం(1)
ఓం ఐం హ్రీం శ్రీమ్ ఐం క్లీం సౌః ఓం నమస్త్రిపురసుందరీ,

ఇప్పుడు అమ్మ అయిన శ్రీ దేవీని

ఓం ఐం హ్రీం శ్రీమ్ ఐం క్లీం సౌః ఓం నమస్త్రిపురసుందరీ అనే మంత్రం తో అంతర్ముఖం గా భావిస్తూ సంబోధిస్తున్నాము

న్యాసాంగదేవతాః (6)
హృదయదేవీ, శిరోదేవీ, శిఖాదేవీ, కవచదేవీ, నేత్రదేవీ,అస్త్రదేవీ అని
ఈ నామాలతో అంగన్యాస దేవతల స్మరణ జరిగింది.

తిథినిత్యాదేవతాః* (16)
కామేశ్వరీ,భగమాలినీ,
నిత్యక్లిన్నే, భేరుండే, వహ్నివాసినీ, మహావజ్రేశ్వరీ, శివదూతీ, త్వరితే,
కులసుందరీ, నిత్యే, నీలపతాకే,
విజయే, సర్వమంగళే, జ్వాలామాలినీ,
చిత్రే, మహానిత్యే అని పదహారు నిత్యా దేవతలు. ప్రతి రోజు పూర్ణమి నుండి అమవ్యాస వరకు పై వరసలో, అమవ్యాస నుండి పూర్ణమి క్రింద నుండి పైకి 16 తిధి దేవతల పేర్లు ఇవి.పదిహేను తిదులతో పాటు పూర్ణమి (పై కామేశ్వరీ నామము నుండి మహానిత్యే నామము వరకు) మొత్తంగా 16 నామాలు ఉన్నాయి. అలానే అమవ్యాస నుండి పూర్ణమి వరకు ( మహానిత్యే నామము మొదలుకొని కామేశ్వరీ నామము వరకు)
మొత్తంగా 16 నామాలు ఉన్నాయి.

గురుపరంపర ఇలా ఉంది
దివ్యత్వము పొందిన గురువులు ఏడుగురు. వారే పరమేశ్వర, పరమేశ్వరీ, మిత్రేశమయీ, ఉడ్డీశమయ, చర్యానాథమయ, లోపాముద్రమయ అగస్త్యమయ.
సిద్ధౌఘగురవః* (4)

సిద్ధౌఘ గురువులు నలుగురు వారే
కాలతాపశమయ ధర్మాచార్యమయ ముక్తకేశీశ్వరమయ, దీపకలానాథమయ

ఇవి సిద్ధిని సాధించిన మన సమకాలీన ఎనిమిది మంది సద్గురువుల పేర్లు.
విష్ణుదేవమయ, ప్రభాకరదేవమయ
తేజోదేవమయ, మనోజదేవమయ
కళ్యాణదేవమయ, వాసుదేవమయ రత్నదేవమయ, శ్రీరామానందమయ.

ఇవి ప్రస్తుత గురు పరంపర పేర్లు.ఇవే కాకుండా ఇక్కడ, శ్రీరామానందమయీ, తరువాత, మన పరమేష్ఠి గురువు గారి పేరు, (అంటే మన గురువు గారి గురువుగారి గురువుగారు పేరు, ఒక రకంగా ముత్తాత పెరు లాగా చెప్పుకుంటాం) ఆ తరువాత మన పరమ గురువు గారి పేరు (అంటే మన గురువు గారి గురువు గారి పేరు ఒక రకంగా తాత పేరు లాగా), ఆ తరువాత మన గురువు గారి పేరు ఈయనని స్వగురువు అంటారు, ఒక రకంగా మన తండ్రి గారి లాగా. ఇలా ఇప్పటికి గురు స్మరణ పూర్తి అయ్యింది.

