Tuesday 18 February 2014

Proofs of Ramayana

రామాయణం పుక్కిటి పురాణం కాదు అనేదానికి శాస్త్రీయమయిన ఆధారాలు మన శాస్త్రజ్ఞులకు లభించాయి.... దాని వివరాలలోకి వెళ్ళాలంటే దిగువన ఉన్న లింకు లోకి వెళ్ళండి...
రావణాసురినికి సంభంధించిన (6) విమానాశ్రాయాలు... సీతమ్మ అమ్మవారిని దాచి ఉంచిన ప్రదేశం, ఆంజనేయుడు విశ్రమించిన ప్రదేశంనీటి పైన తేలియాడే రాళ్ళు, రాముడు నిర్మించిన వారధి, ఆంజనేయుడు లక్శ్మణుడికై తెచ్చిన సంజీవని పర్వతం ఇవన్నీ లింకులో గమనించవచ్చు....
ఇప్పుడు నేను వివరించే ప్రదేశాలన్నీ శ్రీలంకలో ఉన్నాయి... గమనించ గలరు...
సీతమ్మ వారిని ఉంచిన ప్రదేశం పేరు "నాగులీయ" ,
ఇది ఒక కొండ గుహ..  బయటనుండి చూడడానికి ఒక పెద్ద నాగు పాము పడగ ఆకారంలో కొండ ఉండడం గమనార్హం... శిల  విధంగాను చెక్కబడలేదు.. ఇది కేవలం ప్రకృతి సహజసిద్ధంగా ఏర్పడినదే నని.. పాశ్చాత్య శాస్త్రజ్ఞులు తేల్చి చెప్పారట...
సీతమ్మ అమ్మ వారు స్నానం చేసిన ప్రదేశం

ఇక జనక మహారాజుకు నాగలి కోడుకు తగిలిన పెట్టెలో సీతాదేవి లభించినది కాబట్టి సీతమ్మకు నాగులీయ అనే పేరుకూడా ఉండేదట... పేరుమీదనే ప్రదేశానికి నాగులీయ అనే పేరు వచ్చిందని భావిస్తున్నారు..
ప్రస్తుతం ఈ ప్రదేశానికి సంబంధించిన సిగిరియ కొండ వీడియో... 


ఆంజనేయుడు విశ్రమించిన స్థలం

పర్వతం  ఏరియల్ వ్యూ చూస్తే అక్కడ నిద్రిస్తున్న ఆంజనేయ స్వామి రూపాన్ని మనం గమనించవచ్చు...
హనుమాన్ పడుకునే పర్వతం, Srilanka


ఇక్కడే ఆంజనేయ స్వామి పాద ముద్రలను కూడా చూడవచ్చు.. ఆంజనేయుని పాద ముద్రలు


ఇక్కడే కాక మన ఆంద్రప్రదేశ్ లోని అనంతపురం జిల్లా, హిందూపురం మండలంలోని లేపాక్షిలో కూడా ఉంటాయి..
(సీతాదేవి పాద ముద్రలు లేపాక్షిలో ఉన్నాయి.. పాదాల నుండి నిరంతరం నీటి ఊట బయటకు వస్తూ ఉంటుంది.. ముద్ర ఒక కొండ మీద ఉంది... మామూలుగా అనంతపురం జిల్లా ఒక రకంగా ఎడారే.. ఇక్కడ నీళ్ళు పడాలంటే కనీసం ౫౦౦ అడుగుల లోతు తవ్వాలి... కానీ సీతమ్మ పాదాల ముద్రలలో మండుటెండల్లోనూ నిరంతరం రావడం గమనించవచ్చు... లేపాక్షికి వెళ్ళిన వారు తప్పక చూడండి...)
యుద్ధంలో లక్ష్మణుడు మూర్చిల్లినపుడు.. మూర్చనుండి తేరుకోవడానికై తెచ్చిన సంజీవని పర్వతం
sanjeevani parvatam
ఇంకా అక్కడే ఉంది.. దానిని కూడా చూడండి.. ఇక్కడ ఇంకా ఎన్నో వేల మూలికలు, ఔషధాలు లభిస్తున్నయట..

