ఆంగ్ కోర్ వాట్ ప్రపంచంలోనే అతి పురాతనమైన, అత్యంత పెద్దదైన హిందూ దేవాలయం..
చరిత్రను పరికిస్తే...
హిందూ సంస్కృతి ఆనవాళ్ళు విశ్వవ్యాప్తంగా ఎన్నో దేశాల్లో ఉన్నట్టు ఇప్పటికే ఋజువులున్నాయి.
వేల ఏళ్ళ క్రితమే మన హిందూ సంస్కృతి ప్రపంచం నలుమూ లలా ఫరిఢవిల్లింది.
నాటి హిందూ రాజులు మన సంస్కృతిని విశ్వ వ్యాప్తం చేశారు.
మన సంప్రదాయాలు, శిల్ప కళా నైపు ణ్యం విదేశాల్లో ఇప్పటికీ వేనోళ్ళ పొగడ్తలందుకుంటూనే ఉంది.
హిందూ దేవాలయ సంప్రదా యం కేవలం మన భారతదేశంలోనే కాకుండా అనేక దేశాల్లో కూడా వ్యాపించింది.
జైన, బౌద్ధ మతాల కన్నా హిందూ మతం బాగా పరిఢవిల్లిం దనడం అతిశయోక్తి కాదు.
అందుకు నిదర్శనమే ఈ కంబోడియా లోని కొన్ని వం దల సంవత్సరాల క్రితం నిర్మించిన విష్ణూదేవు ని ఆలయం ‘ఆంగ్‌కోర్ వాట్’.
Ancient Vishnu idol, Angkorewat |
ఆంగ్‌కోర్ వాట్ దేవాలయం కంబోడియాలోని సీమ్ రీప్ పట్టణానికి సుమారు ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది. హిందూ సంస్కృతీ సంప్రదాయాలు ప్రతిబింబించే అద్భుతమైన శిల్పకళా నైపుణ్యం ఇక్కడ కనిపి స్తుంది. భారతీయ ఇతిహా సాలను తనలో ఇముడ్చుకుని అందరినీ ఆకట్టుకుంటోంది. అంతేకాదు ఈ దేవాల యం ఆ దేశ జాతీయ పతాకంలో కూడా స్థానం సంపాదించుకుంది. ఈ ఆలయానికి కొన్ని దశాబ్దాల చరిత్ర ఉంది. ఖ్మేర్ సామ్రాజ్యంలో ఈ అద్భుత కట్టడానికి అంకురా ర్పణ జరిగింది. క్రీశ 12వ శతాబ్దకాలంలో ఆంగ్ కోర్ వాట్‌ను రాజధానిగా చేసుకుని పాలించిన రెండవ సూర్యవర్మన్ కాలంలో ఈ ఆలయ నిర్మాణం జరిగి నట్లు చరిత్ర చెబుతోంది. దీన్ని నిర్మించడానికి సుమారు 30 సంవత్సరాలు పట్టిందట.
వ్యాఖ్యను జోడించు |
ఖ్మేర్ సామ్రాజ్యంలో నీటిని నిల్వ చేసుకునేందుకు అద్భుత మైన టెక్నాలజీని ఉపయో గించారు. ఇక్కడి నీరు పల్లం నుండి ఎత్తుకు ప్రవహించేదట. అదే టెక్నాలజీని ఆంగ్ కోర్ వాట్ దేవాలయంలో కూడా వాడారు. ఇది అప్పట్లోనే ఎలా సాధ్యమయ్యిందనే విషయం అందర్నీ ఆశ్చర్యపరుస్తుంది. ఐదు మైళ్ల పొడవు, ఒకటి న్నర మైలు వెడల్పు తో విశాలమైన రిజర్వాయర్లు (వీటిని అక్కడ ‘బారే’లు అంటారు) నిర్మించడం ఆనాటి ఇంజనీర్ల ప్రతిభకు నిదర్శనం. ఈ రిజర్వాయర్లను వ్యవ సాయ అవసరాలకు కూడా ఉపయోగించే వారట. ఫ్రెంచ్ ఆర్కియాలజిస్ట్ ఫిలిప్ గ్లోసియర్ ఈ రిజర్వా యర్లపై పరి శోధన జరిపి ఈ విషయాన్ని ధృవపరిచారు.
