భక్ష్యం - అంటే కొరికి తినేది
భోజ్యం - అంటే నమిలి మింగేది
లేహ్యం - అంటే నాకి తినేది
చోష్యం - అంటే పీల్చుకొనేది/ జుర్రుకొనేది
పానీయం - అంటే తాగేది
మనం తినే ఆహారం సమీకృతంగా మరియు జీర్ణక్రియ సక్రమంగా ఉండాలని మన పెద్దలు తయారు చేసిన ఆహార ప్రణాళికలో భాగాలు ఇవి.
మనం రోజూ తినే పదార్థాలు ఏ కోవలోకి రాగలవో ...ఒక ఉదాహరణ మాత్రమే..
భ క్ష్యం - గారెలు, బూరెలు, బొబ్బట్లు లాంటివి
భోజ్యం - అన్నంతో చేసేన పులిహోరా లాంటివి
(ఇవి చింతపండు వగైరా జీర్ణరసాన్ని వృద్ధి చేసి తిన్న ఆహారం త్వరగా జీర్ణం అయ్యేలా చేస్తుంది... )
లేహ్యం - నేను మన పచ్చళ్ళని దీని క్రింద చేర్చుతాను(ఇవి నోటిలో లాలాజలం వృద్ధి అవడానికి తోడ్పడుతాయి... )
చోష్యం - సాంబార్, రసం. పాయసం, పెరుగు లాంటివి
పానీయం - మంచినీరు, పానకం, ఫలరసాలు వంటివి.(ఇవి రెండు ఆహారాల మధ్య సంధిలా ఉపయోగించుకోవచ్చు)
For more interesting Topics...
Post a Comment