ఈ రోజు మనం దర్శిస్తున్న ఆలయం వేదాద్రి శ్రీ యోగానంద లక్ష్మీనర్సింహాస్వామి వారి ఆలయం...
(ఈ ఆలయ పూర్తి వీడియో పోస్ట్ క్రింద భాగంలో ఇస్తున్నాము... చూడగలరు)
ఎక్కడ ఉంది...
ఈ ఆలయం.. జగ్గయ్యపేటకు సమీపంలో కృష్ణానదీ తీరంలో ఉంది...
ఎలా చేరుకోవాలి...
హైదరాబాద్ నుండి వచ్చే వారు చిల్లకల్లు నుండి వస్తే 14 కి.మీ అవుతుంది...
విజయవాడ వైపు నుండి వచ్చే వారు.. కొణకంచి అడ్డరోడ్ నుండి రావచ్చు... ఇక్కడ నుండి 12 కి.మీ దూరం ఉంటుంది...
మధ్యదారిలోనే గరుడాచలంపై వీరనృసింహ స్వామి వారి ఆలయం ఉంటుంది..
ఏ వాహనం లేని వారు... ఈ ఆలయమునకు జగ్గయ్యపేట నుండి అయితే apsrtc బస్ / చిల్లకల్లు నుండి అయితే ఆటో సర్వీస్ ఉపయోగించుకోవచ్చు...
ఇక్కడ ఉన్నంత ప్రశాంత రూపంలో లక్ష్మీనరసింహ స్వామి వారు ఎక్కడా కనపడరు...
వేదాద్రికి ఆనుకునే కృష్ణానది ప్రవహిస్తూ ఉంటుంది..
ఈ ఆలయ స్థల పురాణం
వేదాద్రి క్షేత్ర మహాత్మ్యాన్ని గురించిన ప్రస్తావన శ్రీనాథుడి 'కాశీ ఖండం' లో కనిపిస్తుంది. ఎర్రా ప్రగడ, నారాయణ తీర్థులు కూడా ఈ క్షేత్రాన్ని దర్శించినట్టు తెలుస్తోంది.
సోమకాసురుడు అనే రాక్షసుడు బ్రహ్మ దేవుడి దగ్గర నుంచి వేదాలను అపహరించి వాటిని సముద్ర గర్భంలో దాచేశాడు. అప్పుడు శ్రీ మహా విష్ణువు మత్స్యావతారమెత్తి సోమకాసురుడిని సంహరించి వేదాలను రక్షించాడు. అప్పుడు వేదాలు స్వామివారి సన్నిధిలో తరించే భాగ్యాన్ని కలిగించమని కోరడంతో, నరసింహవతారంలో హిరణ్య కశిపుడిని సంహరించిన అనంతరం ఆ కోరిక తీరుతుందని స్వామి చెప్పాడు. తనని అభిషేకించాలని కృష్ణవేణి కూడా ఆరాట పడుతుందనీ, అందువలన తాను వచ్చేంత వరకూ ఆ నదిలో సాలగ్రామ శిలలుగా వుండమంటూ అనుగ్రహించాడు. ఆ తరువాత హిరణ్య కశిపుడిని సంహరించిన అనంతరం, స్వామి అక్కడే అయిదు అంశలతో ఆవిర్భవించాడు.
అందుకే లక్ష్మీ నరసింహుల వారు ఇక్కడ వీర లక్ష్మీ నృసింహస్వామిగా , యోగ లక్ష్మీ నృసింహస్వామిగా , జ్వాలా లక్ష్మీ నృసింహస్వామిగా , సాలగ్రామ లక్ష్మీ నృసింహస్వామిగా ,లక్ష్మీ నృసింహస్వామిగా పూజలందుకుంటారు.. ఇలా స్వామి వారు ఐదు రూపాలలో ఒకేక్షేత్రంలో పూజలందుకోవడం కేవలం ఈ ఒక్క క్షేత్రంలోనే మనమ్ చూడవచ్చు...
ముఖ్య దేవాలయములో యోగానంద మరియు లక్ష్మీ నృసింహస్వామి, కొండపైన జ్వాలా నృసింహస్వామి, కృష్ణానది గర్భములో స్నాన ఘట్టమునకు సమీపములో బయటకు కనిపించే రూపం సాలగ్రామము, వేదాద్రికి సమీపములోని గరుడాచల కొండపై వీర నృసింహస్వామి ఉన్నారు.
వేదాద్రి లో స్వామి దేవేరుల చెంచు లక్ష్మి, రాజ్య లక్ష్మి అమ్మవార్లు ఉన్నారు. వీరికి గర్భగుడి పక్కనే ప్రత్యేక ఉపాలయాలు ఉన్నాయి. క్షేత్రపాలకుడు విశ్వేశ్వర స్వామికి మరియు నవగ్రహాలకు కూడా ఉపాలయములు ఉన్నాయి.
ప్రతి సంవత్సరం వైశాఖ పౌర్ణమికి స్వామి వారి కళ్యాణం వైభవంగా జరుగుతుంది. యోగానంద నృసింహస్వామి వారి మూల రూపము ఈ ప్రపంచములో ఎక్కడా లేనంత సుందరముగా సాలిగ్రామ శిలతో చేయబడి త్రేతాయుగములో ఋష్యశృంగ మహర్షిచే ప్రతిష్ఠింపబడినది. 'విశ్వేశ్వరుడు' క్షేత్ర పాలకుడిగా వ్యవహరించే ఈ క్షేత్రాన్ని దర్శించడం వలన సకల పుణ్య ఫలాలు ప్రాప్తిస్తాయని భక్తుల విశ్వాసం. విశేషమైనటు వంటి పర్వదినాల్లో భారీ సంఖ్యలో భక్తులు తరలి వస్తుంటారు.
కృష్ణవేణి నదిలో విష్ణు నామం
మానసిక, శారీరక జబ్బులు ఉన్నవారు ఇక్కడ కొన్నాళ్ళు ఉండి, కృష్ణవేణి నదిలో స్నానం చేసి ఆలయం చుటూ ప్రదక్షిణాలు చేస్తే రుగ్మతలు పోతాయని, మనసుకు ప్రశాంతత చేకూరుతుందని భక్తుల నమ్మకం.
ఆలయ దర్శన సమయాలు
ఉదయం 6: 30 నుండి మధ్యాహ్నం 1:00 వరకు .. మధ్యాహ్నం 3:00 నుండి 5:30 వరకు తిరిగి 6:30 నుండి 8 :30 గంటల వరకు.
మా స్తోత్ర సూచిక లోని >>ఇతర ఆలయ సమాచారముల << కోసం లింక్ చూడండి
మా YouTube Channel ను SUBSCRIBE చేయండి.. మమ్ము కొంచెం Encourage చేసినట్లు అవుతుంది.. Please subscribe our Channel
క్రింద ఈ ఆలయ పూర్తిగా వీడియో👇👇👇
Post a Comment