Friday, 1 August 2014

ఒక IIM లో ప్రొఫెసర్ Marketing Concepts గురించి ఎలా వివరించాడో చూడండి… A funny narration for Marketing technics

ఒక IIM లో ప్రొఫెసర్ Marketing Concepts గురించి ఎలా వివరించాడో చూడండి…
1. మీరు పార్టీ లో ఒక అందమైన అమ్మాయి ని చూసారు. మీరు నేరుగా ఆమె దగ్గరకు వెళ్ళి,
“నేను చాల ధనవంతున్ని. నన్ను పెళ్ళి చేసుకోండి” అని అడిగితే అది
– “Direct Marketing”

2. మీరు మీ స్నేహితులతో పార్టీ లో ఉన్నారు. మీకొక అందమైన అమ్మాయి తారసపడింది.
మీ స్నేహితుడొకడు ఆమె దగ్గరకు వెళ్ళి మీకేసి చూపిస్తూ ,
“ఆయన చాల ధనవంతుడు. ఆయన్ని పెళ్ళి చేసుకోండి” అంటే అది -
”Advertising”

3. మీరు పార్టీ లో ఒక అందమైన అమ్మాయి ని చూసారు. మీరు ఆమె దగ్గరికెళ్ళి కాస్సేపు మాట్లాడి, ఆమె నంబర్ తీసుకున్నారు. మరునాడు ఆమెకి కాల్ చేసి “నేను చాల ధనవంతున్ని. నన్ను పెళ్ళి చేసుకోండి” అని అడుగుతారు.
అది – “Telemarketing”

4. మీరు పార్టీ లో ఒక అందమైన అమ్మాయి ని చూసారు. ఆమె ని చూడగానే మీరు మీ టై సరిచేసుకొని, ఆమె దిగుతున్న కార్ డోర్ తెరిచి, లగేజ్ చేతిలోకి తీసుకొని, ఆమెని లోనికి తీసుకెళ్ళి, చేతికి ఒక డ్రింక్ అందించి, “మీకు తెలుసో లేదో..నేనొక ధనవంతున్ని.నన్ను పెళ్ళి చేసుకోండి” అంటారు.
అది -”Public Relations”

5. మీరు పార్టీ లో ఒక అందమైన అమ్మాయి ని చూసారు. ఆ అమ్మాయె మీ దగ్గరకు వచ్చి “మీరు చాల ధనవంతులని వన్నాను. నన్ను పెళ్ళి చేసుకుంటారా?” అని అడిగుతుంది.
అది “Brand Recognition”

6. మీరు పార్టీ లో ఒక అందమైన అమ్మాయి ని చూసారు. మీరు నేరుగా ఆమె దగ్గరకు వెళ్ళి, “నేను చాల ధనవంతున్ని. నన్ను పెళ్ళి చేసుకోండి” అని అడిగారు. ఆమె మీ చెంప ఛెళ్ళుమనిపించింది.
అది -”Customer Feedback”

7. మీరు పార్టీ లో ఒక అందమైన అమ్మాయి ని చూసారు. మీరు నేరుగా ఆమె దగ్గరకు వెళ్ళి, ” నేను చాల ధనవంతున్ని. నన్ను పెళ్ళి చేసుకోండి” అని అడిగారు. ఆమె తన భర్తని మీకు పరిచయం చేసింది.
అది -”Demand and Supply gap”

8. మీరు పార్టీ లో ఒక అందమైన అమ్మాయి ని చూసారు. మీరు నేరుగా ఆమె దగ్గరకు వెళ్ళేలోగా మరొకడు వెళ్ళి ఆమె తో ” నేను చాల ధనవంతున్ని. నన్ను పెళ్ళి చేసుకోండి” అని అడిగాడు. ఆమె అతనితో వెళ్ళిపొయింది.
అది -”Competition eating into your market share”

9. మీరు పార్టీ లో ఒక అందమైన అమ్మాయి ని చూసారు. మీరు నేరుగా ఆమె దగ్గరకు వెళ్ళి ” నేను చాల ధనవంతున్ని. నన్ను పెళ్ళి చేసుకోండి” అని అడిగేలోగా మీ భార్య వెంకనుండి వచ్చి మొట్టికాయ వేసింది.
అది -”Restriction for entering new markets”

ఆంగ్లమూలం నుండి అనువదించబడినది:

Post a Comment

Whatsapp Button works on Mobile Device only