Monday 15 August 2022

Sundarakanda book pdf free download in telugu - సుందరకాండ

Sundarakanda book free download in telugu - సుందరకాండ
(We have given the downloadable link in the last of the post please see)

|సుందరకాండ Pdf book Description in telugu|
రామాయణంలో సుందరకాండ ఐదవ కాండ. హనుమంతుడు లంకా పురికి పయనమవడానికి... మహేంద్రగిరి మీదకు చేరుకోవడంతో కిష్కింధకాండ ముగుస్తుంది. సరిగ్గా అక్కడితో వాల్మీకి రామాయణం 11999 శ్లోకాలు పూర్తి అయి, సుందరకాండ మొదటి శ్లోకం 12000వ శ్లోకంతో మొదలవుతుంది. సుందరకాండను “పారాయణ కాండ” అని కూడా అంటారు. సుందరకాండలో 68 సర్గలు ఉన్నాయి. హనుమంతుడు సాగరమును లంఘించుట, సీతాన్వేషణము, లంకాదహనము, సీత జాడను రామునికి తెలియజెప్పుట ఇందులో ముఖ్యాంశాలు..
sundarakanda pdf book  free download in telugu
సుందరకాండ విశిష్టత : |Significance of Sundarakanda in Ramayanam in Telugu|

వాల్మీకి మహర్షి వారు రచించిన శ్రీమద్రామాయణంలోని ప్రతీ శ్లోకము మంత్రంతో సమానమే. అందులో సీతమ్మ వారిని అన్వేషించిన ఘట్టంతో కూడిన సుందరకాండ ఎంతో ప్రసిద్ధమైనది. రామాయణంలోని అన్ని కాండముల కంటే.. ఈ సుందర కాండలో ని ప్రతి శ్లోకం ఎంతో సుందరం... వాల్మీకి మహర్షి హనుమంతుడు సీతాన్వేషణకు చేసిన ప్రతీ కార్యమును మంత్రపూరితమైన శ్లోకాల రూపంలో అద్భుతంగా వర్ణించారు ఈ కాండలో...

సుందరకాండలో ఉన్న కథ :|The Story written in Sunderakand Ramayanam book pdf download|

నూరు యోజనాల దూరం గల సముద్రం అవతల ఉన్న లంకలో సీత ఉన్నదని తెలుసుకున్న వానర బృందం, ఆ సముద్రం దాటి తిరిగి రాగల సమర్థుడు ఒక్క హనుమంతుడే అని గ్రహించారు. హనుమంతుని శక్తి హనుమకు తెలియదు... అప్పుడు హనుమంతుడు అందరి ప్రోత్సాహంతో, శ్రీరామానుగ్రహంతో తన శరీరాన్ని పెంచి సముద్రం దాటడానికి ఎగిరాడు. దారిలో ఆతిథ్యం ఇస్తానన్న మైనాకుడిని సున్నితంగా తిరస్కరించి, సురస అనే నాగమాత ఆశీర్వాదం పొంది, సింహిక అనే రాక్షసిని సంహరించి, లంకా ప్రవేశం చేస్తాడు. అక్కడ లంకిని గర్వం అణచాడు. సూక్ష్మ రూపంలో లంకా నగరం అంతా వెతికాడు. శ్రీరామానుగ్రహంతో అశోక వనంలో సీత కనుగొన్నాడు. దుఃఖంతో ఉన్న సీతకు వినయంతో నమస్కరించి, తన గురించి చెప్పి, శ్రీరాముడు తనకు ఇచ్చిన ముద్రికను ఇచ్చాడు. తరువాత కొందరు రాక్షసులను వదించి, రావణుడిని హెచ్చరించాడు. ధర్మాత్ముడు అయిన విభీషణుడు చెప్పినా వినకుండా, అజ్ఞానంతో రావణుడు హనుమంతుని తోకకు నిప్పు పెట్టాడు. ఆ నిప్పుతో సీత ఉన్న అశోక వనం తప్పా మిగతా లంకా నగరాన్ని తగలబెట్టాడు. తరువాత మరొకసారి సీతను ఓదార్చి, ఆమెకు ధైర్యం చెప్పి, ఆమె ఆశీర్వాదం తీసుకుని, సముద్రాన్ని దాటి మహేంద్రగిరిపై దిగాడు. అక్కడ తన వానర సైన్యాన్ని కలసి, సంతోషంతో ఈ సీతాన్వేషణ ఘట్టాన్ని వివరించాడు. తరువాత అంగదుని ఆజ్ఞతో వారంతా మధువనంలో కాసేపు చిందులాడి, శ్రీరాముని వద్దకు వెళ్ళారు. అప్పుడు హనుమంతుడు శ్రీరామునికి భక్తితో నమస్కరించి, సీత ఇచ్చిన చూడామణిని రామునికి ఇచ్చాడు. సీతాన్వేషణ ఘట్టాన్ని వివరించాడు.

