Friday 5 February 2021

Panchabhakshya paramaannalu serving method - ela vaddinchali -

ఒక అరిటాకులో భోజనం వడ్డించేప్పుడు ఏవేవి ఎక్కడ వడ్డిస్తారు? ఎందుకు?

అరిటాకులో పంచభక్ష పరమాన్నాలు వడ్డించటానికి కూడా ఒక పద్ధతి ఉంటుంది... మనం తినే ఆహారం విస్తరిలో పరిచే టప్పుడు ఏవి ఎక్కడ ఉండాలో ఒక పద్ధతి ప్రకారం జరిగితే తినడానికి అనువుగా ఉంటుంది.... అలా ఒక 31 రకం తినే పదార్థాలను విస్తరిలో ఎలా వడ్డించాలో ఈ పోస్ట్ లో ఉంచాము.... ఇది ఒక కర్ణాటక అయ్యంగార్ ఫ్యామిలీలో వడ్డించే పద్ధతి కి సంబంధించినది... 

 అవునండీ దాదాపుగా 31 ఐటమ్స్ వడ్డించే సమయంలో కొన్ని నిబంధనలతో వడ్డించాలి.

 మొదటి నిబంధన ఆకుపై నీళ్ళు చిలకరించి చేతితో తుడవడం

 రెండవ నిబంధన మొత్తం ఐటమ్స్ వడ్డించే దాకా , చివర్లో నెయ్యి వేసి పెద్ద వారు లక్ష్మి రమణ గోవిందా అని అందరూ అన్నాక ఆకులో ఐటమ్స్ ముట్టాలి. అప్పటి దాకా ముట్టకూడడం నిషిద్దం.

 పైన ఇచ్చిన ఫోటొ ప్రకారం పదార్థాలు స్థానాలు.

 1. ఉప్పు

 2. ఊరగాయ

3. రోటి పచ్చడి 

 4. వడపప్పు 

 5. పచ్చిశనగల సలాడ్ 

 6. కొబ్బరి పచ్చడి 

 7. బీన్స్ కూర (ఇగురు కూర) 

 8. పనస కూర 

 9. పులిహొర 

10. అప్పడము 

 11. వడియాలు 

 12.కుడుము 

 13.అన్నం 

 14.పప్పు 

 15.తీపి ఇగురు 

 16.రసం 

 17.మజ్జిగ పులుసు 

 18. వంకాయ బజ్జి 

 19.తీపి, పుల్లని ఇగురు 

 20. మైసూరు బజ్జీ 

 21. కలగలపుల కూర 

 22.బెండకాయ పకోడీ 

 23. వంకాయ సాంబార్ 

 24. సేమియా 

 25.మసాలా వడ 

 26.కొబ్బరి బొబ్బట్లు 

 27. వంకాయన్నం 

 28. కాల్చిన వంకాయ పచ్చడి 

 29.బియ్యప్పిండి పాయసం 

 30. పెరుగు 

 31. మజ్జిగె 

 ఇక ఎందుకు అంటారా.
Panchabhakshya-paramaannalu-serving-method-ela-vaddinchali
మొట్టమొదట ఉప్పు వడ్డిస్తారు ఇది ఒక రూల్. 

 1వ భాగంలో ఉప్పు వడ్డిస్తారు. ఏదన్న వంటకాల్లో తక్కువైతే కలుపుకోవడానికి. వేరే పదార్ధాలతో కలవకుండా మూలకు వేస్తారు. ఆకు మొన ఎడమవైపుకు తిరిగి వుంటుంది. 

13 వ భాగంలో అన్ని ఐటెంస్ కలుపుకొవదానికి వీలుగా ఎక్కువ స్ఠలం వుంటుంది అని. 

 2,3,4,5,6 పదార్థాలు నూనె లేకుండా నీళ్ళల్లో నానబెట్టీ చెసినవి వడపప్పు వంటివి, రోటి పచ్చళ్ళు వుంటాయి. ఇవి స్టార్టర్ వంటివి.

 9,29 స్థానాల్లో వున్న పులిహోర పాయసం మొదట తినాలి అది రూల్ దీని వల్ల ఆకు ఖాళీ అయ్యి సాంబార్, రసం,పెరుగు మరియు మజ్జిగ వంటివి కలుపుకొవటానికి అనుకూలంగా వుంటుంది. ఇక కుడివైపు పైభాగం విస్తారంగా వుండడం వల్ల కూరలకు అనుకూలం.
కేరళ వాళ్ళ వడ్డన కూడా ఇంచుమించు ఇలాగే వున్నా అది ఉడిపి శైలికి భిన్నంగా వుంటుంది. పండగలను బట్టి పదార్ఠాలు ఎక్కువ తక్కువలుండచ్చు. నమూన ఆకు క్రింద ఇవ్వడం జరిగినది


more related articles: 

Post a Comment

Whatsapp Button works on Mobile Device only