మన భారతదేశంలో అద్భుతాలకు,వింతలకువిడ్డూరాలకు కొదవేం లేదు... అలాంటి అద్భుతాలలో ఒకటి అరుణాచలం మరియు నందీశ్వరుడు::::
Amazing Temples n places in India, Arunachalam |
అందులో భాగంగా అరుణాచలం(తిరువణ్ణామలై) అగ్ని లింగం.. అంటే ఇక్కడ అరుణాచల పర్వతమే శివుని ప్రతిరూపం.. ఇక్కడ గిరిప్రదక్షిణం చేస్తే సాక్షాత్ పరమేశ్వరుడిని ప్రదక్షిణం చేసినట్లే... అందుకే ఇక్కడ గిరి ప్రదక్షిణం చాలా ముఖ్యమైనది..
ఈ క్షేత్ర దర్శనం చేసుకోవడానికి వచ్చిన వారు తప్పనిసరిగా గిరి ప్రదక్షిణాన్ని ప్లాన్ చేసుకుని వస్తే చాలా మంచిది... మొత్తం అరుణాచలం కొండ పరిధి దాదాపు పధ్నాలుగు కి.మీ ఉంటుంది.. ఈ మొత్తం దూరం చాలా విలువైన ఔషధ మొక్కలుండే ప్రాంతం.. అందుకే అక్కడ కాలినడకన చేసే ప్రదక్షిణం ఎన్నో వ్యాధులను నయం చేస్తుందని నమ్మకం... మొత్తం ప్రపంచాన్ని మర్చిపోవచ్చు ఆ ప్రదక్షిణంలో...
అయ్యవారు ఒక పర్వతమైతే అమ్మవారు ఇంకొక పర్వత రూపంలొ అగస్త్యీశ్వర మఠం నుండి చూస్తే పరమేష్ఠి, పరమాత్మలు కలిసి పోయి అర్థనారీశ్వర దర్శనంలా రెండు కొండలు కూడా ఒకే కొండలా కనిపించడం ఒక అద్భుతమే కదా...
అయ్యవారు ఒక పర్వతమైతే అమ్మవారు ఇంకొక పర్వత రూపంలొ అగస్త్యీశ్వర మఠం నుండి చూస్తే పరమేష్ఠి, పరమాత్మలు కలిసి పోయి అర్థనారీశ్వర దర్శనంలా రెండు కొండలు కూడా ఒకే కొండలా కనిపించడం ఒక అద్భుతమే కదా...
ఈ వీడియోలో 👇👇👇అరుణాచలేశ్వరుని ఆలయాన్ని అరుణాచల గిరిని చూడవచ్చు...
ఇక మొత్తం పర్వతమే శివుని రూపమంటే శివుని వాహనమైన నంది ఎలా ఉండాలి... ఖచ్చితంగా ఇంకొక కొండయై ఉండాలి కదా... ఖచ్చితంగా అలాంటి కొండలోనే నందీశ్వరుడు కొలువైఉంటాడు.. మనం నందీశ్వరుడిని చూడాలంటే ఒక నిర్థారిత ప్రదేశం దగ్గరకు వెళ్తే నందీశ్వరుడి ముఖ దర్శనం లభిస్తుంది.. మనం ఆ ప్రత్యేకంగా కేవలం ఆ కొండ ను మాత్రమే చూడడానికి ఆ కొండ దగ్గరకు వెళ్ళినా మనకు నందీశ్వరుడి ముఖం కనపడదు.. కేవలం నిర్ధారిత ప్రదేశం లోనే మనకు దర్శనమిస్తుంది..
ఎంత విచిత్రమో కదా ఆ భగవంతుడి మహత్యం...
హేతువాదులు ఎంత ఇది నమ్మినా నమ్మక పోయినా.. సాక్షాత్ పర్వతాన్నే శివుడిగా భావించే మనకు ఇంకొక పర్వత రూపంలో నందీశ్వరుడు కనిపించడం అద్భుతమే కదా!!
ఓం అరుణాచలేశ్వరాయ నమః !!

క్రింది వీడియోలో మీరు కొండలో ఉన్న ఆనందీశ్వరుని రూపాన్ని చూడవచ్చు
👇👇👇
Post a Comment