Tuesday 18 February 2014

తిరుమల లో స్వామి వారి రూపాలు

తిరుమల సాక్షాత్తూ శ్రీ వేంకటేశ్వరస్వామి నివాసముండే స్థలం... దీనికి నిదర్శనo.. వేర్వేరు కొండలు వేర్వేరు ఆకారాలు సంతరించుకోవడమే.. మనము శేషాచలం కొండను (శేషాద్రి) చూస్తే స్వామి నామాలు, కిరీటం, పూలమాల మనకు స్పష్టంగా కనిపిస్తాయి...
 
Venkateshwara swamy shape hill in tirumala
లక్ష్మీసమేత వరహ స్వామి రూపంలో ఉన్న కొండలూ కనిపిస్తాయి...

కొండలోని ఈ రూపంలో స్వామి వారి కిరీటం, ముక్కు, పెదవులు, చుబుకం తల, వక్ష భాగం వరకు మనకు ప్రత్యక్షంగా చూసిన అనుభూతిని పొందగలం...
ఈ వీడియోలో మీరు పైన కనిపిస్తున్న స్వామి వారి రూపానికి అభిషేకం.. పూలమాలల అలంకరించడాన్ని చూడవచ్చు.. వాస్తవంగా ఇవి చాలా దట్టమైన అడవుల మధ్యలో ఉండడం వలన.. దేవస్థానం వారి అనుమతి లేనిదే అక్కడికి వెళ్లడం సాధ్యం కాదు... సంవత్సరంలో కేవలమ్ కొన్ని రోజులు మాత్రమే అక్కడికి వెళ్ళడం సాధ్యమవుతుంది... 👇👇


ఆంజనేయ స్వామి (అంజనాద్రి) రూపంలో ఉన్న కొండ కనిపిస్తుంది..
శ్రీవారి ఏనుగు ఆకారంలోని కొండ కనిపిస్తుంది...
సాక్షాత్ గరుడవిగ్రహం(గరుడాద్రి) మనకు కనపడుతుంది..
garuda shaped structure in tirumala hills
  
శ్రీవారి ఆర్చి శిలా తోరణం కనపడుతుంది..
 
tirumala shilatoranam images



తిరుపతిలో ఉన్న గోవిందరాజస్వామి వారి గుడిలో ఉన్న విగ్రహం కూడా అసలుది కాదట... దశావతారం సినిమాలో చూపించిన విధంగా క్రిమికంఠుడు స్వామి వారి విగ్రహాన్ని సముద్రంలో విసిరి వేసిన తర్వాత ఆ విగ్రహాన్ని వైష్ణవులు తిరుపతి దాకా చేర్చి... రామానుజుల వారికి అప్పచెప్తారు.. కానీ విగ్రహంలో ఉన్న పగుళ్ళవలన విగ్రహం అర్చనకు పనికి రాదని తిరుపతిలోనే మంచినీళ్ళ కుంట అనే స్థలంలో ఉంచుతారు.. ఇప్పటికీ మనం ఆ విగ్రహాన్ని చూడవచ్చు.. అక్కడి లోకల్ రిక్షావారికి ఇది తెలుసు.. ఈ సారి తిరుపతి వెళ్ళినపుడు దర్శించండి... ఇప్పటి దాకా చూడని వారు.. ఈ వీడియోలో చూడండి..(వీడియో 4.13sec దగ్గర డైరెక్ట్ గా మీరు విగ్రహాన్ని చూడవచ్చు)(అచ్చు ఇలాంటి విగ్రహాన్నే మరొక దానిని తయారు చేసి గోవిందరాజ స్వామి వారి గుడిలో ప్రతిష్టాపించారు... ప్రస్తుతం ఉన్న ఆలయంలోని విగ్రహం అదే.. )





ఇలా అన్ని కొండలూ వాటి రూపాలు, సాక్షాత్ శ్రీవారి రూపం కొండలో గోచరించడం అద్భుతంకాదా!!
అందుకే స్వామి వారిని దర్శించుకున్నంత భాగ్యం క్రింది వాటికి కల్పించారు...
1. స్వామిని సాక్షాత్ దర్శించుకోలేని వారు విమాన వేంకటేశ్వరస్వామిని దర్శించుకుంటే చాలు...

2. విమాన వేంకటేశ్వరస్వామిని దర్శించుకోలేని వారు... గోపురాన్ని దర్శించుకుంటే చాలు



3. గోపురాన్ని దర్శించుకోలేని వారికి గాలిగోపురాన్ని చూస్తే చాలు ...
4. అక్కడకు కూడా వెళ్ళలేని వారు... కొండను చూస్తే చాలు...
5. కొండకు వెళ్ళలేని వారు అక్కడనుండి వచ్చిన తిలములను సమర్పించిన శిరమును(గుండు) తాకినా చాలు...
మనకు స్వామిని దర్శించిన పుణ్యం వస్తుందట...
మీకోసంఅన్నీ ఒక దగ్గరికి చేర్చాము చూడండి!!
స్వామి వారి కరుణాకటాక్షప్రాప్తిరస్తుః —

Whatsapp Button works on Mobile Device only