గతంలో మన పేజీ నుండి భారతదేశ ఖ్యాతి గురించి చాలా సార్లు వేసాను...
కానీ ప్రస్తుతం చాలా వెనుకబడి పోయాము...
మన గత కీర్తి , ప్రస్తుతం ఎలా ఉన్నామో...
ఒక చిన్న వ్యాసం... పూర్తిగా చదవండి..
INDIA THEN … భారతదేశం యొక్క ఘనత (ప్రపంచానికి అందించినవి)
1. సున్న("0") ను కనుగొన్నది ఆర్యభటుడు (ఈతని పేరే మన దేశం ప్రయోగించిన మొదటి ఉపగ్రహానికి పెట్టారు) 2.గత 1000 సంవత్సరాలలో మనదేశం ఏ దేశం పైనా దండెత్తలేదు.
3.క్రీ.పూ 700 సంవత్సరంలోనే ప్రపంచంలోని మొట్టమొదటి విశ్వవిద్యాలయాన్ని తక్షశిలలో నిర్మించారు.ఇక్కడ సుమారు 10,500 మంది ప్రపంచంలోని నలుమూలలనుండి వచ్చి విద్యను అభ్యసించారు.క్రీ.పూ 400 లో నలంద విశ్వవిద్యాలయాన్ని నిర్మించారు.
3."ఫోర్బ్స్" పత్రిక ప్రకారం కంప్యూటర్ కు అత్యంత అనుకూలమైన భాష సంస్కృతం.
4.పాశ్చాత్యప్రపంచం ఈ మధ్య కనుగొన్న ప్లాస్టిక్ సర్జరీ ని ఏనాడో 2600 సంవత్సరాలకు పూర్వమే సుశ్రుతుడు చేసాడు.
5.దేశప్రాంత పటాలు 5000 సంవత్సరాల పూర్వమే సింధునాగరికత కాలంలోనే మనవారు కనుగొన్నారు.ఆంగ్ల పదం నావిగేషన్ మన సంస్కృత పదం ఐన నవగతిః నుండి వచ్చింది.
6.పైథాగరస్ సిద్దాంతాన్ని,"పై" విలువను మొదటిసారిగా కనుగొన్నది మన భారతీయులే.
7.గ్రీకులు,రోమనులు 105 అంకెల వరకు లెక్కించిన కాలంలోనే మనవారు 1053 వరకు లెక్కించారు.
8.1896వ సంవత్సరం వరకు ప్రపంచంలోనే ఏకైక వజ్రాల ఉత్పత్తిదారు,ఎగుమతిదారు ఒక్క భారతదేశమే. 9.మార్కోని కన్నా ముందే జగదీష్ చంద్రబోస్ రేడియో తరంగాలను కనుగొన్నాడు.
10.చదరంగం కనుగొన్నారు.
11.పాశ్చాత్య ప్రజలు ఇంకా అడవులలోనే జీవిస్తున్నకాలం లోనే మనవారు సింధునాగరికత లో ఉన్నారు. 12.దశాంశపద్దతిని కనుగొన్నది భారతీయులే.
INDIA NOW…
1. స్వాతంత్రము వచ్చిన గత 66 సంవత్సరాలలో శాస్త్రాలలో మన నూతన ఆవిష్కరణలు శూన్యం "0". (ఉపగ్రహ పరిశోధనలు తప్ప)
2. గత 66 సంవత్సరాలలో పాకిస్తాన్, చైనా ఆక్రమించిన భూభాగాలగురించి మనము ఏమీచేయలేదు. వారి కవ్వింపు చర్యలకు, ఉగ్రవాద చర్యలకు మన చేతకాని తనాన్ని ప్రదర్శించాము.
3. ఇప్పుడు మనవిశ్వవిద్యాలయాలలో ప్రపంచస్థాయి విద్యాలయము ఒక్కటీలేదు.
4. సంస్కృతాన్ని పూర్వం ఇండోయూరపియన్ లాంగ్వేజ్ అనేవారు. ఇప్పుడు సంస్కృతములో వేదాలనుండి, శాస్త్రాల వరకు ప్రతి పరిశోధన పాశ్చాత్యదేశాలలోనే జరుగుతున్నది. మన "సెక్యులర్" విద్యావిధానం సంస్కృతాన్ని హత్య చేసింది. సంస్కృతములో పరిశొధనలకు మనకు విదేశాలే గతి.
5. సుశ్రుతుడు, చరకుడూ సరే - నేడు ఆయుర్వేదము ఏస్థితిలో ఉన్నది? మన వృక్షసంపద - పసుపు, వేప వంటి వాటిని విదేశీయులు పేటెంట్ చేసుకునే స్థితి వచ్చినది.
