Inspirational stories::ముంబై డబ్బావాలా::
ముంబై మహానగరం ఎప్పుడూ పనిచేస్తూనే ఉంటుంది.. అంటే రోజులో ఇరవైనాలుగు గంటలూ ఈ నగరం మేల్కొనే ఉంటుంది... మన భారతదేశపు రాజధాని ఢిల్లీ అయితే.. వాణిజ్యరాజధాని ముంబై... అందుకే ఢిల్లీ తర్వాత ముంబైకే అత్యంత ప్రాముఖ్యత...ఈ మహానగరంలో పనిచేయడానికి చుట్టుప్రక్కల నుండి వంద కి.మీ. నుండి కూడా పనిచేయడానికి వచ్చే వారుంటారు.. డైలీ సర్వీసులు/మెట్రో రైళ్ళు ప్రతి రోజూ క్రిక్కిరిసి పోతూ ఉంటాయి..
కానీ ప్రతి ఒక్కరికి ఒక ఆశ తన స్వంత ఇంటి భోజనం చేయాలని...
తమ అమ్మ/భార్య చేతి వంట స్వయంగా తనకోసం వండిన దానిని భుజించాలని ఆశగా ఉంటుంది.. ఐదు నక్షత్రాల హోటళ్ళలో బిరియానీ కన్నా తన స్వంత ఇంటి పచ్చడి మెతుకులే చాలా సంతృప్తినిస్తాయి చాలామందికి...
ఇదిగో ఈ ఆశనే తమ ఆశయం(పెట్టుబడి)గా చేసుకున్నారు డబ్బావాలాలు...
వీరంతా ఒక నెట్ వర్క్ గా ఏర్పడి ఇళ్ళ దగ్గరనుండి క్యారియర్ లు తీసుకుని బయలు దేరి గమ్యస్థానాలకు చేరుస్తారు.. ఇది కూడా కేవలం గంటన్నర నుండి రెండు గంటల వ్యవధి లోపల.... వీరి అసోసియేషన్ వలన కొన్నివేల మందికి ఉపాధి కలగడమే కాకుండా కొన్ని లక్షల(నిజమే కొన్ని లక్షల క్యారియర్ లు చేతులు మారతాయి) కుటుంబాల ఆశలు నెరవేరాయి..
ఇక్కడ గమనించవలసినదేమంటే ఒకరి సెంటిమెంట్ ఇంకొకరి జీవనోపాధి అయింది...
సిక్స్ సిగ్మా అని ఒక సంస్థ ఉంది.. ఇది ప్రపంచంలో ఒక ప్రతిష్టాత్మకమైన సంస్థ..ఈ సంస్థ ఏదైనా ఒక ఆర్గనైజేషన్ వారి కార్యకలాపాలలో లక్ష లావాదేవీలలో ఎన్ని లోపాలున్నాయి అనే దానిమీద ఒక గుర్తింపు ఇస్తుంది.. ఈ సంస్థ మన డబ్బావాలా వారి అసోసియేషన్ స్థాయి సిక్స్ సిగ్మా స్థాయి అని సర్టిఫికేట్ ఇచ్చింది.. (సామ్ సంగ్ ఫోన్/సోని/నోకియా లాంటి సంస్థలు కూడా ఆ స్థాయిని అందుకోలేదు.. ఒక్క మోటారోలా అనే ఫోన్ కంపెనీ మాత్రమే సిక్స్ సిగ్మా స్థాయి కంపెనీ)అంటే డబ్బావాలాల ఆరు లక్షల క్యారియర్ Transactions లలో కేవలం ఒకటి కూడా తప్పుడు గమ్యస్థానానికి వెళ్లదు.. అంతటి ఖచ్చితత్వం వారిది.... సమోసాలు అమ్మాలనో లేక క్యారియర్ లు మోయాలనో కాదు నా ఉద్దేశ్యం... అవకాశాలను జాగ్రత్తగా ఒడిసిపట్టుకోవాలని నా ఉద్దేశ్యం... గొప్ప గొప్ప పనులు చేయలేకపోవచ్చు... కానీ చేసే చిన్న పని కూడా గొప్పగా చేయాలి.. ఇదే మన ప్రస్తుత పోస్ట్ యొక్క సారాంశం..
Post a Comment