నాసా చిత్రీకరించిన ఉపగ్రహ చిత్రాల ఆధారంగా పరిశోధ నలు జరిపిన సిడ్నీ యూనివర్శిటీ ఆర్కియాలజిస్టుల పరిశోధన కూడా ఫిలిప్స్ అభిప్రాయాన్ని బలపరు స్తోంది. ఉపగ్రహ చిత్రా ల్లో అప్పటి మానవ నిర్మితమైన నీటి ట్యాంకులు, కాలువలు, డ్యాములు చాలా స్పష్టంగా కనిపించాయట.అద్భుతమైన దృశ్యాలు...ముఖద్వారం నుండి దేవాలయం లోపలికి వెళ్లగానే చుట్టూ పచ్చని పచ్చికతో అక్కడి వాతావరణమం తా ఆహ్లాదభరితంగా ఉంటుం ది. ముఖద్వారం నుండే మూడు పెద్ద పెద్ద గోపురా లు దర్శనమిస్తాయి. ఇం దులో మధ్య గోపురం నుం డి లోపలికి వెళ్తే అనేక గోపురాలు కనిపిస్తాయి.
ఈ దేవాలయంలో ముఖ్యంగా చెప్పు కోవాల్సింది సూర్యోదయం. ఉషోదయ వేళ ఆలయ దర్శనం అద్భుతంగా ఉంటుంది. పొద్దున పొద్దున లేచి గోపురం వెనుక నుండి ఉదయ భానుడు మెల్లిగా నులి వెచ్చని లేలేత కిరణాల్ని ప్రసరింపజేస్తున్నప్పుడు గుడి గోపురాన్ని చూస్తే చాలు... ఎంతసేపైనా ఆ దృశ్యాన్ని అలాగే చూస్తూ ఉండి పోవాలనిపిస్తుంది. ఎండ వేడెక్కి చుర్రుమనిపించే వరకు అలాగే ఉండిపోతారు కూడా.ఎటు చూసినా హిందూ పురాణాలే..!
ఈ దేవాలయంలో మరో అద్భుతమైన ప్రదేశం బ్యాస్ - రిలీఫ్స్ గ్యాలరీ. నాలుగు గోడలతో నిర్మించిన ఈ మండపంలో ఎక్కడ చూసినా హిందూ పురాణ గాథలే కనిపి స్తాయి. ముఖ్యంగా తూర్పున ఉన్న ‘మంటన్’ అనే గ్యాలరీ అందర్నీ ఆకట్టుకుంటుం ది. భారత పురాణాలైన రామాయణ, మహా భారత దృశ్యాలు అనేకం ఇక్కడ మనకు సాక్షాత్కరిస్తాయి. దేవతలూ, రాక్షసుల మధ్య జరిగిన క్షీరసాగర మధన దృశ్యాలు అందర్నీ ఆకట్టుకుంటాయి.
తూర్పు వైపు మండపంలో విష్ణుమూర్తి పుట్టుక, అవతా రాలకు సంబంధించిన శిల్పాలు ఉంటే పశ్చిమం వైపు మండపం గోడలపై యుద్ధాలు, మరణాలకు సంబంధించిన ఆకృతులు కనిపిస్తాయి.
కురుక్షేత్ర యుద్ధం, రామ రావ ణ యుద్ధ సంఘటనలు ఎంతో చక్కగా మలచబడ్డాయి. ఇక దక్షిణ మండపంలో ఆల యాన్ని నిర్మించిన రాజు రెండవ సూర్యవర్మన్ రాజ్యానికి సంబంధించిన సైనిక పటాల దృశ్యాలు దర్శనమిస్తాయి. ఇవే కాక పురాణ పురుషులు, మునులు, కిన్నెర కింపురు షాధి అప్సరసల నాట్య విన్యాసాలు, యమధర్మరాజు కొలువుదీరిన యమసభ వంటి అనేక కళాఖండాలు ఆంగ్‌కోర్ వాట్ ఆలయ గోడలపై సాక్షాత్కరిస్తాయి.ఈ పేరెలా వచ్చిందంటే...ఇదంతా చదివిన తర్వాత భారతీయ సంస్కృతి ఆనవాళ్లే లేని కంబోడియాలో ఇంతపెద్ద హిందూ దేవాలయాన్ని ఎలా? ఎందుకు నిర్మించారనే ప్రశ్న తలెత్తే ఉంటుంది కదా? అసలు విషయానికొస్తే పూర్వకాలంలో ‘కాంబోజ దేశం’ అని పిలిచేవారు. సంస్కృత పదాలను సరిగ్గా ఉచ్ఛరించలేని యూరోపియన్లు, కాంబోజదేశాన్ని కంబోడియాగా మార్చేశారు. యూరోపియన్ వలస దేశాల అజమాయిషీలోకి వెళ్లిన తర్వాత కాంబోజ దేశం కాలక్రమంలో కంబోడియాగా మారిపోయింది.కంబోడియా చరిత్ర...పూర్వకాలంలో కాంబోజ దేశంలో హిందూ సంస్కృతే ఎక్కువగా ఉండేది. 