భృగు మహర్షి శాప కారణంగా బ్రహ్మ దేవునికి ఎక్కడా ఆలయాలు ఉండవు..
కానీ కాశీ లో ఒక ఆలయం ఇక్కడ గుంటూరు జిల్లాలోని చేబ్రోలులో ఒక ఆలయం ఉంటాయి...
Chaturmukha Brahma Lingeswara swamy temple, Chebrol |
ఈ చతుర్ముఖ బ్రహ్మలింగేశ్వరస్వామి ఆలయం చుట్టూ కోనేరుతో మధ్యలో ఆలయం తో చూడముచ్చటగా ప్రశాంతంగా ఉంటుంది...
శివలింగంలో నాలుగు దిశలా నాలుగుముఖాలతో బ్రహ్మ ఇక్కడ కొలువైయ్యాడు...
ఈ ఆలయం వేయి సంవత్సరాలచరిత్ర కలిగినదని... ఆ సమయంలో ఈ ప్రదేశాన్ని చాళుక్య చోళులు పరిపాలించేవారు... తూర్పు చాళుక్యులకు చెందిన సత్యశ్రాయుడు తన సేనాధిపతి బయనంబిని దండయాత్రకై పంపించాడు.. ఆయన చాళుక్యచోళులకు సంబంధించిన ధరణికోట(అమరావతి)ని యనమదల కోటలను ఓడించి తన సామ్రాజ్యానికి ముఖ్యపట్టణంగా చేబ్రోలును ఎంపిక చేసుకుని ఇక్కడ పలు ఆలయాలు నిర్మించాడు... చాలావరకు ఆల యాలు చరిత్ర గతిలో కలసినా ఆంధ్రుల శిల్పకళా ప్రాభ వాన్ని చాటి చెప్పే దేవాలయాలింకా కొన్నిక్కడ మిగిలి ఉన్నాయి. సరస్సు మధ్యలో బ్రహ్మదేవుడి కొక ఆలయం -ఆ చతుర్ముఖుని నాలుగు ముఖాల మధ్యలో శివ లింగం అద్భుతంగా ఉన్నాయి. బ్రహ్మేశ్వర లింగంగా ఇది ప్రసిద్ది చెందింది.
Brahma lingeswara Swamy, Chebrolu |
Brahma lingeswara Swamy, Chebrolu |
ఇదేకాక సహస్ర లింగేశ్వర స్వామి, వీరభద్రస్వామి ఆలయాలు కూడా ఉన్నాయి. నాగేశ్వర ఆలయం,
Nageswara Temple Tower , Chebrol |
Nageswara Temple Tower , Chebrol |
Temple , Chebrol |
Nandeeswara before Ancient Nageswara Temple Tower , Chebrol |
Nandeeswara before Ancient Nageswara Temple Tower , Chebrol |
Ancient Nageswara Temple Tower , Chebrol |
ఈ ఆలయం క్రీ.శ. మొదటి శతాబ్దం నుంచీ ఉన్నదనటానికి చారిత్రక ఆధారాలు ఇక్కడ దొరికిన నాణాలు. తొట్ట తొలుత ఈ క్షేత్రం పేరు తాంబ్రావ, తాంబ్రాప. క్రమంగా అది చేబ్రోలు అయింది. లోహ యుగపు మొదలులో ఇక్కడ తామ్ర లోహం చాలా విరివిగా దొరికేదట...ఇక్కడ రాగి, తామ్రం తో కూడిన తయారీ పనివారు ఉండే వారట... అలా తామ్రమును సంస్కృతంలో ‘చెం’ అని అంటారని...(చిన్న చిన్న రాగి, ఇత్తడి లోటాలను/డొక్కులను చెంబులు అంటారు) ఈ చెంబులు తయారీ అయే పేరు కాస్తా చేబ్రోలు అయిందని వినికిడి... మొదట ఇక్కడ కుమార స్వామికి గుడి, పూజ ఉండేవిట. అప్పట్లోనే చౌడేశ్వర, గణపేశ్వర ఆల యాలు నిర్మించారు. తర్వాత భీమేశ్వర ఆలయం. ఈ భీమేశ్వరాలయం క్రీ.శ. రెండవ శతాబ్ది కి చెందినదని... ఈ గుడికి జీర్ణోద్ధారణ ప్రక్రియ నిమిత్తం బాగుచేస్తుండగా రెండువేల ఏళ్ళ సంవత్సరాల క్రితం శివలింగం నంది విగ్రహాలు బయటపడ్డాయి...
ప్రస్తుతం పురావస్తు శాస్త్రజ్ఞులు చాలా జాగ్రత్తగా పనులు చేస్తున్నారు..
Ancient Bheemeswara Temple, Chebrol |
Ancient Bheemeswara Temple, Chebrol |
Ancient Bheemeswara Temple, Chebrol |
ఇక్కడే పన్నెండు అడుగుల నటరాజ విగ్రహం ఉండేదట కానీ ప్రస్తుతం ఆ ఆలయమూ లేదు దాని ఆనవాళ్ళు కూడా లేవు అక్కడ. కానీ ఆలయముందు భాగంలో ఉండవలసిన ఒక పెద్ద నంది విగ్రహం మాత్రం ఉంది...
Nandi at Nageswara Temple, Chebrol |
Nandi at Nageswara Temple, Chebrol |
ఇది నా మొదటి యూట్యూబ్ చానెల్ ద్వారా వెలువడిన వీడియో...
నాకు ఇంకా అభివృద్ధి చేసుకోవడానికి తగిన సూచనలు తెలుపండి...
క్రింది పోస్ట్ లు మీకు మరింత information - interesting గా అనిపించవచ్చు... ఆ పోస్ట్ చూడడానికి ను క్లిక్ చేయండి..
CLICK HERE 👇👇👇👇
Post a Comment