మొదటిది దానం
"నేను అర్జునుని యుద్ధంలో ఓడించి, అతన్ని చంపే వరకు ఎవరు ఏది అడిగితే అది వారికి దానం చేస్తాను" అని దీక్ష బూనాడు. కానీ అతను ఎటువంటి దానములు చెయ్యలేదు. ఇంద్రుడు వచ్చి తనని కవచ కుండలాలు అడుగుతాడు అన్న విషయం ముందే తెలిసిన కర్ణుడు, తన కవచ కుండలాలు దానం చేసి, ప్రతిగా శక్త్యాయుధం అతని వద్ద నుండి పొందాడు. ఒకటి ఇచ్చి మరొకటి తీసుకుంటే అది దానం అనబడదు కదా..!
రెండోది వీరత్వం
అతను శస్త్రాస్త్రాలు ఎన్నిటినో పొందినా వాటి యందు సరైన విశ్వాసం కానీ, ఎవరి మీద ప్రయోగించాలి ఎవరి మీద కూడదు అన్న జ్ఞానం కానీ అతనికి లేవు. అందుకే ఉత్తర గోగ్రహణంలో అర్జునుడికి ఎదురు నిలిచి, పలాయనం చిత్తగించడం అతని వంతు అయ్యింది.
మూడోది శూరత్వం
పోనీ అతను దాన గుణం ఉన్నది అని అన్నప్పుడు పద్మవ్యూహంలో అభిమన్యుడు అడిగినప్పుడు ఆయుధం ఇచ్చి దానాన్ని నిరూపించుకోలేదు. అంతే కాక నిరాయుధుడుతో పోరాడి, అతనికి శూరత్వం ఏ మాత్రం లేదని ప్రకటించుకున్నాడు.
గురువు దగ్గర అసత్యం పలికి, అతను పొందిన విద్యలు నిర్వీర్యం అయిపోయాయి. ఇది గురు ద్రోహం వలన వచ్చిన ఫలితం. పెద్దలను గురువులను గౌరవించకపోవటం వలన విద్య యందు గురి కానీ, నమ్మకం కానీ కుదరలేదు. ఇది చాలా ప్రమాదం. మనం కూడా ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఇక జూదం ఓడిన సందర్భంలో, ద్రౌపది దాసి అని చెప్పి తనని వివస్త్రను చెయ్యడానికి దుశ్శాసనుని ప్రేరేపించింది కర్ణుడే.
ఇలా చేయకూడనివి చేసి అతను ఎలా జయిస్తాను అనుకున్నాడు. కవచ కుండలాలు అతని వరం మాత్రమే, అవి మరణం రాకుండా చెయ్యలేవు. అతను చేసిన పనులే అతన్ని ఆ స్థితికి తీసుకొచ్చాయి.
Morals from Mahabharata
Facts about Karna
why Karna defeated
Why Karna under rated in Maha Bharata
Few things about Karna
Mahabharatha stories
Inspirational messages from Mahabharata.
Collected information from Quora
Post a Comment