Sunday 24 July 2022

Kanchipuram Temples complete tour guide including lodging pdf in telugu free download

Kanchipuram Temples complete tour guide including lodging free download video
Kanchipuram Route plan - HOw to reach Kanchipuram

 youtube వీడియో 👇👇👇


చాలావరకు కాంచీపురాన్ని చూడడానికి వచ్చే వారు.. తిరుపతి యాత్రలో భాగంగా వస్తారు.. తిరుపతి ప్రయాణంతో పాటుగా కాంచీపురాన్ని కూడా దర్శిస్తారు...
 అలా తిరుపతి ప్రయాణం ముందు కాంచీపురాన్ని చూడాలి అనుకునే వారికి ఇప్పుడు ఇస్తున్న రూటు సరిపోతుంది...

ఎక్కడ నుండి తిరుపతికి వచ్చినా ఉదయం 6 గంటలకు తిరుపతిలో మనం చేరుకునే విధంగానే ఉంటుంది... కానీ అంతకు ముందుగా తిరుపతికి రావాలంటే చాలా కష్టం బస్సు మారి తిరుపతి నుండి కాంచీపురం చేరుకునేసరికి ఉదయం 10 గంటలు అవుతుంది..
 
చెన్నై నుండి కాంచీపురానికి రావాలన్న దాదాపుగా ఇదే పరిస్థితి...
 
కాంచీపురం లోని ప్రధానమైన గుడిలన్నీ 12 గంటలకి మూసివేసి తిరిగి నాలుగు గంటలకు తెరుస్తారు..

అందువలన మనకు రోజంతా వృధాగా గడిచిపోతుంది.. అందుకే రెగ్యులర్ గా విజయవాడ తిరుపతి మరియు విజయవాడ/హైదరాబాద్ to చెన్నై రైళ్ళ వివరాలు ఇవ్వడం లేదు.. ..  గమనించగలరు.. 
 
మరి ఎలా వెళ్ళవచ్చు... Best Route guide to reach Kanchipuram Early:

  
అయితే అందరూ గమనించని ఇంకొక రూట్ ఉంది...


డైరెక్ట్ గా తిరుపతి రాకుండా రేణిగుంట మీదుగా అరక్కోణం అనే స్థలం వరకు వెళ్లే రైళ్లు ఉన్నాయి.. ఒకవేళ మనం అలా చేయగలిగితే అరక్కోణం నుండి కాంచీపురానికి కేవలం ఒక గంట లో మనం చేరుకోవచ్చు... అలా వచ్చే రైళ్లలో ఉదయం 4:45 నిమిషాలకి అరకోణంలో రీచ్ అయ్యే రైలు కనుక మనకు దొరికితే.. ఉదయం 6-7 మధ్యలో కాంచీపురం చేరుకోవచ్చు.. కాలకృత్యాలు తీర్చుకుని ఉదయం 8 లోపల దర్శనానికి మనం మన యొక్క రోజుని ప్రారంభించవచ్చు...

Train No. 12688 - Madurai Express - ఇది విజయవాడలో 8:49pm కు మొదలై... కాంచీపురం చేరే సరికి ఉదయం6:22 అవుతుంది.. 
ఇది స్పెషల్ ట్రైన్... కేవలం మనకు మంగళవారం, శనివారాలలో విజయవాడ నుండి వస్తుంది.. (చండీగడ్ లో సోమ, శుక్ర వారాలలో మొదలవుతుంది కాబట్టి... బుకింగ్ చేసుకునే వారు తగు విధంగా చూసుకోండి)

Train No. 12510 - GHY BNC Express - *ఇది విజయవాడలో 8:00pm కు మొదలై... అరక్కోణం  చేరే సరికి ఉదయం 4:00 అవుతుంది.. 
ఇది స్పెషల్ ట్రైన్*... కేవలం మనకు సోమవారం,మంగళవారం, బుధ వారాలలో విజయవాడ నుండి వస్తుంది.. (గౌహతి లో ఆది, సోమ, మంగళ వారాలలో మొదలవుతుంది కాబట్టి... బుకింగ్ చేసుకునే వారు తగు విధంగా చూసుకోండి)

Train No. 15228 - MFP YPR EXP Express - ఇది విజయవాడలో 7:40pm కు మొదలై... అరక్కోణం  చేరే సరికి ఉదయం 4:00 అవుతుంది.. 
ఇది స్పెషల్ ట్రైన్*... కేవలం మనకు మంగళవారం విజయవాడ నుండి వస్తుంది.. (ముజప్ఫర్ పూర్ లో  సోమ వారం బయలు దేరుతుంది కాబట్టి... బుకింగ్ చేసుకునే వారు తగు విధంగా చూసుకోండి)

