Friday 9 July 2021

Pratyangira stotram in telugu pdf free download - ప్రత్యంగిరా స్తోత్రం

ప్రత్యంగిరా స్తోత్రం Pratyangira stotram


అస్య శ్రీ ప్రత్యంగిరా స్తోత్రస్య,
అంగిరా ఋషిః అనుష్టుప్ ఛన్దః
శ్రీ ప్రత్యంగిరా దేవతా ఓం బీజం శక్తిః
మమాభీష్ట సిధ్యర్దే పాఠే వినియోగః |
హ్రాం హ్రీం హ్రూం హైం హ్రాం హ్రః షడంగన్యాసం కుర్యాత్


ధ్యానమ్ –

కృష్ణరూపాం బృహద్రూపాం రక్తకుంశ్చితా మూర్దజామ్ |
శిరః కపాలమాలాశ్చ వికేశీం ఘూర్ణితాననామ్ ||

రక్తనేత్రామతి క్రుద్దాం లమ్భజిహ్వామధోముఖీమ్ |
దంష్ట్రాకరాలవదనాం నేత్ర భ్రుకుటిలేక్షణామ్ ||

ఊర్ధ్వదక్షిణహస్తేన విభ్రతీం చ పరష్యమ్ ||

అఘోదక్షిణహస్తేన విభ్రాణాం శూలమద్భుతమ్ |
తతోర్ధ్వవామహస్తేన ధారయన్తీం మహాంకుశాం |
అధోమా కరేణాథ విభ్రాణాం పాశమేవ చ |
ఏవం ధ్యాత్వా మహాకృత్యాం స్తోత్రమేతదుదీరయేత్ |



ఈశ్వర ఉవాచ –
నమః ప్రత్యంగిరే దేవి ప్రతికూలవిధాయిని |
నమః సర్వగతే శాన్తే పరచక్రవిమర్దినీ ||

నమో జగత్రయాధారే పరమన్త్ర విదారిణీ |
నమస్తే చణ్ణకే చడ్డీ మహామహిషవాహినీ ||

నమో బ్రహ్మాణి దేవేశి రక్తబీజనిపాతినీ |
నమః కౌమారికే కుణ్ఠి పరదర్పనిషూదినీ ||

నమో వారాహి చైన్ద్రాని పరే నిర్వాణదాయినీ |
నమస్తే దేవి చాముణ్డే చణ్డముణ్డ విదారిణీ ||

నమో మాతర్మహాలక్ష్మీ సంసారార్ణవతారిణీ |
నిశుమ్భదైత్యసంహారి కాలాన్తకి నమోస్తుతే ||

ఓం కృష్ణామ్బర శోభితే సకల సేవక జనోపద్రవకారక దుష్టగ్రహ
రాజఘన్తా సంహృట్ట హరిహి కాలాన్తకి నమోస్తుతే ||

దుర్గే సహస్రవదనే అష్టాదశభుజలతా భూషితే
మహాబల పరాక్రమే అద్భుతే అపరాజితే దేవి
ప్రత్యంగిరే సర్వార్తిశాయిని పరకర్మ విధ్వంసిని
పరయన్త్ర మన్త్ర తన్త్ర చూర్ణాది ప్రయోగకృత
వశీకరణ స్తమ్భన జృంభనాది దోషాన్ |

