అమ్మవారి ఎన్నో రూపాలలో ప్రత్యంగిరా అమ్మవారి రూపం కూడా ఒకటి... అమ్మవారి అవతారమును గురించిన ఎన్నో కథలు ఉన్నాయి... అందులో ఒకటి...
పూర్వం హిరణ్యకశిపుడిని చంపేందుకు, విష్ణువు నరసింహస్వామిగా అవతరించిన విషయం తెలిసిందే. హిరణ్యకశిపుడిని తన గోళ్లతో చీల్చి చెండాడిన తర్వాత కూడా నరసింహస్వామి కోపం చల్లారలేదట. దాంతో శివుడు, శరభేశ్వరుడనే అవతారంలో నరసింహస్వామిని ఓడించి... ఆయన కోపాన్ని తగ్గించే ప్రయత్నం చేశాడు. ఆ సమయంలో అమ్మవారు- శూలిని, మహాప్రత్యంగిర అనే రెండు రూపాలు ధరించి శరభేశ్వరునికి రెండు రెక్కలుగా నిలిచింది. ఈ అమ్మవారిని మొదటగా ప్రత్యంగిరా, అంగీరసుడు అనే ఇద్దరు రుషులు దర్శించారట. అందుకనే ఆ ఇద్దరి పేర్లతో ఈమెను ప్రత్యంగిరా అని పిలుస్తుంటారు.
మనుషులకు ఆపద వచ్చినప్పుడు దేవుడు వేర్వేరు అవతారాలలో వారిని ఆదుకుంటాడు. అమ్మవారు కూడా అంతే! భక్తుడి పరిస్థితిని బట్టి ఒకోసారి శాంతమూర్తిగా అవతరిస్తే, మరోసారి ఉగ్రరూపంలో దర్శనమిస్తుంది. అలాంటి అమ్మవారి అవతారాలలో ప్రత్యంగిరాదేవి ఒకరు.
ప్రత్యంగిరా అంటే ఎదురు తిరిగే దేవత అన్న అర్థం కూడా ఉంది. ఎవరైతే మనకి హాని తలపెడతారో, వారికే తిరిగి హాని తలపెడుతుంది కాబట్టి ఆ పేరు వచ్చిందంటారు. అందుకే దుష్టశక్తులు పీడిస్తున్నయని భయపడుతున్నవారు, చేతబడి జరిగిందనే అనుమానం ఉన్నవారు ఈ అమ్మవారిని పూజిస్తే ఎలాంటి తంత్రమైనా మన మీద పనిచేయదు.
ప్రత్యంగిరాదేవికి మరో ప్రత్యేకత కూడా ఉంది. అదే నికుంబల హోమం. ఈ హోమాన్ని చేసినవాళ్లు ఎలాంటి విజయాన్నయినా అందుకుంటారట. అందుకనే రావణాసురుడి కొడుకు ఇంద్రజిత్తు ఈ హోమాన్ని చేసేందుకు ప్రయత్నించినట్లు రామాయణంలో పేర్కొన్నారు. ఆ హోమాన్ని ఆపేందుకు సాక్షాత్తు హనుమంతుడే దిగిరావలసి వచ్చింది. కుంభకోణంలో ఉన్న ప్రత్యంగిరాదేవి ఆలయంలో ఇప్పటికీ ప్రతి అమావాస్యలోనూ ఈ హోమం చేస్తారు. ఇందుకోసం పళ్లు, కాయగూరలు, పట్టుచీరలు, ఎండుమిర్చిలాంటి 108 రకాల వస్తువులను ఉపయోగించడం విశేషం. హోమంలో ఎండుమిర్చి వేసినా, దాని ఘాటు చుట్టుపక్కల వారికి తెలియకపోవడం ఓ వింత.
ప్రత్యంగిరా మాతకు సంబంధించి ఇంకా చాలా విశేషాలే ఉన్నాయి. ఆమెను అమ్మవారి సప్తమాతృకలు అంటే ఏడు అవతారాలలో ఒకటిగా భావిస్తారు. మన మంత్రాలకు మూలమైన అధర్వణ వేదానికి కూడా ప్రత్యంగిరా మాతను అధిపతిగా భావిస్తారు. అందుకే ఆమెను అధర్వణ భద్రకాళి అని కూడా పిలుస్తారు. ప్రత్యంగిరాదేవి సింహముఖంతో ఉంటుంది కాబట్టి, ఆమెకు నారసింహి అన్న పేరు కూడా ఉంది. శని ప్రభావంతో బాధపడుతున్నవారు, శత్రునాశనం కోరుకునేవారు, కోర్టు కేసులలో ఇరుక్కున్నవారు, వ్యాపారంలో నష్టాలు వస్తున్నవారు... ఈ అమ్మవారిని పూజిస్తే వెంటనే ఫలితం వస్తుందని చెబుతారు. అయితే ప్రత్యంగిరా దేవి చాలా ఉగ్రస్వరూపిణి. ఆమెని పూజించేటప్పుడు మద్యపానం చేయడం, మాంసాహారం తినడంలాంటి పనులు చేయకూడదు. వీలైనంతవరకు పెద్దలని సంప్రదించి, వారి సలహా మేరకు ప్రత్యంగిరాదేవిని పూజించాలి.