*Note: స్పెషల్ ట్రైన్స్ ఏవైనా అరక్కోణంలో రెండు నుండి మూడు నిమిషాల కంటే ఎక్కువ సేపు ఆగవు మరియు.. విజయవాడ లో మొదలైతే మధ్యలో ఎక్కడా ఆగవు... అందుకే తగు జాగ్రత్తలు తీసుకోవాలి... ట్రైన్ ఆగకముందే లగేజీ అంతా ఒక దగ్గర చేర్చుకునే విధంగా చూసుకోండి.. మళ్ళీ నన్ను తిట్టుకోకండి.. ఈ ఒక్క శ్రమ ఓర్చుకొనగలిగితే ఒక రోజులో కాంచీపుర ముఖ్య ఆలయాలు చూసెయవచ్చు)

Hotel Accomodation: HOtels near Kanchipuram Kamakshi amman Temple:
కాంచీపురంలో కామాక్షి అమ్మవారి ఆలయమునకు అత్యంత సమీపంలో చాలా సత్రాలు హోటళ్లు ఉన్నాయి ఆ లిస్టు ఇక్కడ మీకు చూపిస్తున్నాను... కొన్ని సంవత్సరాల తర్వాత ఒకవేళ ఈ Post ని చూస్తున్నట్లయితే... HOtels near Kanchipuram Kamakshi amman Temple అని మనం google  సెర్చ్ చేస్తే చాలా లిస్టు బయటకు వస్తుంది... దాదాపుగా అన్ని నంబర్లు పనిచేస్తున్నాయి ఎందుకంటే అది వారి బిజినెస్ కాబట్టి... ఉన్న హోటల్స్ లో బెటర్ హోటల్స్ కామాక్షి మఠం... యాత్రి నివాస్ ఆర్యవైశ్య సమాజం గొల్ల సత్రం మరియు మేము బస చేసిన జి ఎస్ ఆర్ రెసిడెన్సి...ఇవి కాక చాలా హోటల్స్ ఉన్నాయి.. గూగుల్ మ్యాప్స్ లో ఇచ్చే నెంబర్లు దాదాపు పనిచేస్తాయి.. ఒక సారి ట్రై చేయండి
ఈ హోటల్స్ అన్నిటికీ కామాక్షి అమ్మవారి ఆలయానికి కేవలం 300 మీటర్ల దూరం కంటే తక్కువగా ఉండే విధంగా ప్లాన్ చేసుకుంటే మనం రెండు దఫాలలో అనుకున్న ఆలయాలన్నీ దర్శించగలిగి అదే రోజు మనం తిరుమలకు రిటర్న్ జర్నీ కూడా చేయవచ్చు...
ఇక్కడ ప్రస్తుతం ఉన్న హోటళ్ల వివరాలు వాటి ఫోన్ నెంబర్లు కూడా ఇస్తున్నాను అవకాశాన్ని బట్టి మీరు రిజర్వ్ చేసుకోండి...

Yatri Niwas - 9994346966, 044-2723115
ఆర్యవైశ్య సమాజం - +91 44 2722 8347
గొల్ల సత్రం - 8248008198
YATRINIVAS Contact Numbers: 044-2723115, 9994346996
GSR Residency : +91 9500368999 మేము ఇక్కడే బస చేసాము... చాలా బాగా convenient గా అనిపించింది 
MM Hotels: 08098827250
Hotel Ramco Residency: 08681830009
HOtel Simla Residency: 04427223342

కాంచీపురం లో  ఒక ఇల్లులాంటి అపార్ట్ మెంట్ లు కూడా ...  రోజులలెక్కలో అద్దెకు ఇస్తారు... హోటల్ లాగానే అనుకోవచ్చు.. అలాంటి హోటలు
JK Residency : 09952305300 ...

నేను ఇక్కడ ఇచ్చినవన్నీ.. కామాక్షి అమ్మవారి గుడి దగ్గరవే.... ఈ హోటల్స్ చుట్టూ మనం క్రింద Discuss చేసిన ఆలయాలు దాదాపు 9 ఉంటాయి.. అందుకే ఈ హోటల్స్ లిస్ట్ ఇచ్చాను.. వీటన్నిటినుండి ఆలయాలు walkable Distance లో ఉంటాయి.. 