9-15 శతా బ్దాల కాలంలో ఈ దేవాలయాన్ని నిర్మించిన రెండవ సూర్యవర్మన్‌తో పాటు అనేకమం ది హిందూ రాజులు కంపూచియాను పాలించినట్లు చరిత్ర ద్వారా తెలుస్తోంది. చైనా రికార్డుల ప్రకారం ఈ ప్రాంతమంతా భరత ఖండానికి చెందిన రాజుల పాలనలో ఉంది. భారతీయ పురాతన సంస్కృత గ్రంథాలు కూడా ఈ విషయాన్ని రూఢి చేస్తు న్నాయి. చోళ రాజ్యానికి చెందిన ఒక రాజు, టోనెల్ సాప్ నదీ పరివాహక ప్రాంతాన్ని ఏలుతున్న ‘నాగ’ అనే రాకుమార్తెను వివాహం చేసుకుని ఇక్కడ రాజ్యాన్ని ఏర్పాటు చేసినట్టు చారిత్రక ఆధారాలున్నాయి. ఖ్మేర్ సామ్రాజ్య పురాణగాథల ప్రకారం ఖ్మేర్ సామ్రాజ్యాధినేత అయిన ‘కాము’తో భరత ఖం డానికి సంబంధాలున్నట్లు తెలుస్తోంది. ఖ్మేర్ నాగరికత తర్వాత కొన్ని శతా బ్దాల అనంతరం భారతీయ సంస్కృతి కంపూచియాకు వ్యాపించింది. సం స్కృతం అధికార భాషగా హిందూ, బౌద్ధమతాలు అధికార సంప్రదాయా లుగా వెలుగొందాయి. జీవితకాలంలో కనీసం ఒక్కసారైనా దర్శించాల నుకునే పర్యాటక ప్రాంతాల్లో ఆంగ్‌కోర్ వాట్ దేవాలయం ఒకటి.మరో అద్భుతం ఆంగ్‌కోర్ థోమ్...ఆంగ్‌కోర్ వాట్ దేవాలయానికి సుమారు రెండు కిలోమీటర్ల దూరం లో ఉన్న మరో అద్భుత ప్రదేశం ఆంగ్‌కోర్ థోమ్. ఖ్మేర్ సామ్రాజ్యంలోని చివరి చక్రవర్తుల్లో ఒకరైన ‘జయవర్మన్ - 6 ఆంగ్‌కోర్ థోమ్‌ను రాజధానిగా చేసుకుని రాజ్యాధికారం చేపట్టాడనడానికి చారిత్రక ఆధారాలున్నాయి. దీనినే ‘గ్రేట్ సిటీ’ అని కూడా అంటారు. తొమ్మిది చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఈ దేవాలయ నిర్మాణం జరిగింది. ఇక్కడ కూడా అనేక పురాణ కళాకృతులు మనకు దర్శనమిస్తాయి. ఇక్కడ బౌద్ధమత సంస్కృతి ఎక్కువగా ఉంది. ఏను గుల మిద్దెలు, లెపర్ రాజు ప్రతిమలు, బెయాన్, బఫూన్ లాంటి అనేక నిర్మాణాలు ఇక్కడి ప్రత్యేకత. ఆంగ్‌కోర్ థోమ్ మధ్యలో చిన్న చిన్న మిద్దెలతో నిర్మించిన గోర్డెన్ టవర్ (బెయాన్) ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది. 54 అంతస్తులతో నిర్మించిన బెయాన్ (బుద్ధుని) దేవాలయంలో ఆంగ్‌కోర్ థోమ్‌కి ఆకర్షణీయంగా నిలుస్తుంది.ఖ్మేర్ నాగరికత తర్వాత కొన్ని శతాబ్దాల అనంతరం భారతీయ సంస్కృతి కంపూ చియాకు వ్యాపించింది. సంస్కృతం అధికార భాషగా హిందూ, బౌద్ధమతాలు అధికార సంప్రదాయాలుగా వెలుగొందాయి. జీవిత కాలంలో కనీసం ఒక్కసారైనా ఇంత పెద్ద విష్ణుమూర్తి దేవాలయాన్ని దర్శించలనడం అతిశయోక్తి కాదు. ప్రకృతి ప్రేమికులను విశేషంగా ఆకర్షిస్తోన్న ఆంగ్‌కోర్ వాట్ వంటి అద్భుత కళాసౌరభం ప్రపంచ వింతల్లో ఒకటిగా చేరకపోవడం బాధాకరం.
ఇది సేకరించబడిన పోస్ట్.....
వికీ పీడియా, సూర్య దినపత్రిక సౌజన్యంతో...
chala chala bagundhi.. many many thanks..
ReplyDeleteVERY GOOD INFORMATION ABOUT HINDU TEMPLES. THANKS.
ReplyDeleteoh..nice meru kuda "katakam" ey na?
Deletevery very good info about hindu devalayam
ReplyDeletevery interesting and importent information
ReplyDeletevery good information for hidus all over the world
ReplyDeleteVery very good
ReplyDelete