చయాచ్ఛాదిని సర్వశత్రూచ్చాటిని మారిణి మోహిని వశీకరణిస్తమ్బిని

జృమ్భిణి ఆకర్షిణి సర్వదేవగ్రహ యోగగ్రహ యోగినిగ్రహ దానవగ్రహ

దైత్యగ్రహ రాక్షసగ్రహ సిద్ధగ్రహ యక్షగ్రహ గుహ్యకగ్రహ విద్యాధరగ్రహ

కిన్నరగ్రహ గన్దర్వగ్రస అప్సరాగ్రహ భూతగ్రహ ప్రేత గ్రహ పిశాచగ్రహ

కూష్మాణ్డగ్రహ గజాదికగ్రహ మాతృగ్రహ పితృగ్రహ వేతాలగ్రహ రాజగ్రహ

చౌరగ్రహగోత్ర గ్రహాశ్వదేవతా గ్రహ గోత్ర దేవతా గ్రహ ఆధిగ్రహ

వ్యాధిగ్రహ అపస్మార గ్రహ నాసాగ్రహ గలగ్రహ యామ్యగ్రహ మరికాగ్రహోదక
గ్రహ విద్యోరగ్రహారాతి గ్రహ ఛాయాగ్రహ శల్యగ్రహ సర్వగ్రహ విశల్యగ్నహ
కాలగ్రహ సర్వదోషగ్రహ విద్రావిణీ సర్వదుష్ట భక్షిణి సర్వపాప నిశూదిని
సర్వయన్త్ర స్ఫోటిని సర్వశృంఖలా త్రోటిని సర్వముద్రా ద్రావిణి జ్వాలాజిహ్వే
కరాల వక్రే రౌద్రమూర్తె దేవి ప్రత్యంగిరే సర్వదేహి యశోదేహి పుత్రం దేహి
ఆరోగ్యం దేహి భుక్తి ముక్త్యాదికం దేహి సర్వసిద్ధి దేహి మమ సపరివారం
రక్ష రక్ష పూజా జప హోమ ధ్యానార్చనాదికం కృతం
న్యూనమధికం వా
పరిపూర్ణం కురు కురు అభిముఖి భవ భవ రక్ష రక్ష
స్వాపరాధం ఏవం
స్తుతా మహాలక్ష్మీ శివేన పరమాత్మనః ఉవాచేదం ప్రహృష్టాన్గీ
శృణుష్వ
పరమేశ్వరః ||


ఫలశ్రుతిః –
ఏతత్ ప్రత్యంగిరా స్తోత్రం యే పఠని ద్విజోత్తమాః |
శృణ్వన్తః సాధయన్తాశ్చ తేషాం సిద్దిప్రదా భవేత్ ||

శ్రీశ్చ కుభ్జీం మహాకుబ్జీ కాలికా గుహ్యకాలికా |
త్రిపురా త్వరితా నిత్యా త్రైలోక్య విజయా జయా ||


జితాపరాజితా దేవీ జయన్తీ భద్రకాలికా |
సిద్ధలక్ష్మీ మహాలక్ష్మీః కాలరాత్రి నమో స్తుతే ||

కాలీ కరాల విక్రాన్తే కాలికా పాపహారిణీ |
వికరాలముఖీ దేవి జ్వాలాముఖి నమోస్తుతే ||

ఇదం ప్రత్యంగిరా స్తోత్రం యః పఠేన్నియతః శుచిః |
తస్య సర్వార్థ సిద్ది స్యాన్నాత్ర కార్యా విచరణాః ||

శత్రవో నాశమాయాన్తి మహానైశ్వర్యవాన్భవేత్ |
ఇదం రహస్యం పరమం నాఖ్యేయం యస్యకస్యచిత్ ||

సర్వపాపహరం పుణ్య సద్యః ప్రత్యయకారకమ్ |
గోపనీయం ప్రయత్నేన సర్వకామఫలప్రదమ్ ||

ఇతి అథర్వణరహస్యే ప్రత్యంగిరా స్తోత్రం సమాప్తమ్ |


👇👇Pratyangira Devi Stotram in pdf free download click here👇👇


ప్రత్యంగిరా దేవి అవతార విశేషాలు..

శక్తి రూపమైన అమ్మవారి అవతారాలలో ప్రత్యంగిరాదేవి ఒకరు. మానవులకు ఆపద వచ్చినప్పుడు ఎలా ఐతే దేవుడు వేర్వేరు అవతారాలలో ఆడుకుంటాడో.. అమ్మవారు కూడా అలానే భక్తుడి పరిస్థితిని బట్టి ఒకోసారి శాంతమూర్తిగా అవతరిస్తే, మరోసారి ఉగ్రరూపంలో అవతరిస్తుంది.. అలా ఉగ్రరూపం దాల్చిన అమ్మవారే ప్రత్యంగిరా దేవి.. మరి అమ్మ వారి అవతార విశేషాలేంటో మనం ఇపుడు తెల్సుకుండా..

