Saturday, 4 October 2014

ప్రకృతిచే నిర్మించిన జీవవారధి(లివింగ్ బ్రిడ్జ్):: మేఘాలయలోని వింత::ప్రకృతితో ఎడతెగని పోరాటాలు మానవులలో అంతులేని మేథోసంపత్తిని పెంచుతాయనేందుకు నిదర్శనమే ఈ లివింగ్ బ్రిడ్జెస్ Living Bridge Cherrapunji

ప్రకృతిచే నిర్మించిన  జీవవారధి(లివింగ్ బ్రిడ్జ్):: మేఘాలయలోని వింత::
ప్రకృతితో ఎడతెగని పోరాటాలు మానవులలో అంతులేని మేథోసంపత్తిని పెంచుతాయనేందుకు నిదర్శనమే ఈ లివింగ్ బ్రిడ్జెస్... వీటిని తయారు చేయడానికి సాక్షాత్తూ పది సంవత్సరాల దాకా పడతాయి...అంటే ఎంత దూరదృష్టో కదా ఆ పెద్దలది... తమ భవిష్యత్ తరాల వారు ఇబ్బంది పడకుండా పది సంవత్సరాలు ఓపికతో సాధించిన విజయం ఈ లివింగ్ బ్రిడ్జెస్..
చిరపుంజి:: ఒకప్పుడు ఇది భారతదేశంలో అత్యధిక వర్షపాతం(rainfall -12,892mm/సం.)  కలిగిన ప్రదేశం.
ప్రస్తుతం మాసిన్రం(Mawsynram, Meghalaya, India::  అనేది అత్యధిక వర్షపాతం (26,461 mm/సం.)కలిగిన ప్రదేశం.... ఇవి రెండు కూడా ఈశాన్య రాష్ట్రమైన మేఘాలయలో ఉన్నాయి... ఇక్కడ సంవత్సరం పొడుగునా వర్షాలు పడుతుండడం వలన ఎప్పుడూ కాలువలు  ప్రవహిస్తూనే ఉంటాయి.. అందువలన మధ్యమధ్యలో ఉన్న ఆ ప్రవాహాలను దాటడానికి వేరే మార్గాల అన్వేషణకై ప్రజలు ప్రకృతిపై సాధించిన విజయంగా ఈ లివింగ్ బ్రిడ్జిలను చెప్పుకోవచ్చు..
ఒకరకమైన రబ్బరు మొక్కలు ఈ చిరపుంజి ప్రదేశంలో ఎక్కువగా పెరుగుతూ ఉంటాయి... వీటి వ్రేళ్ళు చాలా పొడవుగా దాదాపు వందమీటర్ల పొడవుదాకా పెరుగుతాయట. భూమిలో ఉన్న మూలపు వ్రేళ్ళు కాకుండా తర్వాత జనించిన వ్రేళ్ళను ఒక క్రమపద్ధతిలో పెరగనిచ్చి కాలువ అవతల ఒడ్డుకు చేరుకున్న తర్వాత వాటిని మళ్ళీ భూమిలోకి పాతుకు పోయేలా గ్రామస్థులు తగు జాగ్రత్తలు తీసుకుంటారు.. ఇలా రెండు వైపులా ఉన్న రెండు చెట్లను దీనికోసమై నాటి ఎంపిక చేసుకుని నిర్వహిస్తారట.. దీనికోసమై కనీసం పది సంవత్సరాల సమయం పడుతుంది.. ఇలా రెండు వైపులా పెరిగిన ఈ వ్రేళ్ళను కలుపుతూ తిరిగి వాటిని ఒకదానికొకటి దట్టంగా అల్లుకునేవిధంగా చేసి అది అన్ని విషయాలలో ధృఢంగా ఉంది అని నిర్ధారించుకున్న తర్వాత దానిని వినియోగిస్తారట.. ఇలాంటి బ్రిడ్జ్ లు చిరపుంజి సమీపంలో చాలా ఉన్నాయట... కొన్ని కొన్ని బ్రిడ్జ్ లు ఐదువందల సంవత్సరాల వయస్సు కలిగినవి కూడా ఉన్నాయని చెపుతారు... ఇవి కనీసం వందమందిని ఒకేసారి మోయగలిగిన బలాన్ని కలిగి ఉంటాయి...
సరే ఇంత శ్రమ ఎందుకు చెక్కవో లేక కాంక్రీట్ తో నో చేసుకోవచ్చు కదా బ్రిడ్జ్ లు అంటారేమో.. మరి ఈ లివింగ్ బ్రిడ్జిల సంస్కృతి ఇప్పటిది కాదు.. అది కొన్ని వందల సంవత్సరాల నుండి ఒక తరం నుండి వేరొక తరానికి వస్తూఉన్న వారసత్వం... అప్పటిలో ప్రస్తుతం మనకున్న అధునాతన సాంకేతికత లేకపోవచ్చు...
అక్కడ ప్రవాహాల తాకిడి ఏవారథులూ నిలవవట.. అందుకే ఈ ప్రయత్నాలన్నీ... మొత్తానికి ప్రాచీన మన భారతదేశ మేఘాలయలోని ఈ చిరపుంజి బ్రిడ్జ్ లు అంతర్జాతీయంగా గుర్తింపు పొంది.. ఇపుడొక పర్యాటక ప్రదేశంగా మారింది...

Living Bridges, Cherrapunji

ఇప్పుడు చిత్రంలో మనకు కనపడుతోంది.. Umshiang Double Decker Bridge డబల్ డెక్కర్ బ్రిడ్జ్ అంటారు.. ఇది Jingkieng Nongriat అనే గ్రామంలో ఉంది..

Post a Comment

Whatsapp Button works on Mobile Device only