Tuesday, 29 September 2020

short stories for kids in telugu -

 దు:ఖం నుండి శాంతి వైపుకు .....

ఒక రాజు ఒక రాత్రి తన జాతకం వ్రాయబడిన కాగితాన్ని చదువుతుంటే ఆయనకు ఒక అనుమానం వచ్చింది : ' నేను పుట్టిన రోజే ప్రపంచం లో అనేకమంది పుట్టివుంటారు. కానీ వాళ్ళంతా రాజులు కాలేదు , నేనే ఎందుకయ్యాను ? ఈ గొప్ప స్థానం నాకే ఎందుకు దక్కింది ? ' మరుసటిరోజు సభ లో పండితులముందు ఇదే ప్రశ్న పెడితే వాళ్ళు చెప్పిన జవాబు రాజుకు తృప్తి ఇవ్వలేదు. అపుడు ఒక వృద్ధ పండితుడు '' రాజా , ఈ నగరానికి తూర్పున బయటవున్న అడవిలో ఒక సన్యాసి వున్నాడు. ఆయనను కలవండి. జవాబు దొరుకుతుంది ''అన్నాడు. రాజు వెళ్ళాడు. అపుడు ఆ సన్యాసి బొగ్గు తింటుంటాడు. అది చూసి రాజు ఆశ్చర్యపోయి , తన ప్రశ్న ఆయన ముందు పెడితే ఆయన అన్నాడు : '' ఇక్కడికి నాలుగు మైళ్ళ దూరం లో ఇలాంటిదే మరొక గుడిశె వుంది. అందులో ఒక సన్యాసి వున్నాడు , ఆయన్ను కలవండి.'' నిరాశపడినా , రాజు రెండవ సన్యాసి కోసం వెళ్ళాడు. రాజు ఆయన్ని చూసినపుడు , ఆ సన్యాసి మట్టి తింటూంటాడు. రాజు కాస్త ఇబ్బందిపడ్డాడు. కానీ తన ప్రశ్ననైతే అడిగాడు. కానీ ఆ సన్యాసి రాజు మీద కోపంతో గట్టిగా అరచి అక్కడినుండి వెళ్ళిపొమ్మంటాడు. రాజుకూ కోపం వచ్చినా , సన్యాసి కాబట్టి ఆయన్ని ఏమీ అనలేదు. వాపసు వెళుతుంటే సన్యాసి రాజుతో ఇలా అంటాడు : 
'' ఇదే దారిలో వెళితే ఒక గ్రామం వస్తుంది , అక్కడ ఒక బాలుడు చనిపోవడానికి సిద్ధంగా వుంటాడు, వెంటనే అతన్ని కలవండి.'' రాజుకంతా గందరగోళంగా వుంటూంది. అయినా అక్కడికెళతాడు. చనిపోవడానికి సిద్ధంగా వున్న ఆ అబ్బాయిని కలిసి తన ప్రశ్న అడిగాడు. అపుడు ఆ అబ్బాయి ఇలా చెపుతాడు : '' 
గత జన్మ లో నలుగురు వ్యక్తులు ఒక రాత్రి అడవిలో దారితప్పివుంటారు. ఆకలేస్తే వాళ్ళ దగ్గరున్న రొట్టెలు తిందామని చెట్టుక్రింద ఆగివుంటారు. తినబోతుంటే అక్కడికి బాగా ఆకలేసి , నీరసంగా వున్న ఒక ముసలి వ్యక్తి వచ్చి తనకూ కొంచెం ఆహారం ఇవ్వమని అడిగితే ఆ నలుగురిలో మొదటీవాడు కోపంతో '' నీకు ఇస్తే నేను బొగ్గు తినాలా ? '' అని కసురుకొంటాడు. రెండవ వ్యక్తిని అడిగితే '' నీకు ఈ రొట్టె ఇస్తే నేను మట్టి తినాల్సిందే '' అని వెటకారంగా అంటాడు. మూడవ వాడు '' రొట్టె తినకపోతే ఈ రాత్రికే చస్తావా ? ''అని నీచంగా మాట్లాడాడు. కానీ నాల్గవ వ్యక్తి మాత్రం '' తాతా , నీవు చాలా నీరసంగా వున్నావు. ఈ రొట్టె తిను , '' అని తాను తినబోతున్న రొట్టెను ఇచ్చేసాడు. ఆ నాల్గవ వ్యక్తివి నువ్వే రాజా '' అని అన్నాడు. రాజు దిగ్భ్రాంతి కి లోనయ్యాడు. అపుడు ఆ అబ్బాయి మరో మాట చెప్పి ప్రాణం వదిలాడు : '' రాజా , ఇంతకంటే ఆశ్చర్యం ఏమిటంటే ఆ నలుగురు వ్యక్తులు ఒకే తల్లికి పుట్టిన నలుగురు కొడుకులు.''


