Saturday, 15 October 2022

Padarasa - shivalingam - importance - information - benefits in telugu - పాదరస శివలింగ పూజామహిమ

పాదరస శివలింగం - padarasa shivalingam
ఇష్టదైవమైన మహాశివుని వేర్వేరు లోహాలతో లింగరూపంలో ఇప్పటికీ కొలుస్తాము..పాదరసాన్ని రసరాజు అంటారు.. ఇప్పటికీ కూడా ఆయుర్వేదంలో విస్తృతంగా దీనిని వాడతారు... పాదరసం స్వయంసిద్ధ ధాతువు. పూర్ణత్వానికి ప్రతీక. ఎన్నో వేల సంవత్సరాల నుండి దీనిపై పరిశిధన జరిగింది. . కేవలం ఔషధంగా మాత్రమే కాక, పాదరసాన్ని మర్థనానికి, భస్మరూపంగా ప్రాణదాయకమైన అనేక రసాలుగా వాడతారు, తంత్రశాస్త్రంలో దీని ప్రాముఖ్యత విశేషంగా చెప్పబడింది.
అసలు పాదరసమును శుద్ది చేయడం ఎంతో కష్టమైన పని... అసలు పాదరసాన్ని ఒకదగ్గర నిలబెట్టడమే కష్టమైన పని.. అయితే.. పాదరసాన్ని ఒక ప్రత్యేక ఆకులతో దళములతో సిద్ధులు ఒక స్థితిలో శుద్ది చేసి.. పాదరస లింగాన్ని తయారుచేస్తారు..
16 రకాల పద్దతులలో పాదరసమును శుద్ది చేయవచ్చని dharnidhara samhita లో ఉందట... ఇన్ని రకాల పద్దతులతో శుద్ది చేసిన తర్వాత ఎన్నో toxins కు కొలువైన పాదరసం కూడా... ఎటువంటి టాక్సిన్స్ లేకుండా తనపై అభిషేకం చేసిన ద్రవాలను హాని కారం కాకుండా మనకు మకరందంలాగా చేసి ఇవ్వడం చూస్తే.. మన మహర్షుల టెక్నాలజీకు మెచ్చుకోకుండా ఉండలేము...
దాదాపు 7000 సంవత్సరములనుండి ఇంకా చెప్పాలంటే సరస్వతి నది నాగరికతకు ముందే... ఈ లింగ ప్రస్థావన మనకు కనపడుతుంది... ఈ పాదరస లింగ ప్రస్థావన లింగ పురాణము నుండి మొదలుకుని ఎన్నో గ్రంథాలలో,. శాస్త్రములలో, తంత్రములలో... పురాణములలో మనకు కనపడుతుంది...
వాస్తుదోష నివారణకు, తాంత్రికదోషనివారణకు, పితృ దోష నివారణలకు, రోగ విముక్తి, వివాహం ఆలస్యమైనా పాదరస లింగాన్ని పూజిస్తే చక్కటి ఫలితం పొందవచ్చని చెప్పబడింది... 
తీవ్రమైన వ్యాధులతో బాధపడేవారికి ఔషధసేవనం, చికిత్సతో పాటు పాదరస శివలింగానికి అభిషేకం చేసిన తీర్థం ప్రతిరోజూ ఒక చెంచాడు తాగిస్తే శీఘ్రంగా కోలుకుంటారు.


ఈ బ్లాగ్ లో మరెన్నో విలువైన పుస్తకాలు ఉన్నాయి... మన పురాతన విజ్ఞానము పుస్తక భాండాగారము 👈👈ఈ లింక్ లో ఉన్నాయి... చూడండి...

మరింత information కోసం మా మెనూ చూడండి



మాసైట్ లో ఇంకా ఎన్నో 👉అమూల్యమైన పుస్తకాలు 👈ఉన్నాయి.. మీరు చూసి ఇష్టమైన వాటిని డౌన్ లోడ్ చేసుకోవచ్చు.. 


Post a Comment

Whatsapp Button works on Mobile Device only