Wednesday, 9 December 2020

Cow hugging Holland wellness centers story in telugu

Cow-hugging-Holland-wellness-centers-story-in-telugu
ఆవు మనకు గోమాత. పాత తరం భారతీయులు / హిందువులు గోవును నిత్యం పూజించేవారు... అలా పూజించే సంస్కృతిలో భాగంగా గోమాతను ఆలింగనం కూడా చేసుకునేవారు... అలా చేసుకోవడం ద్వారా చాల జాతుల దేశీయ ఆవులు మనలో ఉన్న జాడ్యాలను గుర్తించి దానిని నివారించడానికి అవసరమయిన ఆకులను మూలికలను తిని మనకు ఇచ్చే పాలను ఔషధం లాగా మార్చి తన యజమాని కుటుంబాన్ని రక్షించేదట...
gir cow information in telugu greatness of gomata in telugu
అందుకే మన పూర్వీకులు గోపూజను మన సంస్కృతిలో భాగంగా చేసారు..... అలా గో మయం, గోమలం, ఆవు పాలు, పెరుగు, నెయ్యి... (పంచామృతం) ఇలా ప్రతి ఆవు ఆధారిత పదార్థాన్ని పవిత్రంగా సేవించేవారు... అయితే ఈ మాతలో మరో శక్తి ఉందని హాలెండ్ వాసులు దశాబ్దం క్రితమే కనిపెట్టారు. 
అంతేకాకుండా కౌ హగ్గింగ్ (కౌగిలింత)ను సాధన చేస్తున్నారు. గోమాతను కౌగిలించుకొని కొంతసేపు గడిపితే ఆందోళన మటుమాయమవుతుందని అనుభవంతో చెబుతున్నారు. 
cow hugging Holland wellness centers story in telugu
కోవిడ్ సమయంలోనూ దీనిని సాధన చేశారు. గోమాత... హాలెండ్ వాసులకు ఉచిత డాక్టర్ గా మారింది. 
ఆవు కళ్లల్లో కళ్లు పెట్టి చూస్తే, ఆవును ప్రేమిస్తే శరీరం...స్వస్థత పొందుతుందని చెబుతున్నారు. ఇది ఇప్పుడు అమెరికాలోనూ విస్తరించింది. అమెరికాలో కౌ హగ్గింగ్ కోసం గోశాలలను నడుపుతున్నారట... 
దీనికి వారు 75 డాలర్లు.. (అంటే సుమారు 5,000 రూపాయల వరకు)చార్జ్ చేస్తున్నారని తెలుస్తోంది.. ఇప్పుడిప్పుడే ఈ సంస్కృతి అమెరికాకు కూడా ప్రాకింది... అయితే వారు ఉపయోగిస్తున్నది... జెర్సీ లాంటి సంకరజాతి ఆవులు... కానీ మన దేశీయ ఆవులైతే... ఫలితం ఇంకా బాగా ఉంటుంది... ఈ రోజు నుండి గో ఆరాధనను అలవాటు చేసుకుంటే మంచిది... పాశ్చాత్యులు మన పాత ఆచారాలను పాటిస్తున్నారు... కానీ మనమే దురాచారాలని వాటిని దూరం చేసుకుంటున్నాం...
Cow hugging and wellness centers in Holland.. new trend coming in Europian and US worshipping cow.. like traditional indians.
Tags:
Greatness of Cow Hugging
Go Puja

For more interesting Topics... 

Post a Comment

Whatsapp Button works on Mobile Device only