Tuesday, 30 August 2022

గణపతి స్తోత్రములు - Vinayaka chavithi padyamulu shlokamulu important stotras

Vinayaka chavithi padyamulu shlokamulu important stotras

వినాయక చవితినాడు చిన్నారులతో పాడించేందుకు - గణపతిని ప్రార్థించే కొన్ని ముఖ్యమైన స్తోత్రములు.. పద్యములు ఇక్కడ ఇస్తున్నాము..

ఇది సంస్కృత పద్యం..

1. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం|
ప్రసన్న వదనం ధ్యాయేత్సర్వ విఘ్నోప శాంతయే||

2. అగజానన పద్మార్కం గజానన మహర్నిశం|
అనేక దంతం భక్తానాం ఏకదంతముపాస్మహే||

3. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ|
నిర్విఘ్నం కురుమేదేవ సర్వకార్యేషు సర్వదా||

4. మూషికవాహన మోదకహస్త
చామరకర్ణ విలంబిత సూత్ర|
వామనరూప మహేశ్వరపుత్ర
విఘ్న వినాయక పాద నమస్తే||

5. గజాననం భూతగణాదిసేవితం
కపిత్త జంబూఫల సారభక్షితం|
ఉమాసుతం శోకవినాశ కారణం
నమామి విఘ్నేశ్వర పాద పంకజం||

6. సుముఖశ్చై కదందశ్చ కపిరో గజకర్ణికః
లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాదిపః|
ధూమకేతు నరాధ్యక్షః ఫాలచంద్రో గజాననః
వక్రతుండ శూర్పకర్ణో హేరంభ స్కందపూర్వజః||



వినాయక చవితినాడు చిన్నారులతో పాడించేందుకు - గణపతిని ప్రార్థించే కొన్ని ముఖ్యమైన స్తోత్రములు.. పద్యములు ఇక్కడ ఇస్తున్నాము..

తెలుగు లో గణేశుడి గురించి ఏదైన పద్యం చెప్పు అంటే చాలా మందికి గుర్తు వచ్చే పద్యం..

ఈ పద్యాన్ని నన్నె చోడుడు రచించారు
తొండము నేకదంతమును తోరపుబొజ్జయు వామహస్తమున్
మెండుగ మ్రోయు గజ్జెలును మెల్లని చూపులు మందహాసముల్
కొండొక గుజ్జురూపమును కోరిన విద్యలకెల్ల నొజ్జయై
యుండెడి పార్వతీతనయ! ఓయి గణాధిప నీకు మ్రొక్కెదన్!

అల్లసాని పెద్దన గారు రచించిన ఈ పద్యం:

అంకము జేరి శైలతనయా స్తనదుగ్ధములాను వేళ బా
ల్యాంక విచేష్ట దొండమున నవ్వలి చన్ గబళింపబోయి యా
వంక గుచంబు గాన కహివల్లభ హారము గాంచి వే మృణా
ళాంకుర శంక నంటెడి గజాస్యుని గొల్తు నభీష్ట సిద్ధికిన్!

దశకుమార చరిత్రలో కేతన గారు వ్రాసిన పద్యం:

గ్రక్కున నేత్రయుగ్మము కరద్వితయంబున మూసిపట్టి యా
మిక్కిలి కంటికిం దనదు మిక్కిలి హస్తము మాటుసేసి యిం
పెక్కెడు బాలకేళి బరమేశ్వరు చిత్తము పల్లవింపగా
దక్కక ముద్దునం బొలుచు దంతిముఖుం గొలుతుం బ్రసన్నుగాన్!

కుమారసంభవం లోనిది ఈ పద్యం


తను వసితాంబుదంబు, సితదంతముఖం బచిరాంశు, వాత్మ గ
ర్జన మురుగర్జనంబు, గర సద్రుచి శక్రశరాసనంబునై
చన మదవారివృష్టి హితసస్య సమృద్ధిగ నభ్రవేళ నా
జను గణనాథు గొల్తు ననిశంబు నభీష్టఫల ప్రదాతగాన్!