పూర్వం హిరణ్యకశిపుడిని వధించేందుకు విష్ణుమూర్తి నరసింహస్వామి అవతారమెత్తిన విషయం తెలిసిందే. హిరణ్యకశిపుడిని తన గోళ్లతో చీల్చి చెండాడిన తర్వాత కూడా నరసింహస్వామి కోపం చల్లారకపోవటంతో, శివుడు శరభేశ్వరుడనే అవతారంలో నరసింహస్వామిని ఓడించి… ఆయన కోపాన్ని తగ్గించే ప్రయత్నం చేశాడు. ఆ సమయంలో అమ్మవారు కూడా శూలిని, మహాప్రత్యంగిర అనే రెండు రూపాలు ధరించి శరభేశ్వరునికి రెండు రెక్కలుగా నిలిచింది. ఈ అమ్మవారిని మొదటగా ప్రత్యంగిరా, అంగీరసుడు అనే ఇద్దరు రుషులు దర్శించారట. అందుకనే అమ్మవారిని ప్రత్యంగిరా దేవి అని పిలుస్టారు.

ప్రత్యంగిరా అంటే ఎదురు తిరగటం.. ఎవరైనా మనకి హాని తలపెడితే, తిరిగి వారికే హాని తలపెడుతుంది కాబట్టి ఈ అమ్మవారికి ఆ పేరు వచ్చిందంటారు. అందుకే దుష్టశక్తులు భయంతో ఉన్నవారు, చేతబడి ఉన్నవారు ఈ అమ్మవారిని పూజిస్తే ఎలాంటి తంత్రమైనా ఇక వారి మీద పనిచేయకుండా అనుగ్రహిస్తుంది.. ప్రత్యంగిరాదేవికి మరో ప్రత్యేకత కూడా ఉంది. అదే నికుంబల హోమం. ఈ హోమాన్ని చేసినవాళ్లు ఎలాంటి విజయాన్నయినా అందుకుంటారట. రావణాసురుడి కొడుకు అయినా ఇంద్రజిత్తు ఈ హోమాన్ని చేసేందుకు ప్రయత్నించినట్లు రామాయణంలో పేర్కొన్నారు. అపుడు సాక్షాత్తు హనుమంతుడే ఆ హోమాన్ని ఆపేందుకు వచ్చినట్లు పురాణ కథనం… కుంభకోణంలో ఉన్న ప్రత్యంగిరాదేవి ఆలయంలో ఇప్పటికీ ప్రతి అమావాస్యలోనూ ఈ హోమం చేస్తారు. ఇందుకోసం పళ్లు, కాయగూరలు, పట్టుచీరలు, ఎండుమిర్చిలాంటి 108 రకాల వస్తువులను ఉపయోగించడం విశేషం. అయితే హోమంలో ఎండుమిర్చి వేసినా, దాని ఘాటు కనీసం చుట్టుపక్కల వారికి కూడా తెలియకపోవడం విశేషం..

ప్రత్యంగిరా మాతను అమ్మవారి సప్తమాతృక అవతారాలలో ఒకటిగా భావిస్తారు. మన మంత్రాలకు మూలమైన అధర్వణ వేదానికి కూడా ప్రత్యంగిరా మాతను అధిపతిగా కొలుస్తారు.. అందుకే అమ్మవారిని అధర్వణ భద్రకాళి అని కూడా పిలుస్తారు. ప్రత్యంగిరాదేవి సింహముఖంతో ఉంటుంది కాబట్టి, ఆమెకు నారసింహి అన్న పేరు కూడా ఉంది.
 
శని ప్రభావంతో బాధపడుతున్నవారు, శత్రునాశనం కోరుకునేవారు, కోర్టు కేసులలో ఇరుక్కున్నవారు, వ్యాపారంలో నష్టాలు వస్తున్నవారు… ఈ అమ్మవారిని పూజిస్తే వెంటనే ఫలితం వస్తుందని చెబుతారు.

అయితే ప్రత్యంగిరా దేవి చాలా ఉగ్రస్వరూపిణి.ఆమెని పూజించేటప్పుడు మద్యపానం చేయడం, మాంసాహారం తినడంలాంటి పనులు చేయకూడదు. వీలైనంతవరకు పెద్దలని సంప్రదించి, వారి సలహా మేరకు మాత్రమే ప్రత్యంగిరాదేవిని పూజించాలి.

Post a Comment

Whatsapp Button works on Mobile Device only