సుందరకాండ పారాయణ విధి : |How to read Sunderakanda Ramayanam in telugu|
(పోస్ట్ చివరలో డౌన్ లోడ్ లింక్ ఉంచాము చూడండి)
ఇంతటి పవిత్రమైన సుందరకాండను పారాయణ చేయాలని సంకల్పించడమే గొప్ప విషయం. మొదట గణపతి ప్రార్థన, గురు ప్రార్థన, కులదేవత మరియు ఇష్టదేవతా ప్రార్థన చేయాలి. ఏదైనా కోరిక కోసం పారాయణ చేసే వారు సంకల్పంతో పాటు చేయాలి. మామూలుగా ఇష్టంతో పారాయణ చేసేవారు సంకల్పం చెప్పినా, చెప్పకున్నా పరవాలేదు. మొదట 100 శ్లోకాలు గల బాలకాండలోని సంక్షేప రామాయణమును పారాయణ చేయాలి. తరువాత...


మొత్తం 68 సర్గలు గల ఈ సుందరకాండను 3 రోజులలో పారాయణ చేయాలి అనుకునేవారు

మొదటి రోజు 1వ సర్గ నుండి 23వ సర్గ వరకు
రెండవ రోజు 24వ సర్గ నుండి 47వ సర్గ వరకు
మూడవరోజు 48వ సర్గ నుండి 68వ సర్గ వరకు పారాయణ చేయాలి.
లేదా 9 రోజులలో పారాయణ చేయాలనుకునే వారు

మొదటి రోజు 1వ సర్గ నుండి 5వ సర్గ వరకు
రెండవ రోజు 6వ సర్గ నుండి 15వ సర్గ వరకు
మూడవ రోజు 16వ సర్గ నుండి 23వ సర్గ వరకు
నాల్గవ రోజు 24వ సర్గ నుండి 31వ సర్గ వరకు
ఐదవ రోజు 32వ సర్గ నుండి 41వ సర్గ వరకు
ఆరవ రోజు 42వ సర్గ నుండి 49వ సర్గ వరకు
ఏడవ రోజు 50వ సర్గ నుండి 58వ సర్గ వరకు
ఎనిమిదవ రోజు 59వ సర్గ నుండి 63వ సర్గ వరకు
తొమ్మిదవ రోజు 64వ సర్గ నుండి 68వ సర్గ వరకు పారాయణ చేయాలి
. ఇలా సుందరకాండ పారాయణ చేసిన తరువాత శ్రీరామ పట్టాభిషేక ఘట్టాన్ని కూడా పారాయణ చేస్తే సంపూర్ణ సుందరకాండ పారాయణ ఫలితం వస్తుంది.



సుందరకాండ పారాయణ ఫలితాలు :|Benefits of Reading Sunderakanda Ramayanam|
ఎలాంటి వ్యాధులైనా తొలగుతాయి
గ్రహ బాధలు తొలగుతాయి
సిరిసంపదలు కలుగుతాయి
ఎలాంటి కష్టాలైనా తొలగుతుంది
అనుకున్న పనులు, శుభకార్యాలు జరుగుతాయి
మోక్షం కోరుకునే వారికి మోక్షం లభిస్తుంది
ఈ పరమ పవిత్రమైన సుందరకాండను పారాయణ చేసి, ఇంకా ఎన్నో ఫలితాలను, అనుభూతులను, ఎందరో మహానుభావులు పొందారు. శ్రద్ధ, భక్తి, నమ్మకంతో పారాయణ చేసేవారికి ధర్మ బద్ధమైన కోరికలు అన్నీ తీరుతాయి.

ఉషశ్రీ గారిచే వ్రాయబడిన సుందరకాండ బహు రమణీయంగా ఉంటుంది.. ఆ ప్రతిని క్రింద ఇస్తున్నాము చూడండి

సుందరకాండ(Usha Sri)  pdf book in Telugu free download

సుందరాకాండ Sundarakanda book free download pdf in telugu

అయితే ఈ సుందరకాండ లోని కొన్ని ముఖ్యమైన శ్లోకాలను వాటి ఫలితాలను క్రింద ఇస్తున్నాము..
పారాయణ నియమాలతో ఉంటుంది.

