గంగా కావేరీల అనుసంధానం మన భారత దేశ బంగారు భవితకు ఆరంభం కానుందా!!
మన భారత దేశాన్ని చాలా సంవత్సరాలుగా పట్టి పీడిస్తున్నవి... రెండు
అందులో మొదటిది ఉత్తర భారత దేశంలో వరదలు..
రెండవది దక్షిణ భారతంలో కరవు...
ఈ రెండిటికి ఒకటే దారి... నదుల అనుసంధానం...
ఈ అనుసంధానం వలన కలిగే ప్రయోజనాలు: తాగునీటి సమస్యలు తీరి జనుల దాహార్తి తీరుతుంది...
ప్రాజెక్టుల రూపకల్పనలో దానిని నిర్మించేందుకు ఎంతో శ్రామిక శక్తి అవసరమై నిరుద్యోగ సమస్య తీరుతుంది...
అది కేవలం దారిద్ర్యాన్ని నిర్మూలించేదే కాక భవిష్యత్తులో వ్యావసాయిక అవసరాలకు...
పారిశ్రామిక అవసరాలకు పనికొస్తాయి...
ప్రాజెక్టులనుండి విద్యుదుత్పత్తి వలన పారిశ్రామిక,గృహ వినియోగ అవసరాలు తీరతాయి...
పంటలు బాగా పండటం వలన ఇంతటి బృహత్తరమైన కార్యం కాబట్టే మన ప్రభుత్వం మొదట దీనికై కసరత్తులు ప్రారంభించింది...
అయితే ఇది ఇప్పుడు అనుకుంటున్న ప్రణాళిక కాదు..
సర్ ఆర్థర్ కాటన్ ఉన్నప్పటినుండీ తలంచుచున్నదే...
అయితే 1977 నుండి కొంచెం ఊపందుకుంది..
ఇదివరలో డా. కె.యల్. రావు గారి అధ్యక్ష్యతన దీని మీద సాధ్యాసాధ్యాలగురించి ఒక నివేదికను తయారు చేయడం కూడా జరిగింది...
దీని కోసమై... బీహార్ రాష్ట్రం పాట్నా నగర సమీపంలో గంగా నదిని దారి మళ్ళించి మొదట నర్మదా నదికి...
ఆ తర్వాత నర్మదను తపతికి అనుసంధానం చేస్తారు..
తపతి నదిని గోదావరి నదికి అనుసంధానించడం తో గంగమ్మను దక్షిణాదికి తరలించడం సాధ్యమవుతుంది... గోదావరికి కృష్ణను అనుసంధానంచేసి... కృష్ణ ను పెన్నకు .. పెన్నా నదిని కావేరికి అనుసంధానం చేయాలని సంకల్పించారు... కానీ ఇది మాటలలో చెప్పుకునేంత సులభం కాదు..
దీనికై చాలా సవాళ్ళను ఎదుర్కోవలసి ఉంటుంది... ఎంతో ఆర్థిక ప్రణాళిక అవసరం...
ఇది 2,640 km భూభాగమునకు సంభందించినది...
ఇది సాధ్యమైతే 60,000 క్యూసెక్కుల గంగమ్మ వరద నీటిని సంవత్సరంలో 150 రోజుల పాటు పొందవచ్చు... (భారతదేశంలో మనకు వర్షం వచ్చేది కేవలం 150 రోజులే) దీనిలో 50,000 క్యూసెక్కుల నీటిని దక్కన్ భాగం వాడుకున్నా...
మిగిలిన 10,000 క్యూసెక్కుల నీరు గంగా పారివాహిక ప్రాంతానికై మిగిలే ఉంటుంది...
దీని వలన ప్రస్తుతం సాగులో ఉన్న2,59,౦౦౦ ఎకరాలకు తోడుగా మరియొక నాలుగు లక్షల ఎకరాలు సాగులోకి వచ్చే అవకాశముంది..
అయితే కాలువల నిర్మాణానికై బోలెడంత భూమిని సేకరించవలసిఉంటుంది..
అది చాలా ఖర్చుతో కూడిన వ్యవహారం...
వేరే ఏదైనా ఉపాయాలు ఆలోచించేందుకై ప్రాజెక్టు ఆగిపోయింది...
ఈ ప్రాజెక్టుకై వస్తున్న ప్రతికూలతలు: భిన్న రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం...
(భిన్న రాష్ట్రాల మధ్య ఇప్పుడు ఉన్న విద్యుత్ గ్రిడ్ ల వలె సా(తా)గు నీటికై భవిష్యత్ లో గ్రిడ్ లు ఏర్పాటు చేయవలసి ఉంటుంది...)
భూముల కొనుగోలుకై కావలసిన వ్యయం...
పర్యావరణ ప్రతికూలతలు: పెద్ద పెద్ద డ్యాం లు కట్టడానికి అయ్యే ఖర్చు...
వాటి ద్వారా ఏర్పడే ముంపుకు...
పునరావాసానికై పెట్టవలసిన ఖర్చు...
భూకంపాలు వచ్చే అవకాశం...
ప్రజలకు అవసరమైన ప్రదేశ ఎన్నిక నిర్వహణ మొదలగునవి
దీనికి విరుగుడుగా నీరు లభించే కొన్ని కొన్ని ప్రదేశాలలో చిన్న సైజు డ్యాం లను ఎక్కు వ సంఖ్యలో నిర్మించడం
అనుకూలతలు:
ఎక్కువ హెక్టార్లలో విస్తరించే సాగు, సంవత్సరంలో మూడు పంటలు,తక్కువ ధరకే ఆహార ధాన్యాల లభ్యత, ధరలు తగ్గే అవకాశం,
విద్యుత్ ఉత్పత్తి పెరగటం వలన అతి తక్కువ ధరకే విద్యుత్,
తద్వారా ఎక్కువయ్యే పరిశ్రమలు....
పారిశ్రామిక వృద్ధి వలన పెరిగే ఉద్యోగ అవకాశాలు...
వస్తూత్పత్తి మరియు వ్యవసాయిక మిగుళ్ళ వలన పెరిగే ఎగుమతులు,
తద్వారా రూపాయి విలువ బలపడటం...
ఇన్ని మంచి విషయాలు దాగున్నాయి.. ఈ బృహత్ ప్రణాళికలో...
ఇందులో మన ప్రభుత్వం విజయం సాధించి ముందుకెళ్ళడంలోనే మన భారత ప్రగతి ఉందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు...
Benefits from Ganga-Kauveri uplinking
A Free transalation
from Wikipedia
The hindu business line
Post a Comment