ఎల్లోరా..
ఇది అతి ప్రాచీనమైన ఒక గుహాలయం..ఇది రాష్ట్ర కూట రాజ్యమునకు సంబంధించిన ఆలయం...
ఈ ఆలయానికి ప్రపంచ వారసత్వ హోదా (చాలా రోజుల క్రిందటే)లభించినది..
మహారాష్ట్రలోని ఈ క్షేత్రం ఔరంగా బాదు నుండి కేవలం 29 కి.మీ దూరంలొ ఉంది....
అత్యంత రమణీయంగా తీర్చిదిద్దిన విశాల ప్రదేశంలో కైలాసనాథ ఆలయం కడు రమణీయంగా ఉంటుంది..
ఇక్కడ మొత్తం 34 గుహలు చరణాంద్రి పర్వతంపై నిలువుగా చెక్కబడి ఉంటాయి..
చరణాంద్రి పర్వతాలు పశ్చిమ కనుమలలో భాగం..
ఎల్లోరా గుహలలోని శిల్పాలు మన భారతీయ సంస్కృతికి, వారసత్వ సంపదకు ప్రతిరూపాలు...
ఇక్కడ మనం బౌద్ధ, హిందూ, జైన శైలిలో సాగించిన నిర్మాణాలను చూడవచ్చు.. 34 గుహలలో 12 బౌద్ధులవి(1–12), 17 హిందువులవి (13–29) మరియు 5 జైనుల (30–34) కు సంబంధించినవి.
ఈ గుహాలయాలు సామాన్య శకము. 5-7 వ శతబ్దానికి చెందినవి.
ఇవి మొదట బౌద్ధ ఆరామాలుగా విరాజిల్లాయి..ఒక తిమింగలంలోని అస్థి పంజరంలా కట్టిన గుహలలో ధ్యానం చేయడానికి అనువుగా ఉంటాయి.. ఇక్కడ ఓంకారం జపిస్తే వచ్చే ప్రతిధ్వని అద్భుతంగా ఉంటుంది...మేము ప్రత్యక్షంగా చేసాము.... 360 view of this cave👇👇
ఇక్కడ బౌద్ధులకు సంబంధించిన చైత్యము(స్థూపం) విశ్వకర్మ గుహ((Cave 10) చాలా ప్రసిద్ధి చెందింది..
ఇది అజంతా గుహలలో 19 - 26 గుహల నిర్మాణ శైలిని పోలి ఉంటుంది..
కైలాసనాథ దేవాలయం:
ఇది 16 వ గుహలో ఉంది. మొత్తం ఎల్లోరా కు ఇదే ప్రధాన ఆకర్షణ..ఇది కైలాస పర్వతానికి ప్రతిరూపంగా తలుస్తారు... ఇక్కడ పరమశివుడు ఒకే రాతి తో చెక్కబడి ఉంటాడు...
శిల్పాలకు పెట్టిందిపేరైన గ్రీకు దేశపు ఏథెన్స్ లో కూడా ఇంత పెద్ద శిల్పం లేదంటే అతిశయోక్తి లేదు..
ఇక్కడ చెక్కిన ప్రతి కట్టడం ఒకే అంతస్థుతో పూర్తి కాలేదు అన్నీ బహుళ అంతస్థులలో కూడి ఉంటుంది..
సువిశాల మైన ప్రదక్షిణా మండపాలు..
గోపురాలు.. శిల్పాలు... చూడడానికి రెండు కళ్ళు సరిపోవు..
ప్రధాన గుడికి ఎదురుగా ఉన్న నంది మండపంలో నంది ఉంటుంది..
ఇది 29.3 మీటర్ల ఎత్తు.. పదహారు స్థంభాలమీద ఆలంకృతమై ఉంటుంది...
ఈ నంది మండపాన్నంతా కొన్ని ఏనుగులు మోస్తున్నట్లు చెక్కడం ఒక మచ్చు తునక..
ఈ నంది మండపం నుండే శివుని మందిరానికి ఆరోజుల్లోనే ఒక వంతెనను నిర్మించారు.. అంటే నంది మండపం నుండి శివుని చూడడానికి వంతెన ద్వారా నే ప్రయాణించాలన్న మాట... చూసారా ఎంత ఎత్తులో మందిరాలను నిర్మించారో!!ఇప్పుడు మీరు చూస్తున్నదే ఎల్లోరా లోని కైలాసనాథ ప్రధాన ఆలయం... ఇక్కడ స్థంభాలు... ఆలయ ప్రాకారాలు... గర్భగుడిలో చెక్కిన శిల్పాలు చాలా చూడవచ్చు... !
ఈ ఆలయ నిర్మాణం మొత్తం దక్షిణ భారత ద్రవిడ సంస్కృతి శైలి కొట్టొచ్చినట్లు కనపడుతుంది..
ఎందుకంటే ఈ ఆలయాన్ని నిర్మించిన రాష్ట్రకూటులు కన్నడిగులు..
ఇక్కడే రావణాసురుడు కైలాస పర్వతాన్ని ఎత్తే శిల్పం కడు రమణీయంగా తీర్చి దిద్దారు..
ఈ మొత్తం దేవాలయాన్ని శిల్పాలను తీర్చిదిద్దేదానికి అవసరమైన శిలలు ఎంతో తెలుసా???200,000 టన్నులు.. ఆరోజుల్లో ఇంత శ్రమను ఎలా చేయగలిగారో మనకు అంతుపట్టనిదే..
ఏడవ శతాబ్థంలో మొదలైన కట్టడం పూర్తి అయ్యే సరికే క్రీ.శ.757–773 అయిందంటే ఎన్ని తరాల వారు తమ శ్రమను దీనికై వినియోగించి ఉంటారు...
ఇంకా జైనుల గుహల( 32,33)లో.. దిగంబరులు, యక్షులు, ఇంద్రసభ ఉంటాయి..
360 view of Ellora... just rotate your mobile and see the picture..
జీవిత కాలంలో ఒక్కసారైనా దర్శించ దగిన ఆలయమిది... షిరిడీ యాత్రకు ప్లాన్ చేసుకునేటపుడు ఈ యాత్రను దానిలో చేర్చుకోవచ్చు... అక్కడినుండి దగ్గరే ఈ ప్రదేశం
జీవిత కాలంలో ఒక్కసారైనా దర్శించ దగిన ఆలయమిది... షిరిడీ యాత్రకు ప్లాన్ చేసుకునేటపుడు ఈ యాత్రను దానిలో చేర్చుకోవచ్చు... అక్కడినుండి దగ్గరే ఈ ప్రదేశం
Post a Comment