Wednesday 19 May 2021

దక్షిణామూర్తి స్తోత్రం - Dakshina Murthy Stotram in Telugu pdf free download video

Sri Dakshina Murthy Shlokam in Telugu:
దక్షిణామూర్తి స్తోత్రం - Dakshina Murthy Stotram in Telugu pdf free download video
ఈ దక్షిణా మూర్తి శ్లోకం చాలా మహిమాన్వితమైనది. విద్య ఎంతో బాగా వస్తుంది. ఎన్నో సమస్యల్ని దూరం చేస్తుంది. కేవలం విద్య మాత్రమే కాదు .. విద్యార్థులకు విద్యని.. సాధకులకు జ్ఞానాన్ని.. అటుపిమ్మట సిద్ధ స్థితిని కూడా ఇవ్వగలిగే మహిమాన్విత " స్తోత్రం "... ఏ స్తోత్రము లు చదవాలో తెలియక సమస్యలు ని ఎదుర్కొనే శక్తి లేనప్పుడు ఒక్క దక్షిణామూర్తి స్తోత్రం సంపూర్ణంగా సకల సమస్యలు ని పరిష్కారం చూపుతుంది. .. ఈ మాట నేను అనటం లేదు. ఒక సందర్భంలో శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు చెప్పేది. ఆయన ముఖతః ఈ స్తోత్రాన్ని ఒక ప్రవచనంలొ చెప్పారు... అందరిచే నేర్పించారు... ఈ స్తోత్రాన్ని ఆయన ద్వారా అందరికీ తెలియాలని యథాతథంగా వారి గొంతు తోనే ఈ స్తోత్రం చేసాము.. మీరు కూడా నేర్చుకోండి దక్షిణామూర్తి స్తోత్రం చాగంటి గురువు గారి ప్రవచనంలో గురువు గారి నోటి నుండి వచ్చినది.. యథాతధంగా..

Note:వీడియో పోస్ట్ చివరలో ఉంచాను.. చూడండి.. చదువుకోవడానికి వచనం ముందు ఉంచుతాను... pdf డౌన్ లోడ్ చేసుకునేందుకు వీడియో పైన ఉంచుతాను.. గమనించగలరు   
 

దక్షిణామూర్తి స్తోత్రం - Sri Dakshina Murthy Stotram in Telugu

మౌనవ్యాఖ్యా ప్రకటిత పరబ్రహ్మతత్త్వం యువానం|
వర్షిష్ఠాన్తే వసదృషిగణైరావృతం బ్రహ్మనిష్ఠైః |
ఆచార్యేన్ద్రం కరకలిత చిన్ముద్రమానందరూపం|
స్వాత్మారామం ముదితవదనం దక్షిణామూర్తిమీడే ||

వటవిటపిసమీపే భూమిభాగే నిషణ్ణం
సకలమునిజనానాం జ్ఞానదాతారమారాత్ |
త్రిభువనగురుమీశం దక్షిణామూర్తిదేవం|
జననమరణదుఃఖచ్ఛేదదక్షం నమామి ||

చిత్రం వటతరోర్మూలే వృద్ధాః శిష్యా గురుర్యువా |
గురోస్తు మౌనం వ్యాఖ్యానం శిష్యాస్తుచ్ఛిన్నసంశయాః ||

నిధయే సర్వవిద్యానాం భిషజే భవరోగిణామ్ |
గురవే సర్వలోకానాం దక్షిణామూర్తయే నమః ||

ఓం నమః ప్రణవార్థాయ శుద్ధజ్ఞానైకమూర్తయే |
నిర్మలాయ ప్రశాంతాయ దక్షిణామూర్తయే నమః || ||

శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం
నమామి భగవత్పాద శంకరం లోకశంకరం

విశ్వందర్పణ దృశ్యమాన నగరీ తుల్యం నిజాంతర్గతం
పశ్యన్నాత్మని మాయయా బహిరివోద్భూతం యథానిద్రయా |
యస్సాక్షాత్ కురుతే ప్రభోధసమయే స్వాత్మానమే వాద్వయం
తస్మై శ్రీగురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే || 1 ||

బీజస్యాంతరి వాంకురో జగదితం ప్రాఙ్నర్వికల్పం పునః
మాయాకల్పిత దేశకాలకలనా వైచిత్ర్యచిత్రీకృతమ్ |
మాయావీవ విజృంభయత్యపి మహాయోగీవ యః స్వేచ్ఛయా
తస్మై శ్రీగురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే || 2 ||

యస్యైవ స్ఫురణం సదాత్మకమసత్కల్పార్థకం భాసతే
సాక్షాత్తత్వమసీతి వేదవచసా యో బోధయత్యాశ్రితాన్ |
యస్సాక్షాత్కరణాద్భవేన్న పురనావృత్తిర్భవాంభోనిధౌ
తస్మై శ్రీగురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే || 3 ||