6. సింధునాగరికత సరే, మనకి ఇప్పుడు ఉన్న నాగరికత ఏమిటి? సింధు-సరస్వతీ నాగరికతల అధ్యయనానికి మన దేశము ఇచ్చిన ప్రాముఖ్యత ఏమిటి? AIT (Aryan Invasion Theory కి దీటుగా మనము OIT (Out of India Theory) ని నిరూపించడానికి ప్ర్యత్నిస్తున్నామా! వెండీ డోనిగర్ , మైకెల్ విట్జెల్ వంటి వారి తప్పుడు రాతలను acadameic and scholarly level లో ఖండించగలుగుతున్నామా?
7. పైథగొరస్ సిద్ధాంతము శుల్బ సూత్రాలలో ఉన్నదని, "పై" విలువకు మనవాళ్ళు ఇచ్చిన విలువను మన గణితపుస్తకాలో ఇస్తున్నామా?
8. గణిత శాస్త్రములో 66 సం.లో మన ప్రగతి ఎంత? బంతి ఆటగాళ్ళకు, సినిమాలలో కుప్పిగంతులు వేసేవాళ్ళకు ఇచ్చిన ప్రాముఖ్యత, పనిచేసే వాతావరణం మన విద్యా, వైజ్ఞానిక రంగాలకు ఇస్తున్నామా?
9. జగదీశచంద్రబోస్ రేడియోలో ఏమిచేశాడో మన టెలికాం వారికి కనీసం తెలుసా? రామన్ బోస్ లు స్వాతంత్ర్యము రాకముందు పనిచేశారు. ప్రపంచ ప్రఖ్యాతి వదిలేయండి. దేశ స్థాయిలో సైన్స్ ఎకాడమీల ఫెలొస్ ఆంధ్ర, తెలంగాణా రాష్ట్రాలలో ఎంతమంది ఉన్నారు?
10. అమెరికా నగరాలలో తక్కువ తరగతివారు డౌన్టౌన్ లలో బ్రతుకుతుంటే, మధ్యతరగతి వారు విశాలమైన సబర్బ్స్ లో బ్రతుకు తున్నారు. అమెరికాలో ప్రతివారు 12 వరకు ఉచితవిద్య పొందగలరు. మనము ఇప్పుడు నగరాలలో కాంక్రీట్ అడవులలో బ్రతుకుతున్నాము. మన రోడ్లు మన నగరాలలో నేర ప్రవృత్తి బాగా పెరిగిపోయాయి. విద్య, వైద్యరంగాలు వాణిజ్యరంగం పరంచేసాం.
11. అప్పుడు చదరంగం కనుగొంటే ఇప్పుడు భయంకరమైన తెలుగు సినిమా అనే సంస్కృతిని, ప్రభుత్వ పర్యవేక్షణలోని సారా వ్యాపారాన్ని, ప్రవేశ పెట్టాము. అప్పుడు ప్రభువులు దేవాలయాలు కట్టిస్తే, ఇప్పటి ప్రభుత్వం హిందూదేవాలయాలను, భూములను కబ్జా చేసింది.
12. భారతదేశ ఐక్యతకు సమగ్రతకు ఏకైక పునాది సనాతన ధర్మమనే నిజాన్ని పైకి చెప్పుకోలేని స్థితిలో హిందువులు ఉంటే ఆచార్య ఐలయ్య వంటి వారు హిందూమతానంతర భారతం గురించి కలలు గంటున్నారు. అసలు అప్పుడు భారతదేశమనే దేశపు ఉనికికి అవసరం ఏముంది?
మన గతాన్ని చూసి మురిసిపోతూ భవిష్యత్ ప్రశ్నార్థకంగా మార్చుకోరాదు..
ఈ వ్యాసానికి ముగింపు ఎలా చేయాలో కూడా నాకు అర్థం కాలేదు..
చాలా ప్రశ్నలున్నాయి..
కానీ మన భారత దేశం గొప్పది...
తప్పని సరిగా మరికొన్ని సంవత్సరాలలో పైన తెలిపిన వాటన్నిటికీ భరతవాక్యం చెప్పవచ్చు...
ఎందుకంటే మోడీ సర్కార్ భారతీయతకు పెద్ద పీట వేస్తోంది...
ఉదా: గంగా నదీ ప్రక్షాళన, నదీ జలాల అనుసంధానం, పాఠశాలలో సమగ్ర మూల్యాంకనా విధానాన్ని ప్రవేశ పెట్టడం, ఊర్లలో ఉన్న చిన్న చిన్న ఏర్లను, సెలయేళ్ళను అనుసంధానం చేసి జీవనది లా మార్చే ప్రయత్నం, మూడు నెలలకొకసారి మంత్రుల ప్రవర్తనా సమీక్ష.. మొదలగునవి... ప్రక్షాళన మొదలైంది... ముగింపు సాధ్యమేమో... behope...