ఇక శ్రీచక్రము లోని ప్రథమా ఆవరణ దేవతలను చూద్దాము

ఇప్పుడు ప్రధమ ఆవరణ అయిన భుపురం చతురస్ర ఆకారంలో ఉంది. దీనికి మూడు గీతలు ఉన్నాయి. ప్రధమ గీతకి అణిమాసిద్ధే,లఘిమాసిద్ధే, గరిమాసిద్ధే,మహిమాసిద్ధే, ఈశిత్వసిద్ధే, వశిత్వసిద్ధే, ప్రాకామ్యసిద్ధే, భుక్తిసిద్ధే,
ఇచ్ఛాసిద్ధే, ప్రాప్తిసిద్ధే, సర్వకామసిద్ధే అనే సిద్ధులు, రెండవ గీతకు బ్రాహ్మీ, మాహేశ్వరీ, కౌమారి, వైష్ణవీ, వారాహీ, మాహేంద్రీ, చాముండే, మహాలక్ష్మీ,అని అష్ట దేవతలు, ఇక మూడవ ఆవరణకు సర్వసంక్షోభిణీ,సర్వవిద్రావిణీ,
సర్వాకర్షిణీ, సర్వవశంకరీ, సర్వోన్మాదినీ,
సర్వమహాంకుశే, సర్వఖేచరీ,సర్వబీజే,
సర్వయోనే, సర్వత్రిఖండే, అనే దశ ముద్రలు మొత్తంగా 29 శక్తులు ఉన్నాయి.

ఈ అవరణన మూడు లోకాలలోని మోహనము కలిగించేది గా ఉంటుంది కాబట్టి ఈ అవరణను త్రైలోక్యమోహన చక్రస్వామి అని పిలుస్తారు. అమ్మ ఇక్కడ ప్రకటితమౌతుంది కాబట్టి అమ్మని
ప్రకటయోగినీ అని అంటారు

శ్రీచక్రము లోని ద్వితీయావరణ దేవతలు
ఇక శ్రీచక్రము లోని ద్వితీయ ఆవరణ దేవతలను చుదాము. ద్వితీయ అవరణని షోడశ దళ పద్మం అని అంటారు. ఇది పదహారు రేకుల పద్మం లాగా ఉంది. ఇందులో దేవతల ఉంటారు. వారే కామాకర్షిణీ, బుద్ధ్యాకర్షిణీ, అహంకారాకర్షిణీ, శబ్దాకర్షిణీ, స్పర్శాకర్షిణీ, రూపాకర్షిణీ, రసాకర్షిణీ, గంధాకర్షిణీ, చిత్తాకర్షిణీ, ధైర్యాకర్షిణీ, స్మృత్యాకర్షిణీ,నామాకర్షిణీ, బీజాకర్షిణీ, ఆత్మాకర్షిణీ,అమృతాకర్షిణీ, శరీరాకర్షిణీ.

ఈ అవరణన మన సర్వ ఆశలను పరి పూర్ణం చేస్తుంది కాబట్టి ఈ అవరణను సర్వాశాపరిపూరక చక్రస్వామినీ, అని పిలుస్తారు. అమ్మ ఇక్కడ రహస్యంగా ఉంటుంది కాబట్టి అమ్మని గుప్తయోగినీ అని అంటారు

శ్రీచక్రము లోని తృతీయ ఆవరణ దేవతలు
ఈ తృతీయ ఆవరణ అష్ట దళపద్మం. అంటే ఎనిమిది రేకుల పద్మము. ఇందులో దేవతల ఉంటారు. వారే అనంగకుసుమే,అనంగమేఖలే, అనంగమదనే, అనంగమదనాతురే,
అనంగరేఖే, అనంగవేగినీ,
అనంగాంకుశే, అనంగమాలినీ.

ఈ అవరణన సర్వ సంక్షోభాలు నివారించేది, అందుకనే ఈ అవరణను సర్వసంక్షోభణచక్రస్వామినీ అని పిలుస్తారు. అమ్మ ఇక్కడ అతి గుప్తంగా కనబడకుండా ఉంటుంది కాబట్టి అమ్మని గుప్తతరయోగినీ అని అంటారు.