ఇక రావణుడి సోదరుడయిన కుబేరుడినుండి తీసుకోబడిన పుష్పక విమానం గురించి....
pushpakavimanam
దీనిలోనే రావణ సంహారానంతరం.. విభీషణుడి పట్టాభిషేకానంతరం రాముడు , సీతా పరివార సమేతంగా అయోధ్యకు వెళ్ళారట.. రావణుడికి ఇవి కాక ఇంకా విమానాశ్రయాలు ఉన్నాయట్.. ప్రస్తుతం శ్రీలంకలో వాడుకలో ఉన్న ప్రదేశాల్ పేర్లు , వాటి అర్ధం , ప్రదేశాలి ఉన్న స్థలం చూస్తే అవి విమానాలు ల్యాండ్ కావటానికి అనుకూలంగా తీర్చిదిద్దబడ్డాయని తెలుస్తుంది...
రాముడు నిర్మించిన వారధి..
రామ సేతు ఇప్పటికీ చెక్కు చెదరలేదు... దాని నిర్మాణానికై ఉపయోగించిన నీటిపై తేలియాడే ఇటుకలను


మీరు గమనించవచ్చు.. రోజుల్లోనే ఎంత సాంకేతికత ఉందో గమనించారా...
టపా తయారు చేసేటపుడు నేను పొందిన ఆధ్యాత్మిక అనుభూతి... శ్రీరామ దివ్యసుధా ధారను మాటల్లో చెప్పలేను.. చూస్తున్న మీకు కూడా శ్రీరామ కరుణా కటాక్షాలు సిద్ధించాలని మనస్పూర్తిగా కోరుకుంటూ...
మీ శ్రీరాగ

రామాయణం నిరూపణలు 

క్రింది పోస్ట్ లు మీకు మరింత information - interesting గా అనిపించవచ్చు... ఆ పోస్ట్ చూడడానికి ను క్లిక్ చేయండి..
CLICK HERE 👇👇👇👇

>>అమెరికా లోని ఓరెగాన్ అనే సరస్సులో 13 కి.మీ.ల శ్రీ చక్రం ప్రత్యక్షమైనదట... అది ఎలియన్స్ గీచారా.. మానవ నిర్మితమా ఏమిటా రహస్యం... 


>>>ఆంజనేయ స్వామి వారు తీసుకువచ్చిన సంజీవని పర్వతం ఇప్పుడు ఇలా ఉందట... ఇక్కడ ఉందట... 



>>>శివాలయంలో ఇలా ఒక ప్రదక్షిణ చేస్తే 10000 ప్రదక్షిణాలతో సమానమట... ఈ సారి శివాలయంలో ఇలా ప్రదక్షిణ చేసి చూడండి


>>>కోణార్క సూర్య దేవాలయంలో 750 సంవత్సరాల క్రితం నిర్మించబడిన ఈ సౌర గడియారం ఇంకా పనిచేస్తూనే ఉంది .. అది ఇలా పనిచేస్తుందట... 



  1. thank u very much and very useful information sir

    ReplyDelete
  2. Thank you Sir, I am feeling lucky to know this Proofs of Ramayana

    ReplyDelete
  3. its very fine we also enjoy the god ramas story

    ReplyDelete
  4. నెనర్లు చక్కగా అంతః శుద్ధితో వివరించిన వల్లిగారు.
    రామానుగ్రహ ప్రాప్తిరస్తు.
    మా నల్లనయ్య అనుగ్రహ ప్రాప్తిరస్తు.

    ReplyDelete
  5. మీ ఉత్సాహం‌ అబినందనీయం. కాని మీరు చూపిన ఏదీ సశాస్త్రీయమైన ఆధారం కాదు. అసలు రామాయణంలోని రావణలంక, ఈ నాటి శ్రీలంక అయ్యేందుకు అవకాశమే లేదు. మీకు లభిస్తే ములుకుట్ల వారు రచించిన ఉద్గ్రంథం "రామాయణసారోధ్ధారము" చదవండి. వారు ఈ‌విషయంలో సుదీర్ఘంగా చర్చించారు. ఇక సీతమ్మవారి పాదాలు దేశంనిండా అనేకచోట్ల ఎక్కడివారు అక్కడ ఇవే అంటూ‌ చూపిస్తారు. సీతమ్మ కాలుపెడితే రాళ్ళమీదా గుంటలు పడటం ఏమీ, చీరలు ఆరేస్తే రాళ్ళమీద ఆనవాళ్ళు కనరావటం‌ ఏమీ? ఇదంతా వట్టి తమాషా మాటలు. అసలు రామాయణకాలం శాస్త్రప్రకారం లక్షలసంవత్సరాల వెనుకకాలం. ఇప్పటికీ ఆ ఆధారాలు చెరిగిపోకుండా ఉంటాయా? శాస్త్రీయాధారాలు నమ్మకాలనుండి సేకరించకండి.