ఇక్కడ ఇచ్చిన వివరాలు ఒకసారి పరిశీలించండి.|More details about Sunderakanda Ramayanam in Telugu|

1. ఆపదలు తొలగటానికి , సంపదలు కలగటానికి..

శ్లోకం.ఆపదమపహర్తారం దాతారం సర్వసంపదామ్

లోకాభిరామం శ్రీరామం, భూయో భూయో నమామ్యహమ్ ||

21 దినమలు
,

108 సార్లు ,

శక్తి కొలది తమలపాకులు,

అరటిపళ్ళు నివేదన చేయాలి.

2. విద్యాప్రాప్తికి.

ఒకసారి పరిపూర్ణంగా పారాయణ చేయవలెను .

3 రోజులు ద్రాక్ష , అరటిపళ్ళు నివేదన

3. భూతబాధ నివారణకు.

3 వ సర్గ వచనము రోజుకు 108 సార్లు

30 దినములు పారాయణ చేయవలెను .

1 కొబ్బరికాయ , అరటిపళ్ళు నివేదన.

4. సర్వ కార్య సిద్దికి.

64 వ సర్గ నిష్ఠతో 11 సార్లు

40 దినములు పారాయణ చేయవలెను .

శక్తి కొలది అరటిపళ్ళు నివేదన చేయవలెను.

5. శత్రు నాశనముకు.

51 వ సర్గ అతినిష్ఠతో 2 సార్లు

21 దినములు పారాయణ చేయవలెను.

శక్తి కొలది ద్రాక్ష , బెల్లము నివేదన చేయవలెను.

6. వాహనప్రాప్తికి.

8 మరియి 9 వ సర్గలు ఏకాగ్రతతో 3 సార్లు

27 దినములు పారాయణ చేయవలెను.

శక్తి కొలది అరటి ,దానిమ్మ నివేదన చేయవలెను.

7. మనశాంతికి.

11 వ సర్గ నిష్ఠతో 3 సార్లు

21 దినములు పారాయణ చేయవలెను.

అరటిపళ్ళు, ఖర్జూరము నివేదన చేయవలెను.

8. స్వగృహం కోరువారికి.

7వ సర్గ ఏకాగ్రతతో 1 సారి

40 దినములు పారాయణ చేయవలెను.

అరటిపళ్ళు చక్కెరతో నివేదన చేయవలెను.

9. యోగక్షేమాలకు.

13 వ సర్గ నిష్ఠతో 3 సార్లు

27 దినములు పారాయణ చేయవలెను.

శక్తి కొలది అరటి , దానిమ్మ నివేదన చేయవలెను.

10. ఉద్యోగప్రాప్తికి.

63 వ సర్గ నిష్ఠతో 5 సార్లు

21 దినములు పారాయణ చేయవలెను .

శక్తి కొలది అరటి ,దానిమ్మ నివేదన చేయవలెను.

11. రోగ నివారణకు.

34వ సర్గ ఏకాగ్రతతో 5 సార్లు ప్రతిదినము ,

21 దినములు పఠించవలెను.

శక్తి కొలది బెల్లపు ముక్క అరటిపళ్ళు నివేదన చేయవలెను.

12. దుఃఖనివృత్తికి.

67 వ సర్గ నిష్ఠతో ప్రయత్నం మానకుండా 3 సార్లు

21 దినములు పారాయణ చేయవలెను.

శక్తి కొలది అరటిపళ్ళు,ఖర్జూరము నివేదన చేయవలెను.

13. దుస్వప్న నాశనానికి.

27వ సర్గ ఏకాగ్రతతో 1 సారి ప్రతిదినము పఠించవలెను . శక్తి కొలది అరటిపళ్ళు, ఖర్జూరము నివేదన చేయవలెను.

14. దూరముగా ఉన్న ఆప్తులు క్షేమమునకు.

33 నుండి 40 వ సర్గ వరకు 1 సారి ,

21 దినములు నిష్ఠతో పఠించవలెను .

శక్తి కొలది అరటిపళ్ళు, ఖర్జూరము నివేదన చేయవలెను.

15. ధనప్రాప్తికి.

15వ సర్గ ఏకాగ్రతతో 1 సారి

40 దినములు పఠించవలెను.

అరటిపళ్ళు, పటిక బెల్లం , మరియు

రామాయణం లో అయోధ్యకాండలో యాత్రాదానము

32 వ సర్గ 1 సారి ,

40 దినములు పఠించవలెను.