శ్రీచక్రములోని చతుర్థ ఆవరణదేవతలు.
ఈ అవరణను చతుర్దశ కోణము అంటారు. ఇందులో పద్నాలుగు మంది దేవతలు ఉంటారు. వారే సర్వసంక్షోభిణీ,
సర్వవిద్రావినీ, సర్వాకర్షిణీ, సర్వహ్లాదినీ,
సర్వసమ్మోహినీ, సర్వస్తంభినీ,
సర్వజృంభిణీ, సర్వవశంకరీ,సర్వరంజనీ,
సర్వోన్మాదినీ, సర్వార్థసాధికే,
సర్వసంపత్తిపూరిణీ, సర్వమంత్రమయీ,
సర్వద్వంద్వక్షయంకరీ.

ఈ అవరణన సకల సౌభ్యాగాలు ప్రసాదించే సర్వసౌభాగ్యదాయక చక్రస్వామినీ, అనేది ఈ ఆవరణ. అమ్మ ఇక్కడ అతి సంప్రదాయంగా ఉంటుంది కాబట్టి అమ్మని సంప్రదాయయోగినీ అని అంటారు.

శ్రీచక్రములోని పంచమ ఆవరణ దేవతలు
ఈ ఆవరణలో పది కోణాలు ఉన్నాయి. ఇలాంటి పది కోణాలతో తరువతి ఆరవ ఆవరణ ఉంది కాబట్టి దీనిని బాహ్య దశారము అని, ఆరవ అవరణను అంతర్ దశారము అని అంటారు. ఈ ఆవరణలో ఉన్న పది దేవతలు, సర్వసిద్ధిప్రదే, సర్వసంపత్ప్రదే,

సర్వప్రియంకరీ, సర్వమంగళకారిణీ,
సర్వకామప్రదే,సర్వదుఃఖవిమోచనీ,
సర్వమృత్యుప్రశమని, సర్వవిఘ్ననివారిణీ, సర్వాంగసుందరీ,
సర్వసౌభాగ్యదాయిన.

ఈ అవరణన సర్వ అర్థాలు (means or resources ) ఇస్తుంది కాబట్టి ఇది సౌభ్యాగాలు ప్రసాదించే సర్వార్థసాధక చక్రస్వామినీ, అనేది ఈ ఆవరణ. అమ్మ ఇక్కడ అతి కులోత్తీర్ణము గా ఉంటుంది కాబట్టి అమ్మని కులోత్తీర్ణయోగినీ అని అంటారు.

శ్రీచక్రము లోని ఆరవ ఆవరణ దేవతలు..
ఇంతకు ముందే అనుకున్నట్టు ఇది కూడా పది కోణముల ఆవరణ. దీనిని
అంతర్ దశారము అని అంటారు. ఇందులో ఉన్న పది దేవతలు
సర్వఙ్ఞే,సర్వశక్తే, సర్వైశ్వర్యప్రదాయినీ,
సర్వఙ్ఞానమయీ, సర్వవ్యాధివినాశినీ,
సర్వాధారస్వరూపే, సర్వపాపహరే,
సర్వానందమయీ, సర్వరక్షాస్వరూపిణీ,
సర్వేప్సితఫలప్రదే.

ఈ అవరణన సర్వ వేళలా రక్షణ ఇస్తుంది కాబట్టి ఇది సౌభ్యాగాలు ప్రసాదించే సర్వరక్షాకరచక్రస్వామినీ , అనేది ఈ ఆవరణ. అమ్మ ఇక్కడ గుడం గా ఉంటుంది కాబట్టి అమ్మని నిగర్భయోగినీ అని అంటారు.

శ్రీచక్రము లోని సప్తమ ఆవరణ దేవతలు
ఈ ఆవరణలో లాలితాసహస్ర నామము లని మొదటి సారి అమ్మ ఎదుట పటించిన వారు ఈ ఎనిమిది మంది దేవతలు. వీరే వశినీ, కామేశ్వరీ, మోదినీ, విమలే, అరుణే, జయినీ,
సర్వేశ్వరీ, కౌళిని.

ఈ అవరణన సర్వ రోగాలని హరిస్తుంది కాబట్టి ఇది సర్వరోగహరచక్రస్వామినీ , అనే ఆవరణ. అమ్మ ఇక్కడ రహాస్యము గా ఉంటుంది కాబట్టి అమ్మని రహస్యయోగినీ అని అంటారు.

