దేవి నవరాత్రి ప్రాశస్త్యం :: మొదటి రోజు అలంకరణ ::
దేవీ నవరాత్రులు సంవత్సరంలో చాలా సార్లు జరుగుతాయి..కానీ శరదృతువులో వచ్చే నవరాత్రులు శ్రేష్టమైనవి ఎందుకంటే...::
దేవతలకు ఒక రోజు = మానవులకు ఒక సంవత్సరం..
ఒక సంవత్సరం లో దేవతలకు ఉత్తరాయణం పగలు అయితే దక్షిణాయణం రాత్రి అవుతుంది..
రోజు లో ప్రతి మూడు గంటలకు ఒక ఝాముగా పరిగణిస్తాం ఇందులో వేకువ ఝాము అత్యంత విశిష్టమయినది అందుకే ఆ కాలాన్ని బ్రహ్మ ముహూర్తం అంటాము.. ఈ బ్రహ్మ ముహూర్తంలో తలపెట్టిన పనులేవైనా దిగ్విజయంగా పూర్తి అవుతాయి...
అలాగే మన ఒక సంవత్సరకాలం దేవతలకు ఒక రోజు అనుకున్నాం కదా ..శరదృతువు దేవతలకు వేకువఝాములాంటిది... రోజులో వేకువ ఝాము ఎంత శ్రేష్టమో సంవత్సరంలో ఈ శరదృతువు అంత శ్రేష్టం.. శరదృతువులో వచ్చే ఈ పండుగ మరియు .. ఈ దసరా నవరాత్రులలో అమ్మవారిని సేవించడం అత్యుత్తమం... శరదృతువులో వస్తుంది కాబట్టి ‘శరన్నవరాత్రులు’ అంటారు.
ఈ ఋతువులో వర్షాకాలం ముగిసి చలికాలం మొదలవుతుంది. ఈ సమయంలో వాతావరణంలో కలిగే మార్పులు అనేక రోగాలకు కారణమవుతాయి. అందుకే ఈ అశ్వయుజ శుద్ధ పాడ్యమినుండి నవమి వరకు శక్తి ఆరాధన పేరుతో ప్రజలంతా శుచిగా, శుభ్రంగా ఉండి ఎలాంటి రోగాల దరిజేరవన్నది ఈ నవరాత్రి వేడుకల వెనుక ఉన్న చరిత్ర.
మార్కండేయ మహర్షి అమ్మవారిని ఎలా ఆరాధించాలి అని అడగడంతో బ్రహ్మ ఇలా వివరించాడట. ప్రధమంశైలపుత్రిణి, ద్వితీయం బ్రహ్మచారిణి
తృతీయం చంద్రఘంటేతి, కూష్మాంతేతి చతుర్ధామ్||
పంచమం స్కంధమాతేతి షష్ఠమం కాత్యాయనీ తిచ
సప్తమం కాళరాత్రంచ, మహాగౌరేతి చాష్టమం
నవమం సిద్ధితి ప్రోక్త, నవదుర్గ ప్రకీర్తిత||
ఆ జగన్మాతను వేర్వేరు ప్రదేశాలలో వేర్వేరు విధాలుగా అలంకరించుకోవడం మనందరకు విదితమే..
అందుకే శ్రీశైలంలో అమ్మవారి అలంకరణలు క్రింది విధంగా ఉంటాయి..
1 శైలపుత్రి
2 బ్రహ్మచారిణి
3 చంద్రఘంట
4 కూష్మాండ
5 స్కందమాత
6 కాత్యాయని
7 కాళరాత్రి
8 మహాగౌరి
9 సిద్ధిధాత్రి
విజయవాడ కనకదుర్గ అమ్మవారిఅమ్మవారి అలంకరణలు క్రింది విధంగా ఉంటాయి..
శ్రీ స్వర్ణ కవచాలంకృత దుర్గాదేవి ... పాడ్యమి
శ్రీ బాలా త్రిపురసుందరీ దేవి ... విదియ
శ్రీ అన్నపూర్ణాదేవి ... తదియ
శ్రీ గాయత్రీదేవి ... చవితి
శ్రీ లలితా త్రిపుర సుందరీదేవి ... పంచమి
శ్రీ సరస్వతీదేవి ... షష్ఠి
శ్రీ మహాలక్ష్మీదేవి ... సప్తమి
శ్రీ దుర్గాదేవి మరియు మహిషాసురమర్ధిని దేవి ... అష్టమి/నవమి
శ్రీ రాజరాజేశ్వరీ దేవి ... దశమి జైమాతాజీ!!
Devi Navaratri 1st day |
Post a Comment