కాంచీపురం లో ఒక ఆలయానికి ఇంకొక ఆలయానికి కేవలం 1-2 కిలోమీటర్లు లోపే ఉంటాయి... శివకంచి నుంచి విష్ణుకంచి కి వెళ్లే దూరం మాత్రమే కొద్దిగా ఎక్కువ...
ఆలయాలను తీరికగా చూడాలి ఆటో డ్రైవర్ టెన్షన్ ఉండకూడదు అనుకుంటే వీలైనంతవరకు డ్రాపింగ్ మాత్రమే అడగండి.. ఒక గుడి నుండి మరొక గుడికి 50 రూపాయల నుండి 75 రూపాయల కంటే ఎక్కువ కాదు...
దాదాపుగా ముఖ్యం అనుకున్న 10 ఆలయాల గురించి ఇక్కడ వన్ బై వన్ ఎలా వెళ్లొచ్చు గూగుల్ మ్యాప్ తో సహా మీకు ఇస్తున్నాను.... మీకు ఉండే అవకాశాన్ని బట్టి ప్లాన్ చేసుకోండి...

వామనమూర్తి ఆలయం... చిత్రగుప్త ఆలయం... పాండవ దూత పెరుమాళ్ ఆలయం... కచ్చాపేశ్వర ఆలయం.. మురుగన్ కొట్టం... చూడటానికి ఎక్కువ సమయం పట్టదు... ఈ ఆలయాలు చిన్నవి రష్ తక్కువ .... మూలవిరాట్ విగ్రహాలు దాదాపుగా 20 అడుగుల దాకా ఉండి అత్యంత శోభాయమానంగా ఉంటాయి... ఇలాంటి ఆలయాలు మనం చూడలేము

వరదరాజ పెరుమాళ్... ఏకాంబర నాథర్ ఆలయం... కామాక్షి అమ్మన్ టెంపుల్... కొంచెం రష్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఎక్కువ సమయం పడతాయి...

వైకుంఠ పెరుమాళ్ ఆలయం కైలాస్ నాథార్ ఆలయం... రాతితో అద్భుతాలను చేసిన ఈ ఆలయాలన్ని చూడాలంటే రెండు కళ్ళు సరిపోవు ఎక్కువ సమయం తీసుకుంటే మంచిది...
వరదరాజస్వామి ఆలయమునకు ముందుగానే ఎడమచేతివైపులో ఒక కోనేరు కనబడుతుంది ఈ కోనేరులోనే అత్రి వరదరాజస్వామివారిని ఉంచుతారు ఈ వరదరాజస్వామి వారే మనకి 40 సంవత్సరములకు ఒకసారి బయటకు తీసేది... ఈ కోనేరు పక్కనే చక్రాలవార్(సుదర్శన చక్రం) సన్నిధి కనపడతాయి ఇవి మిస్ చేసుకోవద్దు...

ఈ పోస్ట్ లో కేవలం రూట్ మ్యాప్ కోసం గైడ్ లైన్స్ ఆలయాల గురించి చిన్న brief మాత్రమే ఇస్తాను.. తర్వాత ఒక్కొక్క ఆలయం గురించి detailed post వేస్తాను... ప్రతి ఒక్క ఆలయ వీడియో information ఇదే పోస్ట్ లో మీకు update చేస్తాను.. గమనించగలరు.. 

1. కామాక్షి అమ్మవారి దేవాలయము:Kamakshi Amman Temple information in Telugu
కాంచీపురం మొత్తం ఎన్ని శివాలయాలు ఉన్నా.. అమ్మవారి దేవాలయము మాత్రం ఇదొక్కటే.. ఈ ఆలయం ఉదయం 5:30 నుండి మధ్యాహ్నం 1: 00 వరకు తిరిగి 4:00 నుండి 8:00 వరకు  ఉంటుంది.. కాబట్టి... రోజు మొదలులో ఈ ఆలయాన్ని దర్శించే విధంగా ప్లాన్ చేసుకోవచ్చు.. కుదరని పక్షంలో 12:00 ఇక్కడ ఉండేవిధంగా చూసుకుంటే... మిగిలిన ఆలయాలు 12:00 లోపు మూసేస్తారు కాబట్టి... అలా ప్లాన్ చేసుకోండి... 
ఈ ఆలయం దగ్గరే బస ఏర్పాటు చేసుకుంటాం కాబట్టి మొదట ఈ ఆలయం దర్శిస్తే సులభంగా ఉంటుంది
 

