Sunday, 9 May 2021

Hinglaj Mata Shakti Peeth temple information in telugu video

శక్తి పీఠాలు అంటే ఏమిటి అవి ఎలా ఏర్పడ్డాయి...???

దక్షుడు తలపెట్టిన బృహస్పతి ( నిరీశ్వర) యాగమునకు శివునికి శివుని భార్య సతీ దేవికి పిలుపు వెళ్ళదు... సతీ దేవి తండ్రి(దక్షప్రజాపతి )తలపెట్టే యాగమునకు తనను పిలువనవసరం లేదని భావించి.. అక్కడకు వెళ్తుంది.. అది నిరీశ్వర యాగమని తెలియడంతో అవమానంతో ఒక యజ్ఞచితిని ఏర్పరచుకుని భస్మం అవుతుంది.... అయిన సతీ వియోగదుఃఖం తీరని శివుడు ఆమె మృతశరీరాన్ని అంటిపెట్టుకొని ఉండి తన జగద్రక్షణాకార్యాన్ని మానివేశాడు. దేవతల ప్రార్ధనలు మన్నించి విష్ణువు సుదర్శన చక్రంతో ఆ దేహాన్ని ఖండాలుగా చేసి, శివుడిని కర్తవ్యోన్ముఖుడిని చేశాడు. సతీదేవి శరీరభాగాలు పడిన స్థలాలు శక్తి పీఠాలుగా భక్తులకు, ముఖ్యంగా తంత్రసాధకులకు ఆరాధనా స్థలాలు అయినాయి.


 ప్రతి శక్తి పీఠంలోను దాక్షాయణి మాత భైరవుని(శివుని)తోడుగా దర్శనమిస్తుంది. సతీ దేవి బ్రహ్మరంధ్రం ఇక్కడ పడినట్టు చెప్పుకుంటారు. ఇక్కడ భైరవుడు భీమలోచనుడనే పేర పిలువబడుతున్నాడు.

Hinglaj Mata Shakti Peeth temple information in telugu video


రామాయణం ప్రకారం రావణ వధ తర్వాత రాముడు బ్రహ్మహత్యదోష నివారణ కోసం హింగ్లాజ్ దేవిని సందర్శించాడు. హింగుళా దేవికి చెందిన ఈ మంత్రం దధీచీవిరచితంగా భావిస్తారు.

ఓం హింగుళే పరమ హింగుళే అమృతరూపిణీ తనుశక్తి మనః శివే శ్రీ హింగుళాయ నమః స్వాహా

హింగ్లాజ్ దేవి ఆలయం.. పాకిస్తాన్ లోని బెలూచిస్తాన్ ప్రాంతంలో ఉంది....
అక్కడికి వెళ్ళాలంటే పాకిస్తాన్ వీసా పర్మిషన్ లాంటివి ఎన్నో ఉంటాయి... తినడానికి.. త్రాగడానికి ఎలాంటి వసతులు ఉండవు..
గతంలో గుజరాత్ నుండి డైరెక్ట్ గా రైల్ వెళ్ళెదట... కానీ మనకు పాకిస్తాను కు ఎటువంటి రాకపోకలు లేవు కాబట్టి ప్రస్తుతం పాకిస్తాన్ నుండి వెళ్ళవలసిందే... ఈ మధ్య కరాచీ నుండి హింగ్లాజ్ మాత ఆలయమునకు మధ్య ఒక హైవే నిర్మించారని తెలుస్తోంది.. దాదాపు 3 గంటలలో చేరవచ్చు కరాచీనుండి.. అని తెలుస్తోంది... ఎంతైనా శత్రు దేశంలో ఒక శక్తి పీఠాన్ని దర్శించడం సాహసమే...
రావణుడిని వధించినందుకు గాను బ్రహ్మ హత్యా పాతుకాన్ని తప్పించుకోవడానికి శ్రీరాములవారు ఇక్కడకు వచ్చి అమ్మవారిని కొలిచినట్లుగా స్థల పురాణం ఉంది...
మిగిలిన అన్ని శక్తి పీఠాల మాటేమో గానీ.. ఈ శక్తి పీఠాన్ని దర్శించుకోవడం.. కొంచెం కష్టతరమైనదే... క్రింద వీడియో లో చక్కగా అమ్మవారు మరియు ఆలయం... వివరాలు మొత్తం ఉన్నాయి... ... చూడండి.. 👇👇👇👇


 Tags: 
Hinglaj mata shakti peeth temple information in telugu,
Hinglaj mata temple, beluchistan, Pakistan temple information in telugu

 

Post a Comment

Whatsapp Button works on Mobile Device only