    ReplyDelete
    Replies
    1. meru cheppindi correct naku oka chinna doubt mari a varadhi evaru nirmincharu, yenduku nirmincharo cheppandi.

      Delete
    2. This comment has been removed by a blog administrator.

      Delete
    3. బ్లాగ్ ఓనర్ శ్రీ రాగ గారు, మీ బ్లాగులో కామెంట్ మోడరేషన్ ఉంటే బాగుంటేదేమో?

      Delete
    4. క్షమించండి శ్యామలీయం గారు.. మీ కామెంట్ కు వెంటనే ప్రతిస్పందించలేక పోయాను... ఒకరిద్దరు ఏమైనా పరుష పదాలు ఉపయోగిస్తే నన్ను క్షమించండి.. మీరు అడిగిన శాస్త్రీయమైన ఆధారాలు చెప్పేంత పెద్దవాడిని కాక పోవచ్చు... నేను గ్రహించిన /సేకరించిన/ నా రామేశ్వర యాత్ర విషయాలను మాత్రమే ఇక్కడ ఉంచాను...

      Delete
    5. విన్న కోట నరసింహారావు గారు... నేను బ్లాగింగుకు క్రొత్త.. అందుకే వెంటనే ప్రతిస్పందించలేక పోయాను... ఇకపై తప్పులు దొర్లవు

      Delete
    6. avananna kaadanna adharalu choopinchagalagali. ikkada manam matladukuntundi faith gurunchi kadu. facts gurunchi. first of all idi lakshala samvatsarala kritam kaadu. arounf 7000 years krindata. deeniki em answer cheptaru. in this video, rama's birth date is calculated based on modern scintific methods.
      https://www.youtube.com/watch?v=jCmRi3EHgEI

      Delete
  6. This is our history belongs to "Ramayanam".

    ReplyDelete
  7. Jai Shreeram... Intakante goppa mata inkokati lokam lo ledu...

    ReplyDelete
  8. Its great job . Syamaleeyam gari maataki meeru emantaru

    ReplyDelete
    Replies
    1. అడిగిన శాస్త్రీయమైన ఆధారాలు చెప్పేంత పెద్దవాడిని కాక పోవచ్చు... నేను గ్రహించిన /సేకరించిన/ నా రామేశ్వర యాత్ర విషయాలను మాత్రమే ఇక్కడ ఉంచాను...

      Delete
  9. ఆంగ్లంలో weasel words అని ఒక పదం ఉంది. నాకు ఈ పోస్టులో weasel words, కొంత text, కొన్ని బొమ్మలూతప్ప ఇంకేమీ కనబడ్డంలేదు. టిపికల్లీ ఫేస్బుక్ స్టైల్.

    పరిశోధించిన 'మన శాస్త్రజ్ఞు'లెవరు? వారి పేర్లేంటి? వివరాలేంటి? వారి పరిశోధనల ముక్తాయింపేమిటి? రామాయణకాలం ఏదని వారి పరిశోధనసారం? ఇక్కడ పోస్టులో ఉన్న ఆధారాలకాలానికి, వారుచెప్పిన కాలానికి పొంతన కుదిరిందాలేదా(అసలు కర్బన్ డేటింగ్ చేశారా?)? సీత, ఆంజనేయుడు నడిచినచోటల్లా ఇలా గుంటలు పడిపోతూ ఉంటుందా? అప్పుడు అదేరాతిమీద తక్కిన అడుగుంటలు ఏమయ్యాయి? సంజీవని పర్వతాన్ని ఆంజనేయుడు హిమాలయాలనుంచి తీసుకొచ్చినట్లుగా చెబుతారు. మరి పోస్టులోని బొమ్మలో ఉన్న పర్వతపు రాతినిర్మాణం దాన్ని ధృవీకరించేలా ఉందా? పైన శ్యామలీయంగారు లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానమేమిటి?

    ఇవేమీ ఆలోచించకుండా, ప్రశ్నించకుండా ఎవరో ఏదో రాస్తే దాన్ని మీరు ఇక్కడుంచడమేమిటీ, మిగిలినవారు మిగిలినవారు కనీస ప్రశ్నలుకూడా వేసుకోకుండా ఆహో!, ఓహో! అనడమేమిటి! కొన్నిసార్లు విషయాని వీగించేది నమ్మనివారి తప్పుడుప్రచారంకాదు నమ్మేవారి అత్యుత్సాహం.

