Sunday 4 April 2021

Konark sun temple statues history - కోణార్క సూర్యదేవాలయం లో ఉన్న ఈ శిల్పం ..

కోణార్క సూర్యదేవాలయం లో ఉన్న ఈ శిల్పం .. మన చరిత్ర పుస్తకాలలో వ్రాయని దాచి పెట్టిన ఎన్నో రహస్యాలను మనకు చెపుతుంది... (Interesting to know) 
ఈ శిల్పం కోణార్క దేవాలయానికి సంబంధించినది... 
కోణార్క సూర్యదేవాలయం... 13 వ శతాబ్థంలో నరసింహదేవల వారు కట్టించారు... 
అప్పుడు చెక్కబడిన ఈ శిల్పంలో జిరాఫీను.. ఆఫ్రికా జాతికి చెందిన నీగ్రో వారిని మనం చూడవచ్చు....
2. ఎప్పుడో 15 వ శతాబ్థంలో వాస్కోడిగామా ఇండియాను(భారతదేశాన్ని కాదు) కనిపెట్టానని గొప్పగా వ్రాసుకున్నారు... వారి తర్వాతే పారిశ్రామిక విప్లవం వచ్చింది అని చెప్పుకున్నారు... అది వాస్తవం కాదు...
konark sun temple giraffe sculpture videos
ఎందుకంటే ఒకవేళ మన భారతదేశాన్నిపోర్చుగీసు వారు కనిపెట్టక ముందు మన దేశానికి ఐరోపా/ఆఫ్రికా దేశాల వారితో ఏ విధమైన సంబంధం ఉండకూడదు... అయితే 13 వ శతాబ్థంలో నిర్మించిన ఈ ఆలయంలో జిరాఫీ మరియు నీగ్రోలు ఎలా శిల్పీకరించారు...... ఎందుకంటే శిల్పి తాను జిరాఫీను గానీ నీగ్రోలను గానీ చూస్తేనే గానీ అలా చెక్కగలడు... ఒకటి... శిల్పి ఆ రెండిటినీ చూడాలి... లేదా శిల్పి ఆఫ్రికా అయినా వెళ్ళాలి... అంటే రెండు ప్రశ్నలకు ఒకే జవాబు భారతీయుల నౌకా వాణిజ్యం ఖండ ఖండాలకు వ్యాపించింది... 

3. అలా మన ఓడల ద్వారా సరఫరా అయిన పట్టు జరీ చీరలను ఎన్నో అమూల్యమైన వస్తువులను చూసిన వాస్కోడిగామా... మన వారు ఓడల ద్వారా ఆఫ్రికా వచ్చేవరకు ఓపికతో ఎదురుచూసి..... ఓడలో వచ్చిన కొంత మంది పనివారిని మచ్చిక చేసుకుని... లోభం... లంచం ఆశ చూపి ఆ ఓడల వెంట వచ్చేలా చేసుకుని... ఆఫ్రికా వెళ్ళిన మన ఓడల వెంటబడి... వాస్కొడీ గామా అనుసరిస్తూ వచ్చారు... అలా భారతదేశాన్ని కనిపెట్టారు...

మన చాళుక్యులు చోళులు ఖండాంతర వాణిజ్యం చేసేవారు.. అప్పట్లోనే మన బంగారు జరీ చీరలు... ఆభరణాలు చాలా పేరుగాంచేవి... అలా ఓడలలోనే శిల్పులు కూడా ఉండేవారేమో నని అనిపిస్తుంది... మరియు... జిరాఫీ పట్టే ఓడలు మనకు ఉండేవి... ఈ శిల్పాన్ని చూస్తే రాజుకు నీగ్రోలు జిరాఫీను కానుకగా సమర్పిస్తున్నట్లు మనకు తెలుస్తుంది(నీగ్రోల ముఖకవళికలు, హావభావాలు, శరీరాకృతి వస్త్రధారణ లాంటి చిన్న చిన్న విషయాలను కూడా మనం గమనించవచ్చు... ... మన రాజుల ప్రఖ్యాతి ఖండాలను దాటి వెళ్ళిందని మనకు ఈ శిల్పంచూస్తే తెలుస్తుంది... కానీ మన చరిత్రను ఎక్కడా సరిగ్గా లిఖించబడలేదు..... మన దేశ రాజుల చరిత్ర చెప్పకుండా మన దేశంపై దండయాత్ర చేసిన వారి విశేషాలతోనే మన చరిత్ర పుస్తకాలు నింపేసారు... ఇలాంటి విశేషాలు ఇంకా ఎన్నో ఉన్నాయి... ఇప్పటికీ మీరు కోణార్కలో ఈ శిల్పాన్ని చూడవచ్చు.. మ్యూజియంలో ఉంది..


To watch How Konark sundial is still working in the following video.. 


Post a Comment

Whatsapp Button works on Mobile Device only