వైకుంఠ పెరుమాళ్ ఆలయం, కాంచీపురం:Vaikunta Perumal Temple information in telugu full video download tour guide in telugu
కాంచీపురంలో చాలా మంది మిస్ అయ్యే ఆలయములలో ఇది కూడా ఒకటి...
అయితే మొత్తం కాంచీపురంలో కెల్లా ఈ ఆలయం రెండవ ప్రాచీన ఆలయం...
ఈ ఆలయాన్ని పల్లవరాజు అయిన రెండవ నంది వర్మన్ 7 వ శతాబ్థంలో నిర్మించారు... ఈ ఆలయం ద్రవిడ నిర్మాణ శైలిలో నిర్మించారు... 108 దివాదేశ దేవాలయములలో ఈ ఆలయం
ఒకటి.. ఈ ఆలయాన్ని మూడు అంతస్థులలో నిర్మించారు...మొదటి అంతస్థులో మూలవిరాట్ కూర్చుని పల్లవ రాజుకు పాలనాపరమయిన సూచనలు ఇస్తున్నట్లుగా
రెండవ అంతస్థులో విష్ణు భగవానుని మూలవిరాట్ పవళిస్తున్న స్థితిలో పల్లవ రాజు సేవిస్తున్నట్లు ఉంటుంది.. ఈ ఆలయము కేవలం ఏకాదశి రోజున ఉదయం 8:00 నుండి 12:00 వరకు మాత్రమే తెరువ బడుతుంది..
మూడవ అంతస్థులో నిలబడి ఉన్నట్లుగా స్వామి వారి రూపం ఉంటుంది...ఈ రూపంలో స్వామి వారు యుద్ద విద్యలను పల్లవరాజుకు నేర్పుతున్నట్లుగా ఉంటుందట.. ఈ ఆలయము సామాన్య జనాల దర్శనమునకు వీలు ఉండదు..
బయటి నుండి చూస్తే దీర్ఘ చతురస్రాకారంలో ఉండే ఆలయం .. ప్రధాన ఆలయ గర్భ గుడి చుట్టూ కదంకంలా ఉన్న స్థలం చాలా అద్భుతంగా ఉంటుంది.. ప్రధాన ఆలయం basement నుండి మెట్లు రెండవ అంతస్థులో ఉన్న వేరొక గర్భగుడికి దారితీసే విధంగా ఉంటుంది.. బయట ఎక్కడ నుండి కూడా ఈ మెట్లు మనకు కనపడవు... రెండవ గర్భ గుడిలో శేష శయన రూపంలో స్వామివారు ఉంటారు... కేవలం ఏకాదశి రోజు ఉదయం వేళలో మాత్రమే దర్శనం ఉంటుంది... అక్కడి నుండి మూడవ గర్భగుడికి దారితీసే మెట్లు ఉంటాయి.. కానీ ఇప్పుడు అవి శిథిల స్థితిలో ఉన్నాయి... ఎవరికీ ప్రవేశం లేదు... ఈ మూడు ఆలయములలో నూ రాజు నంది వర్మ మూలవిరాట్టుకు పూజ చేస్తున్నట్లుగానే శిల్పకళ ఉంటుంది... ఆలయం చుట్టూ ఉన్న విశాల ప్రాంగణంలో కూడా ఇలాగే శిల్ప కళ ఉంటుంది.. ఇది చాలా clumsy గా క్రిక్కిరిసినట్లు ఉంటుంది... ఎడమ భాగం అంతా విష్ణు అవతారాల కథలను.. కుడి వైపు నందివర్మ జీవిత చరిత్రను చెక్కినిట్లు ఉంటుంది... చాలా శిల్పాలు శిథిల స్థితిలో ఉన్నాయి...
ఈ ఆలయం కాంచీపురం బస్టాండు... కామాక్షి అమ్మవారి ఆలయములకు నడిచి వెళ్ళేంత దగ్గరలో ఉంటుంది..
ఆలయము వివరించిన దానికన్నా చూడడం చాలా బావుంటుంది.. క్రింద యూట్యూబ్ వీడియో
ఉంచాము చూడండి...👇👇👇
👉👉కాంచీపురం ఆలయములు👈👈👈full tour guide గురించిన వివరములు క్రింది లింక్ లో ఉన్నాయి చూడండి
Post a Comment