శ్రీచక్రము ఎనిమిదవ ఆవరణ దేవతలు.
ఎనిమిదవ ఆవరణ ఒక త్రిభుజము. ఈ త్రిభుజం లో ఆయుధములు నాలుగు
బాణము అంటే బాణిని విల్లు అంటే చాపిని, పాశము అనే పాశినీ, మదం అనచడానికా అన్నట్టు అంకుశము అనే అంకుశినీ ఉన్నాయి, ఇవి కాక ఇచ్చా శక్తి ప్రతిరూపంగా మహాకామేశ్వరీ, జ్ఞాన శక్తి ప్రతి రూపంగా మహావజ్రేశ్వరీ, క్రియా శక్తి రూపంగా మహాభగమాలినీ ఉన్నారు.

ఈ అవరణన సర్వ సిద్ధులని ప్రసాదిస్తుంది. కాబట్టి ఇది సర్వసిద్ధిప్రదచక్రస్వామినీ , అనే ఆవరణ. అమ్మ ఇక్కడ అతి రహాస్యము గా ఉంటుంది కాబట్టి అమ్మని అతిరహస్యయోగినీ అని అంటారు.
సర్వ సిద్ధులని ప్రసాదించే ఈ చక్రము

శ్రీచక్రము లోని నవమ ఆవరణ ఒక బిందువు దేవతని శ్రీ శ్రీ మహాభట్టారికే అని పిలుస్తారు.

ఈ అవరణన సర్వ ఆనందాలని ప్రసాదిస్తుంది. కాబట్టి ఇది సర్వానందమయచక్రస్వామినీ , అనే ఆవరణ. అమ్మ ఇక్కడ అతి పరమ రహాస్యము గా ఉంటుంది కాబట్టి అమ్మని పరాపరరహస్యయోగినీ అని అంటారు.

నవచక్రేశ్వరీని తొమ్మిది నామాలతో అర్చన.
త్రిపురే, త్రిపురేశీ, త్రిపురసుందరీ,
త్రిపురవాసినీ, త్రిపురాశ్రీః,
త్రిపురమాలినీ, త్రిపురసిద్ధే,
త్రిపురాంబా, మహాత్రిపురసుందరీ,

శ్రీదేవీ అయిన అమ్మకి విశేషణ పూర్వక నవ నమస్కారములతో
మహామహేశ్వరీ, మహామహారాఙ్ఞీ,
మహామహాశక్తే, మహామహాగుప్తే,
మహామహాఙ్ఞప్తే, మహామహానందే,
మహామహాస్కంధే, మహామహాశయే,
మహామహా శ్రీచక్రనగరసామ్రాఙ్ఞీ,
నమస్తే నమస్తే నమస్తే నమః అని ముగిస్తాము ఈ స్తోత్రముని.

xxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxx


శ్రీ దేవీ ఖడ్గమాలా స్తోత్రం

ప్రార్థన |
హ్రీంకారాసనగర్భితానలశిఖాం సౌః క్లీం కళాం బిభ్రతీం
సౌవర్ణాంబరధారిణీం వరసుధాధౌతాం త్రిణేత్రోజ్జ్వలామ్ |
వందే పుస్తకపాశమంకుశధరాం స్రగ్భూషితాముజ్జ్వలాం
త్వాం గౌరీం త్రిపురాం పరాత్పరకళాం శ్రీచక్రసంచారిణీమ్ ||

అస్య శ్రీశుద్ధశక్తిమాలామహామంత్రస్య, ఉపస్థేంద్రియాధిష్ఠాయీ వరుణాదిత్య ఋషిః, దైవీ గాయత్రీ ఛందః, సాత్త్విక కకారభట్టారకపీఠస్థిత కామేశ్వరాంకనిలయా మహాకామేశ్వరీ శ్రీ లలితా భట్టారికా దేవతా, ఐం బీజం క్లీం శక్తిః సౌః కీలకం మమ ఖడ్గసిద్ధ్యర్థే సర్వాభీష్టసిద్ధ్యర్థే జపే వినియోగః |
మూలమంత్రేణ షడంగన్యాసం కుర్యాత్ ||