ప్రత్యంగిరా అమ్మవారి ఆలయములు చాలా తక్కువ... అందులో ఒక ఆలయం శ్రీ శైవ క్షేత్రము తాళ్ళాయపాలెం, గుంటూరు జిల్లా అమరావతి సెక్రటేరియట్ కు అత్యంత సమీపంలో ఉంది...
మంతెన సత్యనారాయణ గారి ప్రకృతి ఆశ్రమమునకు కూతవేటు దూరంలో ఈ ఆలయం ఉంటుంది... ఒకేరోజు శ్రీశైవక్షేత్రము, ఉండవల్లి గుహలు, మంగళగిరి లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆలయం, కనకదుర్గా దేవి అమ్మవారి ఆలయాన్ని సరిగ్గ ప్లాన్ చేసుకుంటే దర్శించవచ్చు...
మేము ఇదివరలో చిలకలూరి పేటలో ఉండేవారము.. అందుకే ఉదయాన్నే పెదకాకాని వెళ్ళేందుకు కుదిరేది... పెద్దకాకాని శివాలయం ఉదయం 8:00 లోపు దర్శించుకుని ఉదయం ఉపాహారం చేసి... హైవే మీదనుండి ఆటో మాట్లాడుకుని ఒక దానితర్వాత మరొకటి.. మొదటమంగళగిరి లక్ష్మీ నర్సింహస్వామి ఆలయం, గంటలో దర్శనం అయిపోతుంది... ఆ తర్వాత ఉండవల్లి గుహలు ఒక గంట చాలు...... ఆ తర్వాత శ్రీ శైవ క్షేత్రం చూసేలా ప్లాన్ చేసుకోవాలి... శ్రీ శైవ క్షేత్రంలో ఉచిత భోజనాలు లభిస్తాయి... మీ చేతనైనంత చందా వ్రాయండి... వ్రాయక పోయినా పర్లేదు... అక్కడ మొత్తం చూడడానికి కనీసం గంట పడుతుంది... ఈ దర్శనం అయిన తర్వాత కనక దుర్గ అమ్మవారి ఆలయం దగ్గర డ్రాపింగ్ అయ్యాము.. మేము... సాయంత్రం నాలుగు అవుతుంది దగ్గర దగ్గర... అక్కడ దర్శనాలు చాలా సులభంగా అయింది.. ఇలా మా ఒక్క రోజు యాత్ర పూర్తి అయ్యేది...
ఏ సదుపాయం లేని వారు.... విజయవాడ.. గానీ... గుంటూరు బస్టాండ్ లలో అమరావతి సెక్రటేరియట్ కు బస్సులు ఉంటాయి... అక్కడ సమీపంలోని మందడం లో దిగాలి... మందడం నుండి శ్రీ శైవ క్షేత్రం కేవలం 5 కి.మీ దూరం ఉంటుంది... ఇక విజయవాడ సీతానగరం నుండి 5 కి.మీ లు ఉంటుంది... ఆటో మాట్లాడుకోవాల్సిందే... ట్రాన్స్ పోర్ట్ ఫెసిలిటీలు చాలా తక్కువ ఇక్కడ..... మీరు ఏ సదుపాయం లేకుండా... అమరావతి చుట్టు ప్రక్కలి ప్రదేశాలు వెళ్ళలేరు... ఇదొక అడవి లా ఉంటుంది... రవాణా సదుపాయాలు ఉండవు... చీకటి పడితే అంతే సంగతులు... అందుకే వీలైనంత వరకు... సాయంత్రం లోపులో ఉండవల్లి, శ్రీశైవక్షేత్రాల దర్శనం ముగించుకోవాలి...
మా స్తోత్ర సూచిక లోని >>ఇతర ఆలయ సమాచారముల << కోసం లింక్ చూడండి
మా YouTube Channel ను SUBSCRIBE చేయండి.. మమ్ము కొంచెం Encourage చేసినట్లు అవుతుంది.. Please subscribe our Channel
క్రింది లింక్ లో ప్రత్యంగిరా అమ్మవారి ఆలయాన్ని ఉంచాము చాలా బాగా వచ్చింది... చూడగలరు..
మా స్తోత్ర సూచిక లోని అమ్మవారి స్తోత్రముల కోసం క్లిక్ చేయగలరు
Post a Comment