మేము ఈ క్షేత్రం లో నంది ప్రతి సంవత్సరం పెరుగుతూ పోతాడని.. కలియుగం అంతంలో యాగంటి బసవన్న రంకె వేస్తాడని బ్రహ్మం గారి పురాణంలో విన్నాం.. అంతే గాని ఈ క్షేత్రాన్ని చూసిన తర్వాత మా అనుభూతులు వేరే... మేము క్షేత్రాన్ని చేరేసరికి రాత్రి 7:30 అయింది... ఆ చీకటిలో చుట్టూ ఉన్న కొండలు బ్రహ్మ విష్ణు మహేశ్వరునిల కనిపించాయి...
Yaganti-యాగంటి-Hills-Temple-Information-telugu-images-messages-posts-wallpapers |
Yaganti-యాగంటి-Hills-Temple-Information-telugu-images-messages-posts-wallpapers |
Yaganti-యాగంటి-Hills-Temple-Information-telugu-images-messages-posts-wallpapers |
చాల అద్భుతమయిన అనుభూతి... ఆ తన్మయత్వం నుండి తేరుకోలేక పోయాం..
అసలు ఆ రోజు అక్కడ ఉండాలన్న ఆలోచన లేదు కాని... లీవ్ పోడిగించుకొని మరీ ఉండిపోయాం ...
క్షేత్ర పురాణం:
Yaganti-యాగంటి-Hills-Temple-Information-telugu-images-messages-posts-wallpapers |
ఈ గుడి చాల సంవత్సరాల క్రితంది....
చాలా సువిశాల ప్రాంగంణంలో నిర్మితమైన ఆలయం
Yaganti-యాగంటి-Hills-Temple-Information-telugu-images-messages-posts-wallpapers |
మొదట వెంకటేశ్వర స్వామి గుడి కట్టాలని మొదలు పెట్టి విగ్రం తయారయ్యే సమయానికి స్వామి వారి కాలి బొటనవేలిలో లోపం గమనించారట...
ఈ లోపల గుడి కట్టించే రాజు కలలో ఈశ్వరుడు కనిపించి ... ఇక్కడ నా విగ్రహం ప్రతిష్టించు... అని అదేశించాడట... ఇక్కడ ఉన్న శివ లింగం లో నే శివుడు.. పార్వతి ఇద్దరు ఒకే లింగంలో దర్శనమిస్తారు ... ఈ క్షేత్రంలో ఇది ఒక ప్రత్యేకత...
అగస్త్య మహాముని ఈ క్షేత్రంలో యాగం చేసేటప్పుడు రాక్షసులు కాకి రూపంలో వచ్చి మాసం ముక్కలు యాగాగ్నిలో వేస్తున్నారని కాకులు ఈ క్షేత్రంలో తిరగరాదని... అగస్త్యుడు శాపమిచాడట... అందుకే ఈ క్షేత్రంలో కాకులు ఉండవు....
(అగస్త్యుని యాగం వలన ఖ్యాతి చెందింది కాబట్టి ఊరు పేరు యాగంటి అయిందని ఒక వినికిడి )
శని వాహనం కాకి ... ఇక్కడ కాకిని నిషేధించారు కాబట్టి ఇక్కడ నేను ఉండను... అని అయన చెప్పాడంట... అందుకే ఈ గుడిలో నవగ్రహాలు ఉండవు.... ఆ ప్రదేశం లో నందీశ్వరుడు ఉంటాడు...
ఈ గుడిని మొదట వెంకటేశ్వర స్వామి కోసం మొదలు పెట్టారు కాబట్టి... ఈ ఆలయం నిర్మాణం విష్ణు ఆలయాల మాదిరి ఉంటుంది...
Yaganti-యాగంటి-Hills-Temple-Information-telugu-images-messages-posts-wallpapers |
Yaganti-యాగంటి-Venkateswaraswamy-Cave-Temple-Hills-Temple-Information-telugu-images-messages-posts-wallpapers |
ఇక్కడి వెంకటేశ్వర స్వామి మనం రోజు చూస్తున్న మాదిరిగా కాకుండా.. కొంచెం విభిన్నంగా అనిపించాడు... ఇక ప్రధాన్యమయినది..
నంది... ఈ నందీశ్వరుడు... మొదట మండపం మధ్యలో ఉంది చుట్టూ ప్రదక్షిణ చేసే విధంగా ఉండేదట... ఇప్పుడు పూర్తిగా ఆక్రమించి.. స్తంభాలలో సరిపోవటం లేదు...
Yaganti-యాగంటి-బసవయ్య-Hills-Temple-Information-telugu-images-messages-posts-wallpapers |
Yaganti-యాగంటి-బసవయ్య-Hills-Temple-Information-telugu-images-messages-posts-wallpapers |
కోనేరు లో కోనేరులో నీరు ఎక్కడ నుండి వస్తుందో... తెలియదు...సంవత్సరం లో 365 రోజులు నీరు ఉంటుంది...
Yaganti-Koneru-యాగంటి-కోనేరు-Hills-Temple-Information-telugu-images-messages-posts-wallpapers |
జీవిత కాలంలో ఒక్క సారైనా చూడదగిన క్షేత్రం యాగంటి...
Accommoddation facillity:
వసతి సౌకర్యం ఉంది... అక్కడ చాల సత్రాలు ఉన్నాయి.. ఉచితంగా రెడ్డి గారి సత్రంలో భోజనం చేసాము...
మాతో పాటు ఇంకో 2 కుటుంబాలు మాకు జత కలిశాయి... మేము శ్రీశైలం నుండి మహానంది... ఆ తర్వాత అహోబిలం... చూసుకుని ఇక్కడకు వచ్చాము...
