Sunday, 3 August 2014

1000 years big temple Tanjavur Brihadeeswarar information


బృహదీశ్వర లింగం మన భారతదేశములో ఉన్న అతి పెద్ద లింగములలో ఒకటి.
 ఇది నిజం గానే 8.7 మీటర్ల ఎట్టు అయిదు మీటర్ల వెడల్పు ఉన్న పెద్ద లింగం .

ఈ లింగానికి అసలు పేరు ‘’అడ వల్లన్‘’అంటారట.
దీని అర్ధం నాట్యానికి ప్రతీకగా నాట్యం చేసే వాడు అని అర్ధం. దీనికే దక్షిణ కైలాసం అని కూడా పేరు.
అలాగే ఈ లింగమును కట్టినపుడు అక్కడి ప్రజలు రాజు యొక్క ప్రభువు అని అర్ధం వచ్చేలా ద్రావిడ భాషలో రాజ రాజేశ్వర ముదయార్ అని పిలుస్తారు.
ఒకప్పుడు ఈ మహాలింగం కేవలం రాజు గారి దర్శనమునకు మాత్రమే వీలుగా ఉండేది.
ఏక శిలా నిర్మితములైన ఈ ఆలయ భాగాలు అద్బుతముగా కనిపిస్తాయి...
ఈ ఆలయమును నిర్మించడానికి గ్రానైట్ రాయిమరియు   ఒక రకమైన మిశ్రమం తో కట్టారు... ఇది కాంక్రీట్ కంటే ధృఢమైనది .. కాంక్రీట్ LIfe 75-80 మాత్రమే కానీ ఈ మిశ్రమం తో కట్టిన ఈ నిర్మాణం 1000 సంవత్సరాలైనా ఇంకా మొన్ననే కట్టించిన విధంగా క్రొత్తగా కనిపిస్తుంది.. ఇది ఒక రహస్యం... 
నిర్మాణానికి ఉపయోగించిన రాయి తంజావూరు జిల్లా మొత్తంలో ఎక్కడా కనపడదు.... కేవలం ఈ ఆలయ నిర్మాణం కోసమే చాలా దూరము నుండి గ్రానైట్ రాయిని తెప్పించి రాజా రాజా చోళుడు 6 సం. కాలములో కట్టించినట్లు చరిత్ర చెబుతుంది.

అతి పెద్దదైన ఈ లింగమునకు చేసే పూజలు కూడా ఘనంగా ఉంటుంది. మీరే చూడండి.
Thanjavur brihadeeswarar

Thanjavur brihadeeswarar

Thanjavur brihadeeswarar

ఈ ఆలయాన్ని క్రీ.శ 1004లో ప్రారంభించి 1009 లో పూర్తి చేసారు. కేవలం ఐదు సంవత్సరాలలో ఇంతపెద్ద ఆలయాన్ని నిర్మించడం అప్పటి రాజుల నిర్మాణకౌశల్యతకు నిదర్శనం. అవును ఈ ఆలయాన్ని నిర్మించి వేయి సంవత్సరాలయింది. బహు పురాతన ఆలయమిది.. అందుకే ప్రపంచ వారసత్వ సంపద వారు దీనిని రక్షిత ప్రదేశంగా పరిగణించారు...
Thanjavur bruhadeeswarar temple main from nandi mandapa
 ఇది చాలా సువిశాల మైన ప్రదక్షిణా మండపాలు కలిగిఉన్న ఆలయం. ఈ దేవాలయంలో ప్రధాన దైవం అయిన "లింగం" 8.7 మీటర్ల ఎత్తు కలిగి ఉంటుంది అని చెప్పుకున్నాం కదా .
మొదట్లో కేవలం రాజు మాత్రమే ఈ ఆలయాన్ని దర్శించుకునే వాడట..
Thanjavur Bruhadeeswarar
తర్వాత్తరాత దీనిని సామాన్య జనం కూడా దర్శించుకునేందుకు అనుమతించారు... ఈ ఆలయ నిర్మాణానికి ఇటుకలు, సున్నపురాయి, బంకమట్టి... ఇవేవీ ఉపయోగించలేదు.నిర్మాణంపై ఎలాంటి పూతా పూయలేదు. పునాదుల దగ్గర నుంచి పీఠాలు, గోపురం, శిఖరం... ఇలా అన్నీ రాళ్లతోనే తయారయ్యాయి. వాటి బరువుని బట్టి ఒక రాయి మీద మరో రాయిని పేర్చి నిర్మించారు. ఈ ఆలయ గోపురం 13 అంతస్తులు వుంది. 