2) ఇది పూర్తిగా అబధ్ధం. అసలు భరతఖండం అన్న భావనకి వేర్వేరు కాలాల్లో వేర్వేరు అర్ధాలు ఉన్నాయి. మొఘలులనాటికే భారతదేశం అన్నభావన పూర్తిగా అంతరించింది. ఇక్కడి రాజులు కేవలం తమతమ రాజ్యాలను రచించుకొనే/రక్షించుకొనే ప్రయత్నాలుచేశారేతప్ప, భారతదేశం అనే ఒక భావనతో ఏదో ఒక syndicateలా ఏర్పడి పోరాడినట్లు ఆధారాలులేవు. ఆఖరుకి బ్రిటీష్వారి హయాంలోకూడా దక్షణభారతదేశంలో 1857నాటి తిరుగుబాటు జాడలు కనబడవు. ఆతరువాతి స్వాతంత్ర్య పోరాటంలోకూడా ఏవో కొందరు మహానుభావునులుచేసిన ప్రయత్నాలుమినహా దేశమంతా సమిష్టిగా ఒకేతీవ్రతతో తెల్లవాళ్ళను ఎదురొడ్డిందిలేదు.
ReplyDelete4) సంస్కృతం అంటరానివాళ్ళకుగానూనిషేధించినప్పుడే అధికసంఖ్యాకులకు అవసరంలేని పదార్ధమయ్యింది. ఆపరిష్తితులు కొనసాగుతుండగానే వచ్చిపడిన తెల్లదొరలతో, కులపరిమితులకు లోబడని ఆంగ్లభాష రాజభాషయైకూర్చుంది. సంస్కృతభాషా దుస్థుతికి కారణలు లౌకికత్వంకాదు. కులతత్వం. ఈనాటి వ్యాపార ప్రపంచంలో ఉపాధికల్పనకు ఆలవాలమైతేతప్ప దాన్ని ఉధ్ధరించలేం.
5) ఆయుర్వేద గ్రంధాలలోని చెత్తను నిర్దాక్షిణ్యంగా బుట్టదాఖలుచెయ్యాలి. ఆచెత్తంతా వదిలితే ఆయుర్వేదపు విశ్వసనీయత పెరుగుతుంది. ఈనాటికీ సంతాప్రాప్రికోసం టెంకాయను మంత్రించి తూర్పుదిక్కునపాతిపెట్టమనిచెప్పే బుధ్ధిశాలురు బ్లాగుల్లోనే ఉన్నారు.
*) researchమీద మన ప్రస్తుత ప్రభుత్వాలకున్న నమ్మకం, ప్రేమ, గౌరవం అతితక్కువ. మనం immediate resultsపైని ఆపేక్షతతో అమితమైన లాభాపేక్షతో వ్యవహరిస్తున్నాం. అందుకే ఖొరానాలు, బోసులు, ఘోషులు పరిశోధనలనిమిత్తమై విదేశాలకు తరలి వెళ్ళాల్సిన పరిస్థితిని కొనితెచ్చుకున్నాం.
'సెక్యులర్' నిందావాచకమెప్పుడయ్యిందో నాకు అర్ధం కాకున్నది. మీరుదహరించిన అభివృధ్ధిచెందిన దేశాలన్నీ సెక్యులర్ దేశాలే. పొరుగుదేశంలా మతరాజ్యంలా తయారవడం మ్నకు మంచిదా?
అరుణ్ షౌరి ఎన్నికల సమయం అప్పుడు ఇండియాలొ సెక్యులరిజం ఇజ్ ఎ ప్రాసిట్యుటేడ్ వర్డ్ అని ఎప్పుడో అన్నాడు.
ReplyDeleteఈ సారి ఎన్నికల లో బిజెపిని తప్పించి మిగతా అన్ని పార్టిలు కలసి మతత్వ పార్టి అయిన బిజెపి ని ఓడించి ఇండియా లో సెక్యులరిజం రక్షించాలనే నినాదాలిచ్చాయి. కాంగ్రెస్ అధ్యక్షురాలు టి వి లో ప్రత్యేకంగా పిలుపును ఇస్తూ చేసిన ప్రచారం మీకు గుర్తుండే ఉంట్టుంది. అంతేనా ఏ విదేశి పత్రిక చూసినా బిజెపి ని హిందూ పార్టిగా నే వర్నించింది. కాని ప్రజలు ఆ పార్టికి అత్యల్పంగా 44 సీట్లు అంటాగట్టారంటే అర్థమేమిటి? దేశ ప్రజలు సెక్యులరిజ నినాదాన్ని ఈ సారి ఎన్నికలలో పూర్తిగా తిరస్కరించారు.ఇండియా పాకిస్థాన్ లా అయ్యే ప్రసక్తే లేదు. ఇలా రాసే వారికి చరిత్ర మీద అవగాహన లేదని అర్థమౌతుంది.
Dear UG Sriram,
Deletewith due due respect to Shourie and you, I would like to ponder if there is any word that has not been prostituted. Consider for example humanity, 'swadeshi', 'Indian', 'culture', 'mother india' etc... Dear fellow, nothing is permanent. And so is this 'chunaav'. Behold the same people might reject BJP after five more years. Even they do, it wouldn't (probably) mean the death of the party in the question does it?