Saturday, 18 October 2014

Optical illusion statues in Mahabalipuram మహాబలిపురం :: అద్భుతమైన మన భారతీయ శిల్పకళ::: మన కళ్ళనే ఏమార్చేంత అద్భుత శిల్పకళా నైపుణ్యం::

అద్భుతమైన మన భారతీయ శిల్పకళ::: మీ కళ్ళనే ఏమార్చేంత అద్భుత శిల్పకళా నైపుణ్యం::
ఇప్పుడు మీరు చూస్తున్న ఈ శిల్పము... తమిళనాడు లోని మహాబలిపురం లోనిది...
Mahabalipuram, optical illusion statue
ఈ ప్రదేశంలో చాలా శిల్పాలు.. చారిత్రక స్థలాలు ఉన్నాయి.. వీటిని తమిళ రాజు నరసింహవర్మన్ క్రీ.శ. ఏడవ శతాబ్దంలో నిర్మించాడు... ఈ శిల్పం లో మహత్యం ఏమి టంటే మొదటి సారి చూస్తే(చిత్రం ) ఒక ఆవు తన లేగ దూడకు పాలు ఇస్తున్నట్లుగా ఉంటుంది...
Mahabalipuram, optical illusion statue cow feeding to calf
ఇక్కడ ఆవు, దూడ రెండూ  నాలుగు కాళ్ళను కలిగినట్లుగా కనపడుతుంది.
Mahabalipuram, optical illusion statue cow feeding to calf
ఒక ప్రత్యేక స్థలంలో చెయ్యి అడ్డు పెట్టి చూస్తే ఒక తల్లి ఏనుగు పిల్ల ఏనుగుకు పాలు ఇవ్వటం కనపడుతుంది..
Mahabalipuram, optical illusion statue Elephent feeding to calf

మొదట మనకు ఏనుగుకానీ తొండం కానీ కనపడవు.. కానీ ఆ ప్రత్యేకస్థలాన్ని కప్పివేయగానే తల్లి ఏనుగు మాత్రమే కాదు.. పిల్ల ఏనుగు తొండం కూడా కనపడుతుంది...
Mahabalipuram, optical illusion statue Elephent trunk
ఇక్కడ గమనించవలసినదేమంటే.. ఆవుకు ముందరి కాళ్ళు ఏనుగు తొండంలా మారుతుంది... దూడ వెనుక కాళ్ళు పిల్ల ఏనుగు తొండంలా కనపడుతుంది...
అది మన శిల్పకళా చాతుర్యమంటే.. అందుకే ఇది ప్రపంచ వారసత్వ సంపదలో భాగమయింది... 

Post a Comment

Whatsapp Button works on Mobile Device only