ధ్యానమ్ |

తాదృశం ఖడ్గమాప్నోతి యేన హస్తస్థితేనవై |
అష్టాదశమహాద్వీపసమ్రాడ్భోక్తాభవిష్యతి ||

ఆరక్తాభాం త్రినేత్రామరుణిమవసనాం రత్నతాటంకరమ్యాం |
హస్తాంభోజైస్సపాశాంకుశమదన ధనుస్సాయకైర్విస్ఫురంతీమ్ |
ఆపీనోత్తుంగవక్షోరుహకలశలుఠత్తారహారోజ్జ్వలాంగీం |
ధ్యాయేదంభోరుహస్థామరుణిమవసనామీశ్వరీమీశ్వరాణామ్ ||

లమిత్యాది పంచ పూజాం కుర్యాత్, యథాశక్తి మూలమంత్రం జపేత్ |

లం – పృథివీతత్త్వాత్మికాయై శ్రీలలితాత్రిపురసుందరీ పరాభట్టారికాయై గంధం పరికల్పయామి – నమః
హం – ఆకాశతత్త్వాత్మికాయై శ్రీలలితాత్రిపురసుందరీ పరాభట్టారికాయై పుష్పం పరికల్పయామి – నమః
యం – వాయుతత్త్వాత్మికాయై శ్రీలలితాత్రిపురసుందరీ పరాభట్టారికాయై ధూపం పరికల్పయామి – నమః
రం – తేజస్తత్త్వాత్మికాయై శ్రీలలితాత్రిపురసుందరీ పరాభట్టారికాయై దీపం పరికల్పయామి – నమః
వం – అమృతతత్త్వాత్మికాయై శ్రీలలితాత్రిపురసుందరీ పరాభట్టారికాయై అమృతనైవేద్యం పరికల్పయామి – నమః
సం – సర్వతత్త్వాత్మికాయై శ్రీలలితాత్రిపురసుందరీ పరాభట్టారికాయై తాంబూలాదిసర్వోపచారాన్ పరికల్పయామి – నమః

(శ్రీదేవీ సంబోధనం-౧)
ఓం ఐం హ్రీం శ్రీం ఐం క్లీం సౌః ఓం నమస్త్రిపురసుందరి |

(న్యాసాంగదేవతాః-౬)
హృదయదేవి, శిరోదేవి, శిఖాదేవి, కవచదేవి, నేత్రదేవి, అస్త్రదేవి,

(తిథినిత్యాదేవతాః-౧౬)
కామేశ్వరి, భగమాలిని, నిత్యక్లిన్నే, భేరుండే, వహ్నివాసిని, మహావజ్రేశ్వరి, శివదూతి, త్వరితే, కులసుందరి, నిత్యే, నీలపతాకే, విజయే, సర్వమంగళే, జ్వాలామాలిని, చిత్రే, మహానిత్యే,

(దివ్యౌఘగురవః-౭)
పరమేశ్వరపరమేశ్వరి, మిత్రేశమయి, షష్ఠీశమయి, ఉడ్డీశమయి, చర్యానాథమయి, లోపాముద్రామయి, అగస్త్యమయి,

(సిద్ధౌఘగురవః-౪)
కాలతాపనమయి, ధర్మాచార్యమయి, ముక్తకేశీశ్వరమయి, దీపకళానాథమయి,

(మానవౌఘగురవః-౮)
విష్ణుదేవమయి, ప్రభాకరదేవమయి, తేజోదేవమయి, మనోజదేవమయి, కళ్యాణదేవమయి, వాసుదేవమయి, రత్నదేవమయి, శ్రీరామానందమయి,

(శ్రీచక్ర ప్రథమావరణదేవతాః-౩౦)
అణిమాసిద్ధే, లఘిమాసిద్ధే, [గరిమాసిద్ధే], మహిమాసిద్ధే, ఈశిత్వసిద్ధే, వశిత్వసిద్ధే, ప్రాకామ్యసిద్ధే, భుక్తిసిద్ధే, ఇచ్ఛాసిద్ధే, ప్రాప్తిసిద్ధే, సర్వకామసిద్ధే, బ్రాహ్మి, మాహేశ్వరి, కౌమారి, వైష్ణవి, వారాహి, మాహేంద్రి, చాముండే, మహాలక్ష్మి, సర్వసంక్షోభిణీ, సర్వవిద్రావిణీ, సర్వాకర్షిణీ, సర్వవశంకరి, సర్వోన్మాదిని, సర్వమహాంకుశే, సర్వఖేచరి, సర్వబీజే, సర్వయోనే, సర్వత్రిఖండే, త్రైలోక్యమోహనచక్రస్వామిని, ప్రకటయోగిని,