2. వామనమూర్తి ఆలయం - Ulaganatha perumaL Temple, Kanchipuram information in telugu:
సాధారణంగా శ్రీమహావిష్ణువు అయిన వామన అవతారమూర్తికి ఆలయాలు ఉండవు.. ఇక్కడ మాత్రమే మనము ఇలా 30 అడుగుల విగ్రహంతో అద్భుతంగా ఆలయమూర్తిని చూడగలం... ఈ ఆలయ మూర్తిని దర్శించుకుంటే నరక లోకమునకు వెళ్ళే పరిస్థితిని స్వామివారు తొలగిస్తాడని నమ్మకం.. ఈ ఆలయం కామాక్షి అమ్మవారి ఆలయానికి అతి దగ్గరలో అంటే 350మీ. దూరంలో ఉంటుంది.. నడుచుకుంటూ వెళ్ళవచ్చు...


3.పాండవదూత పెరుమాళ్ ఆలయం-Pandavatootha perumal Temple, Kanchipuram information in telugu
ఈ ఆలయంలో శ్రీ కృష్ణ భగవానుల వారు 30 అడుగుల విగ్రహ రూపంలో దర్శనమిస్తారు... కురు పాండవ యుద్ధానికి ముందు యుద్దాన్ని నివారించడానికి పాండవుల పక్షాన దూతగా శ్రీ కృష్ణ రాయబారం జరుగుతుంది.. ఆ సమయంలో ఉన్న మూర్తి రూపంలో స్వామి వారు ఇక్కడ వెలసారని కథనం.. ఆలయం చిన్నది వెంటనే దర్శనం అయిపోతుంది.. కాబట్టి వామన మూర్తి ఆలయం తర్వాత ఈ ఆలయం దర్శిస్తే సమయం కలిసి వస్తుంది...

 

4. చిత్రగుప్త ఆలయం:Chitragupta Temple, Kanchipuram information in telugu
సాధారణంగా యమలోకంలో యమధర్మరాజు దగ్గర ఉండే చిత్రగుప్తుల వారికి ఆలయం ఉండదు.. కానీ ఈ ఆలయంలో మాత్రమే చిత్రగుప్తులవారికి ఆలయం ఉంటుంది... ఈ ఆలయాన్ని దర్శిస్తే యమ బాధలు ఉండవని నమ్మకం... ఈ ఆలయ దర్శనమ్ కూడా వెంటనే అయిపోతుంది.. ఎక్కువ సమయం పట్టదు



5. కచ్చపేశ్వర ఆలయం:Kachapeshwara Temple, Kanchipuram information in telugu
ఈ ఆలయం చాలా విశాలంగా ఉంటుంది.. కోనేరు బావుంటుంది... ఈ అలయంలో మూలవిరాట్టుని శ్రీ మహావిష్ణువు తాబేలు(కచ్చపము) రూపంలో కొలిచారట... ఆలయ మూల విరాట్... దాదాపు ఏకాంబరేశ్వర ఆలయంలోని మూలవిరాట్టు లాగానే ఉంటారు... ఇక్కడ చక్కగా కొంచెం సమయం తీసుకుని దర్శించుకోండి... ఏకాంబరేశ్వర ఆలయంలో ఎక్కువసేపు నిలబడి చూడలేము... దాదాపుగా ఒకేలా ఉంటుంది కాబట్టి స్వామి వారిని గుర్తుంచుకోవచ్చు...ఈ ఆలయంలో కూడా రద్దీ ఉండదు.. వెంటనే దర్శనమ్ అయిపోతుంది...
6.కుమార కొట్టం -Kumaara koTTam Temple information in telugu
ఈ ఆలయంలో కుమారస్వామి వారు బాలుని రూపంలో స్కంధ పురాణం వ్రాసారని నమ్మకం.. ఈ ఆలయంలో శిల్ప సంపద బావుంటుంది.. ఆలయ దర్శన సమయం via media గా ఉంటుంది...
7. వైకుంఠ పెరుమాళ్ ఆలయం -Vaikuntha perumal temple, Kanchipuram information in telugu
కాంచీపురం లోని అతి పురాతన ఆలయాలలో ఇది ఒకటి... ఈ ఆలయంలో శ్రీ మహావిష్ణువు మూడు అంతస్తులలో మూడు రూపాలలో కనపడతారు... చాలా అద్భుతమైన ఆలయం.. కొంచెం సమయం పడుతుంది... ground floor లో కూర్చున్నట్లుగా... 1st floor లో శయన స్థితిలో 3 వ అంతస్థులో నిలబడి ఉన్నట్లుగా స్వామి వారి రూపం ఉంటుంది.. అయితే రెండవ అంతస్థులో స్వామి వారిని కేవలం ఏకాదశి రొజున మాత్రమే అది కూడా ఉదయం పూట మాత్రమే దర్శించుకోగలం. మూడవ అంతస్తులో ఉన్న స్వామి వారిని ఎవరూ ఎప్పుడూ దర్శించుకోలేరు.. అంటే సామాన్య మానవులకు దర్శనాలు లేవు...
VaikuTha perumal temple open view
Vaikunta perumal temple plan
best view of Vaikunta perumal Temple