రామరాజభూషణుడు / భట్టుమూర్తి వ్రాసిన పద్యం:

దంతాఘట్టిత రాజతాచల చలద్గౌరీ స్వయంగ్రాహముం
గంతుద్వేషికి గూర్చి శైలజకు దద్గంగాఝరాచాంతి న
త్యంతామోదము మున్నుగా నిడి కుమారాగ్రేసరుండై పితృ
స్వాంతంబు ల్వెలయింపజాలు నిభరాడ్వక్త్రుం బ్రశంసించెదన్!

పోతన వ్రాసిన పద్యం:

ఆదరమొప్ప మ్రొక్కిడుదు నద్రిసుతా హృదయానురాగ సం
సాదికి దోషభేదికి బ్రసన్నవినోదికి విఘ్నవల్లికా
చ్ఛేదికి మంజువాదికి నశేష జగజ్జననందవేదికిన్
మోదక ఖాదికిన్ సమద మూషికసాదికి సుప్రసాదికిన్!

కవయిత్రి మొల్ల వ్రాసిన పద్యం

చంద్రఖండ కలాపు జారు వామనరూపు
గలిత చంచలకర్ణు గమల వర్ణు
మోదకోజ్జ్వలబాహు మూషికోత్తమవాహ
ు భద్రేభవదను సద్భక్తసదను
సన్ముని స్తుతిపాత్రు శైలరాడ్దౌహిత్రు
ననుదినామోదు విద్యాప్రసాదు
బరశువరాభ్యాసు బాశాంకుశోల్లాసు
నురుతరఖ్యాతు నాగోపవీతు

లోకవందిత గుణవంతు నేకదంతు
నతుల హేరంబు సత్కరుణావలంబు
విమల రవికోటితేజు శ్రీవిఘ్నరాజు
బ్రథిత వాక్ప్రౌఢికై యెప్డు ప్రస్తుతింతు!

శ్రీనాథ కవి సార్వభౌముడు వ్రాసిన పద్యం:

కలితశుండాదండ గండూషితోన్ముక్త
సప్తసాగర మహాజలధరములు
వప్రక్రియా కేళివశ విశీర్ణ సువర్ణ
మేదినీధర రత్నమేఖలములు
పక్వ జంబూఫల ప్రకటసంభావనా
చుంబిత భూభృత్కదంబకములు
వికట కండూల గండక దేహమండలీ
ఘట్టిత బ్రహ్మాండ కర్పరములు

శాంభవీశంభు లోచనోత్సవ కరములు
వాసవాద్యమృతాశన వందితములు
విఘ్నరాజ మదోల్లాస విభ్రమములు
మించి విఘ్నోపశాంతి గావించు గాత!

జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు వ్రాసిన పద్యం:

ఎలుకగుఱ్ఱము మీద నీరేడు భువనాలు
పరుగెత్తి వచ్చిన పందెకాడు
ముల్లోకముల నేలు ముక్కంటి యింటిలో
పెత్తనమ్మొనరించు పెద్దకొడుకు
"నల్లమామా!" యంచు నారాయణుని పరి
యాచకాలాడు మేనల్లుకుఱ్ఱ
వడకుగుబ్బలి రాచవారిబిడ్డ భవాని
నూఱేండ్లు నోచిన నోముపంట

అమరులందగ్ర తాంబూలమందు మేటి
ఆఱుమోముల జగజెట్టి అన్నగారు
విఘ్నదేవుడు వాహ్యాళి వెడలివచ్చె
ఆంధ్రవిద్యార్థి! లెమ్ము జోహారు లిడగ!

తెలివి యొకింత లేనియెడ దృప్తుడనై కరిభంగి సర్వమున్
దెలిసితినంచు గర్వితమతిన్ విహరించితి దొల్లి, యిప్పు డు
జ్జ్వలమతులైన పండితుల సన్నిధి నించుక బోధశాలి నై
తెలియనివాడనై మెలగితిం గతమయ్యె నితాంతగర్వముల్





ఏ పని ప్రారంభించినా ఆటంకాలు ఎదురవుతున్నవారు... doubt తో పని మొదలు పెడుతున్న వారు.. తమ సంశయాలను సంకటాలను నాశనం చేసి గణాధీశుడు మనకు విజయాన్ని అందించే స్తోత్రం... 

సంకటనాశన గణేశ స్తోత్రం -డౌన్ లోడ్ చేసుకోండి...