(శ్రీచక్ర ద్వితీయావరణదేవతాః-౧౮)
కామాకర్షిణి, బుద్ధ్యాకర్షిణి, అహంకారాకర్షిణి, శబ్దాకర్షిణి, స్పర్శాకర్షిణి, రూపాకర్షిణి, రసాకర్షిణి, గంధాకర్షిణి, చిత్తాకర్షిణి, ధైర్యాకర్షిణి, స్మృత్యాకర్షిణి, నామాకర్షిణి, బీజాకర్షిణి, ఆత్మాకర్షిణి, అమృతాకర్షిణి, శరీరాకర్షిణి, సర్వాశాపరిపూరకచక్రస్వామిని, గుప్తయోగిని,

(శ్రీచక్ర తృతీయావరణదేవతాః-౧౦)
అనంగకుసుమే, అనంగమేఖలే, అనంగమదనే, అనంగమదనాతురే, అనంగరేఖే, అనంగవేగిని, అనంగాంకుశే, అనంగమాలిని, సర్వసంక్షోభణచక్రస్వామిని, గుప్తతరయోగిని,
(శ్రీచక్ర చతుర్థావరణదేవతాః-౧౬)
సర్వసంక్షోభిణి, సర్వవిద్రావిణి, సర్వాకర్షిణి, సర్వహ్లాదిని, సర్వసమ్మోహిని, సర్వస్తంభిని, సర్వజృంభిణి, సర్వవశంకరి, సర్వరంజని, సర్వోన్మాదిని, సర్వార్థసాధికే, సర్వసంపత్తిపూరణి, సర్వమంత్రమయి, సర్వద్వంద్వక్షయంకరి, సర్వసౌభాగ్యదాయకచక్రస్వామిని, సంప్రదాయయోగిని,

(శ్రీచక్ర పంచమావరణదేవతాః-౧౨)
సర్వసిద్ధిప్రదే, సర్వసంపత్ప్రదే, సర్వప్రియంకరి, సర్వమంగళకారిణి, సర్వకామప్రదే, సర్వదుఃఖవిమోచని, సర్వమృత్యుప్రశమని, సర్వవిఘ్ననివారిణి, సర్వాంగసుందరి, సర్వసౌభాగ్యదాయిని, సర్వార్థసాధకచక్రస్వామిని, కులోత్తీర్ణయోగిని,

(శ్రీచక్ర షష్ఠావరణదేవతాః-౧౨)
సర్వజ్ఞే, సర్వశక్తే, సర్వైశ్వర్యప్రదాయిని, సర్వజ్ఞానమయి, సర్వవ్యాధివినాశిని, సర్వాధారస్వరూపే, సర్వపాపహరే, సర్వానందమయి, సర్వరక్షాస్వరూపిణి, సర్వేప్సితఫలప్రదే, సర్వరక్షాకరచక్రస్వామిని, నిగర్భయోగిని,

(శ్రీచక్ర సప్తమావరణదేవతాః-౧౦)
వశిని, కామేశ్వరి, మోదిని, విమలే, అరుణే, జయిని, సర్వేశ్వరి, కౌళిని, సర్వరోగహరచక్రస్వామిని, రహస్యయోగిని,

(శ్రీచక్ర అష్టమావరణదేవతాః-౯)
బాణిని, చాపిని, పాశిని, అంకుశిని, మహాకామేశ్వరి, మహావజ్రేశ్వరి, మహాభగమాలిని, సర్వసిద్ధిప్రదచక్రస్వామిని, అతిరహస్యయోగిని,