8. కైలాసనాథ దేవాలయం-Kailasanathar Temple, Kanchipuram information in telugu
ఈ ఆలయం కాంచీపురంలో కెల్లా అతి పురాతన ఆలయం, ఈ ఆలయం మరియు వైకుంఠ పెరుమాళ్ ఆలయములు ఎక్కువ సేపు చూడదగిన ఆలయములు.. అందుకే కొంచెం తీరిగ్గా చూడాలి... ఇవి చూసిన తర్వాత ఏకాంబరనాథార్ ఆలయం చూస్తే సమయం కలిసి వస్తుంది.. ఈ ఆలయం మరియు వైకుంఠ పెరుమాళ్ ఆలయంలోని ఒక్కొక్క శిల్పం గురించి ఒక్కొక్క పోస్ట్ / వీడియో తీయవచ్చు. అంత information ఉంది ఈ ఆలయాలలో.. వీలైతే guide ను చూడండి...



క్రింద కైలాసనాథార్ దేవాలయం గురించిన వీడియో ఉంచాము.. చూడండి....



9. ఏకాంబరేశ్వరార్ ఆలయం: Ekambareshwarar Temple, Kanchipuram information in telugu
ఇది అతిముఖ్యమైన ఆలయాలలో ఒకటి.... కాంచీపురం శివాలయాలలో కెల్లా అతి విశాలమైనది అమ్మవారు పూజచేసినది ఈ ఆలయమూర్తికే కాబట్టి.. ఇది మిస్ కాకుండా చూడాల్సిన ఆలయం.. ఈ అలయంలో ప్రదక్షిణా మండపము చాలా పెద్దది... దాదాపు అర కి.మీ. నడుస్తామేమో .. ఈ ఆలయం లోపులే... చాలా పెద్ద గుడి... ఎక్కువ సమయం పట్టవచ్చు... ఈ ఆలయంలోనే అతి పురాతనమైన మామిడి చెట్టు ఉంది.. ఏకాంబరనాథార్ ఆలయం 12:30 కు మూసివేస్తారు.. కాబట్టి 12:00 లోపుల అక్కడికి వెళ్తే మంచిది...

3600 సంవత్సరాల చరిత్ర కలిగిన మామిడి చెట్టు orizinal కాండము ఇది ఇలా భద్ర పరిచారు.. ఈ చెట్టునే అమ్మవారు కొలిచారు..
ఈ మామిడి చెట్టుతో అంటుకట్టిన మామిడి చెట్టు.. అంటే అసలైన అమ్మవారు పూజించిన చెట్టు ఉన్న ప్రదేశంలో ఇప్పుడు ఉన్న చెట్టు ఇది...


10.వరదరాజ స్వామి వారి ఆలయం - బంగారు బల్లి వెండి బల్లి:varadarajaswami Temple - Golden lizard - silver lizard
ఇక్కడ చివరగా ఇస్తున్నానని వరదరాజ పెరుమాళ్ ఆలయాన్ని మిస్ కాకండి.. ఈ ఆలయంలోనే వెండి బల్లి బంగారు బల్లులు ఉండేది... దాదాపు ఒక గంట పడుతుంది.. ఆలయాన్ని చూడడానికి... గోపురం దాటగానే ఎడమచేతి వైపు పుష్కరిణి ఉంటుంది.. ఈ పుష్కరిణి లోనే అత్రి వరదరాజ స్వామి వారి విగ్రహం నీళ్ళలో ఉంటుంది... ప్రక్కనే చక్రాళ్వార్ (సుదర్శన చక్రమునకు ఆలయం)వారి సన్నిధి కడు శోభాయమానంగా ఉంటుంది.. మిస్ కాకండి... ఈ ఆలయంలో వరదరాజస్వామి వారి విగ్రహం చాలా పెద్దగా కన్నుల పండువగా ఉంటుంది.. కుదిరితే రెండుసార్లు దర్శించుకోండి.