    ReplyDelete
    Replies
    1. క్షమించండి .. మీ కామెంట్ కు వెంటనే ప్రతిస్పందించలేక పోయాను... ఒకరిద్దరు ఏమైనా పరుష పదాలు ఉపయోగిస్తే నన్ను క్షమించండి.. మీరు అడిగిన శాస్త్రీయమైన ఆధారాలు చెప్పేంత పెద్దవాడిని కాక పోవచ్చు... నేను గ్రహించిన /సేకరించిన/ నా రామేశ్వర యాత్ర విషయాలను మాత్రమే ఇక్కడ ఉంచాను... నేను కేవలం భగవంతుడిని ఆరాధించేవాడిని మాత్రమే... శాస్త్రజ్ఞుడను కాదు!!!

      Delete
  10. jai sri raaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaammmmmmmmmmmmmmmmmmmmmmm

    ReplyDelete
  11. elanti adbuthamaina vishayalau next generation telusuuntudi face book lo pedite congts sir.

    ReplyDelete
  12. Mhu... ఇలాంటివాళ్ళు కలియుగం లో untarani aa DEVUDI ki mundey telusu kabatte kaliyugam aarambham lo ne manavula kantiki kanabada kunda velli poyadu... Oka vela kanipisthe nuvve devudivi anataniki aadharalu choopincha mantarani... But... Aaa karuna murthy thanani nammina vallani eppudu thana karuna katakshalatho kaapaduthune untadu... Idi santhyam... Evaro nammarani abaddalu nijalu kaavu... namma ledani nijalu nijalu kaakunda povu... Idi charithra migilchina sakshyalu... Evaro edo book lo raaasaru antunnaru aa raasina vaaru denini praamanikamu gaa teesukuni aa pusthakaanni raasaaru... Meeku avakasam untee aa book ni naaku mail చెయ్యగలరని ఆశిస్తున్నాను... Alaage koddi sepu avanni pakkana unchudamu... Manam rasthu untamu kadaa క్రీస్తు పూర్వం , క్రీస్తు శకం అని ... మరి ఆ క్రీస్తు యొక్క జీవితాన్ని ఎంత మంది తమ స్వలాభం కోసం వాడుకున్నారు... మరి క్రీస్తు దేవుడు అని ఎంత మంది ఒప్పుకుంటారు... మరియు షిరిడి బాబా ఆయన మన ముందు తరం వారి కళ్ళ ముందు నడయాడిన దైవం గా ఎన్నో మహిమలు చూపించారు ఇంకా ఇప్పటికి కూడా సమాధి నుండే సమాధానం చెబుతున్నారు... ఇది ఎంత మంది నిజం అని నమ్ముతారు... రామాయణం గురించి తెలియక పోతే సంపూర్ణ రామాయణం పుస్తకము కొని చదవండి... అంతే కానీ రామాయణం లేదు , లంక లేదు అని మీకు తెలియని తనం గురించి ఎదురుగ ఉన్న నిజాలకు అంటగట్టకండి ... ఇందులో ఎవరిని బాద పెట్టాలనే ఉద్దేశ్యం నాకు లేదు... ఎదో ఒక పుస్తకాన్ని పట్టుకుని రామాయణమే లేదు అనటమే బాగోలేదు... జై శ్రీరామ్...
    @వెంకట్@

    ReplyDelete
  13. nammatam nammaka povatam vaari vaari ishtam. oka vishayam cheppinappudu raka rakaluga spandistaru. negative ga spandinchinavarini tittatam samskaram kaadu. naa varuku nenu nammutunnanu

    ReplyDelete
  14. Good job Bhaiah.due 2 u v able 2 c our history in Srilanka.

    ReplyDelete
  15. annaya chala bagundi..ma amma ithe chala intrstng ga chusindi....thanq u

    ReplyDelete
  16. ramudu nijam, ramayanam nijam. adi telusukokapovadam mana morrkhatavam. telusukovadaniki chese prayatname samskrutika punarujjeevam.