Thanjavur Bruhadeeswarar temple Gopuram
అంత పెద్ద శివ లింగానికి నందీశ్వరుడు కూడా భారీగా ఉండాలనుకున్నారో ఏమో అతి పెద్ద నంది విగ్రహం సుమారు 20 టన్నులు కలిగిన ఏకరాతితో నిర్మించారు. ఈ నంది 2 మీటర్ల ఎత్తు 2, 6 మీటర్ల పొడవు మరియు 2.5 మీటర్ల వెడల్పు కలిగి ఉంది.
Thanjavur Bruhadeeswarar temple Nandi

Thanjavur Bruhadeeswarar temple Nandi
ఈ దేవాలయ ప్రాకారం ఎంత పొడవంటే దాదాపు 240 మీటర్ల పొడవు 125 మీటర్ల వెడల్పు కలిగి ఉంటుంది. అంటే నాలుగు ప్రదక్షిణాలు చేస్తే ఒక కిలోమీటరు దూరం నడిచినట్లు... ఔరా ఎంత పెద్దగా ఉండి ఉంటుంది గుడి... 

 ఎంత సువిశాలంగా ఉన్న ఇక్కడ ప్రతిధ్వని ఉండదు.. అదే మన ప్రాచీన భారతీయ ఇంజనీర్ల ప్రతిభ. ప్రధాన దేవాలయ గోపురకలశం మొత్తం ఒకే శిలతో రూపుదిద్దుకుని 81.28 టన్నులు బరువు కలిగిన నల్లరాతితో చేయబడినది.
అంత ఎత్తుకు ఇంత పెద్ద గోపుర కలశాన్ని వేయి ఏళ్ళ క్రితం ఎలా తీసుకెళ్ళారో చాలా అద్భుతంగా ఉంటుంది...

ఈ రాయిని గోపురంపైకి తీసుకెళ్లడానికి చాలా ఇబ్బంది పడ్డారు. గోపురం నుండి ఏడు కిలోమీటర్లు దూరంలో ఉన్న ఓ గ్రామం దగ్గర్నుంచి ఏటవాలుగా ఉండే ప్రత్యేక వంతెనను నిర్మించారు. 
శిఖరం రెండు తలాలుగా ఉంటుంది. తంజావూరు చుట్టుపక్కల ఎక్కడా కొండలు, గుట్టలు కనిపించవు. ఈ రాళ్లను దాదాపు 150 కిలోమీటర్ల దూరంలో ఉన్న పుదుకొవై ప్రాంతంలోని రెండు కొండల్ని పూర్తిగా తొలిచి తీసుకొచ్చి ఆలయం నిర్మించి ఉంటారని ఒక అంచనా. ఈ ఆలయ గోపురాన్ని చూడడానికి రెండు కళ్ళు చాలవు(ఎందుకంటే దాదాపు పదమూడు అంతస్థుల భవనమంత ఉంటుంది మరి)
ఈ ఆలయ నిర్మాణమంతా కుంజర రాజరాజ పెరుంథాచన్ అనే సాంకేతిక నిపుణుడు మరియు వాస్తుశిల్పి చే చేయబడినది.
ఇప్పటికీ దేశంలో అతి పెద్ద ఆలయంగా దీన్నే చెబుతారు.