నానాచ్ఛిద్ర ఘటోదర స్థిత మహాదీప ప్రభాభాస్వరం
జ్ఞానం యస్య తు చక్షురాదికరణ ద్వారా బహిః స్పందతే |
జానామీతి తమేవ భాంతమనుభాత్యేతత్సమస్తం జగత్
తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే || 4 ||

దేహం ప్రాణమపీంద్రియాణ్యపి చలాం బుద్ధిం చ శూన్యం విదుః
స్త్రీ బాలాంధ జడోపమాస్త్వహమితి భ్రాంతాభృశం వాదినః |
మాయాశక్తి విలాసకల్పిత మహావ్యామోహ సంహారిణే
తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే || 5 ||

రాహుగ్రస్త దివాకరేందు సదృశో మాయా సమాచ్ఛాదనాత్
సన్మాత్రః కరణోప సంహరణతో యో‌உభూత్సుషుప్తః పుమాన్ |
ప్రాగస్వాప్సమితి ప్రభోదసమయే యః ప్రత్యభిఙ్ఞాయతే
తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే || 6 ||

బాల్యాదిష్వపి జాగ్రదాదిషు తథా సర్వాస్వవస్థాస్వపి
వ్యావృత్తా స్వను వర్తమాన మహమిత్యంతః స్ఫురంతం సదా |
స్వాత్మానం ప్రకటీకరోతి భజతాం యో ముద్రయా భద్రయా
తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే || 7 ||

విశ్వం పశ్యతి కార్యకారణతయా స్వస్వామిసంబంధతః
శిష్యచార్యతయా తథైవ పితృ పుత్రాద్యాత్మనా భేదతః |
స్వప్నే జాగ్రతి వా య ఏష పురుషో మాయా పరిభ్రామితః
తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే || 8 ||

భూరంభాంస్యనలో‌உనిలో‌உంబర మహర్నాథో హిమాంశుః పుమాన్
> ఇత్యాభాతి చరాచరాత్మకమిదం యస్యైవ మూర్త్యష్టకమ్ |
నాన్యత్కించన విద్యతే విమృశతాం యస్మాత్పరస్మాద్విభో
తస్మై గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే || 9 ||

సర్వాత్మత్వమితి స్ఫుటీకృతమిదం యస్మాదముష్మిన్ స్తవే
తేనాస్వ శ్రవణాత్తదర్థ మననాద్ధ్యానాచ్చ సంకీర్తనాత్ |
సర్వాత్మత్వమహావిభూతి సహితం స్యాదీశ్వరత్వం స్వతః
సిద్ధ్యేత్తత్పునరష్టధా పరిణతం చైశ్వర్య మవ్యాహతమ్ || 10 ||

ఇతి శ్రీ ఆదిశంకరాచార్య విరచితం దక్షిణాముర్తి స్తోత్రం సంపూర్ణం

download  చేసుకునే ముందు మా You Tube Channel ని Subscribe చేసుకోండి. మాకు కొంచెం support ఇచ్చినట్టుగా ఉంటుంది. 


👇👇To download Sri Dakshina Murthy Stotram in telugu pdf  click here 👇👇 
దక్షిణామూర్తి స్తోత్రం ఇన్ తెలుగు పిడిఎఫ్ ఫ్రీ డౌన్లోడ్

 
Tags:
Sri Dakshina Murthy Stotram in Telugu pdf free download,
Sri Dakshina Murthy stotram importance and significance,
Dakshina Murthy stotram meaning in telugu,
Dakshina Murthy Stotram learning video,
Dakshina murhty stotram book in telugu,
Dakshina Murthy Stotram Lyrics in Telugu, 


Join to Chant with Sri Chaganti - Sri Dakshina Murthy Stotram ఈ స్తోత్రాన్ని ఆయన ద్వారా అందరికీ తెలియాలని యథాతథంగా వారి గొంతు తోనే ఈ స్తోత్రం చేసాము.. మీరు కూడా నేర్చుకోండి దక్షిణామూర్తి స్తోత్రం చాగంటి గురువు గారి ప్రవచనంలో గురువు గారి నోటి నుండి వచ్చినది.. యథాతధంగా..

 



మా స్తోత్ర సూచిక లోని >>శివ స్తోత్రాలు << కోసం లింక్ చూడండి

మా YouTube Channel ను SUBSCRIBE చేయండి.. మమ్ము కొంచెం Encourage చేసినట్లు అవుతుంది.. Please subscribe our Channel
👉👉👉To Subscribe us please click here👈👈👈


Post a Comment

Whatsapp Button works on Mobile Device only