    ReplyDelete
    Replies
    1. ధన్యవాదములు srinivass prasad garu

      Delete
  17. ఇక్కడ కొందరు వాదిస్తున్నారు ఆధారాలు శాస్త్రీయంగా లేవని ఆసలు ముందు అలా వాడిన్చ్జేవాళ్ళు అందరు ఎ మతానికి చెందనివారా అలా అయితే అడగడంలో ఏమి తప్పు లేదు కాని ఒక మతాన్ని నమ్ముతూ ఇంకో మతం లో ని అంశాలను తప్పులు వెతకడం తప్పు మీకు నమ్మకమున్న దేవుడి పై శాస్త్రీయమైన ఆధారాలు చూపగలరా ఎవరైనా అలా ఒక్క దేవుడినైన నిరూపించాగాలారా అది కేవలం నమ్మకం మాత్రమె ఆదారపడి ఉంటుంది ఆ నమ్మకం లేని చోట ఎవరు ఎన్ని చెప్పిన అన్ని అబద్దాలు గానే కనబడతాయి ఎవరు ఎన్ని చెప్పిన హిందూ సంస్కృతి అథిఒ గొప్పది దేవుడు ఉన్నాడు అని నమ్మేవదికే కాదు లేదు అని వదిన్చేవాల్లకు కూడా ఈ సంస్కృతి సమాదానం చెప్తుంది అది శాస్త్రీయ ఆడారాలతో సహా మీకు వివరణ ఇస్తుంది ఈ సంస్కృతి అది ఎలా అంటారా అయితే చుడండి దేవుడు ఉన్నాడు అని నమ్మేవాలకు కిందవిదంగా చెప్తారు కొన్ని పద్దతులు
    1. తుమ్మితే వెళ్లొద్దు అంటారు ఇది నమ్మకం నిజమే తుమ్మితే వెళ్ళకూడదు ఎందుకు తుమ్మినప్పుడు తుమ్మినవల్ల నోటిలోనుంచి వచ్చే బాక్టీరియా వలన ఆ గాలి మనం పీలిస్తే ఆ బాక్టీరియా మనలోకి ప్రవేశించి మనం జబ్బు పడతాం ఇది శాస్త్రీయం

    2.గుమ్మానికి పసుపు రాయమంటారు శుభం జరుగుతుంది అని ఇది నమ్మకం ఇక శాస్త్రీయం పసుపు రాయడం వలన పురుగు పుట్రా లాంటివి ఒంటిలోకి ప్రవేశించి ఎవరిని కుట్టకుండా ఉంటాయి అని ఎందుకంటే ఇప్పటిల అప్పుడు మంచాలు లేవు అందరు నెలా మీద పడుకునే వాళ్ళు కాబట్టి కాదని చెప్పగలరా

    3.కాళ్ళు ఊపితే అరిష్టం అంటారు ఇది నమ్మకం నిజమే కాళ్ళు ఊపే వాళ్ళకు కొన్ని రోజుల తరువాత కాళ్ళు పీకుడు పట్టుకుంటుంది దాని వాళ్ళ వాళ్ళ సంపాదన నవసరంగా కోరి తెచ్చుకున్న రోగానికి వైద్యానికి కర్చు చేస్తే అరిష్టం కాకా మరేముంటుంది ఇది శాస్త్రీయం ఇది కాదు అని ఎవరైనా డాక్టర్ చెప్తారేమో కనుక్కోండి
    ఇలా ఒకటి రెండు కాదు కొన్ని వేల సంక్యలో హిందూ సంస్కృతి మనిషి ఎలా జీవిస్తే సరైన ఆరోగ్యం తో జీవిస్తారో ముందే చెప్పారు దేవుడుని నమ్మేవాడికి నమ్మకం తో ను నమ్మలేని కొందరికి సాస్త్రియంగాను ఏర్పాటు చేసింది ఈ సంస్కృతి
    ఇకనైనా ఇవేవి నిజం కాదు అంటున్న కొంతమంది ఆలోచించండి ఇక్కడ చెప్పిన ప్రతి కథ , పొడుపు కథ ,సామెత , ఇలా చెయ్యాలి అలా చెయ్యకూడదు అని పెట్టిన ప్రతి పద్ధతి వెనుక ఏదో ఒక సైంటిఫిక్ రీజన్ ఉంటుంది దాన్ని అన్నింటికీ వివరణ ఇచ్చేయడానికి లేదా తప్పు పట్టేయడానికి మన సామర్ద్యం సముద్రంలో నీటి చుక్కలో అణువంత దాన్నే మనం సర్వ సంపన్న జ్ఞానం గా విర్రవీగుతున్నాం అది మానితే మన దేశం ప్రపంచ పటంలో ఎవరెస్ట్ శిఖరం కన్నా ఎంతో ఎత్తులో ఉంటుంది .

    ReplyDelete
  18. kallu tharinchayi.....ollu pulakarinchindi.....janma charithardam aindi.....JAI SREE RAM...JAI HANUMAN

    ReplyDelete

Whatsapp Button works on Mobile Device only