sri bhramarambika ashtakam lyrics in telugu
రవిసుధాకర వహ్నిలోచన రత్నకుండల భూషిణీ
ప్రవిమలంబుగ మమ్మునేలిన భక్తజన చింతామణీ
అవని జనులకు కొంగుబంగారైన దైవశిఖామణీ
శివుని పట్టపురాణి గుణమణి శ్రీగిరి భ్రమరాంబికా || ౧
కలియుగంబున మానవులకును కల్పతరువై యుండవా
వెలయగును శ్రీ శిఖరమందున విభవమై విలసిల్లవా
ఆలసింపక భక్తవరులకు అష్టసంపద లీయవా
జిలుగు కుంకుమ కాంతిరేఖల శ్రీగిరి భ్రమరాంబికా || ౨
అంగ వంగ కలింగ కాశ్మీరాంధ్ర దేశములందునన్
పొంగుచును వరహాల కొంకణ పుణ్యభూముల యందునన్
రంగుగా కర్ణాట రాట మరాట దేశములందునన్
శృంగినీ దేశముల వెలసిన శ్రీగిరి భ్రమరాంబికా || ౩
అక్షయంబుగ కాశిలోపల అన్నపూర్ణ భవానివై
సాక్షిగణపతి కన్న తల్లివి సద్గుణావతి శాంభవీ
మోక్షమోసగెడు కనకదుర్గవు మూలకారణ శక్తివి
శిక్షజేతువు ఘోరభవముల శ్రీగిరి భ్రమరాంబికా || ౪
ఉగ్రలోచన వరవధూమణి కొప్పుగల్గిన భామినీ
విగ్రహంబుల కెల్ల ఘనమై వెలయు శోభనకారిణీ
అగ్రపీఠమునందు వెలసిన ఆగమార్థ విచారిణీ
శీఘ్రమేకని వరములిత్తువు శ్రీగిరి భ్రమరాంబికా || ౫
నిగమగోచర నీలకుండలి నిర్మలాంగి నిరంజనీ
మిగుల చక్కని పుష్పకోమలి మీననేత్ర దయానిధీ
జగతిలోన ప్రసిద్ధికెక్కిన చంద్రముఖి సీమంతినీ
చిగురుటాకులవంటి పెదవుల శ్రీగిరి భ్రమరాంబికా || ౬
సోమశేఖర పల్లవాధరి సుందరీమణీ ధీమణీ
కోమలాంగి కృపాపయోనిధి కుటిలకుంతల యోగినీ
నా మనంబున పాయకుండమ నగకులేశుని నందినీ
సీమలోన ప్రసిద్ధికెక్కిన శ్రీగిరి భ్రమరాంబికా || ౭
భూతనాథుని వామభాగము పొందుగా చేకొందువా
ఖ్యాతిగను శ్రీశైలమున విఖ్యాతిగా నెలకొంటివా
పాతకంబుల పారద్రోలుచు భక్తులను చేకొంటివా
శ్వేతగిరిపై నుండి వెలసిన శ్రీగిరి భ్రమరాంబికా || ౮
ఎల్లవెలసిన నీదు భావము విష్ణులోకము నందున
పల్లవించును నీ ప్రభావము బ్రహ్మలోకము నందున
తెల్లముగ కైలాసమందున మూడులోకము లందున
చెల్లునమ్మ త్రిలోకవాసిని శ్రీగిరి భ్రమరాంబికా || ౯
తరుణి శ్రీగిరి మల్లికార్జున దైవరాయల భామినీ
కరుణతో మమ్మేలు యెప్పుడు కల్పవృక్షము భంగినీ
వరుసతో నీ యష్టకంబును వ్రాసి చదివిన వారికి
సిరులనిచ్చెద వెల్ల కాలము శ్రీగిరి భ్రమరాంబికా || ౧౦
Tags:
Sri Bhramarambika AshTakam in Telugu pdf free download,
Sri Bhramarambika AshTakam importance and significance,
Sri Bhramarambika AshTakam meaning in telugu,
Sri Bhramarambika AshTakam learning video,
Sri Bhramarambika AshTakam book in telugu,
Sri Bhramarambika AshTakam Lyrics in Telugu,

To listen chant learn Sri Bhramaramba ashtakam follow video
Post a Comment