సంకటనాశన గణేశ స్తోత్రం - sankata nashana ganesha stotram free download in telugu pdf


సకల దరిద్రాలను హరించి...  సంసార బాధలనుండి ఉపశమనం పొంది... మంగళప్రదంగా మన జీవితమును మలచుకొనుటకు ..దారిద్ర్య దహన గణపతి స్తోత్రము పఠించవచ్చు..

దారిద్ర్య దహన గణపతి స్తోత్రము 
దారిద్ర్య దహన గణపతి స్తోత్రము - Daridrya dahana ganapati stotram in telugu pdf free download




మన జీవితాలలో పేరుకు పోయిన అమంగళాలన్నీ తొలగించి వేసి.. మంగళకరమైన ఆశీస్సులు అందించే స్తోత్రం... 

గణేశ మంగళ మాలికా స్తోత్రము
గణేశ మంగళ మాలికా స్తోత్రము - Ganesha Mangala Malika stotram in telugu free download pdf


శ్రీ గణపతి అథర్వణోపనిషత్
శ్రీ గణపతి అథర్వణోపనిషత్ - Shree Ganapathi atharvaNopanishad free download pdf in telugu



ఈ స్తోత్రం ప్రణవ స్వరూపుడైన గణేశుని స్తుతించేందుకు పరమేశ్వరుడు సూచించినట్లుగా ఉంటుంది.. ఈ స్తోత్రం చదివితే భవిష్యత్ బంగారం అవుతుంది.. పుత్ర పౌత్ర వంశాభివృద్ధి .. సుఖం సంతోశాలులభిస్తాయని.. ఫల శృతి... 

శివశక్తి కృత గణాథీశ స్తోత్రం
శివశక్తి కృత గణాథీశ స్తోత్రం - shiva shakti kruta ganadhisha stotram in telugu pdf free download


లక్ష్మీ అమ్మవారి అనుగ్రహం ఎప్పుడూ గణేశుడి తోడుగా ద్విగుణీకృతమవుతుందట... అందుకే లక్ష్మీ గణపతులను ఎప్పుడూ జంటగా పూజిస్తుంటారు... ఈ మరకత శ్రీ లక్ష్మీ గణపతి స్తోత్రం.. మనకు సిరి సంపదలను కలిగిస్తుంది.. 

మరకత శ్రీ లక్ష్మీ గణపతి స్తోత్రం
మరకత శ్రీ లక్ష్మీ గణపతి స్తోత్రం - Marakata sri lakshmi ganapathi stotram in telugu free download pdf


తలపెట్టిన అన్నికార్యములలో దిగ్విజయం పొందేందుకు ఈ స్తోత్రం పఠించాలి.. 

శ్రీ గణనాయక అష్టకం
శ్రీ గణనాయక అష్టకం - Sri Gananayaka Ashtakam in telugu free download pdf



Tags: Key words:
Vinayaka chavithi padyalu shlokamulu in telugu
Ganesha Stotralu padyamulu
గణపతి పద్యాలు
వక్రతుండ మహాకాయ శ్లోకం
శుక్లాంబరధరం శ్లోకం
శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే
తొండము నేకదంతమును తోరపుబొజ్జయు వామహస్తమున్ shlokam padyam
మా YouTube Channel ను SUBSCRIBE చేయండి.. మమ్ము కొంచెం Encourage చేసినట్లు అవుతుంది.. Please subscribe our Channel
👉👉👉To Subscribe us please click here👈👈👈

Join with me in our telegram:




ఈ బ్లాగ్ లో మరెన్నో విలువైన పుస్తకాలు ఉన్నాయి... మన పురాతన విజ్ఞానము పుస్తక భాండాగారము 👈👈ఈ లింక్ లో ఉన్నాయి... చూడండి...

మరింత information కోసం మా మెనూ చూడండి



మాసైట్ లో ఇంకా ఎన్నో 👉అమూల్యమైన పుస్తకాలు 👈ఉన్నాయి.. మీరు చూసి ఇష్టమైన వాటిని డౌన్ లోడ్ చేసుకోవచ్చు.. 



Post a Comment

Whatsapp Button works on Mobile Device only