Tuesday, 10 August 2021

important shlokas for daily life in telugu pdf free download - ప్రతి నిత్యం పఠించవలసిన ముఖ్యమైన శ్లోకములు

ప్రతి నిత్యం పఠించవలసిన ముఖ్యమైన శ్లోకములు

ఉదయం నిద్ర లేవగానే పఠించవలసిన శ్లోకం

కరదర్శన శ్లోకం

ఉదయం కరదర్శనం

కరాగ్రే వసతే లక్ష్మీః కరమధ్యే సరస్వతీ !
కరమూలేతు గోవిందః ప్రభాతే కరదర్శనం !!
(పాఠభేదః: కరమూలే స్థితా గౌరీ ప్రభాతే కరదర్శనం)
——————————————————————————————————– 

నిద్ర లేచిన తర్వాత కాళ్ళు భూమి పై పెట్టే ముందు భూదేవిని ప్రార్థిచాలి... ఎందుకంటే మనం భూమాతను కాళ్ళతో త్రొక్కుతూ మన జీవనం సాగిస్తూ ఉంటాము.. దానికి కృతజ్ఞతగా.. మరియు తప్పు కు ప్రాయ శ్చిత్తంగా ఈ శ్లోకం పఠించాలి...

భూప్రార్థనా శ్లోకం

ఉదయం భూప్రార్ధన

సముద్రమేఖలే దేవి పర్వత స్తన మండలే !

విష్ణుపత్ని నమస్తుభ్యం పాదస్పర్శం క్షమస్వమే !!

——————————————————————————————————–
తదుపరి తూర్పుగా తిరిగి నమస్కరిస్తూ

1.అహల్యా, ద్రౌపదీ, సీతా, తారా, మండోదరీ తథా !
పంచకన్యా స్మరేన్నిత్యం, మహాపాతక నాశనమ్ !!

2.పుణ్య శ్లోకో, నలోరాజా, పుణ్య శ్లోకో, యుధిష్ఠిరః !
పుణ్య శ్లోక శ్చ చ వై దేహః, పుణ్య శ్లోకో, జనార్దనః !!

3.కర్కోటకస్య నాగస్య దమయంత్యాః నలస్య చ !
ఋతు పర్ణస్య రాజర్షేః కీర్తినం కలి నాశనమ్ !!

4.అశ్వత్థామా బలిర్వ్యాసః హనుమాంశ్చ విభీషణః !
కృపః పరశురామశ్చ సప్తైతే చిరంజీవినః !!

5.బ్రహ్మా మురారిః త్రిపురాంతకశ్చ భానుః శశీ భూమిసుతో, బుధశ్చ !
గురుశ్చ శుక్ర శ్శని రాహు కేతవః కుర్వంతు సర్వే మమ సుప్రభాతమ్ !!

——————————————————————————————————–

సూర్యోదయ శ్లోకం

బ్రహ్మ స్వరూప ముదయే మధ్యాహ్నేతు మహేశ్వరమ్ !
సాహం ధ్యాయేత్సదా విష్ణుం త్రిమూర్తిం చ దివాకరమ్!!

——————————————————————————————————–
సూర్యాస్తమయ శ్లోకం

శుభం కరోతి కళ్యాణం ఆరోగ్యం ధన సంపద !
శత్రు బుద్ధి వినాశాయ దీప జ్యోతి ర్నమోస్తుతే!!

——————————————————————————————————–

ద్వితీయ (విదియ) చంద్రుని దర్శించునపుడు

క్షీరసాగర సంపన్న లక్ష్మీప్రియ సహోదర!

హిరణ్యమకుటాభాస్వద్బాలచంద్ర నమోస్తు తే!!

———————————————————————————————————

స్నానం చేసే ముందు పఠించవలసిన శ్లోకం

1.అతి క్రూర మహాకాయ కల్పాంత దహనోపమ !
భైరవాయ నమస్తుభ్యం అనుజ్ఞాం దాతు మర్హసి !!

2.గంగే చ యమునే కృష్ణే గోదావరి ! సరస్వతి !
నర్మదే సింధు కావేర్యౌ జలేస్మిన్ సన్నిధిం కురు !!

3.గంగా గంగేతి యో బ్రూయాత్ యోజనానాం శతైరపి !
ముచ్యతే సర్వపాపేభ్యః విష్ణు లోకం స గచ్ఛతి !!

