Saturday 27 September 2014

Sashtanga namaskaram - Panchanga Namaskaram

సాష్టాంగ నమస్కారం


అష్టాంగ నమస్కారమునే సాష్టాంగ నమస్కారము అని అంటారు.
 

సాష్టాంగ నమస్కారము అంటే మానవునికి వున్న ఎనిమిది అంగాలతో నమస్కారము చేయుట అని అర్ధము. 

సాష్టాంగ నమస్కారం చేసేటపుడు చదివే శ్లోకం::
ఉరసా శిరసా దృష్ట్యా మనసా వచసా తథా పద్భ్యాం కరాభ్యాం కర్ణాబ్యామ్ ప్రణామో ష్టాంగ ఈరితః
అష్టాంగాలు అంటే ఏమిటి.
1) "ఉరసా" అంటే తొడలు,
2) "శిరసా" అంటే తల,
3) "దృష్ట్యా" అనగా కళ్ళు,
4) "మనసా" అనగా హృదయం,
5) "వచసా" అనగా నోరు,
6) "పద్భ్యాం" అనగా పాదములు,
7) "కరాభ్యాం" అనగా చేతులు,
8) "కర్ణాభ్యాం" అంటే చెవులు.
ఇలా "8 అంగములతో కూడిన నమస్కారం" చేయాలి.

sashtanga and panchanga namaskara differences

మానవుడు సహజంగా ఈ 8 అంగాలతో తప్పులు చేస్తుంటాడు. 
అందుకే దేవాలయంలో బోర్లా పడుకుని పై శ్లోకం చదువుకుంటూ దేవునికి నమస్కరించి ఆయా అంగములు నెలకు తగిలించాలి.

ముఖ్యంగా దేవాలయంలో సాష్టాంగ నమస్కారం దేవునికి, ధ్వజ స్తంభానికి మధ్యలో కాకుండా ధ్వజ స్తంభం వెనుక వుండి చేయాలి.

1) ఉరస్సుతో నమస్కారం అనగా నమస్కారము చేసేటపుడు ఛాతి నేలకు తగలాలి.
2) శిరస్సుతో నమస్కారం అనగా నమస్కారం చేసేటపుడు నుదురు నేలకు తాకాలి.
3) దృష్టితో నమస్కారం చేసేటపుడు కనులు రెండు మూసుకుని మనం ఏ దేవునకు నమస్కారం చేస్తున్నామో ఆ మూర్తిని చూడగలగాలి.
4) మనస్సుతో నమస్కారం అనగా ఏదో మొక్కుబడికి నమస్కారం చేయడం కాకుండా మనఃస్పూర్తిగా చేయాలి.
5) వచసా నమస్కారం అంటే వాక్కుతో నమస్కారం. అంటే నమస్కారం చేసేటపుడు ప్రణవ సహితంగా ఇష్ట దైవాన్ని మాటతో స్మరించాలి.
అంటే "ఓం నమో నారాయణాయ " అని అంటూ నమస్కారం చేయాలి.
6) పద్భ్యాం నమస్కారం అంటే నమస్కార ప్రక్రియలో రెండు పాదములు కూడా నేలకు తగులుతూ ఉండాలి.
7) కరాభ్యాం నమస్కారం అంటే నమస్కారం చేసేటపుడు రెండు చేతులు కూడా నేలకు తగులుతూ ఉండాలి.

8) జానుభ్యాం నమస్కారం అంటే నమస్కారం చేసేటపుడు రెండు మోకాళ్ళు కూడా నేలకు తగులుతూ ఉండాలి.
స్త్రీలు సాష్టాంగ నమస్కారం చేయకూడదు. ఆడవాళ్లు పంచాంగ నమస్కారం మాత్రమే చేయాలి. అంటే కాళ్లు, చేతులు, నుదురు మాత్రమే నేలకు తాకేలా స్త్రీలు నమస్కారం చేయాలని శాస్త్రం చెబుతుంది.

పూజ పూర్తయిన తరువాత మంత్ర పుష్పాన్ని భగవానుడికి భక్తితో సమర్పించుకునే సందర్బంలో సాష్టాంగ నమస్కారం లేదా పంచాంగ నమస్కారం చేయాలి. దైవానికి, గురువులకు, యతులకు వారు ఎదురుపడిన వెంటనే సాష్టాంగ నమస్కారం చేయాలి. నూరు యజ్ఞాలు చేయడం వల్ల కూడా పొందలేని ఉత్తమ గతులను సాష్టంగ నమస్కారం చేసేవాళ్లు పొందుతారని శాస్త్రవచనం.


