కొల్హాపూర్ మహలక్ష్మి అమ్మవారి ఆలయం, (పూర్తి వీడియోను పోస్ట్ క్రింద youtube ద్వారా ఉంచాము.. పూర్తి వీడియో చూడండి.. అమ్మవారి పాదాలను సూర్య కిరణాలు తాకే దృష్యాలు... హారతి దృష్యాలు.. చివరలో ఉంటాయి... మిస్ కావద్దు..) అమ్మవారి ఆవిర్భావం...
పద్మపురాణం, వేంకటాచల మహాత్మ్యం, వరాహ పురాణం, స్కందపురాణాల్లో అమ్మవారి ఆవిర్భావ వివరాలు వివరించి ఉంది. వాటిలోని సారాంశం... తాను నివాసముండే విష్ణు వక్షస్థలంపై భృగుమహర్షి తన్నినా విష్ణువు అతన్ని క్షమించడాన్ని జీర్ణించుకోలేక శ్రీమహాలక్ష్మి వైకుంఠాన్ని వీడి భూలోకానికి చేరుకుంటుంది. అలా శ్రీమహాలక్ష్మి ముందుగా కొల్హాపురం (మహారాష్ట్రలోని కొల్హాపూర్) చేరుకుంటుంది.
మహాలక్ష్మి
రజోగుణ సంపన్నురాలైన ఆదిపరాశక్తి 'అంబాబాయి'గా కొల్హాపూర్ క్షేత్రంలో కొలువై ఉందని ప్రతీతి. ఇక్కడ సతీదేవి నేత్రాలు పడ్డాయని చెబుతారు. కొల్హాపూర్ వాసులు ఈ అమ్మవారిని భవానీమాతగానూ కరవీరవాసినిగానూ కొలుస్తారు. కొల్హాపురీ మహాలక్ష్మి విగ్రహం ఒక ప్రశస్తమైన మణిశిల. అమ్మవారి తలపై ఆదిశేషుడు తన ఐదుపడగలతో ఛత్రం పడుతున్నట్టుగా ఉంటాడు. నల్లని ముఖంతో దివ్యాభరణాలతో వెలిగిపోయే ఈ దేవిని చూడటానికి రెండు కన్నులు సరిపోవంటారు భక్తులు. మహాప్రళయకాలంలిో కూడా లక్ష్మీదేవి ఈక్షేత్రాన్ని వీడదని పురాణప్రతీతి. అందుకే కొల్లాపూర్‌ను 'అవిముక్త క్షేత్రం'గా వ్యవహరిస్తారు.
*కొల్హాపూర్ శ్రీ మహాలక్ష్మి స్థలపురాణం*
పురాణాలలో పేర్కొన్న ప్రకారం ఈ ఆలయం భారతదేశంలో శక్తి నివాసముండే 108 శక్తి పీఠాలలో ఒకటిగా విరాజిల్లుతోంది..
. మహాలక్ష్మిని ప్రేమగా అంబా బాయి అనికూడా పిలుస్తారు, ప్రతి సంవత్సరం లక్షల మంది భక్తులు ఈ చారిత్రక దేవాలయాన్ని సందర్శించి ఆమె దీవెనలను కోరుకుంటారు. ఈ మహాలక్ష్మి దేవాలయం కారణంగా, కొల్హాపూర్, భారతదేశంలోని ఒక ప్రసిద్ధ ఆధ్యాత్మిక కేంద్రంగా ...
7 వ శతాబ్దం లోని ఈ దేవాలయాన్ని చాళుక్య వంశ రాజైన కరన్దేవ్ తిరిగి చాలాకాలం తరువాత దీని నిర్మాణాన్ని చేపట్టారు. ఈ పవిత్ర స్థల నిర్మాణ శైలి హేమండ్ పతి ప్రేరణతో చేయబడింది.
ఈ ఆలయాన్ని యాదవ వంశీయులు 8 వ శతాబ్దంలో మరింత అందంగా తీర్చిదిద్దారని నమ్మబడింది. ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, సూర్యకిరణాలు ప్రతిరోజూ దేవతా విగ్రహానికి బంగారు సొగసులు అందిస్తూ తాకే విధంగా ఈ ఆలయం నిర్మించబడింది.నవరాత్రి వంటి పండుగల సమయంలో స్థానికులు, భారతదేశం అంతటా ఉన్న భక్తులు అంబాదేవి దర్శనం కోసం కొల్హాపూర్ కి తండోపతండాలుగా వస్తారు.
ఈ సమయంలో ఈ ప్రాంతం ప్రకాశవంతమైన రంగులతో, సంగీతంతో ప్రతిధ్వనిస్తుంది...
ఒక రాతి పీఠం మీద నాలుగు చేతులతోనూ, 40 కిలోగ్రాముల వజ్రాలతో తయారైన కిరీటంతోనూ మహాలక్ష్మీ కొలువై ఉంటుంది.