4.ముచ్యతే సర్వపాపాభ్యో విష్ణులోకం స గచ్ఛతి !
అంబ త్వద్దర్శనాన్ముక్తిః న జానే స్నానజం ఫలమ్ !!
స్వర్గారోహణ సోపాను మహాపుణ్య తరంగిణీం !
వందే కాశీం గుహాం గంగాం భవానీం మణికర్ణికామ్ !!
గంగే మాం పునీహి !!

——————————————————————————————————–

భస్మధారణ శ్లోకం

శ్రీకరం చ పవిత్రం చ శోక నివారణమ్ !
లోకే వశీకరం పుంసాం భస్మ త్రైలోక్య పావనమ్ !!

——————————————————————————————————–

కుంకుమ ధరించునపుడు

కుంకుమం శోభనం దివ్యం సర్వదా మంగళప్రదమ్ !
ధారణేనాస్య శుభదం శాంతి రస్తు సదా మమ !!

——————————————————————————————————–

జపం చేసేటప్పుడు విఘ్నాలు రాకుండా ఉండటానికి

మాలే మాలే మహామాలే సర్వతత్త్వ స్వరూపిణి!

చతుర్వర్గస్త్వయి న్యస్తస్తస్మాన్మే సిద్ధిదా భవ!!

త్వం మాలే సర్వ దేవానాం ప్రీతిదా శుభదా భవ!

శివం కురుష్వ మే భద్రే యశో వీర్యం చ సర్వదా!!

——————————————————————————————————-

వంట చేసే సమయంలో
అన్నం బ్రహ్మ రసో విష్ణుః భోక్తా దేవో మహేశ్వరః !
ఇతి స్మరన్ ప్రభుం జానః దృష్టి దోషైః నలిప్యతే !!

——————————————————————————————————–

భోజనానికి ముందు పఠించవలసిన శ్లోకం

1.బ్రహ్మార్పణం బ్రహ్మహవిః బ్రహ్మగ్నౌ బ్రహ్మాణాహుదం !
బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధినః !!
2.అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే !
జ్ఞాన వైరాగ్య సిధ్ధ్యర్ధం భిక్షాం దేహి కృపాకరి !!
3.త్వదీయం వస్తు గోవింద తుభ్యమేవ సమర్పయే !
గృహాణ సుముఖో భూత్వా ప్రసీద పరమేశ్వర !!

——————————————————————————————————–

భోజనం తరువాత పఠించవలసిన శ్లోకం 

అగస్త్యం కుంభకర్ణంచ శమీంచ బడబానలం !
ఆహార పరిణామార్ధం స్మరామి చ వృకోదరం !!
లేదా
వాతాపి రాక్షో భక్షా స త్వం వింధ్య పర్వత గర్వహ !
సముద్ర తీర్ధ పనాసు జీర్ణం కురు మమసనమ్ !!

——————————————————————————————————–

భోజనానంతరం నీటిని విస్తరి చుట్టూ తిప్పి “అమృతాపి ధానమసి” అని కింది శ్లోకం చదువుతూ కుడిచేతి వైపు వదలవలెను.
రౌరవే అపుణ్య నిలయే పద్మ అర్బుధ నివాసినామ్ !
అర్ధీనామ్ ఉదకమ్ దాతమ్ అక్షయ్యముపతిష్టతు !!
——————————————————————————————————–
నిద్ర పోబోయే ముందు పఠించవలసిన శ్లోకం

దుస్స్వప్న పరిహారం (నిద్రించే ముందు)
రామం స్కందం హనూమంతం వైనతేయం వృకోదరం !
శయనేయః స్మరేన్నిత్యం దుస్స్వప్నం తస్య నశ్యతి !!
లేదా శివో, మహేశ్వరశ్చైవ, రుద్రో, విష్ణు, పితామహ,
సంసారవైద్య, సర్వేశ, పరమాత్మ సదాశివ !!

——————————————————————————————————–

నిద్ర లేచిన తరువాత
కాశ్యాం దక్షిణ దిగ్భాగే కుక్కుటో నామ వై ద్విజః !
తస్య స్మరణ మాత్రేణ దుస్స్వప్న శ్శుభధో భవేత్ !!
——————————————————————————————————–
ఇతర ముఖ్యమైన పోస్ట్ లు / స్తోత్రములు: 




మా YouTube Channel ను SUBSCRIBE చేయండి.. మమ్ము కొంచెం Encourage చేసినట్లు అవుతుంది.. Please subscribe our Channel
👉👉👉To Subscribe us please click here👈👈👈


Post a Comment

Whatsapp Button works on Mobile Device only