రాహుకాలం యమగండం దుర్ముహూర్తాలను ఎలా నిర్ణయిస్తారో తెలుసా????
నాకు చాలా కాలం నుండి రాహుకాలం, వ్యర్జం, దుర్ముహూర్తం అంటే ఏమిటో వీటిమధ్య గల తేడా ఏమిటో తెలుసుకోవాలని అనిపించింది.... కానీ దీని గురించిన వివరణ ఎక్కడా దొరకలేదు... పులిపాటి శ్రీనివాస్ గారి కోరా సమాధానంలో దీని గురించిన పూర్తి వివరణ దొరికింది... అందరికీ విషయం తెలుస్తుంది అని బ్లాగులో పోస్ట్ చేస్తున్నాను... ఈ పూర్తి పోస్ట్ క్రెడిట్ పులిపాటి శ్రీనివాస్ గారి కోరా పోస్ట్ దే... గమనించగలరు..
మన శాస్త్రాల ప్రకారం మనకి మొత్తం నవగ్రహాలు ఉన్నాయి. మనవాళ్ళు చంద్ర, సూర్యలను కూడా గ్రహాలక్రిందే లెక్క కట్టారు. రాహూ, కేతు ఛాయాగ్రహాలు కావున వాటిని తీసివేస్తే మిగిలిన 7 గ్రహాల పేర్ల మీద మనకి 7 వారాలు వచ్చాయి.
ఈ పేర్ల క్రమం ఎలా వచ్చిందో చూద్దాం. దీని వెనక ఉన్న తర్కం చూద్దాం
7 గ్రహాల క్రమం మనం ఒక పద్దతి ప్రకారం చూస్తే ….
దూరం
పరిమాణం
గ్రహ భ్రమణ వేగం
ఒక Austronomical Units (Au) అంటే భూమికి, సూర్యునికి మధ్య దూరం, 15,00,00,000 (15 కోట్లు) కిలోమీటర్లు. ఒక Lunar Distance (LD) అంటే భూమికి, చంద్రునికి మధ్య దూరం, 3,85,000 (3 లక్షల, 85 వేల) కిలోమీటర్లు.
పైన చూసిన పట్టిక ప్రకారం చూస్తే మనకు 7 వారాలు దూరప్రకారం లేదా పరిమాణ లేదా గ్రహ భ్రమణ వేగం ప్రకారం, క్రింద చూపిన విధంగా రావాలి.
ఈ క్రమంలో ఎలా వచ్చాయో చూద్దాం.
శ్రీమద్భాగవత, స్ఖంద 3, అధ్యాం 11 లోని శ్లోకాల ప్రకారం మన కాల విభజన ఈవిధంగా ఉంది. ఒక రోజు = 1 అహో + 1 రాత్రి = 8 ప్రహారాలు = 24 గంటలు = 30 ముహూర్తాలు = 60 ఘడియలు
మన పూర్వీకులు, 24 గంటలు లేదా 60 ఘడియలు ఒక గ్రహానికి కేటాయించారు.
సూర్యోదయం నుండి ఒక్కో గంటని ఒక గ్రహానికి కేటాయించారు. క్రింద చూపిన పట్టిక ప్రకారం చూస్తే, మొదటి గంట శని దగ్గర ప్రారంభిస్తే, రెండవ గంట గురుకి, 3వ గంట మంగళ గ్రహానికి కేటాయించుకుంటా వెళితే.. 24 గంటల తరువాత మళ్లా మొదటి గంట సూర్యుడికి వచ్చింది, ఆ విధంగా గంటలని ఇచ్చుకుంటా వెళితే మనకు శని —→ ఆది —→ సోమ —→ మంగళ —→ బుధ —→ గురు —→ శుక్ర వారాలు ఒక క్రమంలో వచ్చాయి.
కొందరు వారం ఆరంభం "ఆది" తో చేసి "శని" తో ముగిస్తున్నారు. మరికొందరు వారం ఆరంభం "సోమ" తో చేసి "ఆది" తో ముగిస్తున్నారు. ఈ విధంగా మనకు ఒక వరుస క్రమం వచ్చింది.