శక్తి కొలది అరటిపళ్ళు, ద్రాక్షనివేదన చేయవలెను . ( అగస్త్య , పరాశర , ఉమా సంహిత ప్రకారం చెప్పబడినది ).

16. దైవాపచారా ప్రాయశ్చిత్తం.

38 వ సర్గ ఏకాగ్రతతో 3 సార్లు

27 దినములు పఠించవలెను.

శక్తి కొలది అరటిపళ్ళు వీలైతే పనస నివేదన చేయవలెను.

17. బ్రహ్మజ్ఞానము కలుగుటకు.

19 వ సర్గ అతినిష్ఠతో రోజుకు ఒకసారి

1 సంవత్సరము పఠించవలెను.

శక్తి కొలది అరటిపళ్ళు నివేదన చేయవలెను.

18. ఏలిననాటి శనీ దోష పరిహారమునకు.

సకల రోగ నివృత్తికి - సర్వ పాప నివృత్తికి

మొత్తం సుందరకాండ నిష్ఠతో 9 దినాలలో 1సారి

68 రోజులు చదువవలెను.

నివేదన రోజూ కొబ్బరికాయ సత్ఫాలితమునిచ్చును
.
19. కన్యా వివాహమునకు.

9 దినములలో ఒకసారి పూర్తిగా

68 దినాలలో పఠించవలెను.

సీతారామ కళ్యాణం నిష్ఠతో 7 సార్లు

ప్రతిరోజు పఠించవలెను.

అప్పాలు , పాలు , పంచదార నివేదన చేయవలెను.

20. విదేశీ యానమునకు.

1 వ సర్గ ఏకాగ్రతతో రోజుకు 5 సార్లు

30 దినములు పఠించవలెను.

శక్తి కొలది అరటిపళ్ళు, ఖర్జూరము నివేదన చేయవలెను.

21. ధననష్ట నివృత్తికి.

55వ సర్గ నిష్ఠతో 3 సార్లు

30 దినములు పఠించవలెను .

శక్తి కొలది అరటిపళ్ళు,పనస నివేదన చేయవలెను.

22. వ్యాజ్యములో విజయమునకు.

42 సర్గ అతి ఏకాగ్రతతో 3 సార్లు ,

21 దినములు పఠించవలెను.

శక్తి కొలది అరటిపళ్ళు, ద్రాక్ష , దానిమ్మ నివేదన చేయవలెను.

23. వ్యాపారాభివృద్ధికి.

15వ సర్గ నిష్ఠతో నియమంతో 5 సార్లు

21 దినములు పఠించవలెను.

శక్తి కొలది అరటిపళ్ళు నివేదన చేయవలెను.


24. పుత్ర సంతానానికి.

ప్రతిదినం 7 వ సర్గ నిష్ఠతో

68 రోజులు పారాయణ చేయవలెను .

శక్తి కొలది అరటిపళ్ళు , కొబ్బరికాయ ,నివేదన చేయవలెను.

శక్తి కొలది తమలపాకులతో అర్చన చేయవలెను . సుందరకాండ 16 రోజులు పారాయణ చేయవచ్చును.

25. ఋణ విముక్తికి.

28 వ సర్గ చాలా నిష్ఠగా రోజుకి 1 సారి

41 రోజులు పఠించవలెను.

శక్తి కొలది అరటిపళ్ళు నివేదన చేయవలెను.

MS రామారావు గారిచే గాత్రం చేయబడిన సుందరాకాండ కు pdf రూపం

సుందరాకాండ book pdf free download (MS RamaRao garu)


మా YouTube Channel ను SUBSCRIBE చేయండి.. మమ్ము కొంచెం Encourage చేసినట్లు అవుతుంది.. Please subscribe our Channel
👉👉👉To Subscribe us please click here👈👈👈

Join with me in our telegram:




ఈ బ్లాగ్ లో మరెన్నో విలువైన పుస్తకాలు ఉన్నాయి... మన పురాతన విజ్ఞానము పుస్తక భాండాగారము 👈👈ఈ లింక్ లో ఉన్నాయి... చూడండి...

మరింత information కోసం మా మెనూ చూడండి



మాసైట్ లో ఇంకా ఎన్నో 👉అమూల్యమైన పుస్తకాలు 👈ఉన్నాయి.. మీరు చూసి ఇష్టమైన వాటిని డౌన్ లోడ్ చేసుకోవచ్చు.. 

Post a Comment

Whatsapp Button works on Mobile Device only