Sunday, 23 October 2022

దీపావళి రోజులలో ఈ స్థానాలలో దీపాలను వెలిగిస్తే మంచిది - Diwali Greetings Quotes wishes images information in Telugu

దీపావళి రోజున ఏ ఏ ప్రదేశాలలో దీపం ఉంచాలి???

Diwali Celebration ideas in Telugu

Diwali Diya's where to keep and how to keep:

దీపావళి అంటేనే దీపాల పండుగ... అయితే కొన్ని ప్రత్యేక స్థానాలలో మనము దీపముల వరుస ను ఉంచటం వలన మనము దీపావళి రోజున ఆ లక్ష్మీదేవి అమ్మవారి అనుగ్రహమును పొందవచ్చు... అందుకే దీపావళి రోజులలో ఈ ఎనిమిది స్థానాలలో దీపాలను వెలిగిస్తే మంచిది...

లక్ష్మిదేవి సకల సంపదలకు, వైభవానికి మూలం. అందుకే లక్ష్మిదేవి నివసించే ఇంట్లో సంపద, సంతోషాలకు లోటు ఉండదని ప్రజలు విశ్వసిస్తారు. దీపావళి రోజునే లక్ష్మీదేవి అమ్మవారు భూమిని దర్శించడానికి వస్తుందని నమ్ముతారు. అటువంటి పరిస్థితిలో ప్రతి ఒక్కరూ లక్ష్మిదేవి ఆశీర్వాదం పొందాలని కోరుకుంటారు. అంతేకాదు ఆమె రాక కోసం ఆరాధిస్తారు.

ఈ సందర్భంగా అమ్మవారికి స్వాగతం పలికేందుకు ఉదయం నుంచే పండుగ కార్యక్రమాలు ప్రారంభించేస్తారు. ప్రజలు తమ ఇంటిని పూమాలలు, తోరణాలు, దీపాలతో అలంకరిస్తారు. అంతే కాకుండా ఇళ్లలో దీపాలు వెలిగిస్తారు. ఈ విధంగా అమావాస్య రాత్రి అయినా సరే వెలుగులతో ప్రకాశిస్తుంది. దీపావళి పండుగ వాస్తవానికి చీకటిపై కాంతి విజయానికి సూచన. లక్ష్మిదేవి ఇంటిలో స్థిరంగా ఉండాలంటే పూజ తర్వాత కొన్ని ప్రత్యేక ప్రదేశాలలో దీపాలను వెలిగించాలి. ఎక్కడెక్కడో తెలుసుకుందాం.
Best Diwali information in telugu - Diwali Significance in Telugu
1. దీపావళి రోజు రాత్రి ఇంటి ప్రధాన ద్వారం వద్ద ఖచ్చితంగా దీపం వెలిగించాలి. లక్ష్మిదేవి ఇంట్లోకి ప్రవేశించే ప్రదేశం ఇది. ఈ ప్రదేశాన్ని పువ్వులు మొదలైన వాటితో చక్కగా అలంకరించాలి.

2. దీపావళి రోజు రాత్రి స్టోర్ హౌస్‌లో ఖచ్చితంగా దీపం వెలిగించాలి. మీ ధాన్యాలు మొదలైనవి స్టోర్ హౌస్‌లో ఉంచుతారు.
కనుక లక్ష్మీదేవి సంతోషిస్తుందని దీని వల్ల ఇంట్లో ఎప్పుడూ ఆహార కొరత ఉండదని చెబుతారు.

3. ప్రతి వ్యక్తి తన ఇంట్లో ఎప్పుడూ ఐశ్వర్యానికి లోటు రాకూడదని కోరుకుంటాడు. అందుకోసం దీపావళి రోజు రాత్రి మీ ఇంట్లోని డబ్బును ఉంచే స్థలంలో ఖచ్చితంగా దీపం వెలిగించాలి.

4. వాహనం కూడా ఆస్తిగా పరిగణిస్తారు. కాబట్టి దాని సమీపంలో సురక్షితమైన స్థలంలో దీపం వెలిగించాలి. ఇది ప్రమాదాలు మొదలైన వాటి నుంచి కుటుంబ సభ్యులను కాపాడుతుంది.

5. నీరు లేకుండా జీవితం సాధ్యం కాదు. అందుచేత కుళాయి, బావి లేదా మరేదైనా నీటి వనరు ఉన్నచోట దీపావళి రోజు రాత్రి పూజ చేసిన తర్వాత దీపం పెట్టాలి.

6. ఇంటిలో నిత్యం పూజ చేసే పూజగదిలో దీపం పెడితే మంచిది. దీంతో లక్ష్మిదేవితో పాటు సకల దేవతామూర్తుల ఆశీస్సులు లభిస్తాయి.

7. రావి చెట్టును విష్ణుస్వరూపం గా భావిస్తారు... ఆయనను ఆరాధించడం వల్ల లక్ష్మీ దేవి చాలా సంతోషిస్తుంది...మరియు రావి చెట్టులో 33 వర్గాల దేవతలు ఉంటారు. కాబట్టి ఈ చెట్టు దగ్గర దీపం పెట్టాలి.

8. ఇంటిలో నిత్యం పూజ చేసే తులసి కోట దగ్గర దీపం పెట్టాలి. తులసిని లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు.

For more Diwali wishes greetings quotes messages in Telugu free download click here



Post a Comment

Whatsapp Button works on Mobile Device only