సాష్టాంగ నమస్కారం ఎక్కడ చేయాలి???

పూజ పూర్తయిన తరువాత మంత్ర పుష్పాన్ని భగవానుడికి భక్తితో సమర్పించుకునే సందర్బంలో సాష్టాంగ నమస్కారం చెయ్యాలి. దైవానికి, గురువులకు, యతులకు వారు ఎదురుపడిన వెంటనే సాష్టాంగ నమస్కారం చేయాలి. దేవాలయంలో అయితే ధ్వజస్తంభానికి ఈవల మాత్రమే సాష్టాంగ నమస్కారం చెయ్యాలి. ధ్వజ స్తంభానికి లోపల మాత్రం సాష్టాంగ నమస్కారం చెయ్యకూడదు.

నూరు యజ్ఞాలు చేయడం వల్ల కూడా పొందలేని ఉత్తమ గతులను సాష్టంగ నమస్కారం చేసేవాళ్లు పొందుతారని శాస్త్రవచనం.


స్త్రీలు ఎందుకు సాష్టాంగ నమస్కారం చేయకూడదో తెలుసా???... 
పురుషులు మాత్రమే సాష్టాంగ నమస్కారానికి అర్హులని పేర్కొంది...
స్త్రీలు పంచాంగ నమస్కారం చేస్తే చాలని చెప్పబడింది....
సాష్టాంగ ప్రణామము చేయటానికి ఎనిమిది అంశాలు అవసరమౌతాయి. అవి చాతి (రొమ్ము), నుదురు, శబ్దం, మనస్సు,కాస్త ఎడంగా పెట్టి నమస్కార రూపంలో ఉంచిన చేతులు, కళ్ళు, మోకాళ్ళు మరియు పాదాలు.
సాష్టాంగ నమస్కారం చేయునప్పుడు రెండు పాదాల ముందుభాగం మోకాళ్ళు, చాతి మరియు నుదురు మాత్రమే నేలకు ఆనించి ఉంచాలి. అలా సాష్టాంగ పడ్డప్పుడు చేతులను తలభాగం పైకి ఎత్తి నమస్కరిస్తూ దేవతను ప్రార్థించాలి. అలా ప్రార్థిస్తున్నప్పుడు దేవుడి మంత్రాలను లేక శ్లోకాలను ఉచ్చరిస్తూ, దేవుడి విగ్రహంపై దృష్టిని ఉంచి మనస్సులో దేవుడిని ధ్యానించాలి.
SASHTANGA NAMASKARAM

ఈ పద్దతిలో నమస్కారం అనేది స్త్రీల శరీర నిర్మాణానికి తగినట్లు ఉండదు... స్త్రీలు సాష్టాంగ నమస్కారం చేసేటపుడు, ఉదరం, పాలిండ్లు, కటి ప్రదేశం నేలకు తగిలే అవకాశం ఉంది... అందువలన గర్భస్థ మహిళలకు, పిల్లలకు పాలిచ్చే మహిళలకు చాలా కష్టంగా ఉండి ప్రమాదం సంభవించవచ్చు.. ఆధునిక శాస్త్రం సైతం స్త్రీలు ఇలాటి ప్రణామాలు చేయడం ద్వారా వారి గర్భాశయం స్థానభ్రమంశం అయ్యే అవకాశం ఉందని తెలియజేయడం జరగింది...  అందుకని మన పెద్దలు స్త్రీలు మోకాళ్ళపై ఉండి నమస్కారించడమో, ధ్యానించడమో లేక మోకాళ్ళపై ఉండి మోకరిల్లడమో(పంచాంగనమస్కారం) చేస్తే చాలు అని చెప్పారు....
అందుకే మరొక ప్రాణికి జన్మనిచ్చి చైతన్యవంతులను చేయగలిగిన అమ్మలకు ఇందులో వెసులు బాటు కలిగించారు....

Tags:
Sashtanga Namaskaram and Ashtanga Namaskaram difference
SashTanga Namaskaram significance and how to perform
Sashtanga Namaskaram importance
Sashtanga Namaskaram shlokam
Sashtanga Namaskaram where to perform?
Sashtanga Namaskaram how to perform?


  1. this was told by sri Chaganti once in his pravachanams.

    ReplyDelete
    Replies
    1. ధన్యవాదములు కమనీయం గారు... చాగంటి గారు కూడా ప్రవచించారు... ఇది నేను కొత్త గా చెప్పింది కాదు సార్!! తెలియని వారికోసమే పంచాను...

      Delete

Whatsapp Button works on Mobile Device only