 ఏకశిలతో శివలింగం..
బృహదీశ్వరాలయ గోపురం మొత్తం ఎక్కడా కొంచెం కూడా ఖాళీ లేకుండా శిల్పాలతో తీర్చిదిద్దారు.
ఆలయం నిర్మాణ గొప్పతనం బయట గోడలపైనే కాదు లోపల కూడా కనిపిస్తుంది. గర్భగుడిలోని శివలింగాన్ని 13 అడుగుల ఎత్తున్న ఏకశిలతో మలిచారు. ఈ శివలింగాన్ని ఉత్తర భారతదేశంలోని నర్మదా తీరం నుంచి తీసుకొచ్చారని చెబుతారు. ఎత్తైన ఈ లింగాన్ని పూజించడానికి రెండు వైపులా మెట్లు ఉంటాయి. ఈ లింగానికి గోముఖ పానవట్టం కూడా సుమారు 500 టన్నుల బరువున్న కొండరాయితో నిర్మించారు. గుడిలోపల భాగం రెండు అంతస్తులుగా ఉంటుంది. ఎక్కడా తలుపులు ఉండవు. రాతి ద్వారాలు ఉంటాయి. లోపలి గోడలపై రాజుల కాలంలో వేసిన కుడ్యచివూతాలు కన్పిస్తాయి. ఇవి అక్కడక్కడా చోళుల కాలంనాటి చిత్రాలపైన వేసి ఉన్నాయి. రాజరాజ చోళుడు తన ముగ్గురు రాణులతో కలిసి దక్షిణామూర్తి రూపంలో నటరాజుకు పూజలు చేస్తున్న కుడ్యచివూతాలు దర్శనమిస్తాయి. ఈ చిత్రాలు ఇప్పుడు అస్పష్టంగా కన్పిస్తున్నాయి. సాంస్కృతిక కార్యక్షికమాల నిర్వహణకోసం ఈ ఆలయానికి రాజ్యం నలుమూలల నుండి 91 దేవాలయాల నుండి 400 మంది దేవదాసీల్ని రప్పించారు. తర్వాత కాలంలో బృహదీశ్వరాలయం... దేవాలయాలూ, దేవాలయ నగరాల నిర్వహణకు ఒక నమూనాగా నిలిచింది.

ఆలయాన్ని చూడడానికి రెండు కళ్ళు సరిపోవు... బాగా సమయం తీసుకుని చూడండి...
భిన్న గుర్తులు.. 1279లో తంజావూరు చోళుల ఆధిపత్యం నుంచి మధురై పాలకులైన పాండ్యుల చేతుల్లోకి వెళ్లింది. పాండ్యుల తర్వాత తంజావూరు విజయనగర రాజుల పాలనలోకి వచ్చింది. ఈ కాలంలో బృహదీశ్వరాలయం ప్రజల సమావేశ మందిరంగా, విద్యా సాంస్కృతిక శిక్షణా కేంద్రంగా ఉండేది. ఆ తర్వాత తెలుగు పాలకులైన నాయకుల ఆధీనంలోకి వచ్చింది. చోళుల కాలం నాటి నందికి వీరు రక్షణగా మండపాన్ని నిర్మించారు. పంతొమ్మిది అడుగుల పొడవూ, ఎనిమిది అడుగుల వెడల్పూ, పన్నెండు అడుగుల ఎత్తూ ఉన్న ఈ నందిని ఏకశిలతో మలిచారు. ఇది దేశంలోనే రెండో అతి పెద్ద ఏకశిల నంది (మొదటిది లేపాక్షి నంది). నాయకుల తర్వాత తంజావూరు మరాఠా పాలకుల చేతిలోకి వెళ్లింది. వీరు ఆలయ శిఖరానికి కొన్ని మార్పులు చేయించారు. ఒకే ఆలయంలో భిన్న రకాల పాలకుల గుర్తులు కనిపించడమనేది భారతదేశంలో మరే చోటా ఉండదు.

జూమ్ చేస్తూ.. చూడండి
ఇదీ అదే...

ఉత్తరాదికి రాజ్యాన్ని విస్తరించిన మొట్టమొదటి దక్షిణాది రాజు మొదటి రాజేంద్ర చోళుడు. ఇతడు రాజరాజ చోళుడి తనయుడు. గంగానది తీరం వరకు తన రాజ్య విస్తరణకు గుర్తుగా రాజధాని నగరాన్ని (గంగై కొండ చోళపురం) నిర్మించాడు. మొదటి రాజేంద్రుడు తంజావూరులో నిర్మించిన బృహదీశ్వరాలయాన్ని పోలిన మరో బృహదీశ్వర ఆలయాన్ని గంగై కొండచోళపురంలో నిర్మించాడు. ఈ రెండు దేవాలయాలూ దాదాపు ఒకేలా ఉంటాయి. ఎత్తైన రాజ గోపురాలూ ప్రహరీలూ అపురూప శిల్ప సంపద...