(శ్రీచక్ర నవమావరణదేవతాః-౩)
శ్రీశ్రీమహాభట్టారికే, సర్వానందమయచక్రస్వామిని, పరాపరరహస్యయోగిని,

(నవచక్రేశ్వరీ నామాని-౯)
త్రిపురే, త్రిపురేశి, త్రిపురసుందరి, త్రిపురవాసిని, త్రిపురాశ్రీః, త్రిపురమాలిని, త్రిపురాసిద్ధే, త్రిపురాంబ, మహాత్రిపురసుందరి,

(శ్రీదేవీ విశేషణాని, నమస్కారనవాక్షరీ చ-౯)
మహామహేశ్వరి, మహామహారాజ్ఞి, మహామహాశక్తే, మహామహాగుప్తే, మహామహాజ్ఞప్తే, మహామహానందే, మహామహాస్కంధే, మహామహాశయే, మహామహా శ్రీచక్రనగరసామ్రాజ్ఞి నమస్తే నమస్తే నమస్తే నమః |

ఫలశ్రుతిః |
ఏషా విద్యా మహాసిద్ధిదాయినీ స్మృతిమాత్రతః |
అగ్నివాతమహాక్షోభే రాజారాష్ట్రస్య విప్లవే ||

లుంఠనే తస్కరభయే సంగ్రామే సలిలప్లవే |
సముద్రయానవిక్షోభే భూతప్రేతాదికే భయే ||

అపస్మారజ్వరవ్యాధి-మృత్యుక్షామాదిజే భయే |
శాకినీ పూతనాయక్షరక్షఃకూశ్మాండజే భయే ||

మిత్రభేదే గ్రహభయే వ్యసనేష్వాభిచారికే |
అన్యేష్వపి చ దోషేషు మాలామంత్రం స్మరేన్నరః ||

సర్వోపద్రవనిర్ముక్త-స్సాక్షాచ్ఛివమయోభవేత్ |
ఆపత్కాలే నిత్యపూజాం విస్తారాత్కర్తుమారభేత్ ||

ఏకవారం జపధ్యానం సర్వపూజాఫలం లభేత్ |
నవావరణదేవీనాం లలితాయా మహౌజసః ||

ఏకత్రగణనారూపో వేదవేదాంగగోచరః |
సర్వాగమరహస్యార్థః స్మరణాత్పాపనాశినీ ||

లలితాయా మహేశాన్యా మాలా విద్యామహీయసీ |
నరవశ్యం నరేంద్రాణాం వశ్యం నారీవశంకరమ్ ||

అణిమాదిగుణైశ్వర్యం రంజనం పాపభంజనమ్ |
తత్తదావరణస్థాయి దేవతాబృందమంత్రకమ్ ||

మాలామంత్రం పరం గుహ్యం పరం‍ధామ ప్రకీర్తితమ్ |
శక్తిమాలా పంచధా స్యాచ్ఛివమాలా చ తాదృశీ ||

తస్మాద్గోప్యతరాద్గోప్యం రహస్యం భుక్తిముక్తిదమ్ ||

ఇతి శ్రీవామకేశ్వరతంత్రే ఉమామహేశ్వరసంవాదే శ్రీ దేవీఖడ్గమాలాస్తోత్రరత్నమ్ |

Sri Devi Khadgamala stotram pdf is below click to download


మా YouTube Channel ను SUBSCRIBE చేయండి.. మమ్ము కొంచెం Encourage చేసినట్లు అవుతుంది.. Please subscribe our Channel
👉👉👉To Subscribe us please click here👈👈👈

Join with me in our telegram:



ఈ బ్లాగ్ లో మరెన్నో విలువైన పుస్తకాలు ఉన్నాయి... మన పురాతన విజ్ఞానము పుస్తక భాండాగారము 👈👈ఈ లింక్ లో ఉన్నాయి... చూడండి...

మరింత information కోసం మా మెనూ చూడండి



మాసైట్ లో ఇంకా ఎన్నో 👉అమూల్యమైన పుస్తకాలు 👈ఉన్నాయి.. మీరు చూసి ఇష్టమైన వాటిని డౌన్ లోడ్ చేసుకోవచ్చు.. 


Post a Comment

Whatsapp Button works on Mobile Device only