రాహుకాలం
నవ గ్రహాలలో 7 గ్రహాలకి ఒక రోజు లేదా 24 గంటలు కేటాయించగా, ఛాయాగ్రహాలైన రాహు, కేతు లకి ఎటువంటి రోజులు లేకుండా పోయాయి.
కావున వాటికోసం, ఒక్కో గ్రహం రోజు నుండి 3 గంటలు తీసుకున్నారు. అలా 7 రోజులనుండి 3 గంటలు తీసుకుంటే 7x3 = 21 గంటలు వచ్చాయి. మిగిలినా 7 గ్రహాలు కూడా తమ తమ 24 గంటలు నుండి 3 గంటలు కోల్పోతే వాటికి కూడా 21 గంటలు మిగిలాయి. ఆ విధంగా 7 గ్రహాలకి 21 గంటలు, రాహూకేతువులకి కలిపి 21 గంటలు వచ్చాయి.
రాహుకేతువులు తమకి రోజుకి వచ్చిన 3 గంటలని సగం సగం చొప్పున పంచుకుంటే, ప్రతిరోజూ ఒక్కోక్కరికి గంటన్నర (1.5 hours) వచ్చింది.
రాహుకాలం రోజూ గంటన్నర ఈ క్రింది విధంగా ఉంటుంది. {2}
యమగండం ( కేతు కాలం ?? )
కేతువు కి ఇచ్చిన గంటన్నర ని మనం యమగండం గా పిలుచుకుంటున్నాం (??? నా అభిప్రాయం). ఇది కూడా రోజుకి ఇలా వస్తుంది.
రాహుకాలం + యమగండం ( కేతు కాలం ) కలిపి ఒక రోజులో
దుర్ముహుర్తం
రోజుకి 30 ముహుర్తాలు లేదా 60 ఘడియలు ఉంటాయి. 24 గంటలు x 60 నిమిషాలు = 1,440 ని.
1,440 / 30 = 48 నిమిషాలు లేదా ఒక ముహుర్త కాలం = 2 ఘడియలు ( 1 ఘడియ = 24 నిమిషాలు )
దుర్ముహుర్తం కూడా రాహుకాలం లానే ప్రతిరోజు 48 నిమిషాలు లేదా ఒక ముహుర్త కాలం వస్తుంది. అది కూడా ఈ క్రింద చూపిన పట్టికలో మాదిరిగా వస్తుంది.
వర్జ్యం
మవ వాళ్లు దీనిని చెడు కాలంలా భావిస్తారు. ఇది ఆ రోజున ఉన్న నక్షత్రం ప్రకారం గుణిస్తారు. దీని సమయ కాలం 2 ముహూర్తాలు లేదా 4 ఘడియలు ఉంటుంది, అనగా 48+48 లేదా 24 + 24 + 24 +24 = 96 నిముషాలు. ఈ 96 నిమిషాలలో ఎటువంటి శుభకార్యములు చేయరు.
సూర్యోదయం ని ఉదయం 06:00 క్రింద మనం తీసుకొంటే వర్జ్యం మనకి ఈ క్రింద పట్టిక ప్రకారం వస్తుంది ( అర్ధరాత్రి 12:00 కి ఘడియ 1 ప్రారంభమై, ఘడియ 60 అర్దరాత్రి 23:59 కి ముగుస్తుంది. )
గమనిక : దుర్ముహుర్తం, వర్జ్యం ఆ సమయాలకే ఖచ్చితంగా ఎందుకు పెట్టారో ఇంకా పరిశోధించి, దాని వెనక ఉన్న మర్మం ఏంటో తెలుసుకొని ఈ సమాధానాన్నినవీకరణ చేయాల్సిఉంది.
Full credits for this post is : పులిపాటి శ్రీనివాస్ garu..
Post a Comment