(ఈ ఆలయం చూడడానికి తంజావూరు ఆలయం లానే ఉంటుంది.. కానీ సముద్రం ఒడ్డున ఉండడం వలన ఎక్కువ తుఫాన్ ల ధాటికి గురై కొంచెం దెబ్బతిన్నది..) 360డిగ్రీ ఫోటో.. మీ మొబైల్ త్రిప్పుతూ స్వయంగా ... జూమ్ చేస్తూ చూడండి.. ఇవన్నీ ఈ రెండు ఆలయాలకే సొంతం. తండ్రిపై విధేయతను చూపుతూ శిఖరం ఎత్తును మాత్రం తగ్గించాడు రాజేంవూదుడు. విస్తీర్ణంలో మాత్రం ఇదే పెద్దది. ఈ ఆలయ ప్రాంగణంలో శివుడితో పాటు ఇతర దేవుళ్ల ఆలయాలూ ఉన్నాయి. బృహదీశ్వరాలయం నిర్మాణాన్ని అప్పటి రాజులు తమ దైవభక్తితో పాటు ఆర్థిక, సైనిక సామర్థ్యాన్ని చాటి చెప్పుకోవడానికి చేసిన ప్రయత్నంగా చరివూతకారులు చెబుతారు. ఏదేమైనా చోళుల కాలంనాటి సంస్కృతీ, సంప్రదాయాలు తెలుసుకోవడానికి ఈ ఆలయాల్లోని చిత్రాలు ఉపయోగపడతాయి. బృహదీశ్వరాలయ నిర్మాణంలో పాల్గొన్న వారిలో ఎక్కువ మంది భక్తులే. ఆలయాన్ని నిర్మించిన రాజరాజ చోళుడు’ ఈ ఆలయ నిర్మాణంలో భాగమైన అందరి పేర్లూ ఇక్కడ చెక్కించాలి’ అని ఆదేశించాడట. ఆయన చెప్పినట్లే వాళ్లందరి పేర్లు శాసనాల్లో కనిపిస్తాయి. వందేళ్ల క్రితం వరకూ ఈ ఆలయాన్ని కరికాళ చోళుడి కాలంలో నిర్మితమైందని భావించేవారు. జర్మనీకి చెందిన ఓ పరిశోధకుడు మాత్రం రాజరాజ చోళుడు నిర్మించాడని నిర్ధారించాడు. దర్శనీయ ప్రాంతాలు తంజావూరు చెన్నైకి దక్షిణంగా 320 కిలోమీటర్ల దూరంలో ఉంది. బృహదీశ్వరాలయం తంజావూరు పట్టణం మధ్యలో ఉంది. బృహదీశ్వరాలయంతో పాటు అక్కడ చూడాల్సిన ప్రదేశాలు చాలా వున్నాయి. ఇక్కడున్న ప్రసిద్ధ సరస్వతి మహల్ లైబ్రరీ సందర్శకులను ఆకట్టుకుంటోంది. ఆలయానికి సమీపంలో పురావస్తుశాఖ మ్యూజియం ఉంది. రాజభవనాన్నే మ్యూజియంగా మార్చారు. తంజావూరు పరిసరాల్లో లభించిన వివిధ రాజుల కాలం నాటి ఆయుధాలు, నాణాలు... అన్నీ అక్కడ చూడొచ్చు. గంగై కొండచోళపురం ఇక్కడి నుంచి 61కిలోమీటర్ల దూరంలో ఉంది.
ఈ ఆలయంలో బయటి ప్రాకారాలను నంది విగ్రహాన్ని గోపురములను కొంత భాగాన్ని మీరు ఈ వీడియోలో వీక్షించవచ్చు...





ఇక్కడి నుండి శ్రీరంగమునకు, అటునుండి మధురైకు యాత్రలను ప్లాన్ చేసుకోవచ్చు.. ఈ రెండు యాత్రలగురించి నా తదుపరి టపాలలో వివరిస్తాను...

వేయి సంవత్సరాల పురాతన 13 అంతస్థుల దేశంలో ఎత్తైన గోపురం ఉన్న ఆలయంలో ఎంత ఘనమైన శివాలయం కట్టాలో అంతటి ఘనమైన శివలింగాన్ని ప్రతిష్టించారు రాజ రాజ చోళుడు.... అంతటి మహాలింగానికి అభిషేకం ఎంతఘనంగా ఉంటుందో ఈ వీడియోలో చూడండి... మృత్యుంజయ మంత్రాన్ని వింటే ఎటువంటి ఋగ్మతలైనా clear అవుతాయి.... ఇప్పటి కరోనా సమయంలో మహాశివుడిని దర్శించడం... అభిషేకాన్ని చూడగలగడం... అది కూడా మృత్యుంజయ మంత్ర సహితం వీటిని చూడడం అద్భుతం కదా... ఇన్ని ప్రత్యేకతలు ఉన్న ఈ పోస్ట్ ను చూడడం మిస్ కావద్దు... 



Post a Comment

Whatsapp Button works on Mobile Device only