3 అడుగుల ఎత్తుగల నల్లరాతిపై మహాలక్ష్మీ ప్రతిమను చెక్కడం జరిగింది. ఆలయంలోని ఒక గోడపై శ్రీ యంత్రం చెక్కబడి ఉంది. దేవత యొక్క వాహనం రాతితో చేయబడిన సింహం ప్రతిమ వెనుక భాగంలో ఉంటుంది.
కిరీటంపై విష్ణువు తల్పం అయిన శేషనాగు యొక్క చిత్రం ఉంటుంది. ఆమె నాలుగు చేతులలో గుర్తింపు కలిగిన నాలుగు వస్తువులు ఉంటాయి. కుడివైపు క్రింది చేతిలో మాలుంగ (సిట్రస్ జాతి ఫలం), ఎడమవైపు కింది చేతిలో పాత్ర ఉంటుంది. హిందూ పవిత్ర చిత్రాలలో ముఖం ఉత్తరవైపు లేదా తూర్పు వైపు చూసే విధంగా ఉంటుంది. ఈ దేవతా విగ్రహం పశ్చిమవైపు చూసే విధంగా ఉంటుంది. చిన్న తెరిచిఉన్న కిటికీ పశ్చిమవైపు గోడకు ఉంటుంది. సూర్యాస్తమయం అయినపుడు సూర్యుని కిరణాలు ఈ కిటికీ గుండా ప్రతి సంవత్సరం 21 మార్చి మరియు 21 సెప్టెంబరు లలో మూడురోజులపాటు విగ్రహంపై పడతాయి. ఆలయ పరిసరాల్లో నవగ్రహాల, సూర్యుని, మహిసాసుర మర్థని, విఠల్-రఖ్‌మయి, శివుడు, విష్ణువు, తుల్జా భవాని మరియు యితర విగ్రహాలు ఉంటాయి. వీటిలోకొన్ని విగ్రహాలు 11వ శతాబ్దానికి ముందువి కొన్ని కొత్తగా ప్రతిష్ఠించినవి.
ఆలయం వద్ద మణికర్ణికా కుండం అనే కొలను ఉంది, ఆ కొలను ఒడ్దున విశ్వేశ్వర మహాదేవ్ విగ్రహం ఉంది...
అమ్మవారికి రోజూ అయిదు సార్లు అర్చన జరుగుతుంది, ఉదయం అయిదు గంటలకు శ్రీ మహా లక్ష్మీ దేవికి సుప్రభాత సేవ చేస్తారు, కాకడ హారతి ఇస్తారు.
ఉదయం ఎనిమిది గంటలకు షోడశోపచార పూజ నిర్వహిస్తారు, మధ్యాహ్నం, సాయంత్రాలలో పూజ, శేజ్ హారతి జరుపుతారు.
అమ్మవారికి ప్రతి శుక్రవారం ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. చైత్రమాసంలో వచ్చే పౌర్ణమితో పాటుగా నవరాత్రులపుడు అమ్మవారికి వేడుకలు జరుపుతారు.
ప్రతి శుక్రవారం సాయంత్రాలలో, పౌర్ణమి నాడు, అమ్మవారిని ఆలయం వెలుపల ఊరేగిస్తారు...
కొల్హాపురమునకు హైదరాబాద్ నుండి ప్రతి రోజూ రెండు విమానాలు ఉంటాయి... విమానం అని భయపడకండి... స్లీపర్ బస్ కంటే కొద్దిగా ఎక్కువ ఖర్చు అంతె.. నేను వెళ్ళినప్పుడు స్లీపర్ బస్ కు 1,100 లు అయితే flight charge 1500 లు అయింది.. విమానం ఎక్కినట్టు కూడా ఉంటుంది.. లేకపోతే హైదరాబాద్ నుండి సాయంత్రం బస్లు ఉంటాయి.. కొంచెం ఖరీదు ఎక్కువ మరియు దాదాపు 12 గంటల సమయం.. దాని కంటే flight better.. రైలు ప్రయాణం మొత్తం హైదరాబాద్ నుండి కొల్హాపురం దాదాపు 18 గంటలు జర్నీ.. అందుకే ఫ్లైట్ బెటర్ అని చెప్పాము.. కొల్హాపురం శివాజీ మహరాజ్ గారి రాజధాని ఈ ఊరు కూడా దాదాపు మైసూర్ / విజయవాడ లను తలపిస్తుంది... ఇక్కడ కోట.. జూపార్క్ లాంటి కొన్ని visiting places ఉంటాయి.. లోకల్ ట్రిప్స్ గైడ్ ఉంటుంది.. చూడండి...
మా YouTube Channel ను SUBSCRIBE చేయండి.. మమ్ము కొంచెం Encourage చేసినట్లు అవుతుంది.. Please subscribe our Channel
Join with me in our telegram:
ఈ బ్లాగ్ లో మరెన్నో విలువైన పుస్తకాలు ఉన్నాయి... మన పురాతన విజ్ఞానము పుస్తక భాండాగారము 👈👈ఈ లింక్ లో ఉన్నాయి... చూడండి...
మరింత information కోసం మా మెనూ చూడండి
Post a Comment