ప్రధాన ఆలయం బంగారు బల్లి వెండి బల్లి...ఉదయం 8:00 కు తెరుస్తారు... మనము 7:00 గంటలకే వెళ్తే చక్రాళ్వార్ సన్నిధి.. కోనేరు.. బయటి ఆలయ సౌందర్యము చూడవచ్చు...
Just for your recall purpose once again: కాంచీపురంలో అన్ని ప్రధాన ఆలయాల లో 1. కామాక్షి అమ్మవారిది... 2. ఏకాంబరేశ్వర స్వామి వారిది 3. వరదరాజ స్వామివారి ఆలయములు...
 
చూసేందుకు అత్యంత విలువైన శిల్ప సంపదతో ఎక్కువ సేపు సమయం పట్టేవి కైలాసనాథార్ ఆలయం, వైకుంఠ పెరుమాళ్ ఆలయం...

వామనమూర్తి ఆలయం... చిత్రగుప్త ఆలయం... పాండవ దూత పెరుమాళ్ ఆలయం... కచ్చాపేశ్వర ఆలయం.. మురుగన్ కొట్టం... చూడటానికి ఎక్కువ సమయం పట్టదు... ఈ ఆలయాలు చిన్నవి రష్ తక్కువ .... మూలవిరాట్ విగ్రహాలు దాదాపుగా 20 అడుగుల దాకా ఉండి అత్యంత శోభాయమానంగా ఉంటాయి... ఇలాంటి ఆలయాలు మనం చూడలేము
  
అన్ని ఆలయాలు ఒకేసారు చూడలేము... పర్వాలేదు కొన్ని మిస్ కావచ్చు అనుకుంటే... కుమార కొట్టం, చిత్రగుప్తస్వామి ఆలయం, అష్టభుజ పెరుమాళ్, కామకోటి పీఠం, స్వామిజీ ఆశ్రమం... మేము మిస్ అయ్యాము.. మీరు వీలు చూసుకుని దర్శించుకోండి...
 
very important foot note:
సాధారణంగా కాంచీపురంలో మధ్యాహ్నం 12:00 నుండి సాయంత్రం 4:00 వరకు ఆలయాలు మూసివేస్తారు... కానీ ఆటో డ్రైవర్ లను అడిగితే... ఏ ఆలయం త్వరగా తెరుస్తారు.. ఏ ఆలయం లేట్ గా మూస్తారు లాంటి సున్నిత విషయాలు తెలుస్తాయి.. కాబట్టి మనకు ఉదయం 6:00 నుండి సాయంత్రం 9:00 వరకు ప్లాన్ చేసుకోవచ్చు..

ఈ బ్లాగ్ కాంటెంట్ ఎలా ఉంది.. మీకు ఏ విషయం గురించి కావాలో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయగలరు.. 

కాంచీపురమునకు ఎలా వెళ్ళాలో వివరంగా ఉన్న ఈ పోస్ట్ మొత్తం youtube వీడియో రూపంలో క్రింద ఉంచాను.. మీ మిత్రులకు డైరెక్ట్ గా ఆ లింక్ ను షేర్ చేయవచ్చు... 
👇👇👇


మా YouTube Channel ను SUBSCRIBE చేయండి.. మమ్ము కొంచెం Encourage చేసినట్లు అవుతుంది.. Please subscribe our Channel
👉👉👉To Subscribe us please click here👈👈👈

Join with me in our telegram:


ఈ బ్లాగ్ లో మరెన్నో విలువైన పుస్తకాలు ఉన్నాయి... మన పురాతన విజ్ఞానము పుస్తక భాండాగారము 👈👈ఈ లింక్ లో ఉన్నాయి... చూడండి...

మరింత information కోసం మా మెనూ చూడండి



మాసైట్ లో ఇంకా ఎన్నో 👉అమూల్యమైన పుస్తకాలు 👈ఉన్నాయి.. మీరు చూసి ఇష్టమైన వాటిని డౌన్ లోడ్ చేసుకోవచ్చు.. 


Post a Comment

Whatsapp Button works on Mobile Device only