మనకు మకర సంక్రాంతి మాత్రమే తెలుసు:: కానీ సూర్య గమనం ఆధారంగా ఇంకా పదకొండు సంక్రాంతులున్నాయి.. అవి ఏమిటి:: వాటి ప్రత్యేకతలు ఏమిటి???
సూర్యుడు రాశిలో ప్రవేశించడాన్ని సంక్రమణము అంటారు...
అయితే ఈ సంక్రమణాన్నే సంక్రాంతి అంటారు.....మనందరికీ తెలుసు మనకు పన్నెండు రాశులు ఉన్నాయి..
అవి ఇలా సూర్యుడు ఒక్కొక్క రాశిలో ప్రవేశిస్తే ఒక్కొక్క సంక్రాంతి ఏర్పడుతుందన్నమాట...
ఇలా సూర్యుడు మొత్తం పన్నెండు రాశులలో ప్రవేశించడం వలన మొత్తం పన్నెండు సంక్రాంతులు వస్తాయి... సంక్రమణం జరిగేటపుడు సూర్యుడు ఏ రాశిలో ఉంటే ఆ సంక్రాంతి అంటారు...
ఇలా ప్రతి మాసం ఒక సంక్రాంతి ఉంటుంది...
కొన్ని ముఖ్యమైన సంక్రాంతులు..
1. ఆయన సంక్రాంతి -
ఇవి ఒకటి ఉత్తరాయణ పుణ్యకాల ప్రారంభానికి (మకర సంక్రాంతి)
రెండవది దక్షిణాయన పుణ్యకాల ప్రారంభానికి సంకేతములు(కర్క సంక్రాంతి)
2. వైషువ సంక్రాంతి -
మొదటిది శీతాకాలం , వేసవి కాలం మధ్య వచ్చే సంధి కాల ప్రారంభం - మేష సంక్రాంతి (వసంతఋతువు లో వచ్చేది))
మరియు వేసవి కాలం వర్షాకాలముల మధ్య వచ్చే సంధి కాలం - తుల సంక్రాంతి (శరత్ ఋతువు లో వచ్చేది)).
సంవత్సరం మొత్తంలో ఈ రెండు రోజులు ఖచ్చితంగా పగలు రేయి సమానంగా ఉంటాయి...
అంటే సూర్యోదయం, సూర్యాస్తమయాలు దాదాపు ఒకే సమయమున సంభవిస్తాయన్నమాట.
3. విష్ణు పది సంక్రాంతి -
సింహ సంక్రాంతి , కుంభ సంక్రాంతి , వ్రుషభ సంక్రాంతి మరియు వ్రుశ్చిక సంక్రాంతి.
4. షద్శితిముఖి సంక్రాంతి - మీన సంక్రాంతి, కన్య సంక్రాంతి, మిథున సంక్రాంతి మరియు ధను సంక్రాంతి.
మిథున సంక్రాంతి రోజు అతి దీర్ఘ పగలు(అంటే పగటి సమయం ఎక్కువగా) ఉంటుంది...
ధనుస్సంక్రాంతి రోజు అతి దీర్ఘ రాత్రి (అంటే రాత్రి సమయం ఎక్కువగా) ఉంటుంది...
ఇప్పటి దాకా రాత్రి పగలు సమ కాలం అనుకునే వాడిని...
కానీ మొత్తానికి చూస్తే సంవత్సరం లో కేవలం కొన్ని రోజులు మాత్రమే రేయింబగళ్ళు సమానంగా ఉన్నాయి...
ఎంత అద్భుతం... ఒక సంవత్సరంలో ఏ రోజు ఎంత సేపుంటుంది.. సూర్యోదయ సూర్యాస్తమయ కాలాలను.. పౌర్ణమి అమావాస్యలను ఘడియ విఘడియలతో సహా ముందుగానే లెక్కవేసుకుని చెప్పేంత పరిజ్ఞానం మన పూర్వీకులకు ఉంది.
వికీ పీడియా సౌజన్యంతో
Post a Comment