మీరు మీ శ్రీశైల యాత్రను రెండు రోజులుగా ప్లాన్ చేసుకుంటే యాగంటి వరకు చూడవచ్చు...
మూడు రోజులుగా ప్లాన్ చేసుకుంటే జోగులాంబ వరకు చూడవచ్చు.. దానిని ఎలా ప్లాన్ చేసుకోవచ్చో తెలిపే ప్రణాళిక:
శ్రీశైల యాత్రలో ఒక భాగంగా దీనిని చూడవచ్చు..
1. శ్రీశైలం లో ఒక రాత్రి బస(నిద్ర) చేయాలి..తెల్ల వారు ఝామున ఐదు గంటలకు మహానందికి బస్సు సౌకర్యం కలదు.. దాని ద్వారా మహానందికి ఉదయం పది గంటలలోపే చేరుకోవచ్చు...
మహానంది కు ShriSailam - 172 KM - 3.5 hr.
2.మహానంది నుండి అహోబిలానికి ట్యాక్సి మాట్లాడుకుంటే బావుంటుంది.. ఎందుకంటే చాలా దూరం నుండి వచ్చిన వారికి ధనం/సౌకర్యంకన్నా కాలం విలువైనది.. మనం భోజనం 1:00pm కల్లా ముగించుకుని తిరిగి అక్కడి నుండి బయలు దేరగలిగితే ఎగువ/దిగువ అహోబిలాలను చూసుకోవచ్చు...
మహానంది అందరి మూదు గుడి నుండి (ఆళ్లగడ్డ వయా) - 1.5 hr (62 Km)
వాస్తవంగా ఇక్కడ నవ అహోబిలాలు ఉంటాయి కానీ ప్రయాణానికి చూడడానికి అనువైనవి... పై రెండే.. మిగిలినవి అడవిలో ఉంటాయి..
3. మన ట్యాక్సి యాగంటి వరకు మాట్లాడుకుంటే సరిపోతుంది... ఎందుకంటే శ్రీశైలం చూసినతర్వాత... ఉదయాన్నే మహానంది, మధ్యాహ్నం లోపు అహోబిలం చూసినవారికి సాయంత్రం యాగంటి చూసే భాగ్యం దొరుకుతుంది..యాగంటికి వెళ్ళే సరికి చీకటి పడిపోతుంది...
(ఆళ్లగడ్డ వయా) - - Yaganti కు అందరి మూదు గుడి 1hr 45min (82 Km)
యాగంటిలో ఖచ్చితంగా రాత్రి బస చేసేందుకు ప్రయత్నించండి... యాగంటి క్షేత్రాన్ని రాత్రి మరియు పగలు రెండు వేళల్లో చూడడం గొప్ప అదృష్టం... యాగంటి క్షేత్రమునకు సంబంధించిన లింకు
click>>>>యాగంటి క్షేత్రానికి సంబంధించిన యాత్ర విశేషాల లింకు<<<<click
4. యాగంటి నుండి తెల్ల వారు ఝామున పునర్దర్శనం చేసుకుని బనగాన పల్లి కి చేరుకుంటాము
బనగాన పల్లె లో శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి వారు నివసించిన (అచ్చమాంబ) ఇల్లు, కాలం జ్ఞానం వ్రాసిన బావి ఉన్నాయి...
Yaganti వ్యవసాయమే పల్లెబాట 12 km - 16 min.
5.మహానంది నుండి మార్గమధ్యంలో ఓంకారం అనే అమ్మవారి గుడి ఉంటుంది... ఇది మంచి శక్తివంతమైన ఆలయం దర్శించడం మర్చిపోవద్దు..
6.బెలూంగుహలు(ఈరెండు స్థలాలు వేర్వేరు ప్రదేశాలలో ఉంటాయి.. ఒకేసారి రెండిటినీ చూడడం కుదరదు) మార్గమధ్యంలో అరుంధతి సినిమా షూటింగ్ తీసిన గద్వాల కోట కనపడుతుంది.. చూడండి...
(పైన పేర్కొన్న వాటిలో 5,6, అనేవి కొంచెం ఎడంగా ఉండే ప్రదేశాలు ఒకేరోజులో చూడడం కుదరవు.. మీరు ఇంకొంచెం ప్లాన్ చేసుకుంటే కుదరవచ్చేమో.. ప్రయత్నించండి..)
మేము ఈ క్షేత్రాలను(5,6మినహా) దర్శించి తిరుగు టపాలో కర్నూలు చేరుకుని అక్కడి నుండి ఆలంపురం, జోగులాంబ ఆలయాన్ని దర్శించాం..
>>>>ఆలంపుర్, జోగులాంబ ఆలయానికి సంబధించిన లింకు<<<
కర్నూలు నుండి ఎవరి ఇంటికి వారు బయలుదేరాం...
సర్వే జనాసుఖినోభవంతు!!! లోకా సమస్తా సుఖినోభవంతు!!
యాత్రను ఈ క్రింది విధంగా ప్లాన్ చేసుకోవచ్చు:
శ్రీశైలం నుండి మహానంది కు - 172 KM - 3.5 hr.
మహానంది నుండి అహోబిలం (ఆళ్లగడ్డ వయా) - 1.5 hr (62 Km)
అహోబిలం నుండి యాగంటి(ఆళ్లగడ్డ వయా) - - 1hr 45min (82 Km)
యాగంటి నుండి బనగాన పల్లె 12 km - 16 min.
బనగాన పల్లె నుండి ఆలంపూర్ (వయా కర్నూలు) 98 km - - 2 hr
>>>>>ఆలంపుర్, జోగులాంబ ఆలయానికి సంబధించిన లింకు<<<<
>>>>యాగంటి ఆలయానికి సంభంధించిన లింకు<<<<
Post a Comment