ఈ కథను ఎందుకు వ్రాసానంటే మనం గతం లో చేసినదేదీ వృథాగా పోదు అని చెప్పడానికే. మరో కారణం ఏమంటే , కన్ను , ముక్కు , చెవి , నాలుక , చర్మం అనే అయిదు ఇంద్రియాల ద్వారా , అలాగే మన మనసు ద్వారా మనం ఎన్నో పనులు చేసివుంటాం. వాటిలో మంచివి వుంటాయి , చెడ్డవి కూడా వుంటాయి. అవేవో మనకు ఇపుడు తెలియవు. మనం ఇపుడు సంతోషంగా , అందంగా , ధనవంతంగా , ప్రశాంతంగా వున్నామంటే గత జన్మల్లో చేసిన మంచి కర్మలు ఇపుడు ఫలితాలు ఇస్తున్నాయని , ఒక వేళ మనం ఆందోళనగా , భయంగా , ఎదురుదెబ్బలు తింటున్నామంటే అప్పటి చెడు కర్మలు ఫలితాలు ఇస్తున్నాయని తెలుసుకోవాలి. కానీ ఈ జన్మ లో మనం ఏమైనా పాపాలు , తప్పులు చేసివుంటే వాటినుండి విముక్తి పొందడానికి ఏమైనా పరిష్కారాలున్నాయా ? అంటే '' ఖచ్చితంగా వున్నాయి '' అంటాయి మన పురాణాలు , శాస్త్రాలు. అవి ఏవి ?
1. ఆ చెడు పనులు ఏవో గుడికెళ్ళి భగవంతుడిముందు చెప్పుకొని , ఇక మీదట అలాంటివి చేయనని మనకు మనమే గట్టి నిర్ణయం తీసుకోవాలి. మరెవ్వరికీ చెప్పరాదు. ఎందుకంటే దేవుడొక్కడే పరిపూర్ణుడు , ఏ లోపాలూ లేని వాడు కాబట్టి. దేవుడికి సర్వస్య శరణాగతి చేసుకోవాలి. [ అంటే '' నీవే దిక్కు. నేను నిన్నే నమ్ముకొన్నాను '' అనే భావంతో బ్రతకడం]
2.ప్రతి రోజూ నియమం తప్పకుండా ఇంట్లో ధ్యానం , ప్రాణాయామం , ప్రార్థన , పూజ చేస్తూ , ఆ సమయంలోనూ , అలాగే ఏ ఇతర పని చేస్తున్నా - వంట చేస్తున్నా , వీధిలో నడుస్తున్నా , వేరే చోట్లకు ప్రయాణిస్తున్నా , తింటున్నా , మేడ మెట్లు ఎక్కి, దిగుతున్నా ... మూడు మంత్రాలను మనసులో ఎప్పుడూ స్మరిస్తూ వుండాలి[ ఇవి ఋషులు , గురువులు , వేదాలు చెప్పినవి ] 1. ఓమ నమో నారాయణాయ 2. ఓం నమ: శివాయ 3. ఓం శ్రీమాత్రే నమ: [ మేము హిందువులం కాదు అనుకొనే వారు వారి మతం లోని దేవుడి పేర్లను స్మరించాలి ] ప్రతి పదిహేను రోజులకు ఒక మారు [ ఏకాదశి రోజున ] ఉపవాసం చెయ్యాలి.
3.పేదలకు , ఆకలిగొన్న వారికి అన్నం పెట్టాలి.
4.ఇంట్లో రామాయణం , భారతం , భగవద్గీత , భాగవతం లాంటి పుస్తకాలను , మహా భక్తుల జీవిత చరిత్రలను [ఉదాహరణకు ధృవుడు , ప్రహ్లాదుడు , మార్కండేయుడు , అనసూయ , సావిత్రి మొదలగు వారు ] అలాగే శ్రీ రామకృష్ణ పరమహంస , వివేకానంద , పరమహంస యోగానంద మొదలగు వారి పుస్తకాలను ప్రతిరోజూ కనీసం ఒకటి లేదా రెండు పేజీలను శ్రద్ధగా చదివి , అర్థం చేసుకొని, ఆచరించడం అలవాటూ చేసుకోవాలి.
5.జీవ హింస ఘోరమైన పాపం కాబట్టి మాంసాహారం తినకూడదు. మద్యం తాగకూడదు.
6.ప్రతిరోజూ ఉదయాన్నే ఇంటి బయట కనిపించే చీమలకు చక్కెరనో , బెల్లమో పెట్టాలి. ఆవులకు కూడా తిండి పెట్టడం మరవరాదు.
7.కోపం వదిలేస్తూ రావాలి. Spiritual [ అధ్యాత్మికంగా ] గా వుంటూ, మంచి పనులు, మంచి ఆలోచనలు చేసేవారితో సాంగత్యం [ స్నేహం ] కలిగివుండాలి. దీన్నే ' సత్సాంగత్యం ' అంటాయి శాస్త్రాలు.
8. మన మేలు కోరేవారిని మనం మాటలతో , ప్రవర్తన తో ఎటువంటి పరిస్థితుల్లో కూడా బాధ పెట్టరాదు.
9. సంపాదనలో కొంత డబ్బును పేదలకు , దాన ధర్మాలకు ఉపయోగించాలి.
10. అహంకారం , అహంభావం వదిలేసి , నిరాడంబరంగా జీవించాలి.

పైన చెప్పిన పది పనులు చేస్తూవుంటే , గతం లోనూ , ఈ జీవితం లోనూ చేసిన చెడు పనుల నుండి మనం విముక్తి పొంది ఇక మీదట జీవితం లో శాంతితో బ్రతకవచ్చు. ఇది వంద శాతం సత్యం. ఎందుకంటే ఇవి నేను చెపుతున్నవి కాదు. మన ధర్మ గ్రంధాలు చెపుతున్న తిరుగులేని సత్యాలు...
Best inspirational stories for kids in telugu

- story from Sri Parasakti Satish  garu... 
Post key words:
telugu inspirational stories,
 telugu moral stories, 
neethi kathalu, 
telugu neethi kathalu, 
stories for kids in telugu, 
telugu stories for children, 
telugu moral stories for kids, 
niti kathalu telugu, 
short stories for kids in telugu, 

Post a Comment

